చిత్రం: ముకుంద (2014)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, కోరస్
నటీనటులు: వరుణ్ తేజ్, పూజా హెడ్గే
దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
నిర్మాతలు: ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్
విడుదల తేది: 24.12.2014
గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా
విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా
తలపును లేపాలిగా బాలా
పరదాలే తీయకా పరుపే దిగనీయకా
పవళింపా ఇంతగా మేలా
కడవల్లో కవ్వాలు సడిచేస్తున్నా వినకా
గడపల్లో కిరణాలు లేలెమ్మన్నా కదలక
కలికీ ఈ కునుకేల తెల్లవార వచ్చెనమ్మ
గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా
నీ కలలన్నీ కల్లలై రాతిరిలో కరగవనీ
నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి
నీకోసమనీ గగనమే భువిపైకి దిగివచ్చెననీ
ఆ రూపాన్నీ చూపుతో అల్లుకుపో సౌదామినీ
జంకేలా జాగేలా సంకోచాలా జవ్వనీ
బింకాలూ బిడియాలూ ఆ నల్లనయ్య చేత చిక్కి
పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడనీ
అంటూ ఈ చిరుగాలి నిను మేలుకొలుపు సంబరాన
గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా
ఏడే అల్లరి వనమాలీ నను వీడే మనసున దయమానీ
నందకుమారుడు మురళీలోలుడు నా గోపాలుడు ఏడే ఏడే
లీలాకృష్ణా కొలనిలో కమలములా కన్నెమది
తనలో తృష్ణ తేనెలా విందిస్తానంటున్నదీ
అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల వెన్న ఇదీ
అందరికన్నా ముందుగా తన వైపే రమ్మన్నదీ
విన్నావా చిన్నారీ ఏమందో ప్రతిగోపికా
చూస్తూనే చేజారే ఈ మంచి వేళ మించనీక
త్వరపడవమ్మా సుకుమారి ఏమాత్రం ఏమారకా
వదిలావో వయ్యారీ బృందావిహారి దొరకడమ్మ
గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా
గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా
******** ******* ********
చిత్రం: ముకుంద (2014)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మిక్కీ జె. మేయర్ , సాయి శివాణి
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్
యుగాలెన్ని రానీ పోనీ
ముగింపంటు లేనేలేనీ
కథే మనం కాదా అననీ...
సమీపాన వున్నాగానీ
కదల్లేని ఈ దూరాన్నీ
మరో అడుగు ముందుకు రానీ..
నిను నను జత కలిపితె గాని
తన పని పూర్తవదనుకోని
మన వెనుకనె తరుముతు రానీ
ఈ క్షణాన్నీ...
గడిచిన ప్రతి జన్మ రుణాన్ని
మరిచిన మది నిదరని కరిగించే..
నిజం ఇదే..నని
మరి ఒకసారి ముడిపడుతున్న
అనుబంధాన్ని చూడని
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్
ప్రతి మలుపు దారి చూపద
గంగా సాగర సంగమానికి
ప్రతి చినుకు వంతెనేయద
నింగీ నేలని కలపడానికి
ఏ కాలం.. ఆపిందీ..
ఆ కలయికనీ...
ప్రణయమెపుడు అడిగిందీ
ఎటు ఉంది తొలకరి రమ్మనీ
ఎపుడెదురవుతుంది తానని
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్
ఏ స్వప్నం తనకి సొంతమో
చూపించాలా కంటి పాపకి
ఏ స్నేహం తనకి చైత్రమో
వివరించాలా పూల తోటకీ
వేరెవరో... చెప్పాలా...
తన మనసిదనీ..
కాని ఎవరినడగాలి
తానేవ్వరి గుండెల గూటిలో
ఊపిరిగా కొలువుండాలని
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్
******** ******* ********
చిత్రం: ముకుంద (2014)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్వేతా పండిట్
నందలాల ఎందుకివేళా ఇంత కళ
తందనాల తండవలీలా చాంగుభళ
పున్నమిలో సంద్రముల ఉల్లము ఝల్లున పొంగినదే
ఊపిరిలో మౌనమిల పిల్లనగ్రోవిల మోగినదే
ఊహల్లో సంబరం ఊరేగే ఉత్సవం
ఎదో పిలుపు విందా ఎటో తెలుసుకుందా
అటే నడపమందా పదా ఒముకుందా
నందలాల ఎందుకివేళా ఇంత కళ
తందనాల తండవలీలా చాంగుభళ
ఊయలే ఊగుతూ ఎందుకో ఉత్సాహం హ హ హ
అటు ఇటు తూగుతూ ఎమిటో సందేహం
కలే నిజమయిందా నువై రుజువైందా
కదే నవ్వమందా మదే ఒ ముకుందా
నీవు నా స్వేచ్చవై వీడనీ చెరసాల హ హ హ
నేను నీ గెలుపునై వేయనీ వరమాల
మరీ వయసు అంతా మహా బరువయిందా
సగం పంచమందా సరే ఒ ముకుందా
నందలాల ఎందుకివేళా ఇంత కళ
తందనాల తాండవలీలా చాంగుభళ
******** ******* ********
చిత్రం: ముకుంద (2014)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిచరన్
పగటి కలో పడుచు వలో
తననిలాగే తలపుల లో (2x)
చాల బాగుంది అనుకుంది మదిలోలో
తానెం చూసింది అనుకోని మలుపుల్లో
పర్వశామో తగని శ్రమో అసలిది ఏమో
తొలి సరదా
పరుగులెడు తున్నది ఇంతల
ఎటు పోతుందో అడగితే చెబుతుంద
నాపైనే తిరగబడు తున్నది ఇంకెలా
ఆశల వేగాన్ని ఆపే వీలుంద
తెగబడి తడబడి వడి వడి
ఇదేమి అలజడో..
తగు జాతే కనబడి వెంటాడే
ఊహలలో ఓహో ..
చాల బాగుంది అనుకుంది మదిలోలో
తానెం చూసింది అనుకోని మలుపుల్లో
అపుడేపుడో
తగిలినది మనసుకి ఈ తడి
అని ఇపుడిపుడే గుర్తుకు వస్తోంది
తొలకరిలో
చినుకు చెమి చేసిన సందడి
నెలకు తెలిసేలా చిగురులు వేసింది
చెలిమికి చిగురులు తోడగగా
సరైన సమయము
ఇది కదా అనుకోని ఎదురేగలో ఏమో హో
చాల బాగుంది అనుకుంది మదిలోలో
తానెం చూసింది అనుకోని మలుపుల్లో
పర్వశామో తగని శ్రమో అసలిది ఏమో