చిత్రం: ఓయ్ (2009)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: చంద్రబోస్
గానం: సిద్దార్ధ్
నటీనటులు: సిద్దార్ధ్, బేబీ షామిలి
దర్శకత్వం: ఆనంద్ రంగా
నిర్మాత: డి.వి.వి. దానయ్య
విడుదల తేది: 03.07.2009.
నూట డెబ్భైఆరు బీచ్ హౌస్ లో ప్రేమదేవతా
యల్లోచుడిదార్ వైట్ చున్ని తో దోచే నా ఎద
ఓయ్..ఓయ్..అంటు casual గా పిలిచెరో
ఓయ్..ఓయ్.. ఇరవై సార్లు కల్లో కలిసెరో
ఓయ్..ఓయ్..ఎంప్టీ గుండె నిండ నిలిచెరో
ఓయ్...ఊ..ఊ..ఊ
Love@1st sight నాలో కలిగే
Love@1st sight నన్ను కదిపే
Love@1st sight నాకే దొరికే
Love@1st sight నన్ను కొరికే
నూట డెబ్భైఆరు బీచ్ హౌస్ లో ప్రేమదేవతా !!
రూపం లోన Beautiful, చేతల్లోన dutyful, మాటల్లోన fundamental...
అన్నిట్లోన capable, అందర్లోన Careful, అంతేలేని sentimental
సినిమాలో మెరిసేటి పాత్ర,City లోన దొరకదు రా...
నిజంగానే తగిలెను తార,వైజాగు నగరపు చివరన
ఝల్ ఝల్ జరిగే
Love@1st sight ఛిల్ కలిగే
Love@1st sight పల్ పల్ పెరిగే
Love@1st sight పైకెదిగే
హేయ్...హేయ్...
డబ్బంటేనే Alergy,భక్తంటేనే Energy నమ్ముతుంది Numerology...
ఇంటి ముందు nostory అంతేలేదు అల్లరి, ఒప్పుకోదు Humorology
ఉండాల్సింది తన వాదల్లో,చ్రాల్సింది Military లో
ఏదో ఉంది strong thing తనలో, లాగింది మనసును చిటికెలో
Some సంబరమే
Love@1st sight వహ్ వరమే
Love@1st sight ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ క్షణమే,
Love@1st sight ఓ యుగమే
నూట డెబ్భైఆరు బీచ్ హౌస్ లో ప్రేమదేవతా
యల్లోచుడిదార్ వైట్ చున్ని తో దోచే నా ఎద
ఓయ్..ఓయ్..అంటు casual గా పిలిచెరో
ఓయ్..ఓయ్.. ఇరవై సార్లు కల్లో కలిసెరో
ఓయ్..ఓయ్..ఎంప్టీ గుండె నిండ నిలిచెరో
ఓయ్..ఊ..ఊ..ఊ..
Love@1st sight నాలో కలిగే
Love@1st sight నన్ను కదిపే
Love@1st sight నాకే దొరికే
Love@1st sight నన్ను కొరికే
Love@1st sight నన్ను కొరికే
******** ********* ********
చిత్రం: ఓయ్ (2009)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: వనమాలి
గానం: కె. కె.
చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావని
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని
నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ
నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ
ప్రతి జన్మ నీతోనే I am waiting for you baby
ప్రతి జన్మ నీతోనే I am waiting for you baby
ఓ..ఓ..ఓ..ఓ... ఓ..ఓ..ఓ..ఓ...
చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావని
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని
నువ్వూ నేను ఏకం అయ్యే ప్రేమల్లోన ఓ..ఓ..
పొంగే ప్రళయం నిన్నూ నన్ను వంచించేనా
పువ్వే ముళ్ళై కాటేస్తోందా..ఆ..ఆ...
నీరే నిప్పై కాల్చేస్తోందా..ఆ..ఆ...
విధినైనా వెలేయనా నిను గెలిచేయనా
నీకోసం నిరీక్షణ ఓ..ఓ..
I am waiting for you baby
ప్రతి జన్మ నీతోనే I am waiting for you baby
ఓ..ఓ..ఓ..ఓ... ఓ..ఓ..ఓ..ఓ...
ప్రేమనే ఒకే మాటే ఆమెలో గతించిందా
వీడని భయం ఏదో గుండెనే తొలుస్తోందా
ఆ ఊహే తన మదిలో కలతలే రేపెనా
విధినైనా వెలేయనా నిను గెలిచేయనా
నీకోసం నిరీక్షణ ఓ..ఓ..
I am waiting for you baby
చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావని
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని
నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ
నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ
ప్రతి జన్మ నీతోనే I am waiting for you baby
ప్రతి జన్మ నీతోనే I am waiting for you baby
********* ********** **********
చిత్రం: ఓయ్ (2009)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: వనమాలి
గానం: యువన్ శంకర్ రాజా
నన్నొదిలి నీడ వెళ్ళిపోతోందా..
కన్నోదిలి చూపు వెళ్ళిపోతోందా..
వేకువనే సందె వాలిపోతోందే..
చీకటిలో ఉదయముండి పోయిందే ..
నా యదనే తోలిచిన గురుతిక నిను తెస్తుందా..
నీ జతలో గడిపిన బతుకిక బలి అవుతుందా..
నువ్వుంటే నేనుంటా ప్రేమా ..
పోవద్దె పోవద్దె ప్రేమా...
నన్నొదిలి నీడ వెళ్ళిపోతోందా..
కన్నోదిలి చూపు వెళ్ళిపోతోందా..
ఇన్ని నాళ్ళు నీ వెంటే సాగుతున్న నా పాదం..
వెంట పడిన అడుగేదంటోందే..ఓ..ఓ...
నిన్నదాక నీ రూపం నింపుకున్న కనుపాపే..
నువ్వు లేక నను నిలదీస్తుందే ..
కోరుకున్న జీవితమే చేరువైన ఈ క్షణమే..
జాలిలేని విధిరాతే శాపమైనదే..
మరుజన్మే ఉన్నదంటే బ్రహ్మనైనా అడిగేదొకటే..
గనమంతా మమ్ము తన ఆటలిక సాగని చోటే..
నువ్వుంటే నేనుంటా ప్రేమా ..
పోవద్దె పోవద్దె ప్రేమా...
నువ్వుంటే నేనుంటా ప్రేమా ..
పోవద్దె పోవద్దె ప్రేమా...
********* ********** **********
చిత్రం: ఓయ్ (2009)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: తోషి సబ్రీ, ప్రియ
అప్పుడెప్పుడో జరిగిన కథలో ఇప్పుడప్పుడే జరగని కలలో ఎప్పుడైన ఈ పని లేని ఆలొచన దండగే కదా
ఉన్నదొక్కటే నడిచే సమయం దానితోనే నువ్వు చేసెయ్ పయనం
మరు నిమిషం లేదంటు లైఫే గడిపెయి మెరుపులా
గల గల పారేటి నది ఎక్కనైనా ఆగేనా అది మనసుకు కట్టొద్దు గది
ఉన్న హద్దులన్ని దాటుకెళ్తే పండగే మరి
శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ
శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ
ఎన్నో మలుపులు కలిసిన జీవితమే చెలిమై వెలిగిపోవాలంటే
తెలుసుకోవే వేసే ప్రతి అడుగు పడనీ ఆలోచనకు గమ్యం ఏదో తెలిసీ సాగిపొవే
రేపటికై కలలు కంటు కలలన్నీ నిజం చేస్తూ ఆశే నీ శ్వాస ఐతే రాతే మారిపోదా
శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ
శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ
అంతు లేని ఓ అందం ఉంది అందుకోమనే లోకం మందీ
అందుకోసమే చెపుతున్నా రాజీ పడటం మానుకో
కనులకు నచ్చింది చూసెయ్ మనసుకు తోచింది చేసెయ్
అడిగితె ఈమాట చెప్పెయ్ నవ్వుతుండగానె మగ్గి పొతే స్వర్గమే అని
శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ
శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ
********* ********** **********
చిత్రం: ఓయ్ (2009)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: కార్తిక్, సునిధి చౌహన్
సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటగట్టుకొని నింగి మధ్యలొ పరిగెడతావా
వంద అడుగుల నీటి లోతులో నిట్టనిలువుగా నిలబడతావా
నా గుండెలో ఎన్నో ఆశలే ఇలా రేగితే నిన్నే చేరితే
క్షణం ఆగక నే కొరితే ఎల్లాగో ఎల్లాగో మరి
నా ప్రేమగ నిన్ను మార్చుకున్నాఓ హో ..... ఆ ఆశలు లోతు చూడలేనా
నీ ప్రేమగ నేను మారుతున్నాఓ.. ఆనందపు అంచు తాకలేనా
సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
చిగురుల తోనే చీరను నేసి చేతికి అందించవా
కలువలతోనే అంచులు వేసి కానుక పంపించనా
అడిగినదేదో అదే ఇవ్వకుండా అంతకు మించి అందిచేది ప్రేమ
కనుపాపలపై రంగుల లోకం గీస్తావా
నా ప్రేమగ నిన్ను మార్చుకున్నాఓ హో ..... ఆ ఆశలు లోతు చూడలేనా
నీ ప్రేమగ నేను మారుతున్నాఓ.. ఆనందపు అంచు తాకలేనా
సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటగట్టుకొని నింగి మధ్యలొ పరిగెడతావా
వంద అడుగుల నీటి లోతులో నిట్టనిలువుగా నిలబడతావా
మెలకువ లోన కలలను కన్నా నిజములు చేస్తావనీ
చిలిపిగ నేనే చినుకౌతున్నా నీ కల పండాలని
పిలువక ముందే ప్రియా అంటూ నిన్నే చేరుకునేదే మనసులోని ప్రేమ
ప్రాణములోనే అమృతమేదో నింపేయవా