Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Maro Charitra (1978)




చిత్రం: మరోచరిత్ర (1978)
సంగీతం: యమ్.యస్. విశ్వనాథన్
నటీనటులు: కమల్ హాసన్, సరిత, మాధవి
దర్శకత్వం: కె.బాలచందర్
నిర్మాత: రమ అరంగన్నల్
విడుదల తేది: 02.05.1978



Songs List:



భలే భలే మగాడివోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: మరోచరిత్ర (1978)
సంగీతం: యమ్.యస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, ఎల్. ఆర్.ఈశ్వరి

భలే భలే మగాడివోయ్ 
బంగారు నా సామివోయ్
నీ మగసిరి గులామునోయ్
నీ ఆన నీ దాననోయ్
ఐ డోంట్ నో వాట్ యు సే
తెలియంది మానేసేయ్
నీకు తెలిసింది ఆడేసేయ్
తీయంది ఒక బాటే

దట్స్ లవ్ షల్ బ్లష్ ఐ సే
ఐ డోంట్ నో వాట్ యు సే టు మి
బట్ ఐ హావ్ సో మచ్ టు సే
ఐ వాన్న ఫ్లై విత్ యు అప్ ద స్కై
ఆండ్ డాన్స్ ఆల్ ద నైట్
ఐ కాంట్ హెల్ప్ డార్లింగ్ ఫాలింగ్ ఇన్ లవ్
విత్ యు అండ్ ఓన్లీ విత్ యు
కమ్ డార్లింగ్ లెట్స్ ప్లే ద గేమ్
కమ్ డార్లింగ్ లెట్స్ సింగ్ అండ్ స్వే

నా గుండె లోన నీవే ఉయ్యాలలూగినావే
లెట్స్ బి మెర్రీ మై డవ్
హే లెట్స్ బి మెర్రీ మై డవ్
ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో
ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో
వన్ ఫైన్ డే యు విల్ బి మైన్
ఇట్ విల్ బి ఫుల్ ఆఫ్ సన్ షైన్
వన్ ఫైన్ డే యు విల్ బి మైన్
ఇట్ విల్ బి ఫుల్ ఆఫ్ సన్ షైన్
నాతోటి నీవుండ నాకు ఇంకేల నీరెండ
నాతోటి నీవుండ నాకు ఇంకేల నీరెండ
కమ్ బేబి లెట్స్ హావ్ సమ్ ఫన్
డౌన్ హియర్ దేర్ ఈజ్ నో వన్

భలే భలే మగాడివోయ్ 
బంగారు నా సామివోయ్
ఐ వాన్న ఫ్లై విత్ యు అప్ ద స్కై
ఆండ్ డాన్స్ ద వోల్ నైట్

నీ కౌగిలింతలోన నా సొగసు దాచుకోనీ
నో నీడ్ టు ఫీల్ షై మై గాల్
నో నీడ్ టు హోల్డ్ బాక్ మై డాల్
నా వంపు వంపులోన నీ వయసు ఆపుకోనీ
హాన్డ్ ఇన్ హాన్డ్ లెట్స్ సే మై డియర్
కమ్ నియర్ డోన్ట్ ఫియర్ డియర్
సాగించు పయనాన్నీ నీవే చూపించు స్వర్గాన్ని
లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఆఫ్ అవర్ లైవ్ అండ్ యువిల్ బి మై డియర్ వైఫ్

హా భలే భలే మగాడివోయ్ 
బంగారు నా సామివోయ్
నీ మగసిరి గులామునోయ్
నీ ఆన నీ దాననోయ్





కలిసి వుంటే కలదు సుఖము పాట సాహిత్యం

 
చిత్రం: మరోచరిత్ర (1978)
సంగీతం: యమ్.యస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, రమోలా 

కలిసి వుంటే కలదు సుఖము కలిసి వచ్చిన అదృష్టము శెభాష్ 
కలిసి ఉంటే కలదు సుఖము కలిసి వచ్చిన అదృష్టము 
ఇది కలిసి వచ్చిన అదృష్టము 
కన్నె మనసులు మూగ మనసులు(2) 
తేనె మనసులు మంచి మనసులు 

చరణం: 1 
మొనగాళ్ళకు మొనగాడు దసరా బుల్లోడు 
ప్రేమ నగర్ సోగ్గాడు పూల రంగడు (2) 
పక్కింటి అమ్మాయి గడుసమ్మాయి (2) 
అమెరికా అమ్మాయి రోజులు మారాయి.. 

చరణం: 2 
మంచి వాడు మామకు తగ్గ అల్లుడు 
చిక్కడు దొరకదు కదలడు వదలదు వాడే వాడు (2) 
అయ్యో పిచ్చివాడు... 
ఈడు జోడు తోడు నీడ నాడు నేడు (2) 
ప్రేమించి చూడు పెళ్లి చేసి చూడు




పదహారేళ్ళకు నీలో నాలో పాట సాహిత్యం

 
చిత్రం: మరోచరిత్ర (1978)
సంగీతం: యమ్.యస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.జానకి

పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే 
చిలిపి పనులకు కోటి దండాలు (2) 
వెన్నెలల్లె విరియబూచి వెల్లువల్లే ఉరకలేసే 
పదహారేళ్ళకు .... 

చరణం: 1 
పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు 
పాటలు పాడిన చిరుగాలులకు 
తెరచాటొసగిన చెలులు శిలలకు (2) 
దీవెన జల్లులు చల్లిన అలలకు 
కోటి దండాలు శత కోటి దండాలు... 

చరణం: 2 
నాతో కలిసి నడచిన కాళ్ళకు 
నాలో నిన్నే నింపిన కళ్ళకు 
నిన్నే పిలిచే నా పెదవులకు 
నీకై చిక్కిన నా నడుమునకు 
కోటి దండాలు శత కోటి దండాలు.. 

చరణం: 3 
భ్రమలో లేపిన తొలి జాములకు 
సమయం కుదిరిన సందె వేళలకు 
నిన్ను నన్ను కన్నవాళ్ళకు (2) 
మనకై వేచే ముందు నాళ్ళకు..





విధి చేయు వింతలన్నీ పాట సాహిత్యం

 
చిత్రం: మరోచరిత్ర (1978)
సంగీతం: యమ్.యస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: వాణి జయరాం

విధి చేయు వింతలన్నీ మతిలేని చేతలేనని 
విరహాన వేగిపోయి విలపించే కధలు ఎన్నో (2) 
విలపించే కధలు ఎన్నో... 

చరణం: 1 
ఎదురు చూపులు ఎదను పిండగా 
ఏళ్ళు గడిపెను శకుంతల 
విరహ బాధను మరిచిపోవగా 
నిదురపోయెను ఊర్మిళ 
అనురాగమే నిజమని 
మనసొకటి దాని ఋజువని 
తుది జయము ప్రేమదేయని 
బలి అయినవి బ్రతుకులెన్నో... 

చరణం: 2 
వలచి గెలిచి కలలు పండిన 
జంట లేదీ ఇలలో 
కులమో మతమో ధనమో బలమో 
గొంతు కోసెను తుదిలో 
అది నేడు జరుగ రాదనీ 
ఎడబాసి వేచినాము 
మన గాధే యువతరాలకు కావాలి మరోచరిత్ర 
కావాలి మరోచరిత్ర




ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో పాట సాహిత్యం

 
చిత్రం: మరోచరిత్ర (1978)
సంగీతం: యమ్.యస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి. సుశీల, కమల్ హాసన్

ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో 
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
అప్పిడిన్న  - అర్ధం కాలేదా!! ఊఁ

ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో 
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో

మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది
మనసు మూగది మాటలు రానిది 
మమత ఒకటే అది నేర్చినది

అహ అప్పిడియ - పెద్ద అర్ధం అయినట్టు
బాషలేనిది బందమున్నది 
మన ఇద్దరిని జత కూర్చినది
మన ఇద్దరిని జత కూర్చినది

ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో 
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో

వయసే వయసును పలకరించినది 
వలదన్నా అది నిలువకున్నది
ఏ నీ రొంబ అలహారిక్కే...!! - ఆ రొంబ అంటే
ఎల్లలు యేవి వొల్లనన్నది 
నీదీ నాదోక లోకమన్నది
నీదీ నాదోక లోకమన్నది

ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో 
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో

తొలి చూపే నను నిలవేసినది 
మరుమాపై అది కలవరించినది
నల్ల పొన్ను అంటే నల్ల పిల్ల
మొదటి కలయికే  ముడివేసినది 
తుది దాకా ఇది నిలకడైనది
తుది దాకా ఇది నిలకడైనది

ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో 
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో



ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో పాట సాహిత్యం

 
చిత్రం: మరోచరిత్ర (1978)
సంగీతం: యమ్.యస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో (2)
తెలిసీ తెలియని అభిమానమౌనో

మనసు మూగది  మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది (2)

బాష లేనిదీ బంధమున్నది
బాష లేనిదీ బంధమున్నది
మన ఇద్దరినీ జత కూర్చినది
మన ఇద్దరినీ జత కూర్చినది

ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో

వయసే వయసును పలకరించినది
వలదన్నా అది నిలువకున్నది (2)

చేసిన బాస శిలవలే నిలచి
చేసిన బాస శిలవలే నిలచి
చివరికి మంచై కరుగుతున్నది 
చివరికి మంచై కరుగుతున్నది 

ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో


Most Recent

Default