చిత్రం: S/O. సత్యమూర్తి (2015) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు: అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్ దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాత: ఎస్.రాధాకృష్ణ విడుదల తేది: 09.04.2015
Songs List:
One & Two & Three & Four పాట సాహిత్యం
చిత్రం: S/O. సత్యమూర్తి (2015) సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సాహిత్యం: దేవీ శ్రీ ప్రసాద్ గానం: సూరజ్ సంతోష్ One & Two & Three & Four Everybody put yourself on the dance floor దిల్ దిల్ దిల్ హే దిల్ మాంగే మోర్ Lets see what life has in store Wall clock వెనక్కి తిప్పెయ్యరో calendar నే కప్పెయ్యరో world-u కి వేగం చుపెయ్యరో The night is still young ఊపెయ్యరో ప్రపంచం ఓ రౌండ్ కన్నా సున్నా లైఫ్ అంటే ఓ స్ట్రెయిట్ లైన్ నానా బాగుందే ఈ రోజు నిన్న కన్న జర స లవ్ కరో నా విమానంలో దూసుకేల్తు ఉన్నా విహారంలో మునిగిపోయి వున్నా ప్రమాదం వినోదం ఈ ఎవ్వరన్నా ఎంత ఆపినా One & Two & Three & Four Everybody put yourself on the dance floor దిల్ దిల్ దిల్ హే దిల్ మాంగే మోర్ Lets see what life has in store Wall clock వెనక్కి తిప్పెయ్యరో calendar నే కప్పెయ్యరో world-u కి వేగం చుపెయ్యరో The night is still young ఊపెయ్యరో
శీతాకాలం సూర్యుడ్లాగా పాట సాహిత్యం
చిత్రం: S/O. సత్యమూర్తి (2015) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: యాజిన్ నజీర్ ఓ శీతాకాలం సూర్యుడ్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే తరిమే తుంటరి తూఫాను లాగా చుట్టేయొచ్చుగా వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే సాయంకాలం సరదా లాగా మొత్తంగా రావే కనులకు కలలు వయసుకు వలలు విసిరిన మగువ మనసుకు దొరకవే శీతాకాలం సూర్యుడ్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే తరిమే తుంటరి తూఫాను లాగా చుట్టేయొచ్చుగా Its love when you feel hot in the cold Its love when you never ever get old Its now when you just you and me Yeah get closer and hold me పగలేదో రాత్రేదో తెలిసీ తెలియక నేను మెలకువలో కలగంటూ సతమతమే అవుతున్నాను ఎరుపేదో నలుపేదో కలరే తెలియక కన్ను రంగులు తగ్గిన రెయిన్ బోలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను A for అమ్మాయంటూ B for బీటే కొడుతూ C for సినిమా హీరోలా తిరిగానే ... తిరిగానే D for డార్లింగ్ అంటూ E for ఎవ్రీ నైటూ F for ఫ్లడ్ లైటేసీ వెతికానే... వెతికానే కనులకు కలలు వయసుకు వలలు విసిరిన మగువ మనసుకు దొరకవే శీతాకాలం సూర్యుడ్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా ఓ...గా...ఓ...గా...ఓ ఓ.... When i see you i start hearing violins Right there in the middle of silence With the rest of the melody slowly fading in Baby you are my symphony in all sense గుండెల్లో మాటల్ని నీకెట్టా చెప్పాలంటూ ఏవేవో పాటల్లో రిఫరెన్స్ ఏదో వెతికాను వెన్నెల్లో కూర్చుంటే కొత్తేముందనుకున్నాను నువ్వొచ్చీ కలిశాకే డిఫరెన్స్ ఎదో చూశాను G for గర్ల్‌ఫ్రెండ్ అంటూ H for హమ్మింగ్ చేస్తూ I for ఐ లవ్ యూ చెబుతూ తిరిగానే... తిరిగానే J for జాబిలీ నువ్వు K for కౌగిలి నేను L for లైఫ్ టైమ్ నీతోనే ఉంటానే... ఉంటానే కనులకు కలలు వయసుకు వలలు విసిరిన మగువ మనసుకు దొరకవే శీతాకాలం సూర్యుడ్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే తరిమే తుంటరి తూఫాను లాగా చుట్టేయొచ్చుగా The sun rises and then it sets But something new happened the day we met They both same to be happening at the same time I knew i had to make you mine
సూపర్ మచ్చి... పాట సాహిత్యం
చిత్రం: సన్నాఫ్ సత్యమూర్తి(2015) సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సాహిత్యం: దేవీ శ్రీ ప్రసాద్ గానం: దేవీ శ్రీ ప్రసాద్, శ్రావణ భార్గవి వందాచ్చే... వందాచ్చే... మిన్ సారం పొళా మాపుళపుళ్ల వందాచ్చే సూపర్ మచ్చి తందాచ్చే ...తందాచ్చే... యెంగ వీట తంగచ్చిలై ఉన్ కయ్యిల తందాచ్చి సూపర్ మచ్చి ఆ...మల్లిగాడి ఇంటి కాడ మల్లెపూలు కోసుకుంటే చందుగాడి సందు కాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్ప కాడ సన్నజాజులేరుకుంటే పోటుగాడి తోట కాడ సన్ గ్లాసులెట్టుకుంటే చాకిరేవు గట్టు కాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముత్యమున్న ముక్కుపుడక ముక్కు మీద పెట్టుకుంటే రోల్డు గోల్డు గాజులేసి చేతులేమో ఘల్లుమంటే చీరకట్టు నేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే సింగార్ కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే అద్దంలొ చూసుకుంటే నాకు నేనె ముద్దుగుంటే కుర్రాళ్ళ చూపులన్ని వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి... అడ సూపర్ మచ్చి సూపర్ మచ్చి... అడ సూపర్ మచ్చి హె...వీరబాబు ఇంటికాడ ఈత కల్లు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు జళ్ళు ఏసుకున్న శ్రీదేవి లాగ ఉంటే రేగిపళ్ళు లాంటి కళ్ళు రారా నా మామ అంటే ఎర్రాని రైక రంగు ఎండకన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంజికాయలాంటి మూతి ముద్దుగానే తిప్పుతుంటే మైండులోని మాటలన్ని సెప్పకుండ సెప్పుతుంటే లిప్పు-స్టిక్కు పెదాల్లో ఇంగిలీషు ముద్దులుంటే హిప్పు లోన ఒంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాపి సోకులన్ని వడకబెట్టి ఒంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి సంపుతుంటే సూపర్ మచ్చి... అడ సూపర్ మచ్చి సూపర్ మచ్చి... అడ సూపర్ మచ్చి మొన్న ఊరి సివర ఉన్న సిన్న టూరింగ్ టాకీస్ కాడ మ్యాటినీ ఆట సూసి వేటింగ్ సేసేత్తువుంటే డుర్రు డుర్రుమంటు నువ్వు బుల్లెట్ ఏసుకొచ్చి బ్యాక్ సీటు మీద నన్ను ఎక్కించేసుకుంటే గతుకులున్న రొడ్డు మీద బెదరకుండ నడుపుతుంటే సిటికడంత సిట్టీ నడుము అయ్యొ అయ్యొ అదురుతుంటే... హెయ్... మ్యాట్నీ ఆటకంటే నువ్వే మస్తుగుంటే ఐటం పాటకంటే నువ్వే కిక్కు గుంటే టూరింగ్ టాకీసు మొత్తం నిన్ను చూడ వస్తువుంటే టీనేజు తాత కూడ నిన్ను చూసి ఈల వేస్తే ప్రాణం లేని నా బుల్లెట్టే కన్నుకొడితే నాలోని ప్రాణమంత గిల గిల కొట్టేసుకుంటే సూపర్ మచ్చి... అడ సూపర్ మచ్చి సూపర్ మచ్చి... అడ సూపర్ మచ్చి మొన్న సండే సంత కాడ మండే ఎండలోన బండే కట్టి నువ్వు దిండే వేసుకొస్తే గుండేలోపలొక వన్డే మ్యాచ్ జరిగి తిండే మాని నేను బెండై పొతూ ఉంటే సూదిమందు గుచ్చకుండ సుర్రుమనిపిస్తుంటే మత్తుమందు పెట్టకుండ మాయలేవొ చేస్తుంటే డప్పుకొట్టినట్టు నువ్వు నడుచుకుంటు వచ్చెస్తే అప్పుదెచ్చినా రాని అందమంత నీదైతే నిన్ను కన్న అమ్మకేమో దండమొకటి పెట్టెస్తే మైడియర్ మామ కొక్క పూలదండ వెసేస్తే రారా నా అల్లుడంటు వాళ్ళు నన్ను పట్టెస్తే నిన్ను ఇంక మొత్తంగ నాకు అంటగట్టెస్తే సూపర్...సూపర్... సూపర్... సూపర్ సు సు సు సు సూపర్ మచ్చి... అడ సూపర్ మచ్చి సూపర్ మచ్చి... అడ సూపర్ మచ్చి
కమ్ టు ద పార్టీ సుబ్బలచ్చిమి పాట సాహిత్యం
చిత్రం: S/O. సత్యమూర్తి (2015) సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: విజయ్ ప్రకాష్ డాన్స్ లైక్ దేరీజ్ నో టుమారో వెల్ ఐ డింట్ సీ దట్ కమింగ్ కాక్‌టైల్ తాగిన కోతి నేను నెక్‌టై కట్టుకున్న కాకి నేను కొంచెం లూజ్, కొంచెం టైటు నేను దారం తెంచుకున్న కైటు నేను శనివారం రచ్చగున్న నైటు నేను కొంచెం రాంగ్, కొంచెం రైటు నేను వేసెయ్ టకిలా, మై హుం అకేల రావె ఓ పిల్లా, మై మజ్ను తు లైలా హమ్ తుమ్ ఇవాళ సమ్‌థింగ్ అనేలా రమ్ పంచుకోలా ప్రపంచం వినేలా కమ్ టు ద పార్టీ సుబ్బలచ్చిమి వెల్కం టు ద పార్టీ అబ్బ టచ్ మి కమ్ టు ద పార్టీ సుబ్బలచ్చిమి వెల్కం టు ద పార్టీ అబ్బ టచ్ మి కమ్ టు ద పార్టీ సుబ్బలచ్చిమి వెల్కం టు ద పార్టీ అబ్బ టచ్ మి కమ్ టు ద పార్టీ సుబ్బలచ్చిమి వెల్కం టు ద పార్టీ అబ్బ టచ్ మి నీలు ఆమ్‌స్ట్రాంగ్ కాలు పెట్టినా మూను నీ నగుమోమా ఆర్య భట్టు గారు కనిపెట్టిన జీరో నీ నడుమా ఆఫ్రికన్ అడవుల్లో పెరిగిన అల్లరి అందం నువ్వా ఆమ్‌స్టర్‌డామ్ లో వెల్లి వెరిసిన పువ్వుల నది నీ నవ్వా గర్ల్స్ అండ్ బాయ్స్ మేక్ సమ్ నాయ్స్ ఐ ఆమ్ ద బెస్ట్ చాయిస్, లైక్ రోల్స్ రాయ్స్ హెలో ఏంజిల్స్, ట్రై మి ఒన్స్ మరొక్కసారి రాదు గా డియర్స్ ఇలాంటి చాన్స్ కమ్ టు ద పార్టీ సుబ్బలచ్చిమి వెల్కం టు ద పార్టీ అబ్బ టచ్ మి కమ్ టు ద పార్టీ సుబ్బలచ్చిమి వెల్కం టు ద పార్టీ అబ్బ టచ్ మి కమ్ టు ద పార్టీ సుబ్బలచ్చిమి వెల్కం టు ద పార్టీ అబ్బ టచ్ మి కమ్ టు ద పార్టీ సుబ్బలచ్చిమి వెల్కం టు ద పార్టీ అబ్బ టచ్ మి ఎంత ఆర్మీ కావాలో నీ అందం కాయాలంటే న్యూక్లియర్ వార్ జరగాలేమో నిన్ను పొందాలంటే జీన్స్ గా జన్మెత్తాలా నిన్నంటుకు తిరగాలంటే ఇంటిమేట్ సెంటవ్వాలా నీ ఒంటిని తాకాలంటే జాక్ అండ్ జిల్ లెట్స్ హేవ్ సమ్ థ్రిల్ హే బ్యూటిఫుల్ యు గాట్ ద లుక్స్ టు కిల్ జరా దిల్ ఖోల్ రాక్ అండ్ రోల్ పెగ్గు వేసి సిగ్గు చంపుదాం ఓ బేబి డాల్ కమ్ టు ద పార్టీ సుబ్బలచ్చిమి వెల్కం టు ద పార్టీ అబ్బ టచ్ మి కమ్ టు ద పార్టీ సుబ్బలచ్చిమి వెల్కం టు ద పార్టీ అబ్బా టచ్ మీ కమ్ టు ద పార్టీ సుబ్బలచ్చిమి వెల్కం టు ద పార్టీ అబ్బ టచ్ మి కమ్ టు ద పార్టీ సుబ్బలచ్చిమి వెల్కం టు ద పార్టీ అబ్బా టచ్ మీ
జారుకో జారుకో జరుకోవలే పాట సాహిత్యం
చిత్రం: S/O. సత్యమూర్తి (2015) సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: సాగర్, యమ్. యమ్. మానసి హే పెన్ను పేపర్ చేతబట్టి తోచిందల్ల రాయబట్టి నా రాతిట్ట తగలెట్టాడా బ్రహ్మ ప ప పిం ప ప ప పిం నట్టింట్లో నను నిల్చోబెట్టి నా కలలన్ని పడుకోబెట్టి ఈడికి బావను చేసేస్తా రా ఖర్మ ప ప పిం ప ప ప పిం అరె తెల్ల లుంగీ పైకేకట్టి తొడలు మొత్తం బయటే పెట్టి తింబి అంటూ తొక్కేస్తారా జన్మ గూట్లో హల్వా నోట్లో బెట్టి సూట్లు బూట్లు నాక్కొనిబెట్టి అంట్లు గట్రా తోమిస్టార అమ్మ ఎంకమ్మ జల్ది జారుకో జారుకో జరుకోవలే ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలే (2) Give give give somemore give give give somemore give give give somemore సైనైడ్ ఫ్లేవర్ లిప్స్టిక్ ఉంది గ్రానైట్ ఫీచర్ నాలో ఉంది టైఫాయిడ్ లా టార్చర్ చేస్తా రారా అరేయ్ వర్ణించారె కవులు వాళ్ళు ఆడాళ్లంటే పూలు పళ్ళు వీళ్ళని చూస్తే రాతను మార్చేస్తారా అరచేతుల్లో గోరింటాకు అరిటాకుల్లో కరివేపాకు అయిపోయాక అవతల పారేస్తారా అరె ఒకళ్ళ కంట్లో వాటర్ ట్యాంక్ ఒకళ్ళ కంట్లో పెట్రోల్ బంక్ ముంచేస్తారో పేల్చేస్తారో లైఫే డేంజర్ రా జల్ది జారుకో జారుకో జరుకోవలే ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలే (2) హే బ్లెండర్ లా నీ బెండే తీస్తా గ్రైండర్ లా నిను పచ్చడి చేస్తా వాషింగ్ మెషీనై ఉతికారేస్తా రారా హే సెల్ఫిష్ కే సెల్ఫివే నువ్వు సైకో కే ఐకాన్ వే నువ్వు సైక్లోన్ కే సూటవ్వదు సిగ్గు చీర గుండెలు తీసే గూండాలైన జండా మార్చే రౌడీ లైనా ఎవరు నీలా మనసే మార్చరు లేరా మెరిసే మల్లెలు రాసోపక్క మానవ బాంబుకి డూపో పక్క బతుకే బస్టాండ్ అయిపోయింది లేరా దేఖోరా జల్ది జారుకో జారుకో జరుకోవలే ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలే (2)
చల్ చలో చలో లైఫ్ సే మిలో పాట సాహిత్యం
చిత్రం: S/O. సత్యమూర్తి (2015) సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: రఘు దీక్షిత్ రాజ్యం గెలిసినోడు రాజవుతాడు రాజ్యం ఇడిసినోడే రామ సంద్రుడు యుద్ధం గెలిసేటోడు వీరుడు సూరుడు యుద్ధం ఇడిసేటోడే దేవుడు చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చెయ్యరో తీపితో పాటుగా ఓ కొత్త చేదు అందించడం జిందగీకి అలవాటే కష్టమే రాదనే గ్యారంటీ లేదు పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే అందుకో హద్దుకో ముందరున్న యీ క్షణాన్ని చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో హే చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చెయ్యరో కన్నిలేందుకు ఉప్పగుంటాయి తియ్యగుంటే కడదాకా వదలవుగనుక కష్టలేందుకు బరువుగుంటాయి తెలికైతే బ్రతుకంత మోస్తూ దించవుగనుక ఎదురే లేని నీకు కాకా ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక చూద్దాం అంటూ నీ తడక వచ్చింది ఇబ్బంది నువ్వున్న ఇంటి గడపదాక పడ్డవాడే కష్టపడ్డవాడే పైకిలేచే ప్రతోడు ఒక్కడైన కానరాడే జీవితాన్ని పోరాడకుండ గెలిచినోడు చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చెయ్యరో మడతే నలగని షర్టు లాగ అల్మారాలో పడివుంటే అర్ధం లేదు గీతే తగలని కాగితంలా కుట్టి చెదలు పట్టిపోతే ఫలితం లేనే లేదు పుడుతూనే గుక్క పెట్టినాక కష్టమన్న మాటేమీ కోతేం కాదు కొమ్మల్లో పడి చిక్కుకోక ఆకాశం ఎత్తుల్లో ఏ గాలిపటం ఎగరలేదు ప్లస్సు కాదు మైనస్సు కాదు అనుభవాలే ఏదైనా ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపోరా నీదైన గెలుపు దారిలోన చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో హే చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చెయ్యరో
వచ్చాడు వచ్చాడు పాట సాహిత్యం
చిత్రం: S/O. సత్యమూర్తి (2015) సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సాహిత్యం: దేవీ శ్రీ ప్రసాద్ గానం: జావేద్ ఆలీ హే వచ్చాడు వచ్చాడు వచ్చాడు వచ్చాడు ఊరికి వీడే మొనగాడు హే ఎనుబోతు కొమ్ము ఏనుగమ దంతం నూరి చేసిన దొర వీడు నెత్తురు పీల్చే దాహం దాహం కత్తులు మోసే మొహం మొహం ఎత్తులు వేసే వ్యూహం వ్యూహం శత్రువు జాడే లక్ష్యం లక్ష్యం హే వచ్చాడు వచ్చాడు వచ్చాడు వచ్చాడు ఊరికి వీడే మొనగాడు హే ఎనుబోతు కొమ్ము ఏనుగమ దంతం నూరి చేసిన దొర వీడు హే వెంకడు చేసిన సంకటి అంటే ప్రాణం ఇస్తాడు యహే వంకర టింకర వేషాల్చసేు పేగులు కోస్తాడు హే గందరగోళం గొడవలు చేస్తే కత్తే దూస్తాడు అరె వందల మందిని నీడకు చేర్చే చెట్టై కావలి కాస్తాడు వచ్చాడో... హే....వచ్చాడో... హ... ఎదురొచ్చానోడంటు లేడు - లేడు ఎదురించే వాడింక రాడు - రాడు కన్నెత్తి చూస్తేనే కత్తెత్తి పైకొచ్చి తెగ రెచ్చిపోతాడు వీడు - వీడో కడతాడు కస్స పంచె - పంచె ఈడు కొడితే హైలెస్స అంతే - అంతే ఊపిరి పీల్చే ఊరికి మొత్తం ఈడే కట్టని కంచె - కంచె హే కట్టెలు కొట్టే గొడ్డలి లాగ కస్సు మంటాడు అరె మెట్టెలు పెట్టిన పెళ్ళాం ముందర మెత్తగవుంటాడు అరె చెట్టుని పుట్టని మట్టిని గట్టుని చుట్టం లాగా చూస్తాడు వచ్చాడో... హే వచ్చాడో... హే వచ్చాడు వచ్చాడు వచ్చాడు వచ్చాడు ఊరికి వీడే మొనగాడు హే ఎనుబోతు కొమ్ము ఏనుగమ దంతం నూరి చేసిన దొర వీడు నెత్తురు పీల్చే దాహం దాహం కత్తులు మోసే మొహం మొహం ఎత్తులు వేసే వ్యూహం వ్యూహం శత్రువు జాడే లక్ష్యం లక్ష్యం