చిత్రం: పెళ్లి చూపులు (2016)
సంగీతం: వివేక్ సాగర్
సాహిత్యం: శ్రేష్ట
గానం: కె. సి. అమృత వర్శిని
నటీనటులు: విజయ్ దేవరకొండ, రీతు వర్మ
దర్శకత్వం: తరుణ్ భాస్కర్
నిర్మాతలు: రాజ్ కందుకూరి, యాష్ రంగినేని
విడుదల తేది: 29.06.2016
చినుకు తాకే జడిలో చిగురు తొడిగే చెలిమే
విరిసె హరివిల్లులే ఎదుట నిలిచే నిజమే
కలలు పంచె తీరే చెలికి చిరునవ్వులే
మునుపు కనుగొనని ఆనందమేదో
కలిగే నాలోన ఈ వేళనే
ఎగిసి ఉప్పొంగే ఊహల్లో మునిగీ ఉన్నాలే
పలకరించే ఆశే పరవశాన్నే పెంచే చిలిపి కేరింతలా
కలవరింతే తరిమే పరుగులెత్తే మనసే ఒడిసి పట్టేదెలా
నాలో నే దాగి నిదురించు నన్నే
తట్టి లేపింది నీవే సుమా
ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా
నేనేనా ఇది అంటూ అనిపించినా
ఔనౌను నేనే మరి కాదా
చిత్రంగా నాకేనే కనిపించినా
కవ్వించే చిత్రాన్నయ్యాగా
నా దారినే మళ్లించిన తుళ్లింతలా వరదలా
పాదాలనే నడిపించిన రహదారి వయ్యావేల
నేరుగా సరాసరి నేనిలా
మారగా మరీ మరీ తీరుగా
పలకరించే ఆశే పరవశాన్నే పెంచే చిలిపి కేరింతలా
కలవరింతే తరిమే పరుగులెత్తే మనసే ఒడిసి పట్టేదెలా
నాలోనే దాగి నిదురించు నన్నే
తట్టి లేపింది నీవే సుమా
ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా
******** ********** ********
చిత్రం: పెళ్లి చూపులు (2016)
సంగీతం: వివేక్ సాగర్
సాహిత్యం: శ్రేష్ట
గానం: హరిచరన్, ప్రణవి ఆచార్య
మెరిసే మెరిసే మనసే మురిసే నీల
చెలిమే వలనే
చిరు చిరు అసలు వీరిసేగా
కడలే యాదలో మునకేసెనా
తొలి తొలి గా ఏయేఏ. అః అహా ఆ..
ఏయేఏ అరె అరె భువీ తిరిగేనులే
తిరిగి తన దిశ మార్చి
ఏయేఏ అలరారే అలా ఏగిసే
తానే తననే చేరి
హృదయం లోలోనా పరిచెయ్
ఎన్నో వెళుతురులే
మిణుగూరులై ముసిరి ఎదా నిమిరె
కడలే యాదలో మునకేసెనా
చిగురులు తొడిగే లతలే అన్ని
సీతాకోక లాయె
తళతలలడే చుక్కలనే తాకే
నీలకశం చుట్టురా తిరిగేస్తూ
ఎంతశ్చర్యం జాబిల్‌కే
నడకలు నేర్పిoచే
ఏయేఏ అరె అరె భువీ తిరిగేనులే
తిరిగి తన దిశ మార్చి
ఏయేఏ అలరారే అలా ఏగిసే
తనాఏ తననే చేరి
కసూరుతూ కదిలే కాలం
ఏమైపోనట్టు….
కోసారి కోసారి పలకరించు
జల్లులీల ఇన్నల్ళేమైనట్టు
గగానం నయనం తెరువంగా
మురిసే భువనామిల
ఒకటై నడిచే అడుగులిక
నిలవాలి కలకలం
మెరిసే మెరిసే మనసే మురిసే నీల
చెలిమే వలనే
చిరు చిరు అసలు వీరిసేగా
తొలి తొలి గా ఏయేఏ. అః అహా ఆ..
ఏయేఏ అరె అరె భువీ తిరిగేనులే
తిరిగి తన దిశ మార్చి
ఏయేఏ అలరారే అలా ఏగిసే
తానే తననే చేరి
హృదయం లోలోనా పరిచెయ్
ఎన్నో వెళుతురులే
మిణుగూరులై ముసిరి ఎద నిమిరె