చిత్రం: మగధీరుడు (1986) సంగీతం: యస్.పి.బాలు నటీనటులు: చిరంజీవి , జయసుధ దర్శకత్వం: విజయ బాపినీడు నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి విడుదల తేది: 07.03.1986
Songs List:
జతకలిసే ఇద్దరం పాట సాహిత్యం
చిత్రం: మగధీరుడు (1986) సంగీతం: యస్.పి.బాలు సాహిత్యం: జి. జేషువా గానం: యస్.పి.బాలు, యస్.జానకి జతకలిసే ఇద్దరం ప్రతిరేయి శోభనం జతకలిసే ఇద్దరం ప్రతిరేయి శోభనం చూపులున్న తలుపులకి చెవులున్న గోడలకి సరిపడదీ లాంఛనం ఈనాడె ఇద్దరం ఆ పైన ముగ్గురం ఆపైన నలుగురం ఆపైనా... ఆపేస్తే అదే సుఖం సుఖం సుఖం సుఖం సుఖం జతకలిసే ఇద్దరం ప్రతిరేయి శోభనం, శోభనం పాతనేది కొత్తగా కొత్తనేది వింతగా కొంగుచాటు కవ్వింతగా ముద్దుమీద ముద్దుగా మూడు ముళ్ళు గుచ్చగా ఇల్లే ఈ కౌగిలింతగా నడుమ నడుమ చిరుగాజులు చప్పుడు తొడిమ లేని సనజాజుల నిప్పులు నడుమ నడుమ చిరుగాజులు చప్పుడు తొడిమ లేని సనజాజుల నిప్పులు చుప్పనాతి నోళ్ళకి చూడలేని కళ్ళకి కలుసుంటే ఇద్దరం కన్నీళ్ల కలవరం ఒళ్ళంతా కంపరం ఆ పైన చలి జ్వరం జ్వరం జ్వరం జ్వరం జ్వరం జతకలిసే ఇద్దరం ప్రతిరేయి శోభనం చూపులున్న తలుపులకి చెవులున్న గోడలకి సరిపడదీ లాంఛనం ఈనాడె ఇద్దరం ఆ పైన ముగ్గురం ఆపైన నలుగురం ఆపైనా... ఆపేస్తే అదే సుఖం సుఖం సుఖం సుఖం సుఖం మొన్నకన్న మోజుగా నిన్నకన్న రంజుగా రోజురోజుకీ లబ్జుగా పగలు కూడ రాత్రిగా రతుల మొదటి రాత్రిగా సిగ్గుతాకితే చిచ్చుగా వెలుగు వెనక ఆడుకునే ఆటలు వెతికి వెతికి అందుకునే వేటలు వెలుగు వెనక ఆడుకునే ఆటలు వెతికి వెతికి అందుకునే వేటలు చప్పరాని వాళ్ళకి చెప్పుకింద కీళ్ళకి ఒకటైతే ఇద్దరం అల్లరే ఆగడం అసూయ ఆగ్రహం ఆపైన చలి జ్వరం స్వయంవరం ప్రియంవరం జతకలిసే ఇద్దరం ప్రతిరేయి శోభనం చూపులున్న తలుపులకి చెవులున్న గోడలకి సరిపడదీ లాంఛనం ఈనాడె ఇద్దరం ఆ పైన ముగ్గురం ఆపైన నలుగురం ఆపైనా... ఆపేస్తే అదే సుఖం సుఖం - సుఖం, సుఖం - సుఖం
ఇంటి పేరు అనురాగం పాట సాహిత్యం
చిత్రం: మగధీరుడు (1986) సంగీతం: యస్.పి.బాలు సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, విశ్వనాథ్, లలితా సాగరి, వాణీ జయరాం ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం మా ఇల్లె బృంధావనం మా ఇల్లె బృంధావనం ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం వెలుగు నీడలైనా కలిమి లేములైనా మా ముంగిట ఎప్పుడు చిరునవ్వుల ముగ్గులె వెలుగు నీడలైనా కలిమి లేములైనా మా ముంగిట ఎప్పుడు చిరునవ్వుల ముగ్గులె ఎదిరించని జానకీ నిదురించని ఊర్మిలా తోడి కోడల్లుగా ఇల్లు చక్కదిద్దగా ప్రేమకు రూపాలుగా రామలక్ష్మనులుగా కొండంత అన్నలు అండగా ఉండగా ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం మా ఇల్లె బృంధావనం మా ఇల్లె బృంధావనం ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం వయసులొ చిన్నైనా మనసులొ పెద్దగా తమ్ముడన్న మాటకె తాను సాక్షిగా వయసులొ చిన్నైనా మనసులొ పెద్దగా తమ్ముడన్న మాటకె తాను సాక్షిగా అమ్మగా నాన్నగా బిడ్డగా పాపగా యే దేవకి కనా యే యసోద పెంచినా గోకులాన వెలిసాడో గొపాల కృష్ణుడు మా ఇంటికి దీపమై చిన్నారి తమ్ముడు ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం మా ఇల్లె బృంధావనం మా ఇల్లె బృంధావనం ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం
అటు దహనం పాట సాహిత్యం
చిత్రం: మగధీరుడు (1986) సంగీతం: యస్.పి.బాలు సాహిత్యం: జి. జేషువా గానం: యస్.పి.బాలు అటు దహనం ఇటు ఖణనం అటు మరణం ఇటు జననం అటు దహనం ఇటు ఖణనం అటు మరణం ఇటు జననం ఇంతకన్న ఏం చేస్తావు నన్ను ఏం సాదిస్తావు ఇంతకన్న ఏం చేస్తావు నన్ను ఏం సాదిస్తావు నిన్ను నమ్మి ఎప్పుడెవడు సుఖపడ్డాడు నీలో హృదయం అన్నది ఎవడు చూడగలిగాడు నిన్ను నమ్మి ఎప్పుడెవడు సుఖపడ్డాడు నీలో హృదయం అన్నది ఎవడు చూడగలిగాడు సత్యం నీవని నమ్మి ధర్మం నీవని నమ్మి హరిచంద్రుడేమైనాడు... గూటికి పేదైపోయి కాటి కాపరైనాడు జీవచవమై నాలా స్మశానాలో చేరాడు సత్యం వధ, ధర్మం చర సత్యమేవ జయతే అటు దహనం ఇటు ఖణనం అటు మరణం ఇటు జననం ఇంతకన్న ఏం చేస్తావు నన్ను ఏం సాదిస్తావు ఇంతకన్న ఏం చేస్తావు నన్ను ఏం సాదిస్తావు నా ఇల్లని నా వాళ్ళని ఐక్యంగా బ్రతకాలని ఆశలు అడియాశలైన పిచ్చివాడ్ని నేను నా ఇల్లని నా వాళ్ళని ఐక్యంగా బ్రతకాలని ఆశలు అడియాశలైన పిచ్చివాడ్ని నేను అన్నపూర్ణ భయపడకు బాధపడకు అన్నపూర్ణ ఏదో సుముహూర్తంలో నువ్విటు వస్తావు చితిమంటల వెలుగులో నన్ను కలుసుకుంటావు సర్వసమానత్వానికి వేదిక ఈ స్మశానం ఇక్కడ జరగక తప్పదు మనకు సంగమం అన్నపూర్ణ ఇక్కడ జరగక తప్పదు మనకు సంగమం
ఇచ్చోటనే పాట సాహిత్యం
చిత్రం: మగధీరుడు (1986) సంగీతం: యస్.పి.బాలు సాహిత్యం: జి. జేషువా గానం: యస్.పి.బాలు ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయె ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికారముద్రికల్ అంతరించే ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయె ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికంగన్న చిత్రలేఖకుని కుంచె నశించె ఇది పిశాచులతో నిటాలేక్షణుండు గజ్జె కదిలించి యాడు రంగస్థలంబు ఇది మరణదూత తీక్షణమౌ దృుష్టులొలయ అవనిపాలించు భస్మ సింహాసనంబు... అ.... ఆ....భస్మ సింహాసనంబు దళమౌ పై ఎదలో నడంగియు సముజ్వల కాంతులీవెండలన్ మలయింపన్ దిశలన్ వదీయ కడసీమన్ బాల సూర్యప్రబాకలితంబై వెలుగొందు చున్నయదీ అది మంగల్యంబు కాబోలు అది మంగల్యంబు కాబోలు దానిని ఏ వెలకైనన్ తెగనమ్మి నీ సుతునికై వెచ్చించి నన్ చెల్లదే....... అ....ఆ...
మన జీవితాలు పాట సాహిత్యం
చిత్రం: మగధీరుడు (1986) సంగీతం: యస్.పి.బాలు సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్.జానకి మన జీవితాలు నవ నాటకాలు అహ తెలుసుకొనవె చెలియా మన జాతకాల ప్రియ సంతకాల సరి చూసుకోర సఖుడా మన జీవితాలు నవ నాటకాలు అహ తెలుసుకొనవె చెలియా మన జాతకాల ప్రియ సంతకాల సరి చూసుకోర సఖుడా ఏ రంగమెక్క వలెనో ఏ రంగు మర్చవలెనో ఏ పాత్ర వేయవలెనో ఏ యాత్ర చేయవలెనో ఆ... ఆ... శభాష్ మన జీవితాలు నవ నాటకాలు అహ తెలుసుకొనవె చెలియా మన జాతకాల ప్రియ సంతకాల సరి చూసుకోర సఖుడా పడుతోంది ఇరవైఒకటో శతాబ్దాల నీడ పడుచమ్మ మార్చాలమ్మ పాడు పాత పాట జెట్ మీద వెళ్ళే కాలం నీ జట్కాలింకామానుకో నీ చిట్కాలింకా మార్చుకో ఇన్హిలగోనె ఇన్హిలగోనె ఇన్హిలగోనె ఇన్హిలగోనె లేలో దుపట్టా మేరా హాయ్ దుపట్టా మేరా తెలుగే సరిగా రాదు మళ్ళీ హిందీ ఒకటి తెలుగులో పాడుతల్లి మన జాతకాల ప్రియ సంతకాల సరి చూసుకోర సఖుడా మన జీవితాలు నవ నాటకాలు అహ తెలుసుకొనవె చెలియా ఎన్నాళ్లీ ఇడ్లీ సాంబార్ కొత్త రుచులు చూడరా ఎన్నాళ్లీ కాశీ మజిలీ కొత్త కథలు చెప్పరా వీడియోలు చూసే కాలం నీ సినిమా హాల్లే దండగ ఈ చిన్నింట్లోనే పండగ యమునను నడిరేయి దాటితివంట వెలచితివంట నందుని ఇంట రేపల్లె ఇల్లాయేనంటా నా తండ్రే ఇంకొకళ్ళ పాటెందుకు నీ సొంత పాట పాడమ్మా మన జీవితాలు నవ నాటకాలు అహ తెలుసుకొనవె చెలియా మన జాతకాల ప్రియ సంతకాల సరి చూసుకోర సఖుడా ఏ రంగమెక్క వలెనో ఏ రంగు మర్చవలెనో ఏ పాత్ర వేయవలెనో ఏ యాత్ర చేయవలెనో ఆ... ఆ... Once more ఆ... ఆ... Please once again I say Shut up
మంచిని పంచిన పాట సాహిత్యం
చిత్రం: మగధీరుడు (1986) సంగీతం: యస్.పి.బాలు సాహిత్యం: గానం: యస్.పి.బాలు మంచిని పంచిన నీవు బాబు మంచిని పంచిన నీవు బాబు వంచన పాలైనావు అనురాగం మమకారం అరదండాలై ఖైదీ అయ్యావు మంచిని పంచిన నీవు బాబు వంచన పాలైనావు తలపై మోసావు ఈ నేరము త్యాగం గుర్తించదీలోకము నీలో నీతిని నమ్మి నలిగిందో హృదయము నీతికి గోతులు తవ్వి కులికిందో భోగము ఈ ఆస్తి పాస్తులనేలి కావయ్య శాశ్వతం ఈ అన్నాదమ్ములగాదే అలనాటి భారతం బాబు వంచన పాలైనావు మంచిని పంచిన నీవు బాబు వంచన పాలైనావు ధనమే ఓ కక్షగా రగిలెను మనసే ఓ శిక్షగా మిగెలెను న్యాయం గాయం చేసి గుండెల్లో మూల్గెను కల్లా కపటం కలిసి నిను రచ్చ కీడ్చెను ఈ నెత్తురు మెత్తని కత్తై నీ వెన్నే పొడిచెను అది రుజువే లేని నిజమై నీతోనే నదిచెను బాబు వంచన పాలైనావు మంచిని పంచిన నీవు బాబు వంచన పాలైనావు
మన జీవితాల ు(Sad Song) పాట సాహిత్యం
చిత్రం: మగధీరుడు (1986) సంగీతం: యస్.పి.బాలు సాహిత్యం: వేటూరి గానం: యస్.జానకి, యస్.పి.బాలు మన జీవితాలు నవ నాటకాలు తెలుసుకొనర నాన్న మన జాతకాల చిరు సంతకాలు సరి చూసుకోనర తండ్రి ఏ రంగమెక్క వలెనో ఏ రంగు మర్చవలెనో ఏ పాత్ర వేయవలెనో ఏ యాత్ర చేయవలెనో మన జీవితాలు నవ నాటకాలు తెలుసుకొనర నాన్న ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం మా ఇల్లె బృంధావనం