Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Oh My Friend (2011)



చిత్రం: ఓ మై ఫ్రెండ్ (2011)
సంగీతం: రాహుల్ రాజ్
నటీనటులు: సిద్దార్థ్, శృతిహసన్, నవదీప్, హన్సిక
దర్శకత్వం: వేణు శ్రీరాం
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 15.10.2011


చిత్రం: ఓ మై ఫ్రెండ్ (2011)
సంగీతం: రాహుల్ రాజ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రంజిత్

ఓ హో హో..., హో హో హో... (2)

నేను తానని అనుకుంటారా
నేనే తానని అనుకోరా
ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా
ఆడా మగ అని తేడా ఉందని
అభిమానానికి చెబుతారా
స్నేహము మొహం రెండు వేరని
తెలిసి తప్పుకుపోతారా...

ఓ హో హో..., హో హో హో...

ఒక చోటే ఉంటే ఒకటే కల కంటూ
విడి విడిగా కలిసే ఉండే కళ్లది ఏ బంధం
కలకాలం వెంటే నడవాలనుకుంటే
కాళ్ళకి ఓ ముడి ఉండాలని ఎందుకు ఈ పంతం
చుట్టరికముందా చెట్టుతో పిట్టకేదో
ఏం లేకపోతే గూడు కడితే నేరమా
ఏ చెలిమి లేదా గట్టుతో ఏటికేదో
వివరించమంటే సాధ్యమా...

నేను తానని అనుకుంటారా
నేనే తానని అనుకోరా
ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా
ఆడా మగ అని తేడా ఉందని
అభిమానానికి చెబుతారా
స్నేహము మొహం రెండు వేరని
తెలిసి తప్పుకుపోతారా...

కనులకు కనిపించే రూపం లేకుంటే
ప్రాణం తానున్నానన్నా నమ్మం అంటారా
చెవులకు వినిపించే సవ్వడి చేయందే
గుండెల్లో కదిలే నాదం లేదని అంటారా
మధిలోని భావం మాటలో చెప్పకుంటే
అటువంటి మౌనం తగనిదంటూ అర్ధమా
తీరాన్ని నిత్యం అల అలా తాకుతుంటే
నిలిపే నిశేదం న్యాయమా...

నేను తానని అనుకుంటారా
నేనే తానని అనుకోరా
ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా
ఆడా మగ అని తేడా ఉందని
అభిమానానికి చెబుతారా
స్నేహము మొహం రెండు వేరని
తెలిసి తప్పుకుపోతారా...

ఓ హో హో..., హో హో హో... (2)





చిత్రం: ఓ మై ఫ్రెండ్ (2011)
సంగీతం: రాహుల్ రాజ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రంజిత్, సంగీత ప్రభు, సరా స్టౌబ్

అలోచన వస్తేనే అమ్మో అనిపిస్తోందే
నువ్వంటూ నాకు కనపడకుంటే ఏమయ్యేదో
నిన్నటి దాకా నేనే
నువ్వు నా పక్కన లేందే
ఉన్నానంటే నమ్మాలో లేదో
ఏనాడు ఇలా ఈ మాటా నీతో అనగలనో లేదో
హో అంటున్నది నీ మౌనం
వింటున్నది నా ప్రాణం
ఇద్దరికి తెలిసిన సత్యం వేరే
కోరదు ఏ సాక్ష్యం
హే ఒంటరిగా ఒక్క క్షణం
నిన్నొదలను ఏ మాత్రం
అందుకనేగా నే ముందే పుట్టి ఉన్నా నీ కోసం

ప్రాయం ఉన్నా పయనం ఉన్నా
పాదం మాత్రం ఎటో పడదు
దారి నేనే దరిని నేనే
నడిపిస్తాగా ప్రతి అడుగు
బెదురుగా హా తడబడే మనసిది
కుదురుగా హా నిలపవా జతపడి
హో అంటున్నది నీ మౌనం
వింటున్నది నా ప్రాణం
ఇద్దరికి తెలిసిన సత్యం వేరే
కోరదు ఏ సాక్ష్యం
హే ఒంటరిగా ఒక్క క్షణం
నిన్నొదలను ఏ మాత్రం
అందుకనేగా నే ముందే పుట్టి ఉన్నా నీ కోసం

నీ కన్నులతోచూసేదాక
స్వప్నాలంటే తెలియదెప్పుడు
నా కల ఎదో గుర్తించాగా
నీ రూపంలో ఇలా ఇపుడు
చలనమే హా కలగని చెలియలో
హా సమయమే హా కరగని చెలిమిలో

అలోచన వస్తేనే అమ్మో అనిపిస్తోందే
నువ్వంటూ నాకు కనపడకుంటే ఏమయ్యేదో
నిన్నటి దాకా నేనే
నువ్వు నా పక్కన లేందే
ఉన్నానంటే నమ్మాలో లేదో
ఏనాడు ఇలా ఈ మాటా నీతో అనగలనో లేదో
హో అంటున్నది నీ మౌనం
వింటున్నది నా ప్రాణం
ఇద్దరికి తెలిసిన సత్యం వేరే
కోరదు ఏ సాక్ష్యం
హే ఒంటరిగా ఒక్క క్షణం
నిన్నొదలను ఏ మాత్రం
అందుకనేగా నే ముందే పుట్టి ఉన్నా నీ కోసం





చిత్రం: ఓ మై ఫ్రెండ్ (2011)
సంగీతం: రాహుల్ రాజ్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: సిద్దార్ధ్

Hey Hyderabad
you guys ready to rock and roll
I can't hear you
lets do this

మా daddy pockets ఎపుడూ plenty plenty రా
నా రెండూ pockets ఎపుడూ empty empty రా
మా daddy pockets ఎపుడూ plenty plenty రా
నా రెండూ pockets ఎపుడూ empty empty రా

Campus canteen లో నన్ను చూసింది ఓ పిల్ల
ఎంతో sudden గా మారాను తన వల్లా
sun glasses ఏ తానే కొనింది నీ కొసమే ఈ gift అనింది
ఆ next one month తిరగని చోటే లేదురా
అ next one week నాలో నే లేనురా
అ next Friday disco లో తన birthday party కదా
అ next moment ఆ billకే చిల్లరే మిగిలింది

మా daddy pockets ఎపుడూ plenty plenty రా
నా రెండూ pockets ఎపుడూ empty empty రా
మా daddy pockets ఎపుడూ plenty plenty రా
నా రెండూ pockets ఎపుడూ empty empty రా

Tring tring tring tring అంటూ మోగింది నా i phone
గడపాలి అంటూ sudden గా రమ్మంది చంపేసి ring ఒడి కట్టు అంది
త్వరగానే ఓ surprise అనింది
అ next one month తేలా నే గాలి లో
అ next one week ఉన్నా tension లో
అ next Friday life time thrill నే తగిలే నాకు మరీ
అ next movement వాడెవడికో ring నే తొడిగింది
So the bottom line of the story is
మా daddy pockets ఎపుడూ plenty plenty రా
నా రెండూ pockets ఎపుడూ empty empty రా
మా daddy pockets ఎపుడూ plenty plenty రా
నా రెండూ pockets ఎపుడూ empty empty రా





చిత్రం: ఓ మై ఫ్రెండ్ (2011)
సంగీతం: రాహుల్ రాజ్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: కార్తిక్

ఓ ఓ my friend తిడితే తిట్టే నన్నే
ఓ ఓ my friend కొడితే కొట్టే అంతే
ఓ ఓ my friend I am so sorry సిరి
బుంగ మూతే పెట్టకలా

ఓ ఓ my friend తిడితే తిట్టే నన్నే
ఓ ఓ my friend కొడితే కొట్టే అంతే
ఓ ఓ my friend I am so sorry సిరి
బుంగ మూతే పెట్టకలా

నీ అలకల్లోన మన పలుకుల్లోన
తెలియని సంగీతమేదో ఉందే
సావాసంలోన విన్నాను అన్నా
సహేలి తోడా తో సంజోనా

చిరుగాలైతే ఎదో తీయని melody నా
వడగాలైతే ఎదో భాధని తెలిపేనా
చిటపట చినుకే నీకు తాళం నేర్పేనా
సారే కన్నీరే గేయంలానే వాలేనా
పలికే వేదాంతం ఐనా గీతా సారాంసం ఐనా
దాంతో పద్యం అంటూ ఉన్నాయే నీ ఒక్కో రూపానా
కలిగే ఆనందం ఐనా
రగిలే ఆవేశం ఐనా
సంగీతం కాదా

ఓ ఓ my friend తిడితే తిట్టే నన్నే
ఓ ఓ my friend కొడితే కొట్టే అంతే
ఓ ఓ my friend I am so sorry సిరి
బుంగ మూతే పెట్టకలా

నీ అలకల్లోన మన పలుకుల్లోన
తెలియని సంగీతమేదో ఉందే
సావాసంలోన విన్నాను అన్నా
సహేలి తోడా తో సంజోనా

sunday monday అంటూ రోజులు ఏడున్నా
రేయి పగలు మారవు ఎందుకు ఏమైనా
అది అంతం రెండు తెలియవు అనుకున్నా
గమనం నువ్వై ముందుకు సాగాలంటున్నా
చెరితై వెలగాలనుకుంటే అడుగై సాగాలి అంతే
గెలుపు ఓటమి అన్నవి గమ్యం కాదని తెలియాలి అంతే
కనులకి కలలుండాలి లే
కదకో మలుపుండాలిలే
ఏదేమైనా friend





చిత్రం: ఓ మై ఫ్రెండ్ (2011)
సంగీతం: అనిల్ (గెస్ట్ కంపోజర్)
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: సిద్దార్ధ్ , శృతిహాసన్

శ్రీ చైతన్యా junior college M.P.C లో పక్క bench పిల్లా
శ్రీ చైతన్యా junior college M.P.C లీ పక్క bench పిల్లా
అప్పుడేంటో నచ్చనే లేదు ఇప్పుడైతే మర్చిపోలేను
చలో చలో killer ఎటువైపుకి
రే ఫాల్తూస్ ఎటు వైపుకి
ఎగిరే గాలి పటం postal address తో తిరుగుతుందా
తెగితే అదే కతం ఎక్కడో పడిపోతుంది రా
google లా వెతుకుతాను గల్లి గల్లీని నేను
గల్లీలో లొల్లి చేస్తే గల్ల పట్టి కొడతారు రా
చ అది అప్పుడే బాగుంటే బాగుండేది

శ్రీ చైతన్యా junior college M.P.C లో పక్క bench పిల్లా
అప్పుడేంటో నచ్చనే లేదు ఇప్పుడైతే మర్చిపోలేను

అం Bi.P.C క్రిష్ణ ఫణిధర్ తనవెంటే పడేవడు
యషోదాలో వాడు doctor lets go now gets the matter
email address cellnumber landline votercard license
passport rationcard pancard hallticket
ఏదైనా తనదొకటుందా no way
కాని తను delhi లో ఉంటుంది అని విన్నా
రే అది already మాకు తెల్సు రా

శ్రీ చైతన్యా junior college M.P.C లో పక్క bench పిల్లా
అప్పుడేంటో నచ్చనే లేదు ఇప్పుడైతే మర్చిపోలేను

నిన్నే చూసా orkut facebook అక్కడ కూడా లేనే లేదు
notebook ఒక్కటే తెలిసిన పిల్లా facebook లో ఉంటుందా ఏ రా
saturday కదా గుడికెల్లిందో చూసొద్దాం అకడేముందో
pub ఐతే పక్కనే ఉంది చూసొద్దాం తప్పేం ఉంది
ఒసే తను దేవత

M.P.C లో పక్క bench పిల్లా
ఇప్పుడైతే మర్చిపోలేను

అచ్చా ఏ కరే
paper లో ఒక add ఏ ఇద్దాం
జెమినిలో ఒక slot ఏ కొందాం
where is she అని program చేద్దాం
దొరికే వరకూ ధర్నాలే చేద్దాం
ఇది కావాలి sensation
ఎందరికో insparation
తను దొరికిందంటే tension
పోతుంది need not mention
శ్రీ చైతన్యా junior college M.P.C లీ పక్క bench పిల్లా
అప్పుడేంటో నచ్చనే లేదు ఇప్పుడైతే మర్చిపోలేను





చిత్రం: ఓ మై ఫ్రెండ్ (2011)
సంగీతం: రాహుల్ రాజ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: బెన్నీ దయల్, కవితా మోహన్, జయరామ్ రంజిత్,

let me say hey o life is journey lets go
వేగం వేగం వేగం
ఈ వాయు వేగమే
వేగం వేగం వేగం
మాలో ఉందే వేగం వేగం వేగం
మెరుపుల ప్రవాహమే మేమే

అంతులతో లెక్కేసే అలలేని అనుభూతులెన్నో మావేనా
ఏ కారణం లేని సంతోషం ఎంతుందో లోనే మా లోనే
రేపనే రూపమే లేదు తెలుసుకో సాగిపో
ఈ గాలిలో నీ రాత లాంటిది క్షణం
lets go lets go
వేగం వేగం వేగం
మా ఈ ప్రపంచమే
వేగం వేగం వేగం
అదుపన్నది లేదులే
వేగం వేగం వేగం
మెరుపుల ప్రవాహమే మేమే

తేలేటి ఈ హాయి తన తీరం ఏదంటూ రాని మా తోనే
వెల్లేటి ఈ దారిలో ముందు ఏముందో అడిగే కాలాన్నీ
లోకమే కొత్తగా మారిపోదు తెలుసుకో
సరికొత్తగా నీ కన్నులే చూడనీ ఓ ఓ ఓ

వేగం వేగం వేగం
ఈ వాయు వేగమే
వేగం వేగం వేగం
మాలో ఉందే
వేగం వేగం వేగం
మెరుపుల ప్రవాహమే మేమే

let me say hey o life is journey
lets go say hey o life is party lets go
అమ్మో this journey is life taking me places here
gara gara get move on baby life is calling we must be crazy
i m sure with my destiny just chill with the girl of my dreams
get me a rock on get me a drink on
you know what i’m saying ..
say hey say o..

వేగం వేగం వేగం...
వేగం వేగం వేగం...
వేగం వేగం వేగం...
forever forever
let me say hey o life is journey
lets go say hey o life is party lets go


Most Recent

Default