చిత్రం: ఒక్కడున్నాడు (2007)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: గోపిచంద్ , నేహా జుల్కా
దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి
నిర్మాత: చెర్రీ
విడుదల తేది: 03.03.2007
చిత్రం: ఒక్కడున్నాడు (2007)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: శ్రేయ ఘోషల్
పల్లవి:
ఇవ్వాళ నా పిలుపు
ఇవ్వాలి నీకు గెలుపు
సంవత్సరం వరకు ఓ లోకమా....ఓ...
ఇవ్వాళ నా పిలుపు
ఇవ్వాలి నీకు గెలుపు
సంవత్సరం వరకు ఓ లోకమా....ఓ...
చరణం: 1
కొంచెం తీపి కొంచెం పులుపు
పంచే ఆ ఉల్లాసమూ
కొంచెం కారం కొంచెం ఉప్పు
పంచే ఆ ఆవేశమూ
చేదు వగరు చేసే మేలు
సమంగా ఆస్వాదించమనీ ఓ...
ఇవ్వాళ నా పిలుపు
ఇవ్వాలి నీకు గెలుపు
సంవత్సరం వరకు ఓ లోకమా....ఓ...
ఇవ్వాళ నా పిలుపు
చరణం: 2
ప్రతి క్షణము ఒక్కో వరమై
సుఖాలే తేవాలని
ప్రతి మనసు ఒక్కో స్వరమై
సంగీతం అవ్వాలని
పల్లవించే పరిచయాలే
స్నేహాలై వికసించాలి అని ఓ...
ఇవ్వాళ నా పిలుపు
ఇవ్వాలి నీకు గెలుపు
సంవత్సరం వరకు ఓ లోకమా....ఓ...
ఇవ్వాళ నా పిలుపు
ఇవ్వాలి నీకు గెలుపు
సంవత్సరం వరకు ఓ లోకమా....ఓ...
చిత్రం: ఒక్కడున్నాడు (2007)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అనంత్ శ్రీరామ
గానం: దేవి శ్రీ ప్రసాద్
పల్లవి:
మనకక్కర్లెధు అసలక్కర్లెధు అసలక్కర్లెధురా
ఫియర్, క్లియర్, ఎవర్...
అరె చుక్కల్లో తెగ చెక్కర్లే ఇక కొట్టొద్దామురా
ఇధర్, ఉధర్, బ్రదర్...
మనకక్కర్లెధు అసలక్కర్లెధు అసలక్కర్లెధురా
ఫియర్, క్లియర్, ఎవర్...
చరణం: 1
వందో వెయ్యో లక్షో గిక్షో రేటు ఉంటుంది తప్పుకి
పర్లెధు చేసి పారేయ్
రింగో చైనో బైకో గియ్కో పోతే పోని ఎంటిలే
నీ స్వేచ్ఛ అగరాదోయ్
మనసెక్కడ ఉంటుందో మనం అక్కడ ఉండుంటేనే
లైఫ్ లోన అంతో ఇంతో కిక్ ఉంది లేరోయ్
మనకక్కర్లెధు అసలక్కర్లెధు అసలక్కర్లెధురా
ఫియర్, క్లియర్, ఎవర్...
అరె చుక్కల్లో తెగ చెక్కర్లే ఇక కొట్టొద్దామురా
ఇధర్, ఉధర్, బ్రదర్...
చరణం: 2
ఫుల్లో హాఫో ఎన్నో రౌండో ఆలోచిస్తూ చూడకోయ్
కావాల్సినంత వేసేయ్
గంటో పూటో రాత్రో పగలో వేస్టే ఐపోని కాలమే
ఏమంత లాస్ లేదోయయ్
మన కళ్ళకు నచ్చిందల్ల మన సొంతం అవుతుంటేనే
భూమ్మిద పుట్టామంటె అర్ధముందిలేరోయ్
చిత్రం: ఒక్కడున్నాడు (2007)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యమ్.యమ్.కీరవాణి
పల్లవి:
అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు
కోరిన తీరాన్నే చేరుకునే వరకు
అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు
కోరిన తీరాన్నే చేరుకునే వరకు
అడుగడుగునా...
చరణం: 1
ఓ నిమిషమైనా నిదరపోవా నిలవనీవేం నిరీక్షణమా
నే వెతుకుతున్నా ఎదుటపడవే తొలి వెలుగు తీరమా
అడుగడుగునా ప్రతి మలుపునా రోజూ నా వెంటే పడకు
విడవని పంతముగా నా ప్రాణం తినకు
చరణం: 2
నీ కలల వెంటే కదలమంటే కుదురుతుందా
అయోమయమా
నా దిగులు మంటే తగులుతుంటే రగలవేం కాలమా
అడుగడుగునా - అడుగడుగునా
పడిపోయినా - పడిపోయినా
ఆగే వీల్లేదే పరుగు
కోరిన తీరాన్నే చేరుకునే వరకు
అడుగడుగునా...