Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Rangam (2011)



చిత్రం: రంగం (2011)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: వనమాలి
గానం: అలాప్ రాజు
నటీనటులు: జీవా, కార్తీక నయర్
దర్శకత్వం: కె.వి.ఆనంద్
నిర్మాత: జయరామన్
విడుదల తేది: 13.05.2011

ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే
పిచ్చి పరుగులు తీసే, వెల్లివిరిసెను వయసే
ఎందుకో ఏమో గుండె దరువులు వేసే
కొంటె తలపులు తోచే, పొంగి పొరలెను ఆశే
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రేపో దరి కనని దరి కనని తీరం
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రోజూ తడబడుతు వెలిగే ఈ ఉదయం

ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే
చెలి దూరమయ్యె వరసే, రేయి కలలుగా విరిసే
ఎందుకో ఏమో రెక్కలెదలకు మొలిచే
చిన్ని గుండెనేదో తొలిచే, ఒంటరిగ నను విడిచే
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రేపో దరి కనని దరి కనని తీరం... ఏమో
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రోజూ తడబడుతు వెలిగే ఉదయం
నువ్వు నేను ఒక యంత్రమ కాలం నడిపే ఓ మహిమా ప్రేమా

ముద్దులిడిన ఊపిరి సెగలు తగిలి రగిలి చెడిపోతున్నా
చెంత నువ్వు నిలబడగానే నిన్ను విడిచి పరిగెడుతున్నా
సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే
అలా నన్ను రమ్మన్నావా అల్లాడి పోతానే
నవ్వుల్తో చంపే మాయే చాల్లే

ఏమో తుళ్ళి తిరిగెను మనసే
పిచ్చి పరుగులు తీసే, వెల్లివిరిసెను వయసే
ఎందుకో ఏమో గుండె దరువులు వేసే
కొంటె తలపులు తోచే, పొంగి పొరలెను ఆశే
నువ్వు నేను ఒక యంత్రమ కాలం నడిపే ఓ మహిమా ప్రేమా

లెట్స్ గో వావ్ వావ్... తూనీగల్లే తెలుగమ్మాయి ఎందుకో ఏమో
దే లుక్ అండ్ సో మరువనన్నది నా మది మరి మరి
నీ మనసే లవ్లీ చెప్పకనే చెప్పెను ప్రేమ ఇద్దరి చూపులే వంతెన
ప్లేయ్డ్ లుక్ లైక్ ఎ సింగల సింగల నాటి లుక్ లిచ్చే ఈ వేళా
ప్లేయ్డ్ లుక్ లైక్ ఎ సింగల సింగల నన్ను చుట్టు ముట్టే వెన్నెలా
ప్లేయ్డ్ లుక్ లైక్ ఎ సింగల సింగల నాటి లుక్ లిచ్చే ఈ వేళా
ప్లేయ్డ్ లుక్ లైక్ ఎ సింగల సింగల నన్ను చుట్టు ముట్టే వెన్నెలా


నిలవనీక నిను తెగ వెతికే కనులకిన్ని తపనలు ఏంటో
ఎన్ని సడులు వినపడుతున్నా వీడిపోదు నీ పలుకేంటో
కలల్లోన నిన్నే కనగా కన్నుల్నే పొందాను
కలే కల్లలయ్యే వేళ కన్నీరై పోతాను

నీడనే దోచే పాపే నేను
ఏమో తుళ్ళి తిరిగెను మనసే
పిచ్చి పరుగులు తీసే, వెల్లివిరిసెను వయసే
ఒహో... ఏమో గుండె దరువులు వేసే అల్ రైట్
కొంటె తలపులు తోచే, పొంగి పొరలెను ఆశే

ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రేపో దరి కనని దరి కనని తీరం... ఏమో
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రోజూ తడబడుతు వెలిగే ఈ ఉదయం... ఏమో

ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రేపో దరి కనని దరి కనని తీరం... ఏమో
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రోజూ తడబడుతు వెలిగే ఈ ఉదయం... ఏమో


**********   *********  *********


చిత్రం: రంగం (2011)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: వనమాలి
గానం: ఉన్నికృష్ణన్ , శ్వేతమోహన్

నెమలి కుళుకుల కలికి వ్యాలి నను కవ్విస్తున్నదే
నడుము సొగసే నను గిల్లి కసి పెంచేస్తున్నదే
కొలంబస్ ఎరుగని ఓ దేశం నను రమ్మంటున్నదే
కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే
రోజా పూలు.. ఆ ముళ్ళ చాటులో విరబూసే
తేనా ముళ్ళు.. ఈ లేత పువ్వులా విరిసే
మళ్ళీ మళ్ళీ.. నిను చూడమంటు కనులడిగే
గుండె ఇవ్వాళ పొంగేటి ప్రేమ గోదారై పొంగే
నెమలి కుళుకుల కలికి వ్యాలి నను కవ్విస్తున్నదే
నడుము సొగసే నను గిల్లి కసి పెంచేస్తున్నదే
కొలంబస్ ఎరుగని ఓ దేశం నను రమ్మంటున్నదే
కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే

పాదం నీ వైపున్నా మది పంపదు అటు కాస్తైనా
నా ప్రేమకు తికమక తగునా ఈ నిమిషానా
బావుల దరిలో ఉన్నా జడివానలు ముంచేస్తున్నా
నిను చూడని ఏ క్షణమైనా ఎండమావేనా
హే గువ్వా గువ్వ గువ్వ గువ్వా పసి గువ్వా
హే నువ్వా నువ్వ నువ్వ నువ్వా ప్రతి దోవా
ఓ.. నిరంతరం హుషారుగా తోచే
ప్రతి కలా నిజాలుగా వేచే
అటూ ఇటూ షికారులే చేసే నా మనసే
ఓ.. నిను నను ముడేసినా ఆశే
పదే పదే వయస్సునే పిలిచే
ఇవ్వాళ నా ప్రపంచమే మార్చే నీ వరసే
నెమలి కుళుకుల కలికి వ్యాలి నను కవ్విస్తున్నదే
నడుము సొగసే నను గిల్లి కసి పెంచేస్తున్నదే
కొలంబస్ ఎరుగని ఓ దేశం నను రమ్మంటున్నదే
కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే

కాలికి మువ్వల గొలుసు ఆ స్వరములు నేలకు తెలుసు
ఆ సడి విని వర్ణించేయినా నీ ప్రతి సొగసు
జాబిలి నింగిని విడిచి హరి విల్లులు నాతో నడిచే
నువు నా జతలో నిలుచుంటే అవి నాకలుసే
హే పువ్వా పువ్వ పువ్వ పువ్వా సిగ పువ్వా
హే మువ్వా మువ్వ మువ్వ మువ్వా సిరి మువ్వా
ఏ.. అలుండని సముద్రమే నేను
తపించని తనువిక చేదు
తపించిన క్షణం ఇక రాదు రా రాదు
సరేనని వరించని పొద్దు
సుఖాలతో విధించకే హద్దు
ప్రతీక్షణం పంచేసుకో నాతో నీ ముద్దు

నెమలి కుళుకుల కలికి వ్యాలి నను కవ్విస్తున్నదే
నడుము సొగసే నను గిల్లి కసి పెంచేస్తున్నదే
కొలంబస్ ఎరుగని ఓ దేశం నను రమ్మంటున్నదే
కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే
రోజ పూలు.. ఆ ముళ్ళ చాటులో విరబూసే
తేనా ముళ్ళు.. ఈ లేత పువ్వులా విరిసే
మళ్ళీ మళ్ళీ.. నిను చూడమంటు కనులడిగే
గుండె ఇవ్వాళ పొంగేటి ప్రేమ గోదారై పొంగే
నెమలి కుళుకుల కలికి గాలి నను కవ్విస్తున్నదే
నడుము సొగసే నను గిల్లి కసి పెంచేస్తున్నదే
కొలంబస్ ఎరుగని ఓ దేశం నను రమ్మంటున్నదే
కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే


**********   *********  *********


చిత్రం: రంగం (2011)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: వనమాలి
గానం: శ్రీరామ్ పార్థసారథి, బొంబే జయశ్రీ

ఈ మంచుల్లో ప్రేమంచుల్లో ఎన్నెన్నో సంగతులు
నీరెండల్లో ఈ గుండెల్లో ఎన్నెన్నో సందడులు
కవ్వించే చీకటి కన్నుల్లో ఈ తడి ఇవ్వాళే వీడెనులే
ఉండుండి ఊహలు ఈ పిల్లగాలులు నిన్నే పిలిచెనులే

చరణం: 1
కనులకు జతగా వలపుల కథనే కలలుగ కొసరనా
గలగల పలికే పెదవుల కొస నే కబురునై నిలవనా
నేడిలా మది విరిసెను ప్రేమలో
తేనెలే పెదవొలికెను జంటలో కలయికలో

చరణం: 2
మలుపులు దాటి మనసులు మీటి నిలిచె నీ మమత లే
ఒకపరి జననం ఒకపరి మరణం నిలువునా తొలిచెలే
యవ్వనం మనసుకు తొలి మోహనం
చుంబనం వయసుకు ఒక వాయనం... అనుదినము

Most Recent

Default