చిత్రం: ఒక మనసు (2016)
సంగితం: సునీల్ కశ్యప్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: హేమచంద్ర, ప్రణవి
నటీనటులు: నగచౌర్య , నిహారిక కొణిదల
దర్శకత్వం: రామరాజ్ వి. గొట్టిముక్కల
నిర్మాతలు: మధురా శ్రీదర్ రెడ్డి, డా౹౹ కృష్ణ భట్ట , ఏ. అభినయ్
విడుదల తేది: 24.06.2016
ఏమిటో ఈ క్షణం గుండెలో సంబరం
ఒకటిగా మారగా ఇద్దరం
గాలిలో తేలటం.. ప్రేమలో మునగటం
ఎంత బాగుందిలే పరవశం
నా మనసున తొలకరి వానలు కురిసినవే
నా పెదవికి నవ్వుల పువ్వులు పూసినవే
నా కనులలో రంగుల తారలు మెరిసినవే
నా అల్లరి ఆశలు అలలుగ ఉరికినవే
ఏమిటో ఈ క్షణం గుండెలో సంబరం
ఒకటిగా మారగా ఇద్దరం
గాలిలో తేలటం.. ప్రేమలో మునగటం
ఎంత బాగుందిలే పరవశం
నేల మొత్తం వాన విల్లై వూగుతోందీ వింతగా
వీధులన్నీ వెన్నెలల్లే వెలిగిపోయే ఎంత బాగా
ఓ చల్లనిగాలే రోజూ నిలువెల్లా తాకినా
హా ఈరోజే మరి నన్నూ గిలి గిలిగా గిల్లెనా
నీ జతే ఉండగా.. పూటకో పండగా.. గుండెకే వచ్చిపోదా..
నా ఎదురుగ జరిగే సంగతులేవైనా
అది నీ వలనే అని గమనిస్తూ ఉన్నా
నా లోపల జరిగే వేడుక ఏదైనా
ఇక జంటగా నీతో జరపాలంటున్నా
నేను అంటే నేను కాదే నీకు ఇంకో పేరులే
నువ్వు అంటే నువ్వు కాదే నాకు ఇంకో అర్థమేలే
చూపులు కలిసిన తరుణం మహబాగా ఉందిలే
మనసుకి పట్టిన వ్యసనం అది నువ్వే అందిలే
గట్టిగా హత్తుకో.. ముద్దులే పెట్టుకో.. నన్నిలా కప్పుకోరా..
నేనున్నది అన్నది గురుతుకి రాకుండా
నా వెన్నెల వేకువ అన్నీ నువ్వైపో
ఈ లోకం కంటికి ఎదురే పడకుండా
నా లోకం మైకం అన్నీ నువ్వైపో
ఏమిటో ఈ క్షణం గుండెలో సంబరం
ఒకటిగా మారగా ఇద్దరం
గాలిలో తేలటం.. ప్రేమలో మునగటం
ఎంత బాగుందిలే పరవశం