Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Prema Tarangalu (1980)




చిత్రం: ప్రేమ తరంగాలు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: కృష్ణంరాజు, చిరంజీవి, జయసుధ, సుజాత
దర్శకత్వం: యస్.పి. చిట్టిబాబు
నిర్మాత: యమ్.వి.హెహ్. రాయపరాజు
విడుదల తేది: 24.10.1980



Songs List:



కలయైనా నిజమైనా కాదన్నా లేదన్నా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ తరంగాలు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, పి. సుశీల 

కల అయినా, నిజమైనా
కాదన్నా, లేదన్నా
చెబుతున్నా ప్రియతమా
నువ్వంటే నాకు ప్రేమ

నిన్ను పూజించనా, నిన్ను సేవించనా
సర్వమర్పించనా, నిన్ను మెప్పించనా
నీ గుడిలో దీపముగా నా బ్రతుకే వెలిగించి, 
కొడిగట్టి నేనారిపోనా
నువ్వంటే నాకు ప్రేమ

నిన్ను లాలించనా, నిన్ను పాలించనా, 
జగతి మరిపించనా, స్వర్గమనిపించనా
నా యెదలో దేవతగా  నీ రూపే నిలుపుకొని, 
నీ ప్రేమ పూజారి కానా
నువ్వంటే నాకు ప్రేమ

కలిసి జీవించినా, కలలు పండించినా, 
వలచి విలపించినా, కడకు మరణించినా
నీ జతలో జరగాలి, నీ కధలో నాయికగా 
మిగలాలి మరుజన్మకైనా
నువ్వంటే నాకు ప్రేమ




మనసు ఒక మందారం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ తరంగాలు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

పల్లవి:
ఉ..హు..ఆ.. ఆ.. ఆ..
లా..లాలాలా..

మనసు ఒక మందారం 
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే 
బ్రతుకు ఒక మధుమాసం

మనసు ఒక మందారం 
చెలిమి తన మకరందం

చరణం: 1
ఈ తోటలో... ఏ తేటిదో
తొలి పాటగా వినిపించెను 
ఎద కదిలించెను
ఆ పాటనే నీ కోసమే
నే పాడినా వినిపించునా నేస్తమా?
వికసింతువా వసంతమా?

మనసు ఒక మందారం 
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే 
బ్రతుకు ఒక మధుమాసం

చరణం: 2
ఈ చీకటి.. నా లోకము
నీ రాకతో మారాలిరా 
కథ మారాలిరా
ఆ మార్పులో.. నా తూర్పువై
ఈ మాపు నే వెలిగింతువా నేస్తమా?
వికసింతువా  వసంతమా?

మనసు ఒక మందారం 
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే 
బ్రతుకు ఒక మధుమాసం

ఆహా..హా.. ఆ... ఆ...ఉమ్మ్..ఉమ్మ్




మనసు ఒక మందారం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ తరంగాలు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం:యస్.పి. శైలజ 

మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
ఆ మధురిపుకు పులకించే
బ్రతుకు ఒక మధుమాసం

ఈ తోటతో ఏ తేటిదో
తొలి పాటగా వినిపించెను
ఎద కదిలించెను
ఆ పాటనే నీకోసమే
నే పాడినా వినిపించునా నేస్తమా
వికసింతువా వసంతమా

ఈ చీకటి నా లోకము
నీ రాకతో మారాలిరా
కథ మారాలిరా 
ఆ మార్పులో నా తూర్పువై
ఈ మాపునే వెలిగింతువా నేస్తమా
వికసింతువా వసంతమా




నా హృదయం తెల్ల కాగితం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ తరంగాలు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

నా హృదయం తెల్లకాగితం
అది ఏనాడో నీకు అంకితం
బేషరతుగ ఇచ్చేశా ప్రేమ పత్రము
ఏమైనా రాసుకో – నీ ఇష్టము

మెరుపై మెరిసావు - చినుకై కురిసావు
చిగురులు వేశావు నాతో
చల్లగ వచ్చావు వెచ్చగ మారావు
పచ్చగ మిగిలావు నాలో
అలచిన్నారి - ఇక వయ్యారివి
ఆనెయ్యానివి - ఇక వియ్యానివి

కలుసుకున్నాము నేడు
కథ రాసుకుందాము రేపు

పూచిన జాబిల్లి - పున్నమి సిరిమల్లి
నాకిక నెచ్చెలివి నీవే
పొంగే గోదారి - పువ్వులరాదారి
నాకిక సహచారివి నీవే
నా కలవాణివి - ఇక కళ్యాణివి
అల నెలరాజువి - ఇక నా రాజువి
కలిసిపోయాము మనము ఇక
కలబోసుకుందాము సుఖము




నవ్వేందుకే ఈ జీవితం నవ్వొక్కటేరా శాశ్వతం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ తరంగాలు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు 

నవ్వెందుకే ఈ జీవితం, 
నవ్వొక్కటేరా శాశ్వతం
దేవుడిచ్చిన జీవితాన్ని, 
చివరిదాకా మాసిపోని 
నవ్వుతో నింపేయరా

కానరాని కాటుచీకటి బాటలో పయనించినా
లోకమంతా ఎకమై నిను వేరుచేసి చూసినా
జాలిలేని కాలమే నిను కాలరాచి వెళ్ళినా
దేవుడిచ్చిన జీవితాన్ని, చివరిదాకా మాసిపోని 
నవ్వుతో గడిపేయరా

కళ్ళుమూసి వెళ్ళిపోయే జీవితం ఒక రాక్షసి 
వెంటవుండి తీసుకెళ్ళే మృత్యువే నీ ప్రేయసి 
నువ్వు వెళ్ళుతూ ఉన్నవాళ్ళకు పూలబాటలు చూపరా
దేవుడిచ్చిన జీవితాన్ని, చివరిదాకా మాసిపోని 
నవ్వుతో సాగించరా





ప్రేమ తరంగాలు నవజీవన రాగాలు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ తరంగాలు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు

కమాన్
జాయిన్ అవర్స్ హెవెన్ 
హే గే డోంట్ బి షై
కమాన్ - హే 

ప్రేమతరంగాలు సంజీవన రాగాలు
ఎంత తలచినా ఎప్పుడు పిలిచినా
ఎంతగ పలికే అనుభవాలు
గిలిగింతగ పలికే అనుభవాలు

విరిసే తొలిపువ్వు ప్రేమ
మెరిసే చెలినవ్వు ప్రేమ
పొడిచే తొలిపొద్దు ప్రేమ
పిలిచే చెలిముద్దు ప్రేమ
ప్రేమే జీవం 
ప్రేమే దైవం
ప్రేమే సర్వం కాదా
ప్రేమే అందుకుంటే స్వర్గం
ప్రేమే అందకుంటే నరకం
ప్రేమే పెరిగిపోతే మమత
ప్రేమే విరిగిపోతే కలత
ఎన్నడు మరపని
ఎప్పుడు చెరగని
ప్రేమే మనదికాదా





ఇదే పరువం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ తరంగాలు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: 
గానం: పి. సుశీల , యస్.పి.బాలు

ఇదే పరువం ప్రతీ సమయం
ఇలా ఆడీ ఘల్ ఘల్ ఘల్ గజ్జె ఘల్లుమన్నది
బలేగీతం బలేనాదం
ఇలా వింటే ఝల్ ఝత్ ఝల్ గుండె ఝల్లుమన్నది
వింత చెలికాడు చెంతనున్నాడు
గుండెలో నేడు చెండు విసిరాడు
మాట కలిసింది మనసు తెలిసింది
మంటలో నేడే మల్లే విరిసింది
దాగివున్న మూగఆశ తీగై సాగిపోతుంది
వసంతాలు పూచె మయూరాలు లేచె
వలచిన అందాలన్ని నీవై ఆడ
జిల్ జిల్ జిల్ ఒళ్లు జిల్లు జిల్లుమన్నది

నేల పూగింది వేళ బాగుంది
మేనిలో ఏదో మెరుపు మెరిసింది
పదం పలికింది మధువు తొలికింది
పెదవిపై ఏదో పిలుపు పిలిచింది
నేటిరేయి చేయిసాచి, నీకై వేచివుంటుంది
హుషారింక చాలు నిషా వుంటే మేలు
కనులను ఏవో ఏవో కలలే కమ్మగా
చల్ చల్ చల్ మనసే చల్ చలమన్నది.

Most Recent

Default