చిత్రం: ఒట్టేసి చెబుతున్నా (2003)
సంగీతం: విద్యాసాగర్
నటీనటులు: శ్రీకాంత్, శివాజి, కనిక దివ్య, అనిత పాటిల్, ఆశా షైనీ
కథ: ఉదయ రాజ్
మాటలు: చింతపల్లి రమణ
దర్శకత్వం: ఇ. సత్తిబాబు
నిర్మాత: కె.అనిల్ కుమార్
సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్
ఎడిటర్: శ్రీకర ప్రసాద్
బ్యానర్: శ్రీ క్రియేషన్స్
విడుదల తేది: 11.04.2003
చిత్రం: ఒట్టేసి చెబుతున్నా (2003)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల
గానం: గోపాల్, శ్రీనిధి
ఒట్టేసిచెబుతున్నా వింటున్నావా ఓ మైనా
నువ్వంటే నేనేనని
అడుగేసి వస్తున్నా ఎందాకైనా ఎవైనా
నీ వెంటే వుండాలని
తీరిందమ్మా ఆరాటం దొరికిందమ్మా ఆధారం
నీవల్లే మారిందే నా జాతకం
అందిందమ్మో అనుబంధం ఏవో జన్మల ఋణబంధం
నీ ఒళ్ళో వాలిందే నా జీవితం
చరణం: 1
వెళ్ళేటిదారుల్లోన నీడుంటే చాలనుకుంటే
బంగరుమేడై కలిసొచ్చావే
వేచేటి కన్నుల్లోన కలలుంటే చాలనుకుంటే
కమ్మని నిజమై కనిపించావే
దీవెన చాలని అనుకుంటే దైవం అందెనే
పూజకు రమ్మని పిలుపిస్తే ప్రాణం పంచెనే
నా రాతే మార్చేసే నా గీతే దిద్దేసే
భామిని ఉండగ బ్రహ్మెందుకో
చరణం: 2
నీ లేతపాదాలంటే ధూళైతే చాలనుకుంటే
పాపిటతిలకమే చేశావమ్మా
నీ పెరటితోటల్లోన గాలైతే చాలనుకుంటే
ఊపిరిలో నను నిలిపావమ్మా
నాలో నేడే వెలిగిందే ఆశాదీపము
ప్రేమే మనకు అందించే ఆశీర్వాదము
నీ మెళ్ళో ముళ్ళేసి పల్లెల్లో ఇల్లేసి
జతపడి బ్రతకని జన్మెందుకో