చిత్రం: రౌడీఅల్లుడు (1991) సంగీతం: బప్పీలహరి నటీనటులు: చిరంజీవి, శోభన, దివ్యభారతి దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు నిర్మాత: డా౹౹. కె. వెంకటేశ్వర రావు విడుదల తేది: 18.10.1991
Songs List:
అమలాపురం బుల్లోడా పాట సాహిత్యం
చిత్రం: రౌడీ అల్లుడు (1991) సంగీతం: బప్పిలహరి సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి.బాలు, చిత్ర పల్లవి: బుమ్బాయే బుమ్బా బుమ్బాయే బుమ్బా బుమ్బాయే బుమ్బా బుమ్బాయే బుమ్బా బుమ్బాయే బుమ్బా బుమ్బాయే బుమ్బా బోలో బోలో బోలో రాణి క్యా చాహియే అరె ప్యార్ చాహియే యా పైసా చాహియే నీ బాసా నాకు తెల్డం లేదు తెలుగు తెలిసితే సెప్పు ఏ ఊరు మంది? అనకాపిల్లి నీ ఊరు ఏటి? అమలాపురం ఇక చూసుకో అనకాపల్లి బుల్లెమ్మా నీకేటి కావాలా స్వీట్ కావాలా పచ్చ నోటు కావాలా పైట పడితే సైట్ కొడితే పండు వెన్నెల్లో ఆట సాగాలా బాక్స్ మోత మోగాలా అమలాపురం బుల్లోడా నీ బొంబాయి చూడాలా బాక్స్ లేవో మోత లేవో నాకు తెల్దంట కొత్తగొచ్చానోయ్ ఊరు చుట్టి చూడాలా చరణం: 1 చల్ రే రాణి చేయవే బోణి స్టార్ట్ చేద్దాం విహారం తొంగి చూసే పొంగులన్నీ లొంగ దీసే యవ్వారం పల్లె దాటి ఫస్ట్ టైము బయటకి ఒచ్చావువయ్యో తల్లి చాట్టు పిల్లదాని లోకమే తెలవదయ్యో చెప్పిన మాట చప్పున వింటే చీర కొనిపెడతా బండి ఎక్కిస్తా చర్చి గేటు చూపిస్తా గేటు చూపి నీట ముంచే మాటలు ఎందుకురో అనకాపల్లి బుల్లెమ్మా ఇంకేమిటి కావాలా అమలాపురం బుల్లోడా నీ బొంబాయి చూడాలా చరణం: 2 అరె జానీ కోయి లడ్కి కో ఆతే హువా దేఖా నహి యహా తో కోయి నహి ఆయా ఓ కిలాడీ మాయలేడి ప్లేట్ మారిస్తే బెస్టు నంగనాచి పోజులిస్తే టైట్ చేస్తా నీ నట్టు ఎర్ర ఖాకి చూస్తే చాలు ఎందుకో సిగ్గు ఒట్టు అందుకే నే పారిపోయా ఆపు నీ జుట్టు పట్టు చూసాలే నీ చిన్నలన్ని రౌడీ రంగమ్మో అరె అరె నిన్ను తలదన్నే A1కేడి నేనమ్మో నీది నాది ఒకటే భాష చూడు బావయ్యో అనకాపల్లి బుల్లెమ్మా ఇంకేమి విననమ్మో అమలాపురం బుల్లోడా ఉహుం ఉహుం
చిలుకా క్షేమమా పాట సాహిత్యం
చిత్రం: రౌడీఅల్లుడు (1991) సంగీతం: బప్పీలహరి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్. పి.బాలు, చిత్ర పల్లవి: చిలుకా క్షేమమా కులుకా కుశలమా చిలుకా క్షేమమా కులుకా కుశలమా తెలుపుమా... ఆ... ఆ... ఆ... ఆ... సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా పలుకుమా... ఆ... ఆ... ఆ... ఆ... చరణం: 1 నడిచే నాట్యమా నడుము నిదానమా పరువపు పత్యమా ప్రాయం పదిలమా నడిపే నేస్తమా నిలకడ నేర్పుమా తడిమే నేత్రమా నిద్దుర భద్రమా ప్రియతమా... ఆ... ఆ... ఆ... ఆ... చిలుకా క్షేమమా కులుకా కుశలమా సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా తెలుపుమా... ఆ... ఆ... ఆ... ఆ... చరణం: 2 పిలిచా పాదుషా పరిచా మిసమిస పెదవుల లాలస పలికే గుసగుస తిరిగా నీ దశ అవ్వనా బానిసా తాగా నీ నిషా నువు నా తొలి ఉషా ప్రియతమా... ఆ... ఆ... ఆ... ఆ... సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా చిలుకా క్షేమమా కులుకా కుశలమా పలుకుమా... ఆ... ఆ... ఆ... ఆ...
కోరి కోరి కాలుతోంది పాట సాహిత్యం
చిత్రం: రౌడీ అల్లుడు (1991) సంగీతం: బప్పిలహరి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, చిత్ర పల్లవి: కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో చరణం: 1 ప ని స గ స ని సా స గ మ ప మ గ మా కాగుతున్న కోరికంత కాగడాగ మారని కంటపడని కైపుకథల సంగతేదొ చూడని కౌగిలిలో నలిపి నలిపి చుక్కలనోడించని రాలుతున్న మల్లెలు గా పక్కపైన దించని గాజుల గలగలలు... విరజాజుల విలవిలలు కందిపోయి కాలమాగనీ... కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో... కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో చరణం: 2 ప ని ప ని సా ప ని ప ని సా స గ స గ మా స గ స గ మా కునుకేదీ కనపడదేం ఏమైందో ఏమో లోకాలను జోకొట్టే పనిలో ఉందేమో కొంగు విడిచిపెట్టని నా సిగ్గెటుపొయిందో జతపురుషుని చేరేందుకు సిగ్గుపడిందేమో ఊపిరి ఉప్పెనలో తొలిమత్తుల నిప్పులలో చందమామ నిదర చెదరని..హా... కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో
లవ్ మీ మై హీరో... పాట సాహిత్యం
చిత్రం: రౌడీ అల్లుడు (1991) సంగీతం: బప్పిలహరి సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి.బాలు, చిత్ర పల్లవి: లవ్ మీ మై హీరో... మజాగా ముద్దిస్తా రారో ఖుషీగా కౌగిట్లో మారో ఓకే మై లేడి అలాగే కానీ అమ్మాడి చలో చూసేస్తా నీ వేడి తనువే బహుమానం... ముదిరే చలికాలం లవ్ మీ మై హీరో... మజాగా ముద్దిస్తా రారో ఖుషీగా కౌగిట్లో మారో... అరె ఓకే మై లేడి... అలాగే కానీ అమ్మాడి చలో చూసేస్తా నీ వేడీ... చరణం: 1 హో...ఒకటో ముద్దు వయస్సుకిచ్చేశా రెండో ముద్దు రౌండ్ అప్ చేసేసా మూడో ముద్దు మరింత లాగించేయ్ నాలుగో ముద్దు నిషాను చూపించెయ్ పనిలో పని పదవే మరి ప్రాక్టీసు మొదలెడదాం లవ్ మీ మై హీరో మజాగా ముద్దిస్తా రారో ఖుషీగా కౌగిట్లో మారో... చరణం: 2 ఐదో ముద్దు ఇక్కడ పెట్టాలి ఆరో ముద్దు అక్కడ తీర్చాలి ఏడో ముద్దు ఏదో ఇమ్మంటే ఎనిమిదో ముద్దు ఇచ్చేదిస్తుంటే లెక్కెందుకు పద ముందుకు ముద్దుల్లో ముంచేందుకు ఓకే మై లేడి... అలాగే కానీ అమ్మాడి చలో చూసేస్తా నీ వేడి లవ్ మీ మై హీరో... మజాగా ముద్దిస్తా రారో ఖుషీగా కౌగిట్లో మారో ముదిరే చలికాలం... తనువే బహుమానం
ప్రేమా గీమా తస్సాదియ్యా పాట సాహిత్యం
చిత్రం: రౌడీ అల్లుడు (1991) సంగీతం: బప్పిలహరి సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి.బాలు, చిత్ర పల్లవి: ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే జోరు జరా చూడు బుల్లెమ్మా కుకు కు కూ... కుకు కు కూ... ప్రేమ గీమ తస్సాదియ్యా పక్కన పెట్టు వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు ఏం పట్టు బాపురే ఔనంటే కిరికిరే కొల్లగొట్టి పోకు ఖజానా కుకు కు కూ... కుకు కు కూ... చరణం: 1 వహ్‌వా బేబి వెదరు బాగుందే ఏదో మూడు ముదిరిపోయిందే అయ్యో రయ్యో వరస మారిందే అబ్బాయి గారి పొగరు హెచ్చిందే అరెరెరె నాటో నీటో ఎంచుకుందామా ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుందామా ఇహ ఓపలేను వదులు బుల్లోడా I love you... you love me I kiss you... you kiss me ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే జోరు జరా చూడు బుల్లెమ్మా కుకు కు కూ... చరణం: 2 అంతో ఇంతో దూరముండాల అమ్మా నాన్నా సిగ్నల్ ఇవ్వాల ఎంతో కొంత లాభముండాలే కొద్దో గొప్పో చిత్తగించాలే అరెరే డేటు టైము ఫిక్స్ చేయమంట -ఓకే అపుడు మనకే రిస్కు లేదంట అరె బాత్ నహీ సాత్ చలో నా..చలో చలో I love you... you love me... OK baby I kiss you... you kiss me ప్రేమా గీమా తస్సాదియ్య పక్కన పెట్టు వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే జోరు జరా చూడు బుల్లెమ్మా కుకురు కు కూ... హే ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు ఏం పట్టు బాపురే ఔనంటే కిరికిరే కొల్లగొట్టి పోకు ఖజానా న న న నా... కుకు కు కూ... కుకురు కు కూ... కుకురు కు కూ... కుకురు కు కూ...
స్లోలీ స్లోలీ పాట సాహిత్యం
చిత్రం: రౌడీ అల్లుడు (1991) సంగీతం: బప్పిలహరి సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి.బాలు, చిత్ర స్లోలీ స్లోలీ
తధ్ధినక తప్పదిక పాట సాహిత్యం
చిత్రం: రౌడీ అల్లుడు (1991) సంగీతం: బప్పిలహరి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, చిత్ర పల్లవి: తధ్ధినక తప్పదిక ధీంతనక తగ్గదిక దబాయించేసిందే దుంపదెగా జబ్బలరైకా నిబాయించేదెట్టా నిప్పుసెగా నివ్వెరపోగా తధ్ధినక తప్పదిక ధీంతనక తగ్గదిక చరణం: 1 కోకా కో అన్నాకా కాదంటుందా కైపెక్కే కదలికా కునుకే కొండెక్కాక కూచోనిస్తుందా కుదురంటూ కుదరకా హోయ్ కేకా కవ్వించాక కంగారేగా కౌగిల్లో కరగగా కసిగా కబురంపాక కంచె తెంచేయదా కొరికేసె కోరికా చలువతో.. కలవగా.. కలబడదా.. కొంటెగా..... తధ్ధినక తప్పదిక ధీంతనక తగ్గదిక దబాయించేసిందే దుంపదెగా జబ్బలరైకా నిబాయించేదెట్టా నిప్పుసెగా నివ్వెరపోగా తధ్ధినక తప్పదిక ధీంతనక తగ్గదిక చరణం: 2 చక్క చెంప చిక్క చూపొచ్చిందే సొంపంతా చిదమగా సోకే సొక్కి పోగా నొక్కిపోతుందే నాజుగ్గా నిమరకా చుక్కా నువ్వించక్కా చూపించాక కౌగించే కబళికా ఇంకా నిలవలేకా రాడా నెలవంకా ఇలవంకా చక చకా చొరవగా.. కొరివిగా.. జతపడగా.. జోరుగా...... తధ్ధినక తప్పదిక ధీంతనక తగ్గదిక దబాయించేసిందే దుంపదెగా జబ్బలరైకా నిబాయించేదెట్టా నిప్పుసెగా నివ్వెరపోగా తధ్ధినక తప్పదిక ధీంతనక తగ్గదిక