చిత్రం: సర్దార్ పాపారాయుడు (1980) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: యన్.టి.రామారావు, మోహన్ బాబు, శ్రీదేవి దర్శకత్వం: దాసరి నారాయణరావు నిర్మాత: క్రాంతికుమార్ విడుదల తేది: 30.10.1980
Songs List:
హల్లో టెంపర్ పాట సాహిత్యం
చిత్రం: సర్దార్ పాపారాయుడు (1980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: రాజశ్రీ గానం: యస్. పి. బాలు పల్లవి: వోయ్ వోయ్ వోయ్ వోయ్... హల్లో టెంపర్ ఓ విజయా సూపర్ హల్లో టెంపర్ ఓ విజయా సూపర్ పైలా పచ్చీస్ పైలాపచ్చీస్ బుల్లెట్ బండి అర్రే పదిహేడేళ్ళు నిండీ నిండని స్కూటరండీ రాటుదేలి రచ్చకెక్కి ఢీ కొన్నాయండి రాటుదేలి రచ్చకెక్కి ఢీ కొన్నాయండి హల్లో టెంపర్ ఓ విజయా సూపర్ చరణం: 1 ఎండకు కందే సుకుమారుల్లా ఉన్నారు మీరు ముందుకు వెనుక తెలియక నాపై దాడికి వచ్చారు మాట మాట పెరిగితే నే మోటుతనానికి దిగితే అర్రె కర్రో కత్తో విసిరితే మీ కాలో చెయ్యో విరిగితే మీ పెళ్ళి కాస్త గోవిందా గోవిందా మీకు మొగుడే రాడు గోవిందా భజగోవిందా గోవిందా పెళ్ళి కాస్త గోవిందా గోవిందా మీకు మొగుడే రాడు గోవిందా భజగోవిందా అహ హల్లో టెంపర్ ఓ విజయా సూపర్ హల్లో టెంపర్ ఓ విజయా సూపర్ చరణం: 2 ముద్దు ముచ్చట తీరుస్తా ముట్టుకోనీ నిన్నూ పగలే చుక్కలు పొడిపిస్తాలే ముద్దు పెట్టుకోనీ నన్ను కాదని విర్రవీగితే.. కయ్యానికి కాలు దువ్వితే టక్కు నిక్కు చూపితే నాలో తిక్కరేగితే నీ టాపు లేచిపోతుంది గోవిందా నీ షేపు మారిపోతుంది భజగోవిందా గోవిందా గోవిందా టాపు లేచిపోతుంది గోవిందా నీ షేపు మారిపోతుంది గోవిందా భజగోవిందా హల్లో టెంపర్ ఓ విజయా సూపర్ హల్లో టెంపర్ ఓ విజయా సూపర్ పైలా పచ్చీస్ పైలాపచ్చీస్ బుల్లెట్ బండి అర్రే పదిహేడేళ్ళు నిండీ నిండని స్కూటరండీ రాటుదేలి రచ్చకెక్కి ఢీ కొన్నాయండి రాటుదేలి రచ్చకెక్కి ఢీ కొన్నాయండి హల్లో టెంపర్ ఓ విజయా సూపర్ హల్లో టెంపర్ ఓ విజయా సూపర్
తెల్లచీర కళ్ళకాటుక పాట సాహిత్యం
చిత్రం: సర్దార్ పాపారాయుడు (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: దాసరి గానం: ఎస్.పి. బాలు, సుశీల పల్లవి: తెల్లచీర కళ్ళకాటుక ఎర్రబొట్టు తెల్లచీర కళ్ళకాటుక ఎర్రబొట్టు తెల్లచీర కళ్ళకాటుక ఎర్రబొట్టు పెట్టుకొని వచ్చింది క్రిష్ణమ్మా ఏదో కబురు పట్టుకొచ్చింది క్రిష్ణమ్మా ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా మల్లెపూలు పట్టుచీర ఎర్రగాజులు మల్లెపూలు పట్టుచీర ఎర్రగాజులు పట్టుకొని వచ్చాడు కిష్టప్పా మంచి గుబులు మీదున్నాడు కిష్టప్పా ఆ గుబులేమిటయ్య ఈ ఉరుకేమిటయ్య ఆ గుబులేమిటయ్య ఈ ఉరుకేమిటయ్య చరణం: 1 జాంపండు చూస్తే కొరకబుద్ది లేత బుగ్గ చూస్తే నిమరబుద్ధి జాంపండు చూస్తే కొరకబుద్ది లేత బుగ్గ చూస్తే నిమరబుద్ధి జాబిల్లిని చూస్తుంటే చూడబుద్ది ఈ పిల్లను చూస్తుంటే ఆడబుద్ది ఎందుకీ పాడబుద్ది అందుకే తన్నబుద్ది బుద్దిమంచిదే పిల్ల వయసు చెడ్డది వయసు ముదిరితే పిల్ల పెళ్ళి చెడ్డది బుద్దిమంచిదే పిల్ల వయసు చెడ్డది వయసు ముదిరితే పిల్ల పెళ్ళి చెడ్డది మల్లెపూలు పట్టుచీర ఎర్రగాజులు మల్లెపూలు పట్టుచీర ఎర్రగాజులు పట్టుకొని వచ్చాడు కిష్టప్పా మంచి గుబులు మీదున్నాడు కిష్టప్పా ఆ గుబులేమిటయ్య ఈ ఉరుకేమిటయ్య ఆ గుబులేమిటయ్య ఈ ఉరుకేమిటయ్య చరణం: 2 ఆకాశం చూస్తే మబ్బులెయ్య పక్కనున్న దీన్ని చూస్తే చిందులెయ్య హోయ్... హోయ్ ఆకాశం చూస్తే మబ్బులెయ్య హోయ్ పక్కనున్న దీన్ని చూస్తే చిందులెయ్య నీ మాటలన్ని వింటుంటే సిగ్గులెయ్య సిగ్గులన్ని కైపెక్కి మొగ్గలెయ్య ఎందుకీ గోడవలయ్యా పిచ్చి మనసు రామయ్య మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది తెల్లచీర కళ్ళకాటుక ఎర్రబొట్టు తెల్లచీర కళ్ళకాటుక ఎర్రబొట్టు తెల్లచీర కళ్ళకాటుక ఎర్రబొట్టు పెట్టుకొని వచ్చింది క్రిష్ణమ్మా ఏదో కబురు పట్టుకొచ్చింది క్రిష్ణమ్మా ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా
పందొమ్మిదివందల ఎనభై వరకు పాట సాహిత్యం
చిత్రం: సర్దార్ పాపారాయుడు (1980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: దాసరి గానం: సుశీల, ఎస్.పి. బాలు పల్లవి: పందొమ్మిదివందల ఎనభై వరకు ఇట్లాంటి ఒక పిల్ల నా కంటబడలేదు పడినా... నే వెంటపడలేదు ఓ బంగారక్కా చూపే శృంగారక్కా ఓ బంగారక్కా చూపే శృంగారక్కా పందొమ్మిదివందల ఎనభై వరకు ఇట్టాంటి కుర్రోడు నాకంటబడలేదు పడినా... నే వెంటపడలేదు ఓ అందాలయ్యా చూపే దండాలయ్యా ఓ అందాలయ్యా చూపే దండాలయ్యా చరణం: 1 ఆరేళ్ళ ముందు చూస్తే చిన్నపిల్ల పదహారేళ్ళ వయసునాడు కుర్రపిల్ల ఆరేళ్ళ ముందు చూస్తే చిన్నపిల్ల పదహారేళ్ళ వయసునాడు కుర్రపిల్ల ఏడు పెరుగుతుంటే ఈడు పెరుగుతుంది ఈడు పెరుగుతుంటే జోడు కుదురుతుంది ప్రేమకు ఈడెందుకూ? పెళ్ళికి ప్రేమెందుకు? ప్రేమకు పెళ్లితోడు..పెళ్ళికి ప్రేమతోడు అమ్మతోడు అయ్యతోడు నీక ునాకు ఈడుజోడు హోయ్.. హోయ్.. పందొమ్మిదివందల ఎనభై వరకు ఇట్లాంటి ఒక పిల్ల నా కంటబడలేదు పడినా...నే వెంటపడలేదు ఓ అందాలయ్యా చూపే దండాలయ్యా ఓ బంగారక్కా చూపే శృంగారక్కా చరణం: 2 మొదటిసారి చూచినపుడు అగ్గిరాముడు మరి మూడేళ్ల ముందుచూస్తే అడవిరాముడు మొదటిసారి చూచినపుడు అగ్గిరాముడు మరి మూడేళ్ల ముందుచూస్తే అడవిరాముడు ఏడు పెరుగుతుంటే వయసు తరుగుతుంది వయసు తరుగుతుంటే సోకు పెరుగుతుంది మనసుకు సోకెందుకు? వయసుకు మనసెందుకు? మనిషికి మనసు అందం మనసుకు ప్రేమబంధం ఈ అందం ఆ బంధం ఇద్దరిది వివాహబంధం హోయ్! పందొమ్మిదివందల ఎనభై వరకు ఇట్టాంటి కుర్రోడు నాకంటబడలేదు పడినా... నే వెంటపడలేదు ఓ అందాలయ్యా చూపే దండాలయ్యా ఓ అందాలయ్యా చూపే దండాలయ్యా పందొమ్మిదివందల ఎనభై వరకు ఇట్లాంటి ఒక పిల్ల నా కంటబడలేదు పడినా... నే వెంటపడలేదు ఓ బంగారక్కా చూపే శృంగారక్కా ఓ బంగారక్కా చూపే శృంగారక్కా
జ్యోతిలక్ష్మి చీరకట్టింది పాట సాహిత్యం
చిత్రం: సర్దార్ పాపారాయుడు (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: దాసరి గానం: జానకి పల్లవి: నమస్కారమండి ఆయ్ అవునండి అయ్యబాబోయ్ ఆ ఈలలెందుకండి వచ్చేశానుగా మొన్నీ మధ్య మా బావగారబ్బాయి పెళ్ళికి బెజవాడ ఎల్లానండి "వాయించరా సచ్చినోడా ఊపు కావాలి" ఇల్లంటే ఇరుగ్గా ఉంటానని మనోరమ ఓటేల్ కెళ్ళానండి రూము కావాలి అన్నాను డబలా? సింగలా? అన్నాడు డబలే అన్నాను ఏసియా? నాన్ ఏ.సి.యా? అన్నాడు ఏ.సి.యే అన్నాను పేరు అన్నాడు "జ్యోతిలక్ష్మి" అన్నాను అనగానే గబుక్కున చూశాడు గుట్టుక్కున నవ్వాడు గబుక్కున చూశాడు గుట్టుక్కున నవ్వాడు అతుక్కున లేచాడు పుటుక్కున విరిచాడు అతుక్కున లేచాడు పుటుక్కున విరిచాడు గుర్కా రామ్ సింగ్.. ఆపరేటర్ అజిత్సింగ్ కిళ్ళీకొట్టు కిషన్ సింగ్ పేపర్ స్టాల్ ధారాసింగ్ ఒగుర్చుకుంటూ వచ్చారు ఆయాసంతో అరిచారు ఒగుర్చుకుంటూ వచ్చారు ఆయాసంతో అరిచారు ఏమని అరిచారో తెలుసా జ్యోతిలక్ష్మి చీరకట్టింది పాపం చీరకే సిగ్గేసింది జ్యోతిలక్ష్మి చీరకట్టింది పాపం చీరకే సిగ్గేసింది అయ్యో బొట్టుకే భయమేసింది ఊరంతా హోరెత్తింది బొట్టుకే భయమేసింది ఊరంతా హోరెత్తింది అని చెప్పి గోల గోల చేసి చివరికి రూము నెంబరు నూట పదకొండు ఇచ్చాడు తీరా తలుపు తెరిచి చూస్తే చరణం: 1 మంచం పక్కన పగిలిన గాజు ముక్కలు మంచం క్రింద నలిగిన మల్లెమొగ్గలు మంచం మీద మిగిలిన ఆకువక్కలు మంచం మీద చాటున వొలికిన పాల చుక్కలు పాల చుక్కలు కంగారు పడి ఏమిటా అని అడిగాను ఎవరో కొత్తగా పెళ్ళి చేసుకున్న దంపతులు మూడు నిద్దర్లు చేసి వెళ్ళారన్నారు ఆ నిద్దర్లు నాకెప్పుడా అని ఆ మంచం మీదే పడుకున్నాను పడుకోగానే ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మని ఫోన్ డర్ డర్ డర్ మని బెల్లు ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మని ఫోన్ డర్ డర్ డర్ మని బెల్లు ధన్ ధన్ ధన్ మని తలుపు ధన్ ధన్ ధన్ మని తలుపు రా రా రా రమ్మని పిలుపు రా రా రా రమ్మని పిలుపు ఏమిటా అని తలుపు తీశాను తియ్యగానే ఫస్టుఫ్లోరు పాపయ్య రెండో ఫ్లోరు రంగయ్య ఆయ్ మూడోఫ్లోరు ముత్తయ్య లిఫ్ట్ బాయ్ లింగయ్య ఒగుర్చుకుంటూ వచ్చారు ఆయాసంతో అరిచారు ఒగుర్చుకుంటూ వచ్చారు ఆయాసంతో అరిచారు ఏమని? జ్యోతిలక్ష్మి చీరకట్టింది పాపం చీరకే సిగ్గేసింది జ్యోతిలక్ష్మి చీరకట్టింది పాపం చీరకే సిగ్గేసింది అయ్యో బొట్టుకే భయమేసింది ఊరంతా హోరెత్తింది బొట్టుకే భయమేసింది ఊరంతా హోరెత్తింది చరణం: 2 ఆ తరువాత ఎలాగూ మా ఇంటికి వెళ్ళిపోయాను తీరా ఇంటికి వెళితే గుమ్మానికి మామిడి తోరణాలు ఇళ్ళంతా మనుషుల తిరనాళ్ళు గదిలో కొత్తవి ఆభరణాలు గదిలో కొత్తవి ఆభరణాలు చూసి చూడని నవ్వుల బాణాలు కంగారు పడిపోయి అండి ఏమిటా అని అడిగాను ఎవరో నన్ను పెళ్ళి చేసుకోవడానికి పెళ్ళి చూపులకు ఒచ్చానన్నారు అతను చూస్తాడు త్వరగా రమ్మని నన్ను ముస్తాబు చేసి కూర్చోబెట్టారు కూర్చో గానే పెళ్ళికొడుకు తమ్ముడు తమ్ముడుగారి తండ్రి హెయ్ తండ్రిగారి తాత ఆ తాతగారి మనవడు అరుచుకుంటూ లేచారు విరుచుకుంటూ అరిచారు అరుచుకుంటూ లేచారు విరుచుకుంటూ అరిచారు ఏమనో తెలుసా? జ్యోతిలక్ష్మి చీరకట్టింది పాపం చీరకే సిగ్గేసింది అయ్యో జ్యోతిలక్ష్మి చీరకట్టింది పాపం చీరకే సిగ్గేసింది అయ్యో బొట్టుకే భయమేసింది ఊరంతా హోరెత్తింది బొట్టుకే భయమేసింది ఊరంతా హోరెత్తింది అని కోపంగా ఎళ్ళిపోయారు ఆ అందరి కోసం అలా ఉండమంటారా ఇలా చీరకట్టుకోమంటారా
ఉయ్యాలకు వయసొచ్చింది పాట సాహిత్యం
చిత్రం: సర్దార్ పాపారాయుడు (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి. బాలు, పి. సుశీల ఉయ్యాలకు వయసొచ్చింది
బుర్రకథ పాట సాహిత్యం
చిత్రం: సర్దార్ పాపారాయుడు (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: శ్రీ శ్రీ గానం: యస్.పి. బాలు, బెనర్జీ బుర్రకథ