Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Mooga Manasulu (1964)




చిత్రం: మూగ మనసులు (1964)
సంగీతం: కె. వి. మహదేవన్
నటీనటులు: నాగేశ్వర రావు, సావిత్రి, జమున
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత: సి. సుందరం
విడుదల తేది: 31.01.1964



Songs List:



ఈనాటి ఈ బంధమేనాటిదో పాట సాహిత్యం

 
చిత్రం: మూగ మనసులు (1964)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఘంటసాల, పి.సుశీల

ఈనాటి ఈ బంధమేనాటిదో 
ఏనాడు పెనవేసి ముడి వేసెనో - ఓ...
ఈనాటి ఈ బంధమేనాటిదో 
ఏనాడు పెనవేసి ముడి వేసెనో - ఓ...
ఈనాటి ఈ బంధమేనాటిదో 

చరణం: 1 
మబ్బులు కమ్మిన ఆకాశం 
మనువులు కలసిన మనకోసం 
మబ్బులు కమ్మిన ఆకాశం 
మనువులు కలసిన మనకోసం 
కలువల పందిరి వేసింది 
తొలి వలపుల చినుకులు చిలికింది 
కలువల పందిరి వేసింది 
తొలి వలపుల చినుకులు చిలికింది 

ఈనాటి ఈ బంధమేనాటిదో 
ఏనాడు పెనవేసి ముడి వేసెనో - ఓ...
ఈనాటి ఈ బంధమేనాటిదో...

చరణం: 2 
నీ జతలో చల్లదనం నీ ఒడిలో వెచ్చదనం 
నీ జతలో చల్లదనం నీ ఒడిలో వెచ్చదనం 
నీ చేతలలో చిలిపితనం చిత్తంలో వలపుధనం 
నీ చేతలలో చిలిపితనం చిత్తంలో వలపుధనం 
అనుభవించి దినం దినం పరవశించనా 
పరవశించి క్షణంక్షణం కలవరించనా 

ఈనాటి ఈ బంధమేనాటిదో 
ఏనాడు పెనవేసి ముడి వేసెనో - ఓ...
ఈనాటి ఈ బంధమేనాటిదో 

చరణం: 3 
ఎవరు పిలిచారనో... ఏమి చూడాలనో...
ఎవరు పిలిచారనో ఏమి చూడాలనో 
ఉప్పొంగి ఉరికింది గోదావరీ గోదావరి 
చెలికాని సరసలో సరికొత్త వధువులో 
చెలికాని సరసలో సరికొత్త వధువులో 
తొలినాటి భావాలు తెలుసుకోవాలని 
ఉప్పొంగి ఉరికింది గోదావరీ 

ఈనాటి ఈ బంధమేనాటిదో 
ఏనాడు పెనవేసి ముడి వేసెనో - ఓ...
ఈనాటి ఈ బంధమేనాటిదో 




గోదారి గట్టుంది పాట సాహిత్యం

 
చిత్రం: మూగ మనసులు (1964)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: దాశరధి
గానం: పి.సుశీల

ఓహూ ఓ ఓ హోయ్ 
ఓహొహూ... ఓ ఓ ఓ ఓ ఓ

గోదారి గట్టుంది గట్టుమీన సెట్టుంది 
సెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులొ ఏముంది 
ఓ ఓ ఓ ఓ ఓ హోయ్

గోదారి గట్టుంది గట్టుమీన సెట్టుంది 
సెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులొ ఏముంది 
ఓ ఓ ఓ ఓ ఓ హోయ్ 

వగరు వగరుగ పొగరుంది పొగరుకు తగ్గ బిగువుంది 
వగరు వగరుగ పొగరుంది పొగరుకు తగ్గ బిగువుంది 
తీయ తీయగ సొగసుంది సొగసుని మించె వాంచుంది
తీయ తీయగ సొగసుంది సొగసుని మించె వాంచుంది...

గోదారి గట్టుంది  గట్టుమీన సెట్టుంది 
సెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులొ ఏముంది 
ఓ ఓ ఓ ఓ ఓ హోయ్ 

ఎన్నెల వుంది ఎండ వుంది పూవు వుంది ముల్లుంది 
ఎన్నెల వుంది ఎండుంది పూవు వుంది ముల్లుంది 
ఏది ఎవ్వరికి ఇవ్వాలో ఇడమరిసే ఆ ఇది ఉంది

గోదారి గట్టుంది గట్టుమీన సెట్టుంది 
సెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులొ ఏముంది 
ఓ ఓ ఓ ఓ ఓ  హోయ్ 

పిట్ట మనసు పిసరంతైనా పెపంచమంతా దాగుంది 
పిట్ట మనసు పిసరంతైనా పెపంచమంతా దాగుంది 
అంతు దొరకని నిండు గుండెలో ఎంత తోడితే అంతుంది 
అంతు దొరకని నిండు గుండెలో ఎంత తోడితే అంతుంది...

గోదారి గట్టుంది గట్టుమీన సెట్టుంది 
సెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులొ ఏముంది 
ఓ ఓ ఓ ఓ ఓ హోయ్ 




ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులు  పాట సాహిత్యం

 
చిత్రం: మూగ మనసులు (1964)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఘంటసాల 

ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులు 
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులు 
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే

ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులు 
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే

పూలదండలో దారం దాగుందని తెలుసును 
పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా...
పూలదండలో దారం దాగుందని తెలుసును
పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా 
నవ్వినా ఎడ్చినా 
నవ్వినా ఎడ్చినా కన్నీళ్ళే వస్తాయి 
ఏ కన్నీటెనకాల ఎముందో తెలుసునా

ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులు 
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే 

మనసు మూగదే కాని బాసుండది దానికి 
సెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది 
మనసు మూగదే కాని బాసుండది దానికి 
సెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది 
ఎద మీద ఎదబెట్టి సొదలన్నీ ఇనుకో 
ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో

ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులు 
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే 

ముక్కోటి దేవుళ్ళు మురిసి సూస్తుంటారు 
ముందు జనమ బంధాలు ముడియేసి పెడతారు...
ముక్కోటి దేవుళ్ళు మురిసి సూస్తుంటారు 
ముందు జనమ బంధాలు ముడియేసి పెడతారు 
కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపుతీపి దీవెనలు 
కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపుతీపి దీవెనలు 
మూగమనసు బాసలు 
ఈ మూగమనసు బాసలు మీకిద్దరికి సేసలు

ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులు 
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే 
ముద్దబంతి పువ్వులో...





గౌరమ్మా నీ మొగుడెవరమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: మూగ మనసులు (1963)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి:
హెయ్.. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా
ఎవరమ్మా వాడెవరమ్మా.. ఆ..
గౌరమ్మా నీ మొగుడెవరమ్మా

సెప్పాలంటే సిగ్గు కదయ్యా.. ఆ..
ఆనవాళ్ళు నే సెబుతానయ్య.. సెప్పు.. సెప్పు..
సిగలో నెలవంక మెడలో నాగరాజు
సిగలో నెలవంక మెడలో నాగరాజు
ఆ రేడు నావాడు సరిరారు వేరెవరూ...

మావయ్యా నా మొగుడెవరయ్యా
ఎవరయ్యా వేరెవరయ్యా.. ఆ..
మావయ్యా నా మొగుడెవరయ్యా

చరణం: 1
ఇల్లు వాకిలి లేనీవాడు.. లేనీ.. వాడూ.. లేనీవాడు..
బిచ్చమెత్తుకుని తిరిగేవాడు.. మాదాకవళం
ఇల్లు వాకిలి లేనీవాడు.. బిచ్చమెత్తుకుని తిరిగేవాడు
ఎగుడు దిగుడు కన్నులవాడు జంగందేవర నీ వాడా

గౌరమ్మా నీ మొగుడెవరమ్మా
ఎవరమ్మా వాడెవరమ్మా.. ఆ..
గౌరమ్మా నీ మొగుడెవరమ్మా

ఆకాశమే ఇల్లు.. లోకమే వాకిలీ..ఈ.. అవును..
బిచ్చమడిగేది భక్తీ.. ఈ.. బదులు ఇచ్చేది ముక్తి
బిచ్చమడిగేది భక్తీ.. బదులు ఇచ్చేది ముక్తి
బిచ్చమడిగేది భక్తీ.. బదులు ఇచ్చేది ముక్తి
బేసికన్నులే లేకుంటేను బెంబేలెత్తును ముల్లోకాలు

మావయ్యో నా మొగుడెవరయ్యా
ఎవరయ్యా వేరెవరయ్యా.. ఆ..
మావయ్యా నా మొగుడెవరయ్యా

చరణం: 2
మొగుడు మొగుడని మురిసావే.. కులికావే.. పొగిడావే..
మొగుడు మొగుడని మురిసావే.. కులికావే.. పొగిడావే..
పిల్లోయ్.. నెత్తిని ఎవరినో ఎత్తుకొని నిత్యం దానినే కొలుసునట
అదియే ఆతని ఆలియట.. కోతలు ఎందుకు కోస్తావే..
కోతలు ఎందుకు కోస్తావే..

గౌరమ్మా నీ మొగుడెవరమ్మా
ఎవరమ్మా వాడెవరమ్మా.. ఆ..
గౌరమ్మా నీ మొగుడెవరమ్మా

ఎవరో పిలిస్తె వచ్చింది.. ఎవరి కోసమో పోతోంది.. మయాన మజిలీ ఏసింది
మయాన మజిలీ ఏసింది..
సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే చెల్లదులే
సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే చెల్లదులే
పళ్ళు పదారు రాలునులే..
పళ్ళు పదారు రాలునులే..

మావయ్యో నా మొగుడెవరయ్యా
ఎవరయ్యా వేరెవరయ్యా.. ఆ..

గౌరమ్మా నీ మొగుడెవరమ్మా
మావయ్యా.. గౌరమ్మా..
మావయ్యా.. గౌరమ్మా..




నా పాట నీ నోట పలకాల సిలకా పాట సాహిత్యం

 
చిత్రం: మూగ మనసులు (1964)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఘంటసాల, పి.సుశీల

నా పాట నీ నోట పలకాల సిలకా
నా పాట నీ నోట పలకాల సిలకా
నీ బుగ్గలో సిగ్గు లొలకాల సిలకా
నా పాట నీ నోట పలకాల సిలకా
పలకాల సిలక... పలకాల చిలకా... 
ఎహే... చి కాదు... సి సి... సిలకా 
పలకాల సిలకా... ఆ
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా

చరణం: 1 
పాట నువ్వు పాడాల పడవ నే నడపాల 
పాట నువ్వు పాడాల పడవ నే నడపాల 
నీటిలో నేను నీ నీడనే సూడాల 
నీటిలో నేను నీ నీడనే సూడాల 
నా నీడ సూసి నువ్వు కిల కిలా నవ్వాల 
నా నీడ సూసి నువ్వు కిల కిలా నవ్వాల 
పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల 
పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల

నా పాట నీ నోట పలకాల సిలక 
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక 

చరణం: 2 
కన్నుల్లు కలవాల ఎన్నెల్లు కాయాల 
కన్నుల్లు కలవాల ఎన్నెల్లు కాయాల 
ఎన్నెలకే మనమంటె కన్నుకుట్టాల 
ఎన్నెలకే మనమంటె కన్నుకుట్టాల 
నీ పైట నా పడవ తెరసాప కావాల
ఆ ఆ ఆ ఆ అ ఓ ఓ ఓ 
నీ పైట నా పడవ తెరసాప కావాల 
నీ సూపే సుక్కానిగ దారి సూపాల 
నీ సూపే సుక్కానిగ దారి సూపాల

నా పాట నీ నోట పలకాల సిలక 
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక 
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక 

చరణం : 3 
మనసున్న మనుసులే మనకు దేవుళ్ళు 
మనసు కలిసిననాడె మనకు తిరణాళ్ళు 
మనసున్న మనుసులే మనకు దేవుళ్ళు 
మనసు కలిసిననాడె మనకు తిరణాళ్ళు 
సూరెచంద్రుల తోటి సుక్కల్ల తోటి 
సూరెచంద్రుల తోటి సుక్కల్ల తోటి 
ఆటాడుకుందాము ఆడనే ఉందాము 
ఆటాడుకుందాము ఆడనే ఉందాము

నా పాట నీ నోట పలకాల సిలక 
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక 
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక




పాడుతా తీయగా చల్లగా పాట సాహిత్యం

 
చిత్రం: మూగ మనసులు (1964)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఘంటసాల 

పాడుతా తీయగా చల్లగా
పాడుతా తీయగా చల్లగా
పసి పాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా
పాడుతా తీయగా చల్లగా 

కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది 
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది 
కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది 
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది 
కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ 
కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ 
ఆ కలిమి కూడ దోచుకునే దొరలు ఎందుకూ 

పాడుతా తీయగా చల్లగా 
పసి పాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా 
పాడుతా తీయగా చల్లగా 

గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు 
ఉండమన్న ఉండవమ్మా సాన్నాళ్ళు 
గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు 
ఉండమన్న ఉండవమ్మా సాన్నాళ్ళు 
పోయినోళ్ళూ అందరూ మంచోళ్ళూ 
పోయినోళ్ళూ అందరూ మంచోళ్ళూ 
ఉన్నోళ్ళూ పోయినోళ్ళ తీపి గురుతులు 

పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా 
పాడుతా తీయగా చల్లగా 

మనిషిపోతె మాత్రమేమి మనసు ఉంటది 
మనసుతోటి మనసెపుడో కలసిపోతది 
మనిషిపోతె మాత్రమేమి మనసు ఉంటది 
మనసుతోటి మనసెపుడో కలసిపోతది 
చావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది 
చావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది 
జనమ జనమకది మరీ గట్టిపడతది 

పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా 
పాడుతా తీయగా చల్లగా 





ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం పాట సాహిత్యం

 
చిత్రం: మూగ మనసులు (1964)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: జమునా రాణి

ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం 
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం 
ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం 
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం 

అడపదడప ఇద్దరు అలిగేతేనే అందం
అడపదడప ఇద్దరు అలిగేతేనే అందం
అలకతీరి కలిసేదే అందమైన బంధం 
అలకతీరి కలిసేదే అందమైన బంధం 

ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం 
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం

సిన్నదాని బుగ్గలకు సిగ్గొస్తే అందం 
సిన్నదాని బుగ్గలకు సిగ్గొస్తే అందం 
బుగ్గమీద సిటికేసి దగ్గరొస్తె బంధం 
ఆ బుగ్గమీద సిటికేసి దగ్గరొస్తె బంధం

ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం 
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం

ఈడొచ్చిన పిల్లకు జోడుంటే అందం
ఈడొచ్చిన పిల్లకు జోడుంటే అందం
ఈడుజోడు కుదిరినాక మూడుముళ్ళె బంధం 
ఈడుజోడు కుదిరినాక మూడుముళ్ళె బంధం 

ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం 
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం

తల్లీగోదారికీ ఎల్లువొస్తె అందం
తల్లీగోదారికీ ఎల్లువొస్తె అందం
ఎల్లువంటి బుల్లోడికి పిల్ల గౌరి బంధం 
ఎల్లువంటి బుల్లోడికి పిల్ల గౌరి బంధం 

ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం 
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం
హొయ్ ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం 
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం





మానూ మాకును కాను... పాట సాహిత్యం

 
చిత్రం: మూగ మనసులు (1963)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి. సుశీల 

పల్లవి:
మానూ మాకును కాను...
రాయీ రప్పను కానే కాను.. 

మామూలు మణిసిని నేను
నీ మణిసిని నేను..

మానూ మాకును కాను
రాయీ రప్పను కానే కాను.. 

మామూలు మణిసిని నేను
నీ మణిసిని నేను..

చరణం: 1
నాకు ఒక మనసున్నాదీ నలుగురిలా అశున్నాదీ
కలలు కనే కళ్ళున్నాయి అవి కలత పడితే నీళ్ళున్నాయి

మానూ మాకును కాను..
రాయీ రప్పను కానే కాను.. మామూలు మణిసిని నేను
నీ మణిసిని నేను..

చరణం: 2
పెమిదను తెచ్చి వొత్తిని యేసి
చమురును పోసి బెమ చూపేవా
ఇంతా సేసి యెలిగించేందుకు యెనక ముందు లాడేవా..

మానూ మాకును కాను..
రాయీ రప్పను కానే కాను.. మామూలు మణిసిని నేను
నీ మణిసిని నేను..

చరణం: 3
మణిషితోటి ఏళాకోళం ఆడుకుంటే బాగుంటాది
మనసుతోటి ఆడకు మావా ఇరిగిపోతే అతకదు మల్లా..

మానూ మాకును కాను..
రాయీ రప్పను కానే కాను.. మామూలు మణిసిని నేను
నీ మణిసిని నేను..


Most Recent

Default