Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Tatamma Kala (1974)




చిత్రం: తాతమ్మ కల (1974)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నటీనటులు: బాలక్రిష్ణ , యన్.టి.రామారావు, హరిక్రిష్ణ
దర్శకత్వం & నిర్మాత: యన్.టి.రామారావు
విడుదల తేది: 30.08.1974



Songs List:



ఎవరనుకున్నారు పాట సాహిత్యం

 
చిత్రం: తాతమ్మ కల (1974)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు
గానం: భానుమతి రామకృష్ణ 

పల్లవి: 
ఎవరనుకున్నారు 
ఎవరనుకున్నారు ఎవరు కలగన్నారు
ఎవరనుకున్నారు ఎవరుకలగన్నారు
ఎవరెందుకు పుడతారో ఏపని సాధిస్తారో
ఎవరెందుకు పుడతారో ఏపని సాధిస్తారో
ఎవరనుకున్నారు ఎవరు కలగన్నారు

చరణం: 
అష్టమ గర్బాన కృష్ణు డవతరించునన్నారా
దేవుడనుచు జనం జేలు కొడతారనుకున్నారా
ఆరవ కొడుకు గాంధీ పుడతాడనుకున్నారా
పుట్టి స్వరాజ్యాన్ని తెచ్చి పెడతాడనుకున్నారా
గంపెడు బిడల కోరికవుండి నేను కన్నానా.
పుట్టమంటె పుడతారా వద్దంటే ఆగుతార

చరణం: 
ఇంటాయన అలిగి ఎపుడొ బెరాగె పోలేదా
అందిన కొడుకూ కోడలు పుటిముంచి పోలేదా
ఇంటాయన అలిగి ఎపుడో బెరాగె పోలేదా
అందిన కొడుకూ కోడలు పుటిముంచి పోలేదా
వంశముదరిసానికి మనమడిక మిగిలావా
నా బంగారపు కలనే పండిస్తావా బాబూ
నా బంగారపు కలనే పండిస్తావా.




అయ్య లాలీ ముద్దులయ్య లాలీ.. పాట సాహిత్యం

 
చిత్రం: తాతమ్మ కల (1974)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు
గానం: భానుమతి రామకృష్ణ 

పల్లవి:
అయ్య లాలీ ముద్దులయ్య లాలీ..
మురిపాల బుజ్జి ముసలయ్యలాలీ
అయ్య లాలీ ముద్దులయ్య లాలీ..
మురిపాల బుజ్జి ముసలయ్యలాలీ
లాలీ.. లాలీ.. లాలీ.. లాలీ

చరణం: 1
తాతవే మనవడిగా పుట్టుకొచ్చావా..
నన్ను జూచి చిలిపిగా నవ్వుతున్నావా
తాతవే మనవడిగా పుట్టుకొచ్చావా..
నన్ను జూచి చిలిపిగా నవ్వుతున్నావా

ఎన్నాళ్ళకో నిన్ను మళ్ళీ చూశానూ..
ఎన్నాళ్ళకో నిన్ను మళ్ళీ చూశానూ
ఇందుకేనేమో నేను బ్రతికే ఉన్నానూ

అయ్య లాలీ ముద్దులయ్య లాలీ..
మురిపాల బుజ్జి ముసలయ్య లాలీ
లాలీ.. లాలీ.. లాలీ.. లాలీ

చరణం: 2
గొప్ప యింటి వాళ్ళమనే పేరొకటే మిగిలిందీ..  
చెప్పుకుంటే సిగ్గు అప్పెంతో పెరిగిందీ
ఈ తాతమ్మ ఇంకేమి కట్టబెట్టేనూ..
ఈ తాతమ్మ ఇంకేమి కట్టబెట్టేనూ
బుగ్గ గిల్లి నీకింత ఉగ్గు పట్టేనూ

అయ్య లాలీ ముద్దులయ్య లాలీ..
మురిపాల బుజ్జి ముసలయ్య లాలీ
లాలీ.. లాలీ.. లాలీ.. లాలీ

చరణం: 3
తిన్నదంతా కూడా జీర్ణమైపోవాలీ..
వెయ్యేనుగుల బలం నీకు రావాలీ
నీ పెళ్ళిదాకా నే బ్రతికే ఉండాలీ..
నీ పెళ్ళిదాకా నే బ్రతికే ఉండాలీ
నీ కళ్ళ ముందే నేను రాలిపోవాలీ

అయ్య లాలీ ముద్దులయ్య లాలీ..
మురిపాల బుజ్జి ముసలయ్య లాలీ
లాలీ.. లాలీ.. లాలీ.. లాలీ




ఏమండీ వదినగారు పాట సాహిత్యం

 
చిత్రం: తాతమ్మ కల (1974)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

పల్లవి:
ఏమండి వదినగారూ.. ఏమండి వదినగారూ.. చెప్పండి కాస్త మీరూ
ఏమండి వదినగారూ..  చెప్పండి కాస్త మీరూ

మా అన్నయ్యను బుట్టలోన వేసుకున్నారూ..
మా అన్నయ్యను బుట్టలోన వేసుకున్నారూ..
ఎలా వేసుకున్నారూ . . ఏమండి వదినగారూ

చరణం: 1
కాలేజి రోడ్డుమీదా కన్నుకొట్టావా..  సినిమాలో సీటు వెనక కాలు గోకావా
కాలేజి రోడ్డుమీదా కన్నుకొట్టావా..  సినిమాలో సీటు వెనక కాలు గోకావా

అబ్బబ్బ ఏమి లక్కు..  ఇక నో మోరు చిక్కు
అబ్బబ్బ ఏమి లక్కు..  ఇక నో మోరు చిక్కు
ఇది న్యూ మోడలు ట్రిక్కూ.. హహహహహ . .

ఏమండి వదినగారూ.. చెప్పండి కాస్త మీరూ
మా అన్నయ్యను బుట్టలోన వేసుకున్నారూ
ఎలా వేసుకున్నారూ . . ఏమండి వదినగారూ

చరణం: 2
కట్నం తప్పే వీలు కనిపెట్టావే.. రెడీమేడ్ హస్బెండును పట్టేసావే
కట్నం తప్పే వీలు కనిపెట్టావే.. రెడీమేడ్ హస్బెండును పట్టేసావే

వేసావులే బలె ఎత్తు.. చేసావులే అన్నను చిత్తు వేసావులే బలె ఎత్తు..
చేసావులే అన్నను చిత్తు.. చెప్పవే ఆ గమ్మత్తు.. ఒహో అహా

ఏమండి వదినగారూ..  ఏమండి వదినగారూ.. చెప్పండి కాస్త మీరూ
ఏమండి వదినగారూ.. చెప్పండి కాస్త మీరూ..

మా అన్నయ్యను బుట్టలోన వేసుకున్నారూ
మా అన్నయ్యను బుట్టలోన వేసుకున్నారూ..
ఎలా వేసుకున్నారూ..  ఏమండి వదినగారూ






కోరమీసం కుర్రోడా పాట సాహిత్యం

 
చిత్రం: తాతమ్మ కల (1974)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల, భానుమతి రామకృష్ణ 

పల్లవి: 
కోరమీసం కుర్రోడా కొట్టచ్చే సొగసోడా !
కోరమీసం కురోడా కొట్టచ్చే సొగసోడా :
కత్తెర జులపాలోడా కాయరంగు పంచోడ
ఏమయ్యో
చూడకళ్లు చాలవయ్య నీసోకూ
నీ చుక్కలాంటి చక్కదనం దిష్టి తగిలి పొయ్యేను
చూడకళ్లు చాలవయ్య నీ సోకు

పల్లవి: 
పసుపుకొమ్ము చాయదాన పల్లదనపు వయసుదాన
పసుపుకొమ్ము చాయదాన పలదనపు వయసుదాన
పచ్చల కమ్మలదానా బాడీ బందులదానా ఓశమ్మీ
గుబులుగుబులు గున్నాదె ఇయ్యాలా
నీచక్కిలిగింతలు పెటే జాణతనం చూస్తుంటే
గుబులుగుబులు గున్నాదె ఇయ్యాల

చరణం: 
మగసిరి ఆసామిగ నువ్ మేడిబటి దున్నుతుంటే
ఏటేటా ఒకయకరం ఇబ్బడిగా కలుపుతుంటే
సైరా మగాడా అని నే వాటేసుకోవాలి
వెచ్చదనం ముంచుకొచ్చి వళ్లు పులకరించాలి

చరణం: 
ఏటిగట్టుమీద నువ్వు ఎగురుకుంటురావాలి
నే తూరుపోత పోసుంటే తోడుగ నువ్ నిలవాలి
నే సద్దిమూట విప్పితే నువ్ సరసనకూర్చోవాలి
ముద్దముద్దకూ నిన్ను ముదుబెట్టుకోవాలి
ఊ గుబులుగుబులు గున్నాదె యియ్యాల
నీ చక్కిలిగింతలు పెట్టే జాణతనం చూస్తుంటే
గుబులు గుబులు గున్నా యియ్యాల

చరణం: 
ఎంతటి ఉబలాటమున్న వెనకముందుచూడాలి
గజ్జెల గుర్రాన్ని కాస్తకళ్లె మేసిపట్టాలి
వేళగాని వేళయిది అటూయిటూ జనముందీ
సరసానికి లోగిలుంది దారిలోన బేరమేంది

చరణం: 
నీ ఓరగంటి చూపులోనా కొంటెతనం కులుకుతుంటే
వుల్లి పొర కొత్తచీర వొంటిమీద నిలవకుంటే
పచ్చిపచ్చిగా యేదో పిచ్చి రేగుతున్నాదీ
పగలూ రేయనకుండా పురుగు తొలుస్తున్నాది.
గుబులు గుబులు గున్నాదె ఇయ్యాల

పల్లవి: 
కోరమీసం కుర్రోడా కొట్టచ్చే సొగసోడ
కత్తెర జులపాలోడా కాయరంగు పంచోడ
ఏమయ్యో
చూడకళ్ళు చాలవయ్య నీ సోకు
నీ చుక్కలాంటి చక్కదనం తగిలిపొయ్యేను
చూడకళ్ళు చాలవయ్య నీ సోకు
హె గుబులు గుబులు గున్నాదె ఇయ్యాల
అహ గుణులు గుబులు గున్నాదె ఇయ్యాల




శనగపూల రైకా దానా.. పాట సాహిత్యం

 
చిత్రం: తాతమ్మ కల (1974)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల

పల్లవి:
శనగపూల రైకా దానా.. జారుపైటా చిన్నాదానా
శనగపూల రైకా దానా..  జారుపైటా చిన్నాదానా
ఆడే నీ వాలకం పసిగట్టానే.. నాదానా నువ్వేననీ కనిపెట్టానే

శనగపూల రైకా దానా.. జారుపైటా చిన్నాదానా
శనగపూల రైకా దానా . . జారుపైటా చిన్నాదానా
ఆడే నీ వాలకం పసిగట్టానే.. నా దానా నువ్వేననీ కనిపెట్టానే

చరణం: 1
ఘల్లు ఘల్లున అందెలు మోగుతుంటే..  ఘల్లు ఘల్లున అందెలు మోగుతుంటే
గుమ్మెత్తించే వాసన రేగుతుంటే.. ఏ పక్క చప్పుడైనా . . ఏ దిక్కు అలికిడైనా
నువ్వే వస్తుంటివనీ అనుకుంటినే.. నీతోడూ ఒట్టేసి చెబుతుంటినే

శనగపూల రైకా దానా.. జారుపైటా చిన్నాదానా
శనగపూల రైకా దానా.. జారుపైటా చిన్నాదానా
ఆడే నీ వాలకం పసిగట్టానే.. నా దానా నువ్వేననీ కనిపెట్టానే

చరణం: 2
గుబ్బల బరువున నడుము ఊగుతుంటే.. హంస లాగ నువ్వు అడుగు వేస్తుంటే
గుబ్బల బరువున నడుము ఊగుతుంటే.. హంస లాగ నువ్వు అడుగు వేస్తుంటే

వయ్యారమంత చూసి అబ్బబ్బ పళ్ళు పులిసీ
వయ్యారమంత చూసి అబ్బబ్బ పళ్ళు పులిసీ
పంట చేను సిగ్గుతోటి తల వంచిందే.. హహహహహ
పకాపకా కొంటే నవ్వు కుమ్మరించిందే

శనగపూల రైకా దానా.. జారుపైటా చిన్నాదానా
శనగపూల రైకా దానా.. జారుపైటా చిన్నాదానా
ఆడే నీ వాలకం పసిగట్టానే.. నా దానా నువ్వేననీ కనిపెట్టానే

చరణం: 3
రంభ లాగ నువ్వు ఎదుట ఉంటేనూ.. రామచిలక లాగ కులుకుతుంటేనూ
రంభ లాగ నువ్వు ఎదుట ఉంటేనూ.. రామచిలక లాగ కులుకుతుంటేనూ
స్వర్గాన్ని కాదంటా నిన్నే కోరుకుంటా
నా భాగ్యదేవతవి నీవని మురుచుకుంటానే.. భద్రంగా గుండెల్లో దాచుకుంటానే

శనగపూల రైకా దానా..  జారుపైటా చిన్నాదానా
శనగపూల రైకా దానా.. జారుపైటా చిన్నాదానా
ఆడే నీ వాలకం పసిగట్టానే.. నా దానా నువ్వేననీ కనిపెట్టానే



పాండవులు పాండవులు పాట సాహిత్యం

 
చిత్రం: తాతమ్మ కల (1974)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు
గానం: యస్.పి.బాలు, మాధవపెద్ది సత్యం, కోవెల శాంత 

ఆహూ ఊహూ
ఆహూ ఊహూ
పాండవులు పాండవులు తుమ్మెదా
పంచపాండవులె తుమ్మెదా

ఆహూ ఊహూ
మనుషులే దేవుళ్లు తుమ్మెదా
మంచిమనసూ వున్నవాళ్ళు తుమ్మెదా

దొరసాని లోగిలీ తుమ్మెదా
చలంగవుండాలి తుమ్మెదా
ఎంతో జయముగా వుండాలి తుమ్మెదా....
తాలే లిల్లియ్యలో శివతాలే లిల్లి య్యలో....
హై పెద్దింటోళ్ళము దొరసానమ్మో ....

యినుకుంటే యివరమ్ము చెబుతావమ్మోవ్
హై తాలే లిల్లియ్యలో శివతాలే లిల్లియ్యలో
కులము చూసుకొని మిడిసిపడతారూ ....
మతాన్ని గట్టుక బతుకుతుంటరూ

కాసులకే దాసోహమంటరు
మోసాలలో కుళ్ళికుళ్ళి చస్తరు
తాలే లిల్లియ్యలో శివతాలే లిల్లి య్యలో
హెహెతాలే తల్లియ్యలో శివతాలే లిల్లియ్యలో
శాత్రాలెన్నో సతికామంటరు
బీదాబిక్కిని కొట్టుకుంటారు.....
ఊపిరికాసా ఊరేగినపుడు
మా సేతిలోబడి మట్టయిపోతరు....

మహాప్రభో జయాభి జయభవః దిగ్విజయీభవ
దాతలంటే మిమ్ము తలచంగవచ్చు
ముందుగా మీకీ రి పొగడంగవచ్చు
శిబిచక్రవర్తి మీ చెయికింద వొచ్చు
బలిచక్రవర్తినే బిగదీయవచ్చు

భువిని రావమ్మవంటి పుణ్యాత్ములెవరు
దుషసంహార నరశింహ దురితదూర
శుభోజయం కలగాలి
బహుపరాక్ పండుగ పుణ్యకాలం:
రాయభట్టులం తల్లీ రాయభట్టులం




సై అన్నానురా పాట సాహిత్యం

 
చిత్రం: తాతమ్మ కల (1974)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

సై అన్నానురా మనసై అన్నానురా
అన్నానురా మనసే అన్నానురా
నీవని నావాడివీ నీవేనని
గడసరి మొనగాడివనీ అన్నానురా
సె అన్నానురా మనసే అన్నానురా

మధువులు చిందే పెదవులకూ మరింతతీపి కావాలనీ
మత్తుగ వాలే కన్నులకూ మరిచితకై పు కావాలనీ
మరిగే వెచ్చనికౌగిలీ మరింతసలసల కాగాలనీ
అనుకున్నానురా
అందుకే సై అన్నానురా మనసై అన్నానురా

నీ మగసిరి చూసీచూడగనే సగమైపోయానురా
బుసకొటే నీకోడె వయసునే కసిగా కోరానురా 
నీసందిటకంటే స్వర్గం వేరే లేదనుకున్నానురా
అనుకున్నానురా
అందుకే సై అన్నానురా మనసై అన్నానురా



ఏ మనిషి పాట సాహిత్యం

 

చిత్రం: తాతమ్మ కల (1974)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు 

ఏయ్ మనిషీ-ఏ హేయ్ మనిషి
ఏయ్ మనిషి ఏహే మనిషి

మరచిపో నువు ఒక మనిషివనీ
మరచిపో నువు ఒక మనిషివనీ
అను.... అను.... అనుక్షణం
హరేరామ హరేక్రిష్ణ హరేరామ హరే క్రిష్ణ ॥ హరే ॥

చరణం: 
గుళ్లోపెట్టి దేవునికే నామమేశావ్
పార్టీలుకటి నమ్మినోళ్ల కొంపదీశావ్ ॥గుళ్ళో||
గదెక్కి లంచాలే తెగ గుంజావ్
బుది గడితిని దేశాన్నే దిగమింగావ్
జానెడంత పొటకొరకు చచ్చేటంత పెనుగులాట
తొక్కులాట తోపులాట కుమ్ములాట గుదులాట
ఆడేగుండె ఆగిందంటే ఆఖరికీ ఆరడుగుతే డేటా

చరణం: 
అయ్యేమొ ఆఫీసు ఫెళ పాలు
అమ్మేమొ లేడీసు కబ్బుపాలు
ఉన్నకాస్త ఆస్తేమొ అప్పుపాలు
కన్నబిడ్డలేమో బజారుపాలు

అమ్మలేదు అయ్యలేదు పిల్ల లేదు పీచులేదు
కొంపలేదు గోడులేదు నీదన్నది ఏదీలేదు
ఇహములేదు సరమూలేదు ఎవరికివారే యమునాతీరే
ఏయ్ మనిషి ఏహేయ్ మనిషి
అను అనూ అనుక్షణం
హరేరామ హరేక్రిష్ణ హరేరామ హరేక్రిష్ణ హరే
సంపాదన చాలక వక ఏడుపు. 
పన్నులూ కట్టలేక వక ఏడుపూ
ఖర్చులూ తగ్గించలేక వక ఏడుపు
వెరశి నీ బ్రతుకంతా వకే ఏడుపూ
జ్ఞానపత్రి దమ్ముకొట్టి గుండెనిండ గుక్కపట్టి
నేలవిడిచి పైకిపైకి తేలి తేలిపోతుంటే
ఇంద్రలోకం చంద్రలోకం కంటిముందె
ఏయ్ మనిషి ఏహే మనిషి
అను అనూ అనుక్షణం
కనపడతాయ్ భాయీ




తారు రోడ్లుపై గింజలు పండవురా పాట సాహిత్యం

 
చిత్రం: తాతమ్మ కల (1974)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: మాధవపెద్ది రమేష్ 

భూమిని నమ్మితే బ్రతుకులున్నవి 
పొలం నవ్వితే గతులు వున్నవి 
తారు రోడ్లుపై గింజలు పండవురా  ఓరయ్యా
కబురులుతోటి కడుపులు నిండవురా

Most Recent

Default