Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Masala (2013)




చిత్రం: మసాలా (2013)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
నటీనటులు: వెంకటేష్ , రామ్, అంజలి, సాజమ్ పదంసి
దర్శకత్వం: కె.విజయ్ భాస్కర్
నిర్మాతలు: డి.సురేష్ బాబు, స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 14.11.2013



Songs List:



నిను చూడని కనులెందుకో  పాట సాహిత్యం

 
చిత్రం: మసాలా (2013)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: రంజిత్, శ్రేయగోషల్

నిను చూడని కనులెందుకో 
నిను చేరని కలలెందుకో 
నిన్ను పొందని మనసెందుకో 
నువ్వుంటే చాలు వేరేమి లేకున్న...ఆ...ఆ.. 
నీకంటే సొంతం లేనే ఎవరున్నా.... 

నిను చూడని కనులెందుకో 
నిను చేరని కలలెందుకో 
నిన్ను పొందని మనసెందుకో 
నువ్వుంటే చాలు వేరేమి లేకున్న...ఆ...ఆ.. 
నీకంటే సొంతం లేనే లేరన్నా.. 

చరణం: 1 
ఎంతెంత దూరానా నేను ఉంటున్నా.. 
నీ గుండె సవ్వళ్ళ ఊసు వింటున్నా... 
ఆ ప్రేమ రాగాల లోన నేనే ఉన్న 
ఓ..అవునంటు కాదంటు 
నా పంచ ప్రాణాలేమన్నా..శ్వాసించే గాలల్లే 
నువ్వుంటే చాలమ్మా 
ఓ ప్రేమ నీలో నన్నే చూస్తున్నా... 
మొత్తంగ నన్నే నీకందిస్తున్నా... 

నిను చూడని కనులెందుకో 
నిను చేరని కలలెందుకో 
నిన్ను పొందని మనసెందుకో 
నువ్వుంటే చాలు వేరేమి లేకున్న...ఆ...ఆ.. 
నీకంటే సొంతం లేనే ఎవరున్నా.... 

చరణం: 2 
నువ్వంటే నెన్నంటూ వేరే చెప్పాలా 
గుండెల్లో దాగున్న్న గుట్టు విప్పాలా.. 
నీ పైన ప్రేమంత ఉందో చూపించాలా 
ఓ... 
నువ్వు అన్నా అనకున్నా నీ మనసే చదివానీ వేళా 
మాటల్లో అనలేని మౌనాలే తెలిసేలా... 
ఓ ప్రేమ నీలో నన్నే చూస్తున్నా... 
మొత్తమగ నన్నే నీకందిస్తున్నా... 

నిను చూడని కనులెందుకో 
నిను చేరని కలలెందుకో 
నిన్ను పొందని మనసెందుకో 
నువ్వుంటే చాలు వేరేమి లేకున్న...ఆ...ఆ.. 
నీకంటే సొంతం లేనే లేరన్నా.. 




కోట్లలో ఒక్కడే రా  పాట సాహిత్యం

 
చిత్రం: మసాలా (2013)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: శంకర్ మహదేవన్

కోట్లలో ఒక్కడే రా 
కోరమీసాల బొబ్బిలి రాజా 
ఎదురొస్తే ఎవడికైనా 
మొత్త మొగలి బ్యాండ్ బాజా... 
రూపం లో అలనాటి రాయలేరా 
కంటి చూపుల్లో కరుణించే సాయమేర 
ఊపిరిలో ఉప్పొంగే ధైర్యమేరా 
ఊరి జనమంతా ప్రేమించే దైవమేర 
ఇలాంటి అండ దండే మేం కోరుకుంది మనసారా 

కోట్లలో ఒక్కడే రా 
కోరమీసాల బొబ్బిలి రాజా 
ఎదురొస్తే ఎవడికైనా 
మొత్త మొగలి బ్యాండ్ బాజా... 

చరణం: 1 
కదిలే సింగం లాంటి అయ్యోరినే చూదాలా 
కంటి ముందుకొచ్చాడంటే దండం పెట్టే తీరాలా 
ఇచ్చే గుణమేదో వస్తూనే తెచ్చాడు 
ప్రేమనే పంచగా... ఈ అందరి వాడు 
తీయని రుణమేదో తీర్చేందుకు వచ్చాడు 
చీకటే తుంచగా... వెయ్యేళ్ళ వెన్నెలల్లే 
మా వెన్ను దన్ను ఉంటాడు 

కోట్లలో ఒక్కడే రా 
కోరమీసాల బొబ్బిలి రాజా 
ఎదురొస్తే ఎవడికైనా 
మొత్త మొగలి బ్యాండ్ బాజా... 

చరణం: 2 
లేని వాడు ఉన్న వాడు ఎవరైనా సమానం 
ఈ రాజు గారి దివాణం లో మంచితనం ప్రధానం 
గడువు తీరాక మనిషెల్లి పోతాడు 
నిలిచే వాడెవడు... ఎ లోకం లోనా 
మనిషి లెక్కున్న కలకలం ఉండేది మాటేగా ఎప్పుడూ 
అ మాటకి విలువిస్తాడు ఈ మనసు గొప్ప దొరబాబు 

కోట్లలో ఒక్కడే రా 
కోరమీసాల బొబ్బిలి రాజా 
ఎదురొస్తే ఎవడికైనా 
మొత్త మొగలి బ్యాండ్ బాజా... 




మీనాక్షి మీనాక్షి పాట సాహిత్యం

 
చిత్రం: మసాలా (2013)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: సుచిత్ సురేషన్, యమ్.యమ్.మానసి

మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి 
ఏదేదో అవుతోంది మనసే నిన్ను చూసి... 
మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కి మీనాక్షి 
ఏక్షన్ లో దూకానే గీతలు చెరిపేసి.... 
చిలిపి నడుము ఒంపుతో నాజుకుగా పిలిచింది కర్వీ బాడి 
వయసు తొలి విందులే వడ్డించగా యూ గెట్ రెడి... 

మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి 
నీ ఒళ్ళో వాలింది పువ్వై విరబూసి... 
మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కి మీనాక్షి 
నీ సాయం కోరింది పెదవే తడి చేసి.. 

చరణం: 1 
హెయ్... వీపుకే అంటుతోంది చూపు 
నరాల్లో మండుతుండి నిప్పు 
ఎటో యే మస్తు మాయ వైపో నన్నే లాగుతోంది కైపు 
తప్పదు ఈ ఇష్టమైన తప్పు 
వీలుగ చెయ్యి చెయ్యి కలుపూ... 
మెరుపు తీగైన నువ్వు మెలివెయ్యని నీ ఒంటిలో ప్రతీ మలుపు 
ఇసుక తిన్నై ఇలా పరిచిందిగా విరి పానుపు 
ఒహ్ ఒహ్ ఒహ్ 

మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి 
ఏదేదో అవుతోంది మనసే నిన్ను చూసి... 
మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కి మీనాక్షి 
ఏక్షన్ లో దూకానే గీతలు చెరిపేసి.... 

చరణం: 2 
హెయ్... కామిని కలల గాలి తడిమి 
కళ్ళలో రగులుతోంది కొలిమి 
సూటిగ దూసుకొచ్చి హగ్ మీ 
కత్తిలా గుచ్చుకుంటు కిల్ మీ 
నువ్వు నా తీయనైన ఎనిమీ 
నేను నీ గుండెలోన గర్మీ... 
ఒళ్ళు ఫైర్ ఐనను అల్లేసుకో అణువణువు అంతా తడిమి 
మొగిలి నిన్నగువై తేల్చేసుకో అమీ తుమీ 

మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి 
ఏదేదో అవుతోంది మనసే నిన్ను చూసి... 
మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కి మీనాక్షి 
ఏక్షన్ లో దూకానే గీతలు చెరిపేసి.... 




అచ్చారే అచ్చారే పాట సాహిత్యం

 
చిత్రం: మసాలా (2013)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: రంజిత్, బిందు

అచ్చారే అచ్చారే అచ్చా హువా 
వెచ్చంగ గిచ్చింది అందం హవా ... 
చూస్తూనే చూస్తూనే యే క్యా హువా 
దిల్ మేరా మబ్బులో తార జువ్వా... 
సిరిమల్లె తీగల్లే తూగే పిల్లా 
హై టెన్షన్ తీగల్లే తాకిందిలా 
ఒల్లంతా చరెంటు పాకేంతలా 
చెలరేగిందే హల్లా గుల్లా 
దుమ్ములే దుమ్ములే దుమ్ము లేపే వూపులో 
నిప్పులే తొక్కినట్టు స్టెప్పులెయ్యాలే 
ఫ్యూజ్ లు గుసులో పేలిపోయే రేంజ్ లో 
హిప్ హాపు కూచిపూడి మిక్సు చేయాలే 

చరణం: 1 
రా రమ్మన్నా... ఆకాశం దిగిరాదు రా 
వద్దు వద్దన్నా.... వచ్చేది నిన్ను దాటి పోనే పోలేదు రా 
ఏనాడైనా అయ్యేదే అవుతుంది రా 
జిందగి లొ అందమైన లెక్క వుంధి రా 
రాసిపెట్టి ఉంటే నీకు దక్కుతుంది రా... 
చేయి జారిపొయేదంతా వేస్ట్ గుక్క రా 
నీ వరాల ఫేస్ మీది దిష్టి చుక్క రా 
సిక్కింది రా లాటరి జాక్ పాట్ లా 
లక్కీ గా నీకే మరి దొరికింది రా 
లవ్లీ గా లవ్ ట్రాకై చేరింది రా 
నీ ఇన్నాళ్ళ జర్నీ ఇలా.... 
దుమ్ములే దుమ్ములే దుమ్ము లేపే టైపులో 
నిప్పులే తొక్కినట్టు స్టెప్పు లెయ్యాలే 
ఫ్యూజ్ లు గుసులో పేలిపోయే రేంజ్ లో 
హిప్ హాపు కూచిపూడి మిక్సు చేయాలే 

చరణం: 2 
నాధిరిధిన్నా ధిన్నా నాధిరిధిన్నా 
నా గుండె సవ్వడులే నిన్న విన్నా 
నా చూపే నువ్వే అయ్యే కన్నులతోనా 
సరికొత్త నన్నే నీ చూస్తూ ఉన్నా 
నేర్పించరా… పాటలు నేర్పించరా... 
చూపించరా నా స్టోరీ నిన్నే చేరే దారి చూపించరా 
నీ ఆశరా నాకేంతో కావాలి రా 
తప్పు ఒప్పు అంటుకోని చంటి మనసు రా 
నిప్పు లాంటి నిన్ను చూసి ఒప్పుకుంది రా 
నిన్న మొన్న లేనే లేదు ఇంత జాతర 
ప్రేమ పంచి పేల్చినావే మందు పాతర 
ఏ క్లాసుది ఉంది నీ తోడుగా 
హై స్పీడ్ బ్రెయిన్ ఉంది ఆటాడగా 
నీ కంట చిరునవ్వు చిగురించగా 
ఏదైనా చేస్తా పదా.. 
దుమ్ములే దుమ్ములే దుమ్ము లేపే టైపులో 
నిప్పులే తొక్కినట్టు స్టెప్పు లెయ్యాలే 
ఫ్యూజ్ లు గుసులో పేలిపోయే రేంజ్ లో 
హిప్ హాపు కూచిపూడి మిక్సు చేయాలే 




మసాలా... మసాలా...  పాట సాహిత్యం

 
చిత్రం: మసాలా (2013)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: రాహుల్ నంబియర్, నవీన్ మాధవ్

మసాలా... మసాలా... 
ఓ టాలీ టాలీ మసాలా 
ఓ టాలీ టాలీ మసాలా 
ఓ టాలీ టాలీ మసాలా 
ఓ టాలీ టాలీ మసాలా 

కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ లా 
కొంచెం స్వీట్ అండ్ చిల్లీ లా 
life is full of masalaa 
రంగులు మారే ఫ్లేవర్ లా 
టాలీ టాలీ మసాలా 
వెంకీ రాం కా మసాలా 
టాలీ టాలీ మసాలా 
వెంకీ రాం కా మసాలా 
ఈ నిముషం టెన్షన్ పెట్టేలా 
మరు నిముషం కితకితలెట్టేలా 
Life is full of masala 
టేస్ట్ చేసి చూడాలా 
Oh venky paajis got the moves 
Ram you rock it with your grooves 
Spicy messy hot and cool 
Oh venky ram you just rule... 


చరణం: 1 
ఓ టాలీ టాలీ మసాలా 
ఓ టాలీ టాలీ మసాలా 
ఓ టాలీ టాలీ మసాలా 
ఓ టాలీ టాలీ మసాలా 

మసాలా... మసాలా.... 

టెంపుల్ రన్ గేమల్లే పరుగులు పెట్టించేసేలా 
వెంటాడే ప్రాబ్లం లా తరిమే ఫ్రెండే మసాలా 
ఆల్ ద టైం మైండ్ అంతా మెర్క్యూరి బల్బ్ అయ్యి వెలిగేలా 
IQ కే కిక్ ఇచే అలర్జీ టానిక్ మసాలా 
మసాలానే లేకుంటే దల్ అయిపొద్దీ లైఫ్ అంతా 
ఈ మసాలాలో మనిషిని నడిపే ఫ్యూయల్ ఉందంటా 
ఓ టాలీ టాలీ మసాలా 
ఓ టాలీ టాలీ మసాలా 
మసాలా... మసాలా... 
మసాలా... మసాలా... 
మసాలా... మసాలా... 




చీటర్ చవస్కొని పాట సాహిత్యం

 
చిత్రం: మసాలా (2013)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: సుచిత్ర, శ్రేయా ఘోషల్, రనినా రెడ్డి

చీటర్ చవస్కొని


Most Recent

Default