Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Marana Mrudangam (1988)




చిత్రం: మరణ మృదంగం (1988)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: చిరంజీవి, రాధ, సుహాసిని
దర్శకత్వం: ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాత: కె.యస్.రామారావు
విడుదల తేది: 04.08.1988



Songs List:



గొడవే గొడవమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: మరణ మృదంగం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ...
గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ...
అడుగు అడిగేది అడుగు... వయసే మిడిసి పడుతుంటే...
తళుకే సుడులే తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే...
తడిసి మెడిసి మెరిసే సొగసు ఉలికి పడుతు

గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ
గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ 

చరణం: 1
మొదటే చలి గాలి సలహాలు వింటే
ముసిరే మోహాలు దాహాలు పెంచే
కసిగా నీ చూపు నా దుంప తెంచే
అసలే నీ వంపు నా కొంప ముంచే

ముదిరే వలుపులో నిదురే సేవంట
కుదిరే మనువుల్లో ఎదురే నే ఉంటా
బెదిరే కళ్ళలో కధలే నే వింటా
అదిరే గుండెలో శృతులే ముద్దంటా
దోబోచులాడేటి అందమొకటి ఉంది
దోచేసుకోలేని బంధమొకటి అంది
పదుకో రగిలే పరువం సిగలో విరిసే మరువం
పగలే పెరిగే బిడియం కలిపి చెరిగే ప్రణయం

గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ...
గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ..
అడుగు అడిగేది అడుగు వయసే మిడిసి పడుతుంటే
తళుకే సుడులే తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే
తడిసి మెడిసి మెరిసే సొగసుఉలికి పడుతు

గొడవే గోడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ
గొడవే లేదమ్మా దారి పట్టి పోదకే పదవమ్మ

చరణం: 2
ఇప్పుడే తెలిసింది ఈ ప్రేమ ఘాటు
పడితే తెలిసింది తొలిప్రేమ కాటు
కునుకే లేకున్నా ఈ నైట్ బీటు
ఎప్పుడో మార్చింది నా హార్ట్ బీటు

పిలిచే వయస్సులతో జరిగే పేరంటం
మొలిచే సొగసులతో పెరిగే ఆరాటం
చలికే వొళ్ళంతా పలికే సంగీతం
సరదా పొద్దులోకరిగే సాయంత్రం

నీ ఎడారి నిండా ఉదక మండలాలు
నీటి ధార దాటే మౌన పంజరాలు
తనువే తగిలే హృదయం కనులై విరిసే ఉదయం
జతగా దొరికే సమయం ఒకటైపోయే ఉభయం

గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ...
గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ..
అడుగు అడిగేది అడుగు వయసే మిడిసి పడుతుంటే
తళుకే సుడులే తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే
తడిసి మెడిసి మెరిసే సొగసు ఉలికి పడుతు

గొడవే గోడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ
గొడవే లేదమ్మా దారి పట్టి పోదకే పదవమ్మ





కొక్కర పిక్కర చక్ పాట సాహిత్యం

 
చిత్రం: మరణ మృదంగం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం:  యస్.పి.బాలు

పల్లవి :
హూ కొక్కర పిక్కర చక్ కుప్పుకర్ చక్
కుక్కుకర్ చక్ కుప్పుకర్ చక్ కుప్పుకర్ తక్
యుగాక్కర్ కొక్కర పిక్కర తక్కర కక్కర కక్కర
తిక్కర ధిక్కార కొక్కర కొక్కర పిక్కర తక్కర
కక్కర కక్కర తక్కర పిక్కర
కోక్కరో కో కో కో కో కో కో
కొక్కర కో కొక్కర కో కో కో కో కో కో కో
కొక్కర కో కో కో కో కో కో కో
కోక్కరో కో కో కో జిం జిం జిం జిం జిం జిం
జిం జిం జిం జిం జిం జిం

హే...  జంగిలి జిమ జిమ జాకెట్ చిమ చిమ
సందడి గుమ గుమ సంగతి యమ యమ ఓ.. ఆహ... ఆ..
మిస్సులు మిల మిల కిస్సులు కిల కిల
డ్రెస్సులు జల జల yes అని పద పద ఓ... ఆహ్... ఏ
అరె సిగ్గులు విడిచిన లంగరు సింగడు వీడే ఇడియట్
దిక్కులు కట్టిన దేవుడు లొంగడు లేవే...  you.....
అం భం భం మేడా రంభం నీదే కుంభం నాదే లాభం

హే జంగిలి జిమ జిమ జాకెట్ చిమ చిమ
సందడి గుమ గుమ సంగతి యమ యమ ఓ....  ఛీ పో
మిస్సులు మిల మిల కిస్సులు కిల కిల
డ్రెస్సులు జల జల yes అని పద పద ఓ ఓ ఓ...  ఆహ్...  గెట్ లాస్ట్ 

చరణం: 1
చెట్టు పుట్ట పిట్ట బట్ట కట్టుకోవులే
పుట్టేనాడు గిట్టేనాడు గుడ్డే లేదులే
చెట్టు పుట్ట పిట్ట బట్ట కట్టుకోవు లే
పుట్టేనాడు గిట్టేనాడు గుడ్డే లేదులే
పేచి లేని గోచి పెట్టె యోగి వేమన
పూచి నాదే డంగై పోకు లింగు లిటుకుమ్మా
ఆనాడు శ్రీకృష్ణుడే చీరెత్తుకేల్లేడులే...  షట్ అప్
ఈనాటి ఓ భామలో సిగ్గు ఎత్తుకేల్లావ్ లే...  you...  you
అందం చందం పంతం బంధం అన్ని దోస్తలే

జంగిలి జిమ జిమ జాకెట్ చిమ చిమ
సందడి గుమ గుమ సంగతి యమ యమ ఓ ఆహ ఆ..
అరె మిస్సులు మిల మిల కిస్సులు కిల కిల
డ్రెస్సులు జల జల yes అని పద పద ఓ ఆహ్..  Get away
అరె సిగ్గులు విడిచిన లంగరు సింగడు వీడే
దిక్కులు కట్టిన దేవుడు లొంగడు లేవే
అం భం భం మేడా రంభం నీదే కుంభం నాదే లాభం

హే జంగిలి జిమ జిమ జాకెట్ చిమ చిమ
సందడి గుమ గుమ సంగతి యమ యమ ఓ ఓ
మిస్సులు మిల మిల కిస్సులు కిల కిల
డ్రెస్సులు జల జల yes అని పద పద ఓ ఆహ్ 

చరణం: 2
కావాలంటే చూపిస్తా లే కండల్లో కసి
వద్దుంటున్నా వడ్డిస్తాలే కౌగట్లిలో రుచి
కావాలంటే చూపిస్తా లే కండల్లో కసి
వద్దుంటున్నా వడ్డిస్తాలే కౌగట్లిలో రుచి
21st సెంచురీని నేనే కొట్టేస్తా
చంటి చిట్టి పొట్టి అంటే ముద్దే పెట్టేస్తా ఛీ పాడు
ఏ వీధి నాట్యాలలో నేను ఆడుతుననులే యు నాటి
నా చాటు కావ్యాలకే నే పాడుతుననులే హౌ సిల్లి
పత్రం పుష్పం శిల్పం తల్పం లూటీ చేస్తాలే

జంగిలి జిమ జిమ జాకెట్ చిమ చిమ
సందడి గుమ గుమ సంగతి యమ యమ ఓ ఆహ ఆ..
అరే మిస్సులు మిల మిల కిస్సులు కిల కిల
డ్రెస్సులు జల జల yes అని పద పద ఓ ఆహ్
అరె సిగ్గులు విడిచిన లంగరు సింగడు వీడే.. వేవ్వే వేవ్వే
దిక్కులు కట్టిన దేవుడు లొంగడు లేవే ... ఛీఛీ ఛీపో
అం భం భం మేడా రంభం నీదే కుంభం..  నాదే లాభం

జంగిలి జిమ జిమ జాకెట్ చిమ చిమ
సందడి గుమ గుమ సంగతి యమ యమ...  ఓ ఓ
మిస్సులు మిల మిల కిస్సులు కిల కిల
డ్రెస్సులు జల జల yes అని పద పద ఓ ... ఆహ్




కరిగిపోయాను కర్పూర వీణలా పాట సాహిత్యం

 
చిత్రం: మరణ మృదంగం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
కరిగిపోయాను కర్పూర వీణలా
కలిసిపోయాను నీ వంశధారలా
నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకుంటున్నా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా..
కలిసిపోయాక ఈ రెండు కన్నులా...

చరణం: 1
మనసుపడిన కథ తెలుసుగా
ప్రేమిస్తున్నా తొలిగా
పడుచు తపనలివి తెలుసుగా
మన్నిస్తున్నా చెలిగా
ఏ ఆశలో...  ఒకే ధ్యాసగా
ఏ ఊసులో ...  ఇలా బాసగా
అనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా

కరిగిపోయాను కర్పూర వీణలా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకుంటున్నా
కరిగిపోయాను కర్పూర వీణలా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా

చరణం: 2
అసలు మతులు చెడి జంటగా
ఏమవుతామో తెలుసా
జతలుకలిసి మనమొంటిగా
ఏమైనా సరిగరిసా
ఏ కోరికో శృతే మించగా
ఈ ప్రేమలో ఇలా ఉంచగా
అధరాలెందుకో అందాలలో నీ ప్రేమలేఖలే లిఖించగా

కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
కలిసిపోయాను నీ వంశధారలా
నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకుంటున్నా
నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
కలిసిపోయాను నీ వంశధారలా



కొట్టండి తిట్టండి పాట సాహిత్యం

 
చిత్రం: మరణ మృదంగం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం:  యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
మహా కసి గున్నది భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది
ఈ ముద్దులో ముంచేసే ముద్దులే తడిపేసే కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా...

చరణం: 1
కళ్ళు కళ్ళు కలిసాక కవ్వింతగా
ఒళ్ళు ఒళ్ళు కలిపేది ప్రేమా...
ఒళ్ళు ఒళ్ళు కలిసాక ఓ జంటగా
ఎద ఎద కలిపేది ప్రేమా....
శృంగార వీధిల్లోనా షికారు చేసి
ఊరోళ్ల నోళ్ళలోనా పుకారు వేసి
పరువమే హుషారు పుట్టించి
పరువునే బజారు కెక్కించి
మాటిస్తే వినుకోదు
లాలిస్తే పడుకోదు
చోటిస్తే సరిపోదు
ఊరిస్తే ఊర్కోదు
ఈ చిగురు వలుపు చిలిపి పిలుపు కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
మహా కసి గున్నది భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...

చరణం: 2
మళ్లీ మళ్లీ అంటుంది మారాముగా
ఒల్లోకి వోచి తాకుతుంది ప్రేమా..
తుళ్ళి తుళ్ళి పడుతోంది మర్యాదగా
చెల్లించేయ్ ఆ కాస్త ప్రేమా..

మంచాల అంచుల్లోన మకాము చేసి
మందార గంధాలు ఎన్నో మలాము వేసి
వయస్సుని వసంత మాడించే
మనస్సులో తుళ్ళింత పుట్టించే
చూపుల్తో శ్రుతి కాదు
మాటల్తో మతి రాదు
ముద్దుల్తో సరి కాదు
ముట్టందే చలి పోదు
ఈ మనసు మధన తనువు తపన కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...

మహా కసి గున్నది భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది
ఈ ముద్దులో ముంచేసే ముద్దులే తడిపేసే కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..



సరిగమ పదనిస రసనసా పాట సాహిత్యం

 
చిత్రం: మరణ మృదంగం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస

ముద్దు పెట్టు ముద్దు పెట్టు పదా
ముద్దులేక పొద్దుపోని కథా
ముద్దుకాటు పడ్డ కన్నె ఎదా
విచ్చుకున్న ముద్దబంతి కథా

సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుసా

చరణం: 1
రెండు హృదయాల పిట్టపోరూ తీరనంటుంది ఎందుకో
దొంగ యోగాల కొంగగారూ గాలమేసేది ఎందుకో
చేతికందాక జాబిలీ చుక్కతో నాకు ఏం పనీ
తట్టుకున్నాక కౌగిళీ ఏమి కావాలొ చెప్పనీ
కస్సుమన్న దాని సోకు కసిగా ఉంటుందీ
తుమ్మెదొచ్చి వాలినాక పువ్వేమంటుందీ

సిగ్గో చీనీలపండు 
బుగ్గో బత్తాయిపండు 
అల్లో నేరేడుపండు నాదీ
అరె నా నా నా నా నా నేనే కాదంటున్నానా

సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస

ముద్దు పెట్టు ముద్దు పెట్టు పదా
ముద్దులేక పొద్దుపోని కథా
ముద్దుకాటు పడ్డ కన్నె ఎదా
విచ్చుకున్న ముద్దబంతి కథా

సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుసా

చరణం: 2
వయసు వడగళ్ళ వాన నీరూ వంటపట్టింది ఎందుకో
నన్ను దులిపేసి వలపు గాలీ నిన్ను తాకింది తట్టుకో
లేత అందాల దోపిడీ ఇప్పుడే కాస్త ఆపనీ
ఆపినా ఆగి చావదూ అందచందాల ఆ పనీ
ఇంతదాక వచ్చినాక ఇంకేమౌతుందీ
లబ్జు లబ్జు మోజు మీదా లంకే అంటోందీ

అబ్బొ నా బాయ్ ఫ్రెండు 
ముద్దిస్తె నోరు పండు 
వాటేస్తె ఒళ్ళుమండునమ్మా
అరె నా నా నా నా నా నేనే కాదంటున్నానా

సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస

ముద్దు పెట్టు ముద్దు పెట్టు పదా
ముద్దులేక పొద్దుపోని కథా
ముద్దుకాటు పడ్డ కన్నె ఎదా
విచ్చుకున్న ముద్దబంతి కథా

సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుసా

Most Recent

Default