చిత్రం: పట్నం వచ్చిన పతివ్రతలు (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:
గానం: యస్.పి.బాలు
నటీనటులు: చిరంజీవి , మోహన్ బాబు, రాధిక , గీత
దర్శకత్వం: విజయ బాపినీడు
నిర్మాత: అట్లూరి రాధాకృష్ణ మూర్తి
విడుదల తేది: 01.10.1982
పల్లవి:
హేయ్... హేయ్... హేయ్... హేయ్
ఇనుకోండి కొండ దొరల దండోరా
బంగారు చిలకలు రెండూ చూశారా
హేయ్... పిలకంత జడ ఉంది... నలకంత నడుముంది
పిసరంత పొగరుంది... సిసలైన సొగసుంది
బస్తీ గిస్తీ గస్తీ కాసి వెతకండోయ్...
ఇనుకోండి కొండ దొరల దండోరా
బంగారు చిలకలు రెండూ చూశారా
పిలకంత జడ ఉంది... నలకంత నడుముంది
పిసరంత పొగరుంది... సిసలైన సొగసుంది
బస్తీ గిస్తీ గస్తీ కాసి వెతకండోయ్...
చరణం: 1
ఇంగ్లీషులో ఢంగు చేస్తాదో దొరసాని
నాటు మాటలో ఘాటుకుంటదో దొరసాని..
ఆ.. ఆ.. ఇంగ్లీషులో డంగు చేస్తాదో దొరసాని
నాటు మాటలో ఘాటుకుంటదో దొరసాని..
కాశులపేరుందంది.. కంచిపట్టు చీరంది
రైళ్లుల్లో బసుల్లో కనపడితే చెప్పండి
ఒళ్లు కళ్లు ఒక్కటి చేసుకొని వెతకండోయ్...
ఇనుకోండి కొండ దొరల దండోరా
బంగారు చిలకలు రెండూ చూశారా
పిలకంత జడ ఉంది... నలకంత నడుముంది
పిసరంత పొగరుంది... సిసలైన సొగసుంది
బస్తీ గిస్తీ గస్తీ కాసి వెతకండోయ్...
చరణం: 2
పట్టణాలకే పుట్టుమచ్చ ఓ చిలకమ్మా
పల్లెసీమకే పచ్చబొట్టు ఓ చిలకమ్మా
ఆ.. ఆ.. పట్టణాలకే పుట్టుమచ్చ ఓ చిలకమ్మా
పల్లెసీమకే పచ్చబొట్టు ఓ చిలకమ్మా
హేయ్.. సినిమాలే చూస్తోందో? షికారులే చేస్తోందో?
బజారుకే వచ్చిందో? ఏ బాధలు పడుతోందో?
నింగికి నేలకు నిచ్చెనలేసుకొని వెతకండోయ్...
ఇనుకోండి కొండ దొరల దండోరా
బంగారు చిలకలు రెండూ చూశారా
పిలకంత జడ ఉంది... నలకంత నడుముంది
పిసరంత పొగరుంది... సిసలైన సొగసుంది
బస్తీ గిస్తీ గస్తీ కాసి వెతకండోయ్...
******** ******** ********
చిత్రం: పట్నం వచ్చిన పతివ్రతలు (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:
గానం: సుశీల
పల్లవి:
సీతారామ స్వామి నే చేసిన నేరములేమి
సీతారామ స్వామి నే చేసిన నేరములేమి
కోరితినా ఆ ఒక్కటితప్పా
నేరాలెన్నగ నేనే గొప్పా... స్వామీ
ఓ.. సీతారామ స్వామి నే చేసిన నేరములేమి
చరణం: 1
నీ కౌగిలే కాసుల పేరని
నీ ముద్దులే ముత్యపుసరులని
మురిసితిగాని కొసరి కొసరి నే కోరితినా ఆ ఒక్కటి తప్ప
అది నీకు నాకు తెలుసును తప్ప.... స్వామి
ఓ.. సీతారామ స్వామి నే చేసిన నేరములేమి
చరణం: 2
ఇంటిపెత్తనాలడిగితినా
వీధికెక్కినే నలిగితినా
ఆ..... ఆ..... ఆ..... ఆ
సాధింపులతో సణిగితినా
ఆ..... ఆ..... ఆ
సాధింపులతో సణిగితినా
నిను బాధపెట్టి నేనెరుగుదునా
కోరితినా ఆ ఒక్కటితప్పా
అది నీకు నాకు తలుసును తప్ప ... స్వామి
ఓ.. సీతారామ స్వామి నే చేసిన నేరములేమి
చరణం: 3
ఎన్నాళ్ళీ లంక చెర ..
ఏనాడు విందువో నాదుమొర
ఆ.... ఆ.... ఆ..ఆ
ఆత్రప్రాణపరయాణ శీలా
ఆ..ఆ...ఆ.... ఆ
ఆత్రప్రాణపరయాణ శీలా
అన్యమడుగునా ఆ ఒక్కటితప్ప
కోరితినా ఆ కోరికతప్ప అది నీకు నాకు తలుసును తప్ప స్వామి
ఓ.. సీతారామ స్వామి నే చేసిన నేరములేమి
కోరితినా ఆ ఒక్కటితప్పా
నేరాలెన్నగ నేనే గొప్పా స్వామీ
సీతారామ స్వామి నే చేసిన నేరములేమి