Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Stuartpuram Police Station (1991)




చిత్రం: స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ (1991)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: చిరంజీవి, విజయశాంతి, నిరోషా
దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాథ్
నిర్మాత: కె.యస్. రామారావు
విడుదల తేది: 09.01.1991



Songs List:



జిందాబాద్ జిల్ జిల్ ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
జిందాబాద్ జిల్ జిల్ ప్రేమ... హోయ్
ప్రేమంటేనే పేచీ రామా...
L.O.V.E. అంటే ప్రేమ... హోయ్
కన్నెరికంతో రాజీనామా
చలి వాడి వేడి నీతో జోడి అమ్మమ్మా.. హొయ్

జిందాబాద్ జిల్ జిల్ ప్రేమ... హోయ్
ప్రేమంటేనే పేచీ రామా...
L.O.V.E. అంటే ప్రేమ... హోయ్
కన్నెరికంతో రాజీనామా

చరణం: 1
ఒత్తిడి గుండెం ఒళ్ళో పడగా
ఏదో తొక్కిడి బంధం తోడే అడగా
నచ్చిన అందం వెచ్చాలడగా
కన్నె మెచ్చిన రూపం కాటే పడగా
అత్తరు ముద్దుకు నెత్తురు పొంగిన మత్తుల మన్మథ నేరం
అక్కడి కిక్కులు ఇక్కడికెక్కిన సిగ్గు దుమారం
అమ్మడి గుమ్మకు చెమ్మలు చిమ్మిన కమ్మని కౌగిలి హారం
ఎక్కడ తాకితే అక్కడ సోకుల టోకుల బేరం
ఎక్కడ పడితే అక్కడ తాడితే పలికే వలపులివే

జిందాబాద్ జిల్ జిల్ ప్రేమ... హోయ్
ప్రేమంటేనే పేచీ రామా...
L.O.V.E. అంటే ప్రేమ... హోయ్
కన్నెరికంతో రాజీనామా
చలి వాడి వేడి నీతో జోడి అమ్మమ్మా.. హా

జిందాబాద్ జిల్ జిల్ ప్రేమ... హోయ్
ప్రేమంటేనే పేచీ రామా...
L.O.V.E. అంటే ప్రేమ... హోయ్
కన్నెరికంతో రాజీనామా

చరణం: 2
చెక్కిలి చట్రం గుంటే పడగా
నాకే దగ్గరి చుట్టం కావే కసిగా
యవ్వన గంధం నిన్నే కడగా
నాకే జీవన బంధం నీతో పడగా
ముక్కుల పచ్చలు మక్కువ పెంచిన చక్కిలి గింతల గీతం
చుక్కల వేళకు అక్కరకొచ్చిన ఈ సుముహూర్తం
అందని లోతులు అల్లుకుపోయిన అల్లరి కాముడి బాణం
చందన చర్చగ చిందిన చిచ్చుగ తీసెను ప్రాణం
జల్లెడ పడితే జల్లున పొంగే వయసుకు వరదలివే

జిందాబాద్ జిల్ జిల్ ప్రేమ... హోయ్
ప్రేమంటేనే పేచీ రామా...
L.O.V.E. అంటే ప్రేమ... హోయ్
కన్నెరికంతో రాజీనామా
చలి వాడి వేడి నీతో జోడి అమ్మమ్మా.. హా

జిందాబాద్ జిల్ జిల్ ప్రేమ... హోయ్
ప్రేమంటేనే పేచీ రామా...
L.O.V.E. అంటే ప్రేమ... హోయ్
కన్నెరికంతో రాజీనామా





Fantastic డిస్కో లే చేస్తా పాట సాహిత్యం

 
చిత్రం: స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
Fantastic డిస్కో లే చేస్తా
కర్ణాటిక్ రాగాలే తీస్తా
సొరుగుల్లో అందాలే చూస్తా
పరువం తో బంధాలే వేస్తా
ఒడెస్సీ నటన ఆడేస్తా
ఓడించే లయ వేస్తా
కాలేజీ లెక్చర్ దంచేస్తా
టీనేజీ కథ రాస్తా

Fantastic డిస్కో లే చేస్తా
కర్ణాటిక్ రాగాలే తీస్తా
సొరుగుల్లో అందాలే చూస్తా
పరువం తో బంధాలే వేస్తా 

చరణం: 1
శ్రీరస్తు ప్రియ మస్తంటూ చిలకే దొరికే
ప్రేమిస్తే ఏమిస్తుందో అడిగే వరకే
సాధిస్తా వేదిస్తుంటే సరదా పడితే
మాట ఇస్తా మాలే వేస్తా మనసే పుడితే
సండే లవర్ ఒన్ డే ఫ్లవర్
నేనే డాన్సర్ నువ్వే ఆన్సర్
జల్సా లా జాజ్ మ్యూజిక్కు
ఆడు అమ్మో మాజిక్కు
జల్సా లా జాజ్ మ్యూజిక్కు
ఆడు అమ్మో మాజిక్కు

Fantastic డిస్కో లే వేస్తా
కర్ణాటిక్ రాగాలే తీస్తా
సొరుగుల్లో అందాలే దాస్తా
పరువం తో బంధాలే వేస్తా 

చరణం: 2
త్యాగయ్య మనవడినైతే రామా అంటా
క్షేత్రయ్య పదమే వింటే భామా అంటా
నీ పేరు పెట్టానంటే ప్రేమ అంటా
నీ తోడు దక్కిందంటే ధీమా గుంటా
నాతో షికార్ యా ఊళ్ళో పుకార్ హా మాయాబజార్ హే నాతో హుషార్
గిన్నీసు బుక్కు ఎక్కిస్తా అమ్మో జిమ్మిక్సే చేయిస్తా
గిన్నీసు బుక్కు ఎక్కిస్తా జిమ్మిక్సే చేయిస్తా

Fantastic డిస్కో లే వేస్తా
కర్ణాటిక్ రాగాలే తీస్తా
సొరుగుల్లో అందాలే దాస్తా
పరువం తో బంధాలే వేస్తా
హే ఒడెస్సీ నటన ఆడేస్తా
ఓడించే లయ వేస్తా
కాలేజీ లెక్చర్ దంచేస్తా
టీనేజీ కథ రాస్తా




భలేగ ఉందిరా పాట సాహిత్యం

 
చిత్రం: స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, చిత్ర

పల్లవి:
భలేగ ఉందిరా ఇదేమి ముద్దురా
పడింది ముద్దరా చెడింది నిద్దరా.. 
వయస్సు ఒడ్డు దాటుతుంటే 
మనస్సు ఆడ్డు చెప్పదాయె..
వయస్సు ఒడ్డు దాటుతుంటే 
మనస్సు ఆడ్డు చెప్పదాయె..
కథేవిటే చెలి ఇదేమి కౌగిళి 
గులాబి మొగ్గ లో గులేభకావళి
ఫలాన చోట అంటుకోనా 
ఫలాల పంట అందుకోనా 
ఫలాన చోట అంటుకోనా 
ఫలాల పంట అందుకోనా

చరణం: 1
పిచ్చి ఎక్కి గాలి గిచ్చి చంపుతుంటే 
ఎక్కడో చిక్కడే సిగ్గుపాపా
గుచ్చి గుచ్చి చూసే కన్ను గీటుతుంటే
ఎందుకో ఏమిటో చెప్పలేవా
ఒయ్యారి ఒంటికీ వత్తిడంత ఇష్టమో
ఆ కంటి చాటుకే రాలేవా
శృంగారవీణకి చీకటంత ఇష్టమో
ఈ పొద్దు వాలితే వారెవ్వా 
అందాల ఆరడి అయ్యక నే రెడి
అందాక తాకిడి ఆపైన దోపిడీ
పాదాలు నేను దాచుకుంటా 
ప్రాయాలు నేను దోచుకుంటా

భలేగ ఉందిరా ఇదేమి ముద్దురా
పడింది ముద్దరా...

చరణం: 2
ముక్కుమీద కోపం ముట్టుకోని రూపం 
ఇక్కడే ఇప్పుడే అంటుకోనా
పక్కదిండు పాపం చుక్కలమ్మ సాక్ష్యం
వద్దని వాయిదా వేసుకోనా
అమ్మయి తీగరో సన్నాయి నొక్కుతా
సంగీత నవ్వులే రావాలి
అబ్బాయి రాకతో లల్లాయి పాటలో 
గారాల ఎంకినైపోవాలి 
శ్రీకాముడీ గుడి సిందూర పాపిడి 
పట్టిందిలే రతి ప్రయాల హారతి 
గుప్పిళ్ళు విప్పుకోని పాప 
చప్పుళ్ళు చాలుగాని టాటా

కథేవిటే చెలి ఇదేమి కౌగిళి 
గులాబి మొగ్గలో గులేభకావళి
వయస్సు ఒడ్డు దాటుతుంటే 
మనస్సు ఆడ్డు చెప్పదాయె.. 
ఫలాన చోట అంటుకోనా 
ఫలాల పంట అందుకోనా




ఇద్దరతివల దెబ్బకు మద్దెలవలే పాట సాహిత్యం

 
చిత్రం: స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి: 
ఇద్దరతివల దెబ్బకు మద్దెలవలే
మధ్య నిలభడి చివరికి మర్డరైతీ
జోడు వాయింపు ఇంపులో జోరు కాస్త
పైట పడ్డది దెబ్బకు లైటు రాగా... ఆ... ఆ...
సీతాకోక చిలక లేత రామ చిలక
సెక్సీ క్లోజప్ నాదేలే
బ్యూటి బేబి సరస లూఠీరాణి వరస
లవ్లీ గాసిప్ జోరేలే
సెక్సాడ్డంలో సాయంకాలం సిక్సో క్లాకు శృంగారం

సీతాకోక చిలక లేత రామ చిలక
సెక్సీ క్లోజప్ నాదేలే
బ్యూటి బేబి సరస లూఠీరాణి వరస
లవ్లీ గాసిప్ జోరేలే 

చరణం: 1
ఏ పూర్వ పుణ్యమో ఈ పురుష సింహుడై
వచ్చాడమ్మా తోడు తెచ్చాడమ్మా ఈడు
అందాల రూపమే ఆహ్వాన లేఖగా
తెంచాడమ్మా పువ్వు పెంచాడమ్మ నవ్వు
ఈ ఛైత్రవేళలో చెలిని మలియాడగా
రురు రురు రురు రురు రు
రురు రురు రురు రురు రు
ఈ ప్రేమ మాసమే ప్రియ మురళి పాడగా
ఒకరి వలపు వయసు పిలుపు
ఒకరి మనసు తెరిచె తలుపు
మతి చెదిరె శృతులు ముదిరె మగువలిటుల తగలగా

సీతాకోక చిలక లేత రామ చిలక
సెక్సీ క్లోజప్ నాదేలే
బ్యూటి బేబి సరస లూఠీరాణి వరస
లవ్లీ గాసిప్ జోరేలే 

చరణం: 2
కస్తూరి మోహమే కసికసిగా మారగా
నీకే వేస్తా బ్రేకు పైకే తీస్తా సోకు
కావేటి రంగడే కలయికలు కోరగా
L.O.V.E. అంట హీరో ముద్దే తింటా
నేనల్లుకుందునా వలపు విరిమాలగా
రురు రురు రురు రురు రు
రురు రురు రురు రురు రు
నా ప్రేమ నోములో తొలి వరమునీయవా
ఒకరి మనసు వలపు కురిసె
ఒకరి సొగసు వలలు విసిరె
లయ ముదిరె అబల జతలు తబల జతులు పలుకగా

సీతాకోక చిలక లేత రామ చిలక
సెక్సీ క్లోజప్ నాదేలే
బ్యూటి బేబి సరస లూఠీరాణి వరస
లవ్లీ గాసిప్ జోరేలే
నారీ నారీ లావాదేవి ఇదేనండి గోవిందం

సీతాకోక చిలక లేత రామ చిలక
సెక్సీ క్లోజప్ నాదేలే
బ్యూటి బేబి సరస లూఠీరాణి వరస
లవ్లీ గాసిప్ జోరేలే



చీకటంటి చిన్నదాని పాట సాహిత్యం

 
చిత్రం: స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, చిత్ర

పల్లవి :
జుజుజు జుజుజు
జుజుజు జుజుజు
జూజూజూజూ జుజుజు జూజూజు

చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం
చీర దాచలేని సోకు నాకు సంబరం
మొదలై తొలి శకం రగిలే సతి సుఖం
ప్రియ కన్యాలాభం
కాలమంత కత్తిరిస్తే కాస్త యవ్వనం
రెండు కళ్ళ కత్తెరేస్తె రేయి ఈ దినం
మొదలై చలియుగం కలిసే చెరిసగం
ఇది జాలీ లవ్ గేమ్
చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం
చీర దాచలేని సోకు నాకు సంబరం

చరణం: 1
నరాల వీణ మీటితే స్వరాలు లేని పాటలు
సరాగుమాడు సందెలో పరాగమాడు తోటలు
సగాలు ఒక్కటై ఇలా బిగించుకున్న జంటలు
వరించుకున్న దిక్కునే ధ్వనించు ప్రేమ గంటలు
ఏమి తీపి ఆటలో ఎంత వింత సాధనో
దాయలేని భావమో మోయలేని మోహమో
తోడు లేక తోచదాయెనే... ఎందుకో

చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం
చీర దాచలేని సోకు నాకు సంబరం
మొదలై చలియుగం కలిసే చెరిసగం
ఇది జాలీ లవ్ గేమ్
చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం
చీర దాచలేని సోకు నాకు సంబరం

చరణం: 2
వసంత రాగ వీధిలో నిషాల కోకిలమ్మలు
విశాఖవేళ ఎండలో భజించు మల్లె రెమ్మలు
షిఫాలు కొంగు గాలితో తుఫాను రేపు భామలు
పిపీలికాదిబ్రహ్మలో పిపాస రేపు ప్రేమలు
ఊహలోని ఉత్సవం వాటమైన వాస్తవం
సందెవేళ సంభవం అందమైన సంగమం
నిన్ను తాకి నీడలాయెనే... అందుకే

కాలమంత కత్తిరిస్తే కాస్త యవ్వనం
రెండు కళ్ళ కత్తెరేస్తె రేయి ఈ దినం
మొదలై తొలి శకం రగిలే సతి సుఖం
ప్రియ కన్యాలాభం
కాలమంత కత్తిరిస్తే కాస్త యవ్వనం
రెండు కళ్ళ కత్తెరేస్తె రేయి ఈ దినం




నీతోనే ఢంకాపలాసు పాట సాహిత్యం

 
చిత్రం: స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
నీతోనే ఢంకాపలాసు
ఇది ప్రేమాటైనా పేకాటైనా
నువ్వే నా కళావరాసు
నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా
నీతోనే చేస్తా రొమాన్సు
మడిగా ఉన్నది వయసు అడిగా ఇమ్మని మనసు
యమగా ఉన్నది సొగసు అది నా సొత్తని తెలుసు
రతి రమ్మీల దొమ్మీల గిమ్మిక్కు చేస్తుంటే
నువ్వే నా రంభావిలాసు

నీతోనే ఢంకాపలాసు
ఇది ప్రేమాటైనా పేకాటైనా
నువ్వే నా కళావరాసు
హోయ్ నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా
నీతోనే చేస్తా రొమాన్సు
మడిగా ఉన్నది వయసు అడిగా ఇమ్మని మనసు
యమగా ఉన్నది సొగసు అది నా సొత్తని తెలుసు
రతి రమ్మీల దొమ్మీల గిమ్మిక్కు చేస్తుంటే
నువ్వే నా రంభావిలాసు 
చలి సయ్యాటైనా ముద్దాటైనా
నీతోనే చేస్తా రొమాన్సూ... హా

చరణం: 1
నీ చూపే తగిలాక జోహారు అన్నాను నీ జోరుకే
ఉలికిపడి మెలికపడె తళుకులతో
నీ చూపే తగిలాక జోహారు అన్నాను నీ జోరుకే
ఉలికిపడి మెలికపడె తళుకులతో
క్రీగంటి గ్రీటింగిచ్చేస్తా
చెలి చకోరికా ఛలో ఇక
కొంగొత్త కోటింగిచ్చేస్తా
క్రీగంటి గ్రీటింగిచ్చేస్తా
చెలి చకోరికా ఛలో ఇక
కొంగొత్త కోటింగిచ్చేస్తా...ఆ..

ఆ..నీతోనే ఢంకాపలాసు
ఇది ప్రేమాటైనా పేకాటైనా
నువ్వే నా కళావరాసు
హోయ్ నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా
నీతోనే చేస్తా రొమాన్సు

చరణం: 2
పాడాలే జతచేరి శృంగార బంధాల భాగేశ్వరి - హహహ
పరువములే పరిచయమౌ ప్రియలయలో
పాడాలే జతచేరి శృంగార బంధాల భాగేశ్వరి
పరువములే పరిచయమౌ ప్రియలయలో
హే... శ్రీరస్తు సిగ్గే చిందిస్తా
తొలి వయస్సుకే వసంతుడా
యావత్తు నీకే అందిస్తా
శ్రీరస్తు సిగ్గే చిందిస్తా
తొలి వయస్సుకే వసంతుడా
యావత్తు నీకే అందిస్తా

హా.. నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా
నీతోనే చేస్తా రొమాన్సు
నీతోనే ఢంకాపలాసు
ఇది ప్రేమాటైనా పేకాటైనా
నువ్వే నా కళావరాసు - అహహ
యమగా ఉన్నది సొగసు అది నా సొత్తని తెలుసు
మడిగా ఉన్నది వయసు అడిగా ఇమ్మని మనసు
రతి రమ్మీల దొమ్మీల గిమ్మిక్కు చేస్తుంటే
నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా
నీతోనే చేస్తా రొమాన్సు
నీతోనే ఢంకాపలాసు
ఇది ప్రేమాటైనా పేకాటైనా
నువ్వే నా కళావరాసు

Most Recent

Default