చిత్రం: శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం (1972)
సంగీతం: టి. వి. రాజు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల
నటీనటులు: యన్.టి.రామారావు, వాణిశ్రీ, దేవిక
దర్శకత్వం: సి.యస్.రావు
నిర్మాణం: జయంతి పిక్చర్స్
విడుదల తేది: 09.01.1963
పల్లవి:
రామా.. రఘురామా
ఎన్నాళ్ళు వేచేను ఓ రామా.. నీకు ఇకనైన దయరాదా శ్రీరామా..
నీకు ఇకనైన దయరాదా శ్రీరామా
ఎన్నాళ్ళు వేచేను ఓ రామా.. నీకు ఇకనైన దయరాదా శ్రీరామా
నీకు ఇకనైన దయరాదా శ్రీరామా
చరణం: 1
నీ అండ నేచేర రాలేను రామా.. నా కొండకే నీవు రావయ్య రామా
ఏ జన్మకైనా.. నా జపము నా తపము.. నీవే నీవే రఘురామా
జగధభి రామా.. జానకి రామా.. జయరామా.. శ్రీరామా
ఎన్నాళ్లు వేచేను ఓ రామా.. నీకు ఇకనైన దయరాదా శ్రీరామా
నీకు ఇకనైన దయరాదా శ్రీరామా
చరణం: 2
సీతమ్మ సేమం తెలిపానే.. నీ తమ్ముని ప్రాణం నిలిపానే
సీతమ్మ సేమం తెలిపానే.. నీ తమ్ముని ప్రాణం నిలిపానే
మహిరావణుని గుట్టు చెప్పానే.. నిన్ను మూపున ఇడుకొని మోశానే
ఇంతగ కొలిచిన నీ పదదాసుని..
ఇంతగ కొలిచిన నీ పదదాసుని ఎటుల మరచితివయ్యా.. రామయ్యా
ఎన్నాళ్లు వేచేను ఓ రామా.. నీకు ఇకనైన దయరాదా శ్రీరామా
నీకు ఇకనైన దయరాదా శ్రీరామా
******** ********* *********
చిత్రం: శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం (1972)
సంగీతం: టి. వి. రాజు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల
పల్లవి :
నీవైన చెప్పవే ఓ మురళీ..
ఇక నీవైన చెప్పవే ప్రియమురళీ.. నీవైన చెప్పవే ఓ మురళీ
అడుగడుగున నా ప్రియభామినికి.. అలుక ఎందుకని.. ఎందుకని
నీవైన చెప్పవే ఓ మురళీ
నీవైన చెప్పవే జాబిలీ..
ఇక నీవైన చెప్పవే ఓ జాబిలీ.. నీవైన చెప్పవే జాబిలీ
తలబంతి ఎవరో.. పదదాసి ఎవరో
తెలుసుకొమ్మనీ.. పిదప రమ్మనీ.. నీవైన చెప్పవే జాబిలీ
చరణం: 1
అలుకలోన నా చెలియ వదనము.. అరుణ కమలమై విరిసెననీ
అలుకలోన నా చెలియ వదనము.. అరుణ కమలమై విరిసెననీ
ఆ కమలములోని తేనియలానగ.. కమలములోని తేనియలానగ
నామది భ్రమరమై ఎగసెననీ.. నీవైన చెప్పవే ఓ మురళీ
చరణం: 2
కోటిపూలతో కులుకు తుమ్మెదకు.. ఈ తోటలో చొటులేదనీ
కోటిపూలతో కులుకు తుమ్మెదకు.. ఈ తోటలో చొటులేదనీ
మనసెరిగిన సత్యా విధేయునికే.. మనసెరిగిన సత్యా విధేయునికే
అనురాగ మధువు అందుననీ.. నీవైన చెప్పవే జాబిలీ
ఇక నీవైన చెప్పవే ఓ జాబిలీ.. నీవైన చెప్పవే జాబిలీ