Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Naa Autograph (2004)




చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: రవితేజ, భూమిక , గోపిక
దర్శకత్వం: యస్.గోపాల్ రెడ్డి
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 11.08.2004



Songs List:



మౌనంగానే ఎదగమని పాట సాహిత్యం

 
చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిత్ర

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమనీ అర్దమందులో ఉంది
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమనీ అర్దమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమనీ అర్దమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా
బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటిన వారికి సొంతమౌతుంది
తెలుసుకుంటే సత్యమిది
తలచుకుంటే సాధ్యమిది

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమనీ అర్దమందులో ఉంది

చెమటనీరు చిందగా నుదిటి రాత మార్చుకో
మార్చలేనిదేది లేదనీ గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో
మారిపోని కథలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి
నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా...
నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమనీ అర్దమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది




గుర్తుకొస్తున్నాయి పాట సాహిత్యం

 
చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్.యమ్.కీరవాణి

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఎదలోతులో... ఏ మూలనో...
నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఈ గాలిలో... ఏ మమతలో...
మా అమ్మ మాటలాగ పలకరిస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

మొదట చూసిన టూరింగ్ సినిమా
మొదట మొక్కిన దేవుని ప్రతిమ
రేగు పళ్ళకై పట్టిన కుస్తీ
రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ
కోతి కొమ్మలో బెణికిన కాలు
మేక పొదుగులో తాగిన పాలు...
దొంగచాటుగా కాల్చిన బీడీ
సుబ్బుగాడిపై చెప్పిన చాడీ
మోట బావిలో మిత్రుని మరణం
ఏకధాటిగా ఏడ్చిన తరుణం...

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

మొదట సారిగా గీసిన మీసం
మొదట వేసిన ద్రౌపది వేషం
నెల పరీక్షలో వచ్చిన సున్నా
గోడ కుర్చీ వేయించిన నాన్న
పంచుకున్న ఆ పిప్పరమెంటు
పీరు సాయిబు పూసిన సెంటు...
చెడుగుడాటలో గెలిచిన కప్పు
షావుకారుకెగవేసిన అప్పు
మొదటి ముద్దులో తెలియని తనము
మొదటి ప్రేమలో తియ్యందనము...

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఎదలోతులో... ఏ మూలనో...
నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి




దువ్విన తలనే దువ్వటం పాట సాహిత్యం

 
చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్.యమ్.కీరవాణి

దువ్విన తలనే దువ్వటం
అద్దిన పౌడర్ అద్దడం
దువ్విన తలనే దువ్వటం
అద్దిన పౌడర్ అద్దడం
అద్దం వదలక పోవడం
అందానికి మెరుగులు దిద్దడం
నడిచి నడిచి ఆగడం
ఆగి ఆగి నవ్వడం
ఉండి ఉండి అరవడం
తెగ అరచి చుట్టూ చూడడం
ఇన్ని మార్పులకు కారణం
ఎమై ఉంటుందోయి

ఇది కాదా LOVE  (15)

ముఖమున మొటిమే రావడం
మనస్సుకు చెమటే పట్టడం
మతి మరుపెంతో కలగడం
మతి స్థిమితం పూర్తిగా తప్పడం
త్వరగా స్నానం చెయ్యడం
త్వరత్వరగా భోం చేస్తుండడం
త్వరగా కలలో కెళ్ళడం
ఆలస్యంగా నిదురోవడం
ఇన్నర్థాలకు ఒకే పదం
ఏమై ఉంటుందోయి

ఇది కాదా LOVE  (15)





మన్మదుడే బ్రహ్మను పూని పాట సాహిత్యం

 
చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: సందీప్ భౌమిక్, గంగ , యమ్.యమ్.కీరవాణి

మన్మదుడే బ్రహ్మను పూని సుృష్టించాడేమో గానీ
యాబై కేజిల మందారాన్ని ఐదున్నర అడుగుల బంగారాన్ని
పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మని

మన్మదుడే బ్రహ్మను పూని సుృష్టించాడేమో గానీ
యాబై కేజిల మందారాన్ని ఐదున్నర అడుగుల బంగారాన్ని

దీన్ని తెలుగులో కారం అంటారు మరి మలయాళంలో?
ఇరివో
ఓహో ఇది తీపి! మీ భాషలో?
మధురం
మరి చేదు చేదు చేదు చేదు?
కైకు

ఆరే రుచులని అనుకున్నానే నిన్నటివరకు
ఏడొ రుచినే కనుగొన్నానే నీ ప్రేమతో
రుజిగల్లారిని న్యంకండు ఇన్నలె వరయెళ్ ఇన్నలె వరయెళ్
ఏయాం రుచియుం ఉండెన్వరిన్యుం నీ ప్రేమతో
నిన్నటి దాక నాలుగు దిక్కులు ఈ లోకంలో
ఇన్నుమురాల్ నువ్వె దిక్కు ఎన్లొ దత్తిళ్...
హే వన్స్ లవ్ యు
నీ పలుకులే కీరవాణి నా పెదవితో తాళమెయ్యనీ
మాధవుడే బ్రహ్మను పూని సుృష్టించాడెమో గానీ
అరవై కేజిల చిలిపితనాన్ని
అలుపన్నది ఏరుగని రవితేజాన్ని
పెదాల్ని ఏమంటారు?
చుండు
నడుం ని?
ఇడుప్పు
నా పెదాలతో నీ నడుం మీద ఇలా చేస్తె ఏమంటారు
ఆశ దోస అమ్మమంట మీస
ఏయ్ చెప్పమంటుంటె
చెప్పనా...
రెండో మూడో కావాలమ్మ బూతద్దాలు
వుందో లేదో చూడాలంటే నీ నడుముని
వందలకొద్ది కావాలంట జలపాతాలు
పెరిగె కొద్ది తీర్చాలంటే నీ వేడిని
లెక్కకుమించి జరగాలమ్మ మొదటి రాత్రులు
మక్కువ తీరగ చెయ్యాలంటే మదురయాత్రలు
విన్నాను నీ హృదయవాణి
వెన్నెల్లలో నిన్ను చేరనీ

మన్మదుడే బ్రహ్మను పూని స్రుష్టించాడేమొ గాని
అరవై కేజిల దుడుకుతనాన్ని
అలుపన్నది ఎరుగని రవితేజాన్ని
పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మనీ




గామా గామా హంగామా పాట సాహిత్యం

 
చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, శ్రీవర్ధిని, గోపిక పూర్ణిమ

గామా గామా హంగామా మనమే హాయి చిరునామా
పాత బాధ గదిని ఖాళీ చేద్దామా
గామా గామా హంగామా కష్టం ఖర్చు పెడదామా
కొత్త సంతోషం జమ చేద్దామా

రప రప్పప్పారప్ప పారర రప రప్పప్పారప్ప
రప రప్పప్పారర రప్పప్పారర పార పార పరప

గామా గామా హంగామా మనమే హాయి చిరునామా
పాత బాధ గదిని ఖాళీ చేద్దామా
గామా గామా హంగామా కష్టం ఖర్చు పెడదామా
కొత్త సంతోషం జమ చేద్దామా

రప రప్పప్పారప్ప పారర రప రప్పప్పారప్ప
రప రప్పప్పారర రప్పప్పారర పార పార పరప

చరణం: 1
నీ రాకతో రాయిలాంటి నా జీవితానికే జీవం వచ్చింది
నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది
చేయూతతో శిల్పం కాస్తా నడకలు నేర్చి కోవెల చేరింది
నీ నవ్వుతో కోవెల చేరిన శిల్పంలోన కోరిక కలిగింది
ఆ కోరికేమిటో చెప్పని నను వీడి నువ్వు వెళ్లొద్దని
మళ్లీ రాయిని చెయ్యొద్దని...

రప రప్పప్పారప్ప పారర రప రప్పప్పారప్ప
రప రప్పప్పారర రప్పప్పారర పార పార పరప

గామా గామా హంగామా మనమే హాయి చిరునామా
పాత బాధ గదిని ఖాళీ చేద్దామా

చరణం: 2
నీ మాటతో నాపై నాకే ఏదో తెలియని నమ్మకమొచ్చింది
నీ స్ఫూర్తితో ఎంతో ఎంతో సాధించాలని తపనే పెరిగింది
నీ చెలిమితో ఊహల్లోన ఊరిస్తున్న గెలుపే అందింది
ఆ గెలుపుతో నిస్పృహలోన నిదురిస్తున్న మనసే మురిసింది
ఆ మనసు అలసి పోరాదని ఈ చెలిమి నిలిచిపోవాలని
ఇలా బ్రతుకును గెలవాలని...

రప రప్పప్పారప్ప పారర రప రప్పప్పారప్ప
రప రప్పప్పారర రప్పప్పారర పార పార పరప

గామా గామా హంగామా మనమే హాయి చిరునామా
పాత బాధ గదిని ఖాళీ చేద్దామా
గామా గామా హంగామా కష్టం ఖర్చు పెడదామా
కొత్త సంతోషం జమ చేద్దామా

రప రప్పప్పారప్ప పారర రప రప్పప్పారప్ప
రప రప్పప్పారర రప్పప్పారర పార పార పరప

రప రప్పప్పారప్ప పారర రప రప్పప్పారప్ప
రప రప్పప్పారర రప్పప్పారర పార పార పరప



నువ్వంటే ప్రాణమని పాట సాహిత్యం

 
చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: విజయ్ యేసుదాసు

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమనీ నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకనీ
ఎవరికి చెప్పుకోను నాకు తప్పా కన్నులకి కలలు లేవు నీరు తప్పా
నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమనీ నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకనీ
ఎవరికి చెప్పుకోను నాకు తప్పా కన్నులకి కలలు లేవు నీరు తప్పా

మనసూ వుంది మమతా వుంది పంచుకొనే నువు తప్పా
ఊపిరి వుంది ఆయువు వుందీ ఉండాలనే ఆశ తప్పా
ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా
ఎవరిని అడగాలి నన్ను తప్పా చివరికి ఏమవాలి మన్ను తప్పా

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమనీ నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకనీ...

వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు
జంటై ఒకరి పంటై వెళ్లావు
కరునిస్తానన్నావు వరమిస్తానన్నావు
బరువై మెడకు ఉరివై పోయావు
దేవతలోను ద్రోహం ఉందని తెలిపావు
దీపంకూడా దహియిస్తుందని తేల్చావు
ఎవరిని నమ్మాలి నన్ను తప్పా ఎవరిని నిందించాలి నిన్ను తప్పా

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమనీ నీ తోడే లేకుంటే బ్రతికేది ఎందుకనీ
ఎవరికి చెప్పుకోను నాకు తప్పా కన్నులకి కలలు లేవు నీరు తప్పా


Most Recent

Default