చిత్రం: సప్తపది (1981) సంగీతం: కె.వి.మహదేవన్ నటీనటులు: జె.వి.సోమయాజులు, సబితా బమిడిపాటి, గిరీష్ దర్శకత్వం: కె.విశ్వనాథ్ నిర్మాత: భీమవరపు బుచ్చిరెడ్డి విడుదల తేది: 26.06.1981
Songs List:
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాట సాహిత్యం
చిత్రం: సప్తపది (1981) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ చరణం: 1 శుభగాత్రి గిరిరాజపుత్రీ అభినేత్రి శర్వార్థగాత్రి శుభగాత్రి గిరిరాజపుత్రీ అభినేత్రి శర్వార్థగాత్రి సర్వార్థసంధాత్రి జగదేకజనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి సర్వార్థసంధాత్రి జగదేకజనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్దశాంతర భువనపాలిని కుంకుమరాగ శోభిని కుసుమబాణ సంశోభిని మౌనసుహాసిని గానవినోదిని భగవతీ పార్వతీ దేవీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ చరణం: 2 శ్రీహరి ప్రణయాంబు రాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి శ్రీహరి ప్రణయాంబు రాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి శ్రీపీఠ సంవర్ధిని డోలాసుర మర్ధిని శ్రీపీఠ సంవర్ధిని డోలాసుర మర్ధిని ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి సకలభోగ సౌభాగ్య లక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ చరణం: 3 ఇందువదనే కుందరదనే వీణా పుస్తక ధారిణే ఇందువదనే కుందరదనే వీణా పుస్తక ధారిణే శుకశౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే శుకశౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే సరససాహిత్య స్వరససంగీత స్తనయుగళే సరససాహిత్య స్వరససంగీత స్తనయుగళే వరదే అక్షరరూపిణే శారదే దేవీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ చరణం: 4 వింధ్యాతటీ వాసినే యోగసంధ్యా సముద్భాసినే సింహాసనస్థాయినే దుష్టహరరంహక్రియాశాలినే విష్ణుప్రియే సర్వలోకప్రియే శర్వనామప్రియే ధర్మసమరప్రియే హే బ్రహ్మచారిణే దుష్కర్మవారిణే హే విలంబితకేశపాశినే మహిషమర్ధనశీల మహితగర్జనలోల భయజనర్తనకేళికే కాళికే దుర్గమాగమ దుర్గ పాహినే.. దుర్గే దేవి
అయిగిరి నందిని పాట సాహిత్యం
చిత్రం: సప్తపది (1981) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: ఆది శంకరాచార్య గానం: యస్. పి.బాలు అయిగిరి నందిని
భామనే సత్య భామనే పాట సాహిత్యం
చిత్రం: సప్తపది (1981) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్. జానకి భామనే సత్య భామనే
గోవుల్లు తెల్లన పాట సాహిత్యం
చిత్రం: సప్తపది (1981) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్. జానకి గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన చరణం: 1 తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా..ఎందుకుండవ్ కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా.. ఏమో తెల్లావు కడుపుల్లో కర్రావులుండవాకర్రావు కడుపున ఎర్రావు పుట్టదా గోపయ్య ఆడున్నా గోపెమ్మ ఈడున్నా గోధూళి కుంకుమై గోపెమ్మకంటదా ఆ పొద్దు పొడిచేనా.. ఈ పొద్దు గడిచేనా.. ఎందువలనా అంటే అందువలన ఎందువలనా అంటే దైవఘటన గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన చరణం: 2 పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు.. పాపం అల్లన మోవికి తాకితే గేయాలు.. హా హా హ పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలుఅల్లన మోవికి తాకితే గేయాలు ఆ మురళి మూగైనా ఆ పెదవి మోడైనా ఆ గుండెగొంతులో ఈ పాట నిండదా ఈ కడిమి పూసేనా.. ఆ కలిమి చూసేనా.. ఎందువలనా అంటే అందువలన ఎందువలనా అంటే దైవఘటన గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన
మరుగేలరా ఓ రాఘవా పాట సాహిత్యం
చిత్రం: సప్తపది (1981) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: త్యాగరాజ గానం: యస్. జానకి మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేల చరాచరరూప పరాత్పర సూర్య సుధాకర లోచనా మరుగేల చరాచరరూప పరాత్పర సూర్య సుధాకర లోచనా మరుగేలరా ఓ రాఘవా చరణం: 1 అన్ని నీవనుచు అంతరంగమునా అన్ని నీవనుచు అంతరంగమునా తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా అన్ని నీవనుచు అంతరంగమునా తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా నిన్నెగాని మదినీ ఎన్నజాలనురులా నిన్నెగాని మదీనెన్నజాలనురుల నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుతా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా
నెమలికి నేర్పిన నడకలివీ పాట సాహిత్యం
చిత్రం: సప్తపది (1981) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్. జానకి నెమలికి నేర్పిన నడకలివీ మురళికి అందని పలుకులివీ శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్య లీలా నెమలికి నేర్పిన నడకలివీ మురళికి అందని పలుకులివీ శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్య లీలా నెమలికి నేర్పిన నెమలికి నేర్పిన నడకలివీ కలహంసలకిచ్చిన పదగతులు ఇల కోయిల మెచ్చిన స్వరజతులు కలహంసలకిచ్చిన పదగతులూ ఇల కోయిల మెచ్చిన స్వరజతులూ ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు ఏవేవో కన్నుల కిన్నెరలు ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు ఏవేవో కన్నుల కిన్నెరలు కలిసి మెలిసి కలలు విరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పన వల్ప శిల్ప మనిమేఖలను శకుంతలను నెమలికి నేర్పిన నడకలివీ చిరునవ్వులు అభినవ మల్లికలు సిరిమువ్వలు అభినయ గీతికలు చిరునవ్వులు అభినవ మల్లికలు సిరిమువ్వలు అభినయ గీతికలు నీలాల కన్నుల్లో తారకలు తారాడె చూపుల్లో చంద్రికలు నీలాల కన్నుల్లో తారకలు తారాడె చూపుల్లో చంద్రికలు కురులు విరిసి మరులు కురిసి మురిసిన రవి వర్మ చిత్ర లేఖనా లేఖ సరస సౌందర్య రేఖను శశిరేఖను నెమలికి నేర్పిన నడకలివీ మురళికి అందని పలుకులివీ శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్య లీలా నెమలికి నేర్పిన నడకలివీ
ఓం జాతవేదసే (శ్రీ దుర్గ సూక్తం) పాట సాహిత్యం
చిత్రం: సప్తపది (1981) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: గానం: యస్.పి.బాలు, యస్.జానకి ఓం జాతవేదసే (శ్రీ దుర్గ సూక్తం)
వ్రేపల్లియ ఎద పాట సాహిత్యం
చిత్రం: సప్తపది (1981) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి నవరస మురళీ ఆ నందన మురళీ ఇదేనా ఇదేనా ఆ మురళి మోహనమురళి ఇదేనా ఆ మురళి వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి నవరస మురళీ ఆ నందన మురళీ ఇదేనా ఇదేనా ఆ మురళి మోహనమురళి ఇదేనా ఆ మురళి చరణం: 1 కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాల మా బాలగోపాలుని కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాల మా బాలగోపాలుని అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ తాండవమాడిన సరళి గుండెల మోగిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి చరణం: 2 అనగల రాగమై తొలుత వీనులలరించి అనలేని రాగమై మరలా వినిపించి మరులే కొలిపించి అనగల రాగమై తొలుత వీనులలరించి అనలేని రాగమై మరలా వినిపించి మరులే కొలిపించి జీవనరాగమై బృందావనగీతమై జీవనరాగమై బృందావనగీతమై కన్నెల కన్నుల కలువల వెన్నలు దోచిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి వేణుగానలోలుని మురిపించిన రవళి నటనలసరళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మువ్వల మురళి ఇదేనా ఆ మురళి చరణం: 3 మధురానగరిలో యమునాలహరిలో ఆ రాధ ఆరాధనా గీతి పలికించి మధురానగరిలో యమునాలహరిలో ఆ రాధ ఆరాధనా గీతి పలికించి సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై సంగీత నాట్యాల సంగమసుఖవేణువై రాసలీలకే ఊపిరి పోసిన అందెలరవళి ఇదేనా ఇదేనా ఆ మురళి వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి నవరస మురళీ ఆ నందన మురళీ ఇదేనా ఇదేనా ఆ మురళి మోహనమురళి ఇదేనా ఆ మురళి
ఏ కులము నీదంటే పాట సాహిత్యం
చిత్రం: సప్తపది (1981) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.ఓయ్.బాలు, యస్. జానకి ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది చరణం: 1 ఏడు వర్ణాలు కలసి ఇంద్రధనసు అవుతాది అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరము ఉంటాది ఏడు వర్ణాలు కలసి ఇంద్రధనసు అవుతాది అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరము ఉంటాది ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది చరణం: 2 ఆది నుంచి ఆకాశం మూగది అనాదిగా తల్లి ధరణి మూగది ఆది నుంచి ఆకాశం మూగది అనాదిగా తల్లి ధరణి మూగది నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు ఈ నడమంత్రపు మనుషులకే మాటలు.. ఇన్ని మాటలు ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది