చిత్రం: స్వయంకృషి (1987) సంగీతం: రమేష్ నాయుడు నటీనటులు: చిరంజీవి , విజయశాంతి, సుమలత దర్శకత్వం: కె.విశ్వనాథ్ నిర్మాత: ఏడిద నాగేశ్వరరావు విడుదల తేది: 03.09.1987
Songs List:
సిన్ని సిన్ని కోరికలడగ పాట సాహిత్యం
చిత్రం: స్వయంకృషి (1987) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.జానకి పల్లవి: సిన్ని సిన్ని కోరికలడగ సీనివాసుడు నన్నడగ అన్నులమిన్న అలవేల్మంగై ఆతని సన్నిధి కొలువుంటా చరణం: 1 ఎరిగిన మనసుకు ఎరలేలే ఏలిక సెలవిక శరణేలే ఎరిగిన మనసుకు ఎరలేలే ఏలిక సెలవిక శరణేలే ఎవరికి తెలియని కధలివిలే ఎవరికి తెలియని కధలివిలే ఎవరో చెప్పగా ఇక ఏలే సిన్ని సిన్ని కోరికలడగ సీనివాసుడు నన్నడగ అన్నులమిన్న అలవేల్మంగై ఆతని సన్నిధి కొలువుంటా చరణం: 2 నెలత తలపులే నలుగులుగా కలికి కనులతో జలకాలు నెలత తలపులే నలుగులుగా కలికి కనులతో జలకాలు సందిట నేసిన చెలువములే సందిట నేసిన చెలువములే సుందర మూర్తికి చేలములు సిన్ని సిన్ని కోరికలడగ సీనివాసుడు నన్నడగ అన్నులమిన్న అలవేల్మంగై ఆతని సన్నిధి కొలువుంటా చరణం: 3 కలల ఒరుపులే కస్తూరిగా వలపు వందనపు తిలకాలు వలపు వందనపు తిలకాలు అంకము జేరిన పొంకాలే అంకము జేరిన పొంకాలే శ్రీ వెంకట పతికిక వేడుకలు సిన్ని సిన్ని కోరికలడగ సీనివాసుడు నన్నడగ అన్నులమిన్న అలవేల్మంగై ఆతని సన్నిధి కొలువుంటా
హాల్లో హాల్లో డార్లింగ్ పాట సాహిత్యం
చిత్రం: స్వయంకృషి (1987) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, యస్.జానకి హాల్లో హాల్లో డార్లింగ్
పారాహుషార్ పారాహుషార్ పాట సాహిత్యం
చిత్రం: స్వయంకృషి (1987) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, యస్.జానకి లాలాలలా హాహాహహా పారాహుషార్ పారాహుషార్ పారాహుషార్ పారాహుషార్ తూరుపమ్మ దక్షినమ్మ పదమరమ్మ ఉత్తరమ్మ తూరుపమ్మ దక్షినమ్మ పదమరమ్మ ఉత్తరమ్మ పారాహుషార్ పారాహుషార్ అంభారి ఏనుగునెక్కి అందాల మా యువరాజు అంభారి ఏనుగునెక్కి అందాల మా యువరాజు ఊరేగుతు వచ్చేనమ్మ పారాహుషార్ పారాహుషార్ పారాహుషార్ తుంటరి కన్నయ్య వీడు ఆగడాల అల్లరి చూడు తూరుపమ్మా పారాహుషార్ దుందుడుకు దుండగీడు దిక్కు తోచనియ్యడు చూదు దక్షినమ్మ పారాహుషార్ పాలు పెరుగు ఉండనీడు పోకిరి గోపయ్య చూడు పడమరమ్మ పారాహుషార్ జిత్తులెన్నో వేస్తాడమ్మ జిత్తులెన్నొ వేస్తాడమ్మ దుత్తలు పడదోస్తాడమ్మ ఉత్తరమ్మ ఉత్తరమ్మ పారాహుషార్ పారాహుషార్ పారాహుషార్ రేయి రంగు మేలి వాడు వేయి నామాల వాడు తూరుపమ్మా పారాహుషార్ ఏ మూలన నక్కినాడొ ఆనమాలు చిక్కనీడు దక్షినమ్మ పారాహుషార్ ఓ... నోరార రా రా రారా అన్నా మొరాయించుతున్నాడమ్మా పడమరమ్మ పారాహుషార్ ముక్కు తాడు కోసెయ్యాలి ముట్టె పొగరు తీసెయ్యాలి ముక్కు తాడు కోసెయ్యాలి ముట్టె పొగరు తీసెయ్యాలి ఉత్తరమ్మ పారాహుషార్ పారాహుషార్ పారాహుషార్ నీలాటి రేవు కాడ నీల మేఘ శ్యాముడు చూడ అమ్మో ఓయమ్మో నీలాటి రేవు కాడ నీల మేఘ శ్యాముడు చూడ చల్లనైన ఏటి నీరు సల సలమని మరిగిందమ్మ అమ్మొ ఓయమ్మో సెట్టు దిగని సిన్నోడమ్మ బెట్టు వదలకున్నాడమ్మ సెట్టు దిగని సిన్నోడమ్మ బెట్టు వదలకున్నాడమ్మ అమ్మమ్మో ఓయమ్మో జట్టూ కట్ట రమ్మంటుంటే పట్టూ దొరక కున్నాడమ్మ అమ్మో ఓయమ్మో అమ్మమ్మో ఓయమ్మో... తూరుపమ్మ దక్షినమ్మ పదమరమ్మ ఉత్తరమ్మ తూరుపమ్మ దక్షినమ్మ పదమరమ్మ ఉత్తరమ్మ పారాహుషార్ పారాహుషార్ పారాహుషార్ పారాహుషార్
సిగ్గు పూబంతి పాట సాహిత్యం
చిత్రం: స్వయంకృషి (1987) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ, యస్.జానకి సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి చరణం: 1 విరజాజి పూల బంతి అర చేత మోయలేని విరజాజి పూల బంతి అర చేత మోయలేని సుకుమారి ఈ సిన్నదేనా శివుని విల్లు మోసిన జాణ ఈ సిన్నదేనా ఔరా అని రామయ కన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు ఔరా అని రామయ కన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు సూసి అలకలొచ్చిన కలికి సూసి అలకలొచ్చిన కలికి ఏసినది కులుకుల మెలికి సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి చరణం: 2 సిరసొంచి కూరుసున్న గురిసూసి సేరుతున్న సిరసొంచి కూరుసున్న గురిసూసి సేరుతున్న సిలకమ్మ కొన సూపు సౌరు బొండు మల్లె చెండు జోరు సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ్య రూపు సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ్య రూపు మెరిసే నల్ల మబ్బైనాది మెరిసే నల్ల మబ్బైనాది వలపు జల్లు వరదైనాది సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి
కాముడు కాముడు పాట సాహిత్యం
చిత్రం: స్వయంకృషి (1987) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: సి.నారాయణ రెడ్డి గానం: యస్.పి.బాలు, యస్.జానకి కాముడు కాముడు
మంచి వెన్నెల ఇపుడు పాట సాహిత్యం
చిత్రం: స్వయంకృషి (1987) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: మహాకవి క్షేత్రయ్య గానం: యస్.పి.శైలజ మంచి వెన్నెల ఇపుడు