Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Seethakoka Chiluka (1981)




చిత్రం: సీతాకోక చిలక (1981)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: కార్తిక్ ముత్తురామాన్ , అరుణ ముచెర్ల
దర్శకత్వం: పి.భారతీరాజ
నిర్మాణం: పూర్ణోదయ మూవీస్
విడుదల తేది: 14.08.1981



Songs List:



మాటే మంత్రము మనసే బంధము పాట సాహిత్యం

 
చిత్రం: సీతాకోక చిలక (1981)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

ఓం శతమానం భవతి శతాయుుః పురుష 
శతేంద్రియః ఆయుషే వేంద్రియే ప్రతి తిస్టతి

మాటే మంత్రము మనసే బంధము
నీ మమతే నీ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓ మాటే మంత్రము మనసే బంధము
నీ మమతే నీ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓ మాటే మంత్రము మనసే బంధము

చరణం: 1
నీవే నాలో స్పందించినా ఈ ప్రియలయలో శృతికలిసే ప్రాణమిదే
నేనే నీవుగా ఊఁ హుఁ తావిగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో
మాటే మంత్రము మనసే బంధము
నీ మమతే నీ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓ మాటే మంత్రము మనసే బంధము

చరణం: 2
నేనే నీవై ప్రేమించినా ఈ అనురాగం పలికించే పల్లవినే
ఎదలా కోవెలా ఎదుటే దేవతా వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో
మాటే మంత్రము మనసే బంధము
నీ మమతే నీ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓ లాలా లాలలా లాలా లాలలా
ఊహుఁ హుఁ హూ ఊహూ హుఁ హూ



మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: సీతాకోక చిలక (1981)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, వాణిజయరాం

ఆ హా హా హా, ఆ హా హా హా 
ఆ హా హా హా, ఆ హా హా హా 

మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా  
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా  
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
అందమైన రంగవల్లులై ఎండలన్ని పూల జల్లులై ముద్దుకే పొద్దుపొడిచే

మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా  
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా

చరణం: 1
ఓ  చుక్కా నవ్వవే వేగుల చుక్కా నవ్వవే 
కంటి కోలాటాల జంట పేరంటాల
ఓ  చుక్కా నవ్వవే నావకు చుక్కానవ్వవే 
పొందు ఆరాటాల  పొంగు పోరాటాల
మొగ్గ తుంచుకుంటే మొగమాటాలా 
బుగ్గ దాచుకుంటే బులపాఠాలా
దప్పికంటే తీర్చడానికెన్ని తంటాలా

మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా  
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా  
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా

చరణం: 2
ఓ రామచిలకా చిక్కని ప్రేమమొలకా 
గూడు ఏమందమ్మా ఈడు ఏమందమ్మా
ఈడు కున్న గూడు నువ్వే గోరింకా 
తోడుగుండి పోవే కంటి నీరింకా
పువ్వునుంచి నవ్వును తుంచ లేరులే ఇంకా

మిన్నేటి సూరీడు -  లల లల
మిన్నేటి సూరీడు - లల లల లల లల

మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా  
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
అందమైన రంగవల్లులై ఎండలన్ని పూల జల్లులై ముద్దుకే పొద్దుపొడిచే
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా  
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా




సాగరసంగమమే (Duet) పాట సాహిత్యం

 

చిత్రం: సీతాకోక చిలక (1981)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

సాగరసంగమమే, ప్రణయ సాగరసంగమమే




సాగరసంగమమే (Solo) పాట సాహిత్యం

 
చిత్రం: సీతాకోక చిలక (1981)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, వాణీజయరాం

సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే
కలలే అలలై ఎగసిన కడలికి
కలలే అలలై ఎగసిన కడలికి
కలలో ఇలలో కలలో ఇలలో దొరకని కలయిక
సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే

కన్యాకుమారి నీ పదములు నేనే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కన్యాకుమారి నీ పదములు నేనే
కడలి కెరటమై కడిగిన వేళ
సుమసుకుమారి నీ చూపులకే
తడబడి వరములు అడిగిన వేళ

అలిగిన నా పొల అలకలు
నీలో పులకలు రేపి పువ్వులు విసిరిన
పున్నమి రాతిరి నవ్విన వేళ
సాగర - సంగమమే 
ప్రణయ - సాగర సంగమమే

భారత భారతి పద సన్నిధిలో
కుల మత సాగర సంగమ శ్రుతిలో
నా రతి నీవని వలపుల హారతి
హృదయము ప్రమిదగ వెలిగిన వేళ
పరువపు ఉరవడి పరువిడి
నీ ఒడి కన్నుల నీరిడి
కలసిన మనసున సందెలు
కుంకుమ చిందిన వేళ
సాగర సంగమమే 
ప్రణయ సాగర సంగమమే
సాగర సంగమమే




పాడింది పాడింది పట్నాల కాకి పాట సాహిత్యం

 
చిత్రం: సీతాకోక చిలక (1981)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: 
గానం: మాధవపెద్ది రమేష్ 

పాడింది పాడింది పట్నాల కాకి 




అలలు కలలు (డ్యూయెట్) పాట సాహిత్యం

 
చిత్రం: సీతాకోక చిలక (1981)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: 
గానం: వాణీజయరాం, ఇళయరాజా

అలలు కలలు (డ్యూయెట్)




అలలు కలలు (Solo) పాట సాహిత్యం

 
చిత్రం: సీతాకోక చిలక (1981)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: 
గానం: వాణీజయరాం

అలలు కలలు

Most Recent

Default