చిత్ర: ప్రతినిధి (2014)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: బి.సుబ్బరాయ శర్మ
గానం: కార్తీకేయన్
నటీనటులు: నారా రోహిత్, సుభద్ర అయప్ప
దర్శకత్వం: ప్రశాంత్ మండవ
నిర్మాత: సాంబశివరావు
విడుదల తేది: 24.04.2014
మా మాట నీ నోట కసిగా నువ్వడిగావయ్య.. శీనయ్య
నువ్వు మా గుండె మంటలకు రూపానివైనావయ్య… శీనయ్య
ఈ అసమర్ధ పాలకుల పని పట్టగ పెను తుఫానువై కాన వచ్చావయా
నయ వంచనతో నటియించు నాయకులకు
నీ నయనాల జన శక్తి చూపించరావయ్య
మా మాట నీ నోట కసిగా నువ్వడిగావయ్య.. శీనయ్య
నువ్వు మా గుండె మంటలకు రూపానివైనావయ్య… శీనయ్య
చరణం: 1
నిజమంటే నిప్పంటే ఆ నిప్పే నీవు అన్యాయాన్ని దహియించర
నీ శ్వాస నీ ధ్యాస ఈ జనమేనంటూ
మా జన ఘోష నీ భాష చేసావు లేర
అలుపే లేని సూరీడు నీవేనురా
ఈ గెలుపింక మా బ్రతుకుకే మలుపురా
మా ఇన్నాళ్ళ కన్నీళ్ళు పోటెత్తగా
ఈ మంచోడు శీనయ్య మా అండ నిలిచాడు
మా మాట నీ నోట కసిగా నువ్వడిగావయ్య.. శీనయ్య
నువ్వు మా గుండె మంటలకు రూపానివైనావయ్య… శీనయ్య
చరణం: 2
మనలోన ఈ ఒకడు మనకోసం నిలచి తన ప్రాణాలు త్రొనమనెనురా
నీ గమ్యం నీ ధ్యేయం జన క్షేమం అంటూ
నీ పయనాన్ని సాగించి సాధించినావ
మా నిజమైన నాయకుడు నీవేనయ్య
నీ వెన్నంటే మేమంతా ఉంటమయ్యా
జన చైతన్యమే తన లక్ష్యం కాదా
ఈ ప్రజలంతా కోరేటి ప్రతినిధివి నీవయ్య
మా మాట నీ నోట కసిగా నువ్వడిగావయ్య.. శీనయ్య
నువ్వు మా గుండె మంటలకు రూపానివైనావయ్య… శీనయ్య
ఈ అసమర్ధ పాలకుల పని పట్టగ పెను తుఫానువై కాన వచ్చావయా
నయ వంచనతో నటియించు నాయకులకు
నీ నయనాల జన శక్తి చూపించరావయ్య
******* ******* *******
చిత్ర: ప్రతినిధి (2014)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: బి.సుబ్బరాయ శర్మ , అఖిలేష్ రెడ్డి
గానం: దనుంజయ్
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం
జనగణమును పద పద పదమని
జన జాగృతి పలికిన గీతమే
వందేమాతరం… వందేమాతరం…
నీ లక్ష్యం ఒకటే సోదరా
నిర్లక్ష్యాన్నే నిలదీయరా
వందేమాతరం… వందేమాతరం…
ఎవరేమన్నా ఎదురేమైనా జన చైతన్యానికి సారధి నీవై సాగరా…
సుజలాం సుఫలాం ఇది నీ గమ్యం ఇక సస్యస్యామలమై పోతుందిరా భారతం
వందేమాతరం… వందేమాతరం…
వందేమాతరం… ఒహొ వందేమాతరం…
వందేమాతరం… వందేమాతరం…
వందేమాతరం… ఒహొ వందేమాతరం…
చరణం: 1
ఏ దేశ్ ప్యార్ కి మిట్టి హై
హర్ దేశ్ మొహబ్బత్ మస్తీ హై
హర్ దిల్ మే భరి సజ్జయి వందేమాతరం
ఏ దేశ్ ప్యార్ కి మిట్టి హై
హర్ దేశ్ మొహబ్బత్ మస్తీ హై
హర్ దిల్ మే భరి సజ్జయి వందేమాతరం
వందేమాతరం వందేమాతరం…