చిత్రం: మహామంత్రి తిమ్మరుసు (1962) సంగీతం: పెండ్యాల నటీనటులు: యన్.టి.రామారావు, శోభన్ బాబు, యస్.వరలక్ష్మి, దేవిక దర్శకత్వం: కమలాకర్ కామేశ్వరరావు నిర్మాత: అట్లూరి పుండరీ కాక్షయ్య విడుదల తేది: 26.07.1962
Songs List:
జై జై జై జై (బుర్రకధ) సాహిత్యం
చిత్రం: మహామంత్రి తమ్మరుసు (1962) సంగీతం: పెండ్యాల సాహిత్యం: పింగళి గానం: పి.లీల జై జై జై జై జై - జై జై జై జై జై వీర రక్తమును ఉడుకెత్తించే విద్యానగర పతాకకు జై ధరణి గావగా దనుజు నడంచిన వరాహ మూర్తికి జై జై జై పరి సంధులపై పడగను విప్పిన ఆఖండ జయ ఖడ్గాహికి జై వచనం: అయ్యా : ధర్మరక్షణకు ప్రబల స్థావరంగా శ్రీ విద్యా రణ్య స్వాములవారు నిర్మించిన మహా నగరమిది, దీని గాధ మహా విచిత్రము వినిన వారెల్లా వీరులు కాగల రయ్యా! వీరులు కాగలరు. ఎలాగయ్యా | ఎలా ? పాట ఆహ ఇచ్చట పుట్టిన కుందేలే వేట కుక్కలను తరిమినది అట్టి మహిమగల గడ్డమీద మరి విజయమందినది విజయనగరము తానీ తాని తందనాన తానీ తాని తందనాన వచనం: ఆ నాటినుండి ఎందరో ప్రభువులు ఆంధ్ర ప్రశస్తిని వెలయించుచూ రాజ్యం చేశారయ్యా: చివరకు తుళువ నరసరాయలు రాజ్యానికి వచ్చాడు, వారికి నృసింహ రాయలు, కృష్ణరాయలు, అచ్యుతరాయలు కుమారులు, వారిలో ఏనాటికైనా ఇచ్చట రామరాజ్య స్థాపకుడు కాగలిగినవాడు కృష్ణరాయలేనని కనిపెట్టిన వాడై మహామంత్రి తిమ్మరుసువారు ఏం చేశారయ్యా ఏం చేశారు? పాట మహామంత్రి తిమ్మరుసు వారురా - తందానో తాని తందనాన తన కన్నకుమారుని కన్నమిన్నగా - తందానో అని తందనాన అన్ని విద్యలను తీర్చి దిద్దుచూ - తందానో కాని తందనాన కృష్ణరాయలనే ఆదరించిరీ - తందాన తాని తందనాన వచనం: అలా వుండగా నరసరాయలువారు కాలంచేసి వీర నృసింహరాయలు వారు రాజ్యానికి వస్తూనే జబ్బుపడి పోయినారు. ఆ అదను కనిపెట్టి కళింగ గజపతి మనపై దాడులు నడిపాడు. అయితేనేం! మన కృష్ణరాయలు, వారిని తరిమి తరిమి కొట్టినారు. కాని దానితోనే దేశానికి కాని రోజులు దాపురించినయ్. ఏం జరిగింది నాయనా ఏం జరిగింది? పాట నృసింహరాయలు ఆస్తమించుచూ ఏమిదారుణము చేసి పోయెనో అరి భయంకరుడు ధర్మ రక్షకుడు కృష్ణరాయలే మాయ మాయెనే వచనం: ఈ ఆరాచక స్థితిలో, గజపతులే కాక, మ్లేచ్ఛులుకూడా। మన మాన, ధన, ప్రాణాలను దోచుకొన పొంచిఉన్నారు. ఇక మన మాతృదేశమును మనమే రక్షించు కోవాలి ఏ విధంగానయ్యా ! ఏ విధంగా ? పాట దేశ దేశముల వీరజాతులకు ఆంధ్ర పౌరుషమె ఆదర్శముగా ప్రతి పౌరుడును కృష్ణరాయలై వీర తోరణమును ధరింపరే॥
జయ వాణీ చరణ కమల పాట సాహిత్యం
చిత్రం: మహామంత్రి తమ్మరుసు (1962) సంగీతం: పెండ్యాల సాహిత్యం: పింగళి గానం: ఘంటసాల, పి.లీల జయ వాణీ చరణ కమల సన్నిధి మన సాధనా రసిక సభా రంజనగా రాజిలు మన వాదనా భావ రాగ గానమునా సుధా ఝరులు పొంగగా నవరసాభి నటనమునా జగము పరవశిల్లగా ఝణ ఝణ ఝణ ఝణ ఝణ ఝణ ఝణ ఝణ ఝణ ఘన నాట్యము సాగే లయ క్రియ వీణియ పలికేనా సరస మధుర స్వరవాహిని రస బిందుల చిందుల వలె జల జల జల అడుగులలో కులుకు లెల్ల ఒలికేనా పద్యం నెం. 1 పాడినది: ఘంటసాల శ్రీ విద్యాపుర వజ్ర పీఠమున వాసిం గాంచి వర్థిల్లుమా, నీ వీరత్వము సాళ్వ తిమ్మరుసు మంత్రిత్వం బమోఘంబుగా, రాయా ఆంధ్ర భోజుండవై. మా విద్యత్కవిరాజ గోష్టులను సన్మానంబులన్ గాంచుమా
లీల కృష్ణా నీ లీలలు పాట సాహిత్యం
చిత్రం: మహామంత్రి తమ్మరుసు (1962) సంగీతం: పెండ్యాల సాహిత్యం: పింగళి గానం: యస్.వరలక్ష్మి పల్లవి: లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా... తెలిసి తెలియని బేలల కడ నీ జాలములేవి చెల్లవుగా..ఆ ..ఆ లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా చరణం: 1 వేణు గానమున తేరగ పిలిచి ..మౌనము పూనగ ఏలనో వేణు గానమున తేరగ పిలిచి ..మౌనము పూనగ ఏలనో అలకయేమో యని దరి రాకుండిన జాలిగ చూచే వేణు... లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా చరణం: 2 నీ చిరునవ్వుల వెన్నెలలో మైమరువగ చేయగ ఏలనో నీ చిరునవ్వుల వెన్నెలలో మైమరువగ చేయగ ఏలనో మైమరచిన చెలి మాటే లేదని.... ఆ ..ఆ..ఆ ..ఆ ..ఆ..ఆ..ఆ మైమరచిన చెలి మాటే లేదని.. ఓరగ చూచే వేణు... లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా తెలిసి తెలియని బేలల కడ నీ జాలములేవి చెల్లవుగా.. లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియను గా...
మోహన రాగమహా పాట సాహిత్యం
చిత్రం: మహామంత్రి తిమ్మరుసు (1962) సంగీతం: పెండ్యాల సాహిత్యం: పింగళి గానం: ఘంటసాల, పి.సుశీల పల్లవి: మోహన రాగమహా మూర్తిమంతమాయె మోహన రాగమహా మూర్తిమంతమాయె... నీ ప్రియ రూపము కన్నుల ముందర నిలచిన చాలునులే మోహన రాగమహా.. మూర్తిమంతమాయె.. చరణం: 1 చిత్రసీమలో వెలయగ జేసి దివ్యగానమున జీవము పోసి ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ... చిత్రసీమలో వెలయగ జేసి దివ్యగానమున జీవము పోసి సరసముగా నను చేరగ పిలిచే ప్రేయసియేయనగా.. మోహన రాగమహా... మూర్తిమంతమాయె చరణం: 2 నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపము రాగా ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ.. నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపము రాగా ఆరాధించిన ప్రియభావమిలా పరవశించెననగా... మోహన రాగమహా... మూర్తిమంతమాయె
తదాస్తు స్వాముల కొలవండీ పాట సాహిత్యం
చిత్రం: మహామంత్రి తిమ్మరుసు (1962) సంగీతం: పెండ్యాల సాహిత్యం: పింగళి గానం: యస్.వరలక్ష్మి, పి.సుశీల తదాస్తు స్వాముల కొలవండీ అస్తీ నాస్తుల తెలియండీ కనులు తెరిస్తే నేను ఆస్తి కన్నులు మూస్తే నీవు నాస్తి ఉన్నది లేదని వాదాలు లేనిది ఉందని భేదాలు వాదం భేదం భేదమె కాగా వేదమె లేదని చెడకండి గ్రాసం కోసమె వేషాలు వేషంతోనే మోసాలు వేషం మోసం దోసమె కాగా శాస్త్రం తెలుసుకు బ్రతకండి హరి ఓం, హరి ఓం, హరి ఓం, హరి ఓం ఓంకారంలో ఒంకరలు ఒంకర బుద్ధికి శంకలు శంకలతోనే జంకులు జంకులతోనే బొంకులు పద్యం నెం. 2 పాడినది : మాధవపెద్ది సత్యం శ్రీకర కాకా, కికీ కుకూ కెకే కైకొ కోలు కౌ కం కఃలు నీ కీర్తిని వర్ణింపగ నాకక్కర వచ్చెనోయి నయముగ తిప్పా
తిరుమల తిరుపతి వెంకటేశ్వర పాట సాహిత్యం
చిత్రం: మహామంత్రి తిమ్మరుసు (1962) సంగీతం: పెండ్యాల సాహిత్యం: పింగళి గానం: యస్.వరలక్ష్మి, పి.సుశీల పల్లవి: తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ ఓ తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ చెలిమిని విరిసే అలమేల్మంగమ... చెలువములే ప్రియ సేవలయ తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ చరణం: 1 నయగారాలను నవమల్లికలా... మమకారాలను మందారములా నయగారాలను నవమల్లికలా... మమకారాలను మందారములా... మంజుల వలపుల... మలయానిలముల... మంజుల వలపుల మలయానిలముల.. వింజామరమున వీతుమయా... తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ చరణం: 2 ఆశారాగమే ఆలాపనగా... ఆ..హ...ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆశారాగమే ఆలాపనగా... సరసరీతుల స్వరమేళనలా... నిసరినిదపదమగరిగరిస మగరిస మపమగరిస గరిగపమగరిస... మపనిసరి మగ మ రి గ సరినిసరి ని ద మ మపద మ గ రి పమరి నినిప ససని నినిస మగరిగ నిసరి నదమపనిస నిసరి నిదమపదప దపదమగరిగనిస... ఆశారాగమే ఆలాపనగా... సరసరీతుల స్వరమేళనలా... అభినయ నటనలే ఆరాధనగా... అభినయ నటనలే ఆరాధనగా... ప్రభునలరించి తరింతుమయా.... తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ ఆ...ఆ...అ...అ...ఆ...ఆ...ఆ.. ఆ...ఆ..ఆ...ఆ...ఆ... తిరుమల తిరుపతి వెంకటేశ్వర... ఆ...ఆ..ఆ.. తిరుమల తిరుపతి వెంకటేశ్వర.... కూరిమి వరముల కురియుమయ
జయ అనరే జయ అనరే పాట సాహిత్యం
చిత్రం: మహామంత్రి తిమ్మరుసు (1962) సంగీతం: పెండ్యాల సాహిత్యం: పింగళి గానం: పి. లీల జయ అనరె జయ జయ అనరె తెలుగు వెలుగులను దిశలనునించే బాలా కుమార రాయలకు కన్నడ రాజ్యము ఏలే నన్నా కళింగ దేశము నాదే నన్నా వాదుకు వచ్చే తాత ఎవ్వరని ముద్దులు గురినే బాలునకు రణ తంత్రమున రాజ్య తంత్రమున జనకునకే గురుదేవులు కాగా అసలు తాత మా అప్పాజీ యని చేతులు జాచే తనయునకు
ఆంధ్ర దేవా పాట సాహిత్యం
చిత్రం: మహామంత్రి తిమ్మరుసు (1962) సంగీతం: పెండ్యాల సాహిత్యం: పింగళి గానం: పి. లీల ఆంధ్ర దేవా వెంకటేశ్వరా విరూపాక్ష స్వామీ చరిత్ర ఎరుగని మహాపాతకము మా దేశానికి పట్టినదా ఉపకారమే ఒక నేరమా అపకారమే ప్రతి ఫలమా ఇదే నీ న్యాయ విధానమా మౌనమె నీ సమాధానమా నాల్గు పాదముల ధర్మము నడిచే రోజులు నేటితొ తీరినవా న్యాయమరయగా జాలక రాజే అన్యాయానికి పాల్పడైనా అందరి కన్నూ అప్పాజీ ఆ మహాత్ము కన్నులె పొడిపించె ఆంధ్ర జ్యోతియె అరిపోవగా ఈ విధి రాయలె జేసెనా