చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ నటీనటులు: ప్రభుదేవా, నగ్మా దర్శకత్వం: యస్.శంకర్ నిర్మాత: కె.టి.కుంజమాన్ విడుదల తేది: 17.09.1994
Songs List:
ఊర్వశీ ఊర్వశీ పాట సాహిత్యం
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: షాహుల్ హమీద్, ఏ.ఆర్.రెహమాన్, సురేష్ పీటర్స్ పల్లవి: ఊర్వశీ ఊర్వశీ డటేకిటీజీ ఊర్వశీ వూసలాగ ఒళ్లు ఉంటే ఎందుకంటా ఫార్మసీ గెలుపుకీ సూత్రమే టేకిటీజీ పాలసీ నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫాంటసీ ఓ చెలి తెలుసా తెలుసా తెలుగు మాటలు పదివేలు అందులో ఒకటో రెండో పలుకు నాతో అది చాలు చరణం: 1 చిత్రలహరిలో కరెంటుపోతే టేకిటీజీ పాలసీ బాగ చదివి ఫెయిలయిపోతే టేకిటీజీ పాలసీ తిండి దండగని నాన్న అంటే టేకిటీజీ పాలసీ బట్టతలతో తిరుపతి వెళితే టేకిటీజీ పాలసీ ఓ చెలి తెలుసా తెలుసా జీవనాడులు ఎన్నెన్నో తెలుపవే చిలకా చిలకా ప్రేమనాడి ఎక్కడుందో చరణం: 2 చూపుతో ప్రేమే పలకదులే కళ్లతో శీలం చెడిపోదే మాంసమే తినని పిల్లుందా పురుషులలో రాముడు ఉన్నాడా విప్లవం సాధించకపోతే వనిత కు మేలే జరగదులే రుద్రమకు విగ్రహమే ఉంది సీతకు విగ్రహమే లేదే పోజుకొట్టి పిల్ల కూడా పడలేదంటే టేకిటీజీ పాలసీ పక్కసీటులో అవ్వే ఉంటే టేకిటీజీ పాలసీ సండే రోజు పండగ వస్తే టేకిటీజీ పాలసీ నచ్చిన చిన్నది అన్నా అంటే టేకిటీజీ పాలసీ పగలు నిన్ను చూడని కన్నెలకు రాత్రిలో కన్నుకొట్టి ఏం లాభం స్వేచ్ఛయే నీకు లేనప్పుడు స్వర్గమే ఉన్నా ఏం లాభం ఫిగరుల సందడి లేకుండా క్లాసుకి వెళ్లి ఏం లాభం ఇరవైలో చెయ్యని అల్లరులు అరవైలో చేస్తే ఏం లాభం
మండపేట మలక్ పేట పాట సాహిత్యం
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: సురేష్ పీటర్స్, షాహుల్ హమీద్, తేని కుంజరమ్మా మండపేట మలక్ పేట నాయుడుపేట పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ నేడేంటి రెపేంటి దినసరి అదే రాత్రేంటి పగలేంటి మార్పులేదులే మర్చిపోదామే బాధలు మర్చిపోదామే కోపం వస్తే కొంచం ఆపుకొందామే అరే గెట్ అప్ అండ్ డాన్స్ ఇక నీదే చాన్స్ నీ చేతిలో అన్ని ఉన్నవిరా తాక్ చిక్ టపాట పాడుదాం ముందు ఎవరు ముందు ఎవరు ముందు ముందు ముందు ముందు పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ అచ్చంపేట బుచ్చంపేట కొత్తపేట కొబ్బరి మట్ట అచ్చంపేట బుచ్చంపేట పేట రాప్ కొత్తపేట కొబ్బరి మట్ట హే డబ్బులేంటి గిబ్బులేంటి ఉన్నది ఒక లైఫ్ చాలయ్య దేవుడా నాకు ఒక వైఫ్ తెరిచి వుంచుదాం మనసు తెరిచి వుంచుదాం వచ్చేది ఎవరో వేచిచూద్దాం అరే నీ కోసం పుట్టింది నీదేరా దొరికింది అందుకోర అంతేరా జరిగింది జరిగేది ఇంతే తెల్లవారె తెల్లవారె తెల్ల తెల్ల తెల్లవారె పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ వాటర్ కరెంట్ కళ్ళాపి ప్యాకెట్ పాలు పిల్లలు స్కూలు ఫీజు చెక్కర చమురు రవ్వ రేషన్ పామాయిల్ పచ్చి బియ్యం గోధుమకు చాలక చాలక ఉన్న డబ్బులన్నీ చాలక ఒక్క అణా రెండు అణా హుండి పగలు గొట్టి పావలా అర్ధ అప్పు సొప్సు చేసి ఒక్క అణా రెండు అణా హుండి పగలు గొట్టి పావలా అర్ధ అప్పు సొప్సు చేసి చెంబు చాట తాకట్టు పెట్టి ఐదు పది అడుక్కున్న అవసరాలు తీరలేదే మండపేట మలక్ పేట నాయుడుపేట పేట రాప్ మండపేట మలక్ పేట నాయుడుపేట పేట రాప్ అచ్చంపేట బుచ్చంపేట కొత్తపేట కొబ్బరి మట్ట అచ్చంపేట బుచ్చంపేట కొత్తపేట కొబ్బరి మట్ట సారాయి ఎండు చిప్ప బీడి ముక్క పండు కప్ప గుడిసె కుప్పతొట్టి పక్కనే టీ కొట్టు రిక్షా గాలిపటం గాజుపెంకు మాంజా గుటిబిళ్ళ గోళికాయ గాలిపాట పాడుదాం అగడం బగడం నెమలికి దంతం సుబ్బరాయుడు సుబ్బలక్ష్మి నర్రా నాగమని ఎన్.టి.ఆర్.ఏ.ఎన్.ఆర్. చిరంజీవి బాలయ్య పగలు గిగులు రాత్రి గీత్రి ఆల్ షోస్ హౌస్ పుల్లే పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్
హే ఎర్రాని కుర్రదాన్ని గోపాల పాట సాహిత్యం
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.జానకి, యస్.పి.బాలు హే ఎర్రాని కుర్రదాన్ని గోపాల అహ చుర్రుమంది నీ చూపు నాకేలా కోడి కోసం వచ్చావా గోపాలా దాని బుట్ట కింద దాచాను గోపాలా పుట్ట తేనే కావాలా గోపాలా దాని ముంలోన వుంచాను గోపాలా గోపాల గోపాల రేపల్లె గోపాల కొండంత సింగారమ్మందిస్తా నీయాల రేపల్లె గోపాల ఈ ఊరి పువ్వు కోసం అమ్మడు ఏరు దాటి వచ్చానే పిల్లవాడి రాకకోసం కళ్లతో వేచి వేచి చుశానే ఆయాసం వచ్చేలా ఐదారు కిలోమీటర్లు నడిచానే హాయి హాయి హాయి భలే హాయి హాయిలే ఈ జోరు నీకేలా సందెపొద్దు దాకనువ్వాగలేవా ఆగలేను నేను గుండెలో ఆగడాలు రగిలే చీకటి పడితే పంచుకో చెంగుచాటు సిరులే చెలియా నీ దేహం తళ తళ మెరిసే బంగారం అరెరె ఏ నీ నోటా కవితలు పలికెను ఎన్నో ఎర్రాని కుర్రదాన్ని గోపాలా అహ చుర్రుమంది నీ చూపు నాకేలా చక్కాని చుక్కనేను గోపాలా నీకు చిక్కుతాను సై అంటె ఈ యాల బుగ్గమీద ముద్దుపెడితే ఎక్కడో కలిగెను గిలిగింత చెవిలోన ముద్దుపెడితె అమ్మమ్మ కళ్ళ్లోన కవ్వింత మావయ్యో మావయ్య సిగ్గుమొగ్గలేసెను లేవయ్యా లే లే లే లే లే లే సన్నాయి లే లే లే అయ్యయ్యో అయ్యయ్యో సిత్తరాలు చూసాను నీలోన చికుబుకు రైలే జోరుగా వదిలెను పొగలే ఎత్తుపల్లమొస్తే నడకలో ఇక తికమకలే అహా హా ఈ పూట కనివిని ఎరుగని యోగం దొరికే ఈ చోట ఎవ్వరికి అందని స్వర్గం
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. పాట సాహిత్యం
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: యస్. పి. బాలు, ఉదిత్ నారాయణ్, యస్.పి. పల్లవి అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే.. అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై.. చిన్న మొటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం ఓర చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే... సానిసా సారిగారి సానిసానిసాని సానిసా సాగమామపమాగారీస సానిసా సారిగారినీ సానిపానిసానిసా సాగమమమ మాప మాగరీస అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో.. పిచ్చిరాతలైన కవితలవునులే ప్రేమకెపుడు మనసులోన భేదముండదే... ఎంగిలైన అమృతమ్ములే.. బోండుమల్లి ఒక్క రూపాయి.. నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు పీచు మిఠాయ్ అర్దరూపాయి.. నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్షరుపాయలు ఉహు..ఉహు...ఉం..ఉం..ఉహు..ఉమ్మ్.. అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే.. అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై.. చిన్న మొటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం... ఓర చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే... ప్రేమ ఎపుడు ముహుర్తాలు చుసుకోదులే.. రాహుకాలం కూడా కలిసి వచ్చులే ప్రేమ కొరకు హంస రాయబారమేలనే.. కాకి చేత కూడా కబురు చాలులే ప్రేమ జ్యోతి ఆరిపోదే.. ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదే ఇది నమ్మరానిది కానెకాదే.. ఈ సత్యం ఊరికీ తెలియలేదే ఆకసం భూమి మారినా మారులే.. కానీ ప్రేమ నిత్యమే ఆది జంట పాడిన పాటలే.. ఇంకా వినిపించులే ప్రేమ తప్పు మాటని... ఎవ్వరైన చెప్పినా నువ్వు బదులు చెప్పు మనసుతో.. ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు అందరూ నువ్వు వెళ్ళు నిర్భయంగా..
ఓ చెలియా..నా ప్రియ సఖియా.. పాట సాహిత్యం
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: ఉన్నికృష్ణన్ ఓ చెలియా..నా ప్రియ సఖియా.. చెయ్ జారెను నా మనసే.. ఏ చోటా అది జారినదో ఆ జాడే మరిచితినే... నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే...ఏ.. ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే..ఏ.. నా గుండెలలో ప్రేమ పరవశమై.. ఇరు కన్నులు సోలెనులే..ఏ.. ఓ చెలియా.. నా ప్రియ సఖియా.. చెయ్ జారెను నా మనసే... ఈ పూటా.. చెలి నా మాటా.. ఇక కరువై పోయెనులే అధరము ఉదరము నడుమున ఏదో అలజడి రేగెనులే... వీక్షణలో.. నిరీక్షణలో.. అర క్షణ మొక యుగమేలే చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయెనులే... ఇది స్వర్గమా..నరకమా...ఏమిటో తెలియదులే ఈ జీవికీ...జీవనమరణమూ...నీ చెతిలో ఉన్నదిలే..ఏ..ఏ... ఓ చెలియా.. నా ప్రియ సఖియా.. చెయ్ జారెను నా మనసే కోకిలమ్మా నువు సై అంటే...నే పాడెను సరిగమలే గోపురమా నిను చేరుకుని...సవరించేను నీ కురులే..ఏ.. వెన్నెలమ్మా నీకు జోల పాడీ...కాలి మెటికలు విరిచేనే..ఏ.. వీచేటి చలిగాలులకు తెరచాపై నిలిచేనే...ఏ.. నా ఆశలా..ఊసులే..చెవిలోన చెబుతానే... నీ అడుగులా ..చెరగని గురుతులే ..ప్రేమ చరితను అంటానే ఓ చెలియా.. నా ప్రియ సఖియా.. చెయ్ జారెను నా మనసే...
ముక్కాబులా చుక్కానిలా పాట సాహిత్యం
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: మనో, స్వర్ణలత ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా లవ్వుకి కాపలా పరువాల తుపాకులా శృంగార వీరుల సింధూర పువ్వులా మత్తుజల్లే మంచు వెన్నెలా ఓలేలో ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా జురాసిక్ పార్కులోన సరదాగ జోడీలే క్లాస్ మ్యూజిక్ నేడే పాడేను పికాసొ చిత్రం నన్ను వెంటాడే చిత్రంగ టెక్సాస్లో నాతో ఆడెను కౌబాయి కన్ను కొడితే ప్లేబాయి చెయ్యేపడితే ఒళ్లంతా సెక్సయ్యింది గుండెల్లో ఫిక్సయ్యింది పాప్ మ్యూజిక్ ధ్రిల్లయ్యేను స్టార్ బేబీ కళ్లయ్యేను లవ్ స్టారై ఊరించేను పిచ్చెక్కి ఊగించేను మన ప్రేమ గీతమే ప్రతినోట పలకాలా ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా తుపాకి లోడు చేసి గురిపెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా తిమింగలాలు పట్టే వలతెచ్చినేసిన ఆ నింగి చుక్కలు చిక్కేనా భూకంపం వస్తే ఏంటి భూగోళం పోతే ఏంటి ఆకాశం విడిపోతుందా ఏవైనా రెండువుతుందా రావే నా రాజహంస రతనాల మణిపూస జింకల్లే చిందులెయ్యి సందేల విందుచెయ్యి సంతోష మెన్నడూ సాగరమై సాగాల ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా
గాలి తరగలపై పాట సాహిత్యం
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: సుజాత మోహన్ గాలి తరగలపై
అలలా వాలే వాన వరద వాలే పాట సాహిత్యం
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: సుజాత మోహన్, సునంద, కళ్యాణి మీనన్, మిన్ మిని అలలా వాలే వాన వరద వాలే
ముట్టుకుంటే కందిపోయే పాట సాహిత్యం
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: పి.జయచంద్రన్ ముట్టుకుంటే కందిపోయే