Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Vamsi (2000)





చిత్రం: వంశీ (2000)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: మహేష్ బాబు, నమ్రతా శిరోడ్కర్
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: జి. ఆది శేషగిరిరావు
విడుదల తేది: 04.10.2000



Songs List:



వేయించు కుంటే బాగుంటది పాట సాహిత్యం

 
చిత్రం: వంశీ (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువన చంద్ర 
గానం: సుక్విందర్ సింగ్, చిత్ర  

వేయించు కుంటే బాగుంటది
పచ్చాని గాజులు నీ చేతికి
పెట్టించుకుంటే బాగుంటది
ఎర్రాని బొట్టునీ నుదుటికి

వేయించు కుంటే బాగుంటది
పచ్చాని గాజులు నీ చేతికి
పెట్టించుకుంటే బాగుంటది
ఎర్రాని బొట్టునీ నుదుటికి

చోటు చూడాలిగా తెర చాటు చేయాలిగా
వేట సాగాలిగా కొన గోట మీటాలిగా
ఈడు ఈలెయ్యని తొలి కోడి కూసెయ్యని
నాడి పట్టేసుకో మనువాడి చుట్టేసుకో  


వేయించు కుంటే బాగుంటది
పచ్చాని గాజులు నీ చేతికి
పెట్టించుకుంటే బాగుంటది
ఎర్రాని బొట్టునీ నుదుటికి

కన్నుబడి వెన్ను మరి సన్నబడిందే
యమ రెచ్చిపడి పొంగులన్ని దోచేయ్ మందే
బెంగపడి కొంగుముడి చిక్కు పడిందే
ప్రియ సిగ్గుపడే బుగ్గల్లో తేనూరిందొయ్
తేనెల్ల వాన కురవాలంట నూరేళ్ళ  తాపం తీరాలంట
వరదల్లే వయసే ఉరకాలంట ముంచేసి దాన్ని గెలవాలంట

పండు చేజిక్కని సిరి బెండు పులకించని
నాడి పట్టేసుకో మనువాడి చుట్టేసుకో  



వెచ్చ వెచ్చగా ఉంది చిలిపి కౌగిలి పాట సాహిత్యం

 
చిత్రం: వంశీ (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: దేవి శ్రీ ప్రసాద్

వెచ్చ వెచ్చగా ఉంది చిలిపి కౌగిలి
అంబరానికి నేడే ప్రేమ జాబిలి
ఊహలకె ఊపిరొచ్చేలే ఊసులకే ఊహ తెలిసెలే
ఊరించే ఆశలెన్నొ మధిలో...
మనసంతా పరవసించెనే నీకోసం పరితపించెలే
నీరూపం నిండివుంది ఎదలో

వెచ్చ వెచ్చగా ఉంది చిలిపి కౌగిలి
అంబరానికి నేడే ప్రేమ జాబిలి

నీ మాటల్లో ఏవో సరిగమలు
నీ మౌనంలో ఏవో గుసగుసలు
నీ కన్నుల్లో రంగుల రాగాలు
ఆరాదంలో ఏవో విరహాలు
ఓ చెలియా చెంత చేరునా
మత్తెక్కె మాయ చేయన
నీ పెదవిని పాలకరించిపోనా
మురిపించే మాట చెప్పనా
కరిగించే కౌగిలివ్వనా
ముద్దులనే మూటగట్టి తేనా

వెచ్చ వెచ్చగా ఉంది చిలిపి కౌగిలి
అంబరానికి నేడే ప్రేమ జాబిలి

నీ సిరిమువ్వల సవ్వడి నను తాకే ఓ
నీ చిరునవ్వుల వల నను బంధించే
నా హృదయంలో అలజడి వైనావే ఓ
నా శ్వాసకు నువ్ శృతివై నిలిచావే
ప్రియురాలా ప్రేమ పంచుకో
పరువాల పల్లవందుకో
గుండెల్లో నన్ను దాచుకోవే...
అధర మాధరాలవెందుకు
వయసార పిలిచినందుకు
తనువార నన్ను దోచినావే

వెచ్చ వెచ్చగా ఉంది చిలిపి కౌగిలి
అంబరానికి నేడే ప్రేమ జాబిలి
మనసంతా పరవసించెనే నీకోసం పరితపించెనే
నీరూపం నిండివుంది ఎదలో
ఊహలకె ఊపిరొచ్చేలే ఊసులకే ఊహ తెలిసెలే
ఊరించే ఆశలెన్నొ మధిలో

వెచ్చ వెచ్చగా ఉంది చిలిపి కౌగిలి
అంబరానికి నేడే ప్రేమ జాబిలి



ABC దాటిందో లేదో గాని సుందరి పాట సాహిత్యం

 
చిత్రం: వంశీ (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహదేవన్

పల్లవి:
ABC దాటిందో లేదో గాని సుందరి
BBC వార్తల్లో ఎక్కేసింది అల్లరి
అబ్బోసి పైటేసి మెరిసింది మొన్నే మరి
ఒగ్గేసి లాగేసి కవ్విస్తుంది పోకిరి
నువ్వెంత అంటే నువ్వెంత అంటు
చెలరేగే చిన్నారి
నా అంతవాడితో పంతమాడి
కేరింతలాడే కన్యాకుమారి

పిల్లనగ్రోవూదానంటే గల్లంతైపోవాలి
ఓ తీగె మీటానంటే తూనిగై తూగాలి
రాగాలే అందుకుంటే నా వెంటే రావాలి
థింతానా దరువేస్తుంటే అందాలే ఆడాలి

ABC దాటిందో లేదో గాని సుందరి
BBC వార్తల్లో ఎక్కేసింది అల్లరి

చరణం: 1
ఓ ప్రేమ అనిపించే ఊపులో
FTV ఛానెల్ లో కనిపించే షేప్ లో
టాప్ రే టాప్ ధడ పెంచే టైప్ లో
బ్రేఓస్ బేబీలాగ బెదిరించే సోకులు
ఆ వైపు నువ్వు కాసేపు చూస్తే గంతై పోతావయ్యో
ఆ పాప నవ్వులో కైపు తాకితే పాతాళంలో పడిపోతావయ్యో 
నీ పాదం తడబడు తుంది గతి తప్పే తాళంలో
నా పాటే చెడిపోతుంది శృతి మించే మైకంలో
నీ ప్లానే పాడవుతుంది మారిపోయే నేరంలో
నీ బ్యాలన్సే పోతుంది మతిపోయే తొందరలో

ABC దాటిందో లేదో గాని సుందరి
BBC వార్తల్లో ఎక్కేసింది అల్లరి

చరణం: 2
హాయ్ హాయ్ హాయ్ అని సాగే ఆటలో
హమ్మా హమ్మా అంటూ ఊరేగే పాటల్లో
రయ్ రయ్ రయ్ పరిగెత్తే హోరులో
రంగేలి హంగామ తెగ తూగే జోరులో
జాగ్రత్త పాపలు చిలిపి జప్పులు ఏమై పోతారో
కర్చీఫ్ క్లాత్ లో దాచుకున్న 
మీ రంగు పొంగు ఎగిరే వేగంలో
ఊరించే మీ చుట్టూరా ఉల్లుకల్లున్నాయి
వీలుంటే ఆశతీరా పలహరం చేస్తాయి
మీ వళ్ళో వయ్యారాలు పరువే తీసేస్తాయి
పరదాలో బందించండి భద్రంగా ఉంటాయి

ABC దాటిందో లేదో గాని సుందరి
BBC వార్తల్లో ఎక్కేసింది అల్లరి
అబ్బోసి పైటేసి మెరిసింది మొన్నే మరి
ఒగ్గేసి లాగేసి కవ్విస్తుంది పోకిరి
నువ్వెంత అంటే నువ్వెంత అంటు
చెలరేగే చిన్నారి
నా అంతవాడితో పంతమాడి
కేరింతలాడే కన్యాకుమారి

పిల్లనగ్రోవూదానంటే గల్లంతైపోవాలి
ఓ తీగె మీటానంటే తూనిగై తూగాలి
రాగాలే అందుకుంటే నా వెంటే రావాలి
థింతానా దరువేస్తుంటే అందాలే ఆడాలి



ఓహో సోనియా సోఫియా సుప్రియ పాట సాహిత్యం

 
చిత్రం: వంశీ (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్

ఓహో సోనియా సోఫియా సుప్రియ
డోంట్ వర్రీ బీ హ్యాపీ
మీ సోకే సోకితే ఊగదా ఇండియా
డోంట్ వర్రీ బీ హ్యాపీ

ఓహొ సోనియా సోఫియా సుప్రియ
డోంట్ వర్రీ బీ హ్యాపీ
మీ సోకే సోకితే ఊగదా ఇండియా
డోంట్ వర్రీ బీ హ్యాపీ

చేయి చేయి కలుపుకుంటూ
చెయ్యి చెయ్యి ఎంజాయ్
రేయి పగలు పాడుకుంటూ
చెయ్యి చెయ్యి ఎంజాయ్
యవ్వనాన్ని వాడుకుంటూ
చెయ్యి చెయ్యి ఎంజాయ్
అందమంత కలుపుకొని
చెయ్యి చెయ్యి ఎంజాయ్

Understand

ఓహొ సోనియా సోఫియా సుప్రియ
డోంట్ వర్రీ బీ హ్యాపీ
మీ సోకే సోకితే ఊగదా ఇండియా
డోంట్ వర్రీ బీ హ్యాపీ

ఓహొ సోనియా సోఫియా సుప్రియ
డోంట్ వర్రీ బీ హ్యాపీ
మీ సోకే సోకితే ఊగదా ఇండియా
డోంట్ వర్రీ బీ హ్యాపీ

ఇంకా ఎందుకీ కోకలు కొంగులు
డోంట్ వర్రీ బీ హ్యాపీ
ఇందా వేసుకో స్కిన్ టైట్ డ్రెస్సులు
డోంట్ వర్రీ బీ హ్యాపీ
లోకమంత చేరుకున్న షేషన్ ఫ్యాషన్
లోకులంత కోరుతున్న రేషన్న్ ఫ్యాషన్
నీకు నేను చెప్పుతున్న గ్లూషన్ ఫ్యాషన్
సోకు మీద అద్దుతున్న లోషన్ ఫ్యాషన్
పాత బ్రాండ్ మర్చిపోండి
కొత్త ట్రెండ్ నేర్చుకోండి
ఫాలో మీ

ఓహొ సోనియా సోఫియా సుప్రియ
డోంట్ వర్రీ బీ హ్యాపీ
మీ సోకే సోకితే ఊగదా ఇండియా
డోంట్ వర్రీ బీ హ్యాపీ

ఓహొ సోనియా సోఫియా సుప్రియ
డోంట్ వర్రీ బీ హ్యాపీ
మీ సోకే సోకితే ఊగదా ఇండియా
డోంట్ వర్రీ బీ హ్యాపీ

నా చెయ్యే తాకితే కాకులే చిలకలౌ
డోంట్ వర్రీ బీ హ్యాపీ
నా చూపే సోకితే కాపరే సిల్వరౌ
డోంట్ వర్రీ బీ హ్యాపీ
మోడలింగ్ రింగ్ లోన మోనాల్ నేను
ఐడియాలు పొంగుతున్న మైండ్ బ్లోయర్ నేను
ఆడపిల్ల గుండెపైనద చైను నేను
ఆంధ్రా నాడు పాడుతున్న ట్యూన్ నేను
ఏకలవ్యుడంతటోన్ని ఏక లవ్ చెయ్యువాడ్ని

ఓహొ సోనియా సోఫియా సుప్రియ
డోంట్ వర్రీ బీ హ్యాపీ
మీ సోకే సోకితే ఊగదా ఇండియా
డోంట్ వర్రీ బీ హ్యాపీ

ఓహొ సోనియా సోఫియా సుప్రియ
డోంట్ వర్రీ బీ హ్యాపీ
మీ సోకే సోకితే ఊగదా ఇండియా
డోంట్ వర్రీ బీ హ్యాపీ



కోయిలమ్మ పాడుతున్నది పాట సాహిత్యం

 
చిత్రం: వంశీ (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత

కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో 
కన్నే బొమ్మ ఆడుత్తున్నది
పూలకొమ్మ ఊగుతున్నది 
గుండెల్లో కోరికమ్మ రేగుతున్నది

వేడి పెంచక ఏడిపించక 
ఈడు పంచి ఊరడించ రాద
గోరువెచ్చగా గోల రెచ్చగా
జోడుకట్టి జోలకొట్ట రాదా
అయితే పద ఓ సంపద తీర్చేద నీ బాధ 

కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో 
కన్నే బొమ్మ ఆడుత్తున్నది
పూలకొమ్మ ఊగుతున్నది 
గుండెల్లో కోరికమ్మ రేగుతున్నది

సున్నితాల చూపులోన కన్నె చూపు జారిపడ్డదే
కన్ను దానినాపలేక కన్నెదాని సిగ్గు చెడ్డదే
వదిలితే మరి దొరకదే ఈ చోటెంత బాగుందే 
ఓ బెదిరితే కథ కదలదే అని తహ తహ తరుముతున్నదే
ఈడాపద తీరేదెల ఎదోటి చెయ్యందే

కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో 
కన్నే బొమ్మ ఆడుత్తున్నది
పూలకొమ్మ ఊగుతున్నది 
గుండెల్లో కోరికమ్మ రేగుతున్నది

లెక్క చేయమాకు నువ్వు సిగ్గులెంత బుగ్గ నొక్కినా
పక్కకెళ్ళి పోకు నువ్వు చుక్కలన్నీ నిగ్గి చూసినా
అడగనా ఒక బహుమతి నువ్వు చీపాడు అనుకుంటే ఓ
అడగకే ఎవరనుమతి చెలి తడి తడి పెదవులు అందితే
కయ్యానికే తయ్యారయ్యి సయ్యాట సయ్యందే

కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో 
కన్నే బొమ్మ ఆడుత్తున్నది
పూలకొమ్మ ఊగుతున్నది 
గుండెల్లో కోరికమ్మ రేగుతున్నది

వేడి పెంచక ఏడిపించక 
ఈడు పంచి ఊరడించ రాద
గోరువెచ్చగా గోల రెచ్చగా
జోడుకట్టి జోలకొట్ట రాదా
అయితే పద ఓ సంపద తీర్చేద నీ బాధ  



సరిగమ పదని సరి పాట సాహిత్యం

 
చిత్రం: వంశీ (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఎస్.పి.బాలు, కల్పన

సరిగమ పదని సరి
తస్సాదియ్య సందిట్లోన సరసాలే మరి
రారాజల్లే వస్తదిగా మరి
నా సామిరంగా చూపులు గుచ్చి చూసెయ్రో గురి

సరిగమ పదని సరి
తస్సాదియ్య సందిట్లోన సరసాలే మరి
రారాజల్లే వస్తదిగా మరి
నా సామిరంగా చూపులు గుచ్చి చూసెయ్రో గురి

బుగ్గను చూస్తే బంగినపల్లి
నవ్వుని చూస్తే జూకామల్లి
ఇద్దరమొకటై మళ్ళీమళ్ళీ
హత్తుకుపోదాం రావే బుల్లి

సరిగమ సరిగమ
సరిగమ పద ని సరి
తస్సాదియ్య సందిట్లోన సరసాలే మరి
రారాజల్లే వస్తదిగా మరి
నా సామిరంగా చూపులు గుచ్చి చూసెయ్రో గురి

నవ్వులిస్తావా పిల్లా పువ్వులిస్తావా
గుండెలోన పొంగుతున్న ప్రేమనిస్తావా

ఈడు కుట్టిందా బుజ్జి మోజు పుట్టిందా
కుర్రదాన్ని చూడగానే కాక రెచ్చిందా
సవరిస్తే మోగాలే వీణ చనువిస్తే ఆడాలె జాణ
అబ్బి ఓరబ్బి నీ తుంటరి మాటలు వింటావుంటే
ఏదో ఏదో అయిపోతున్నా అయినా గానీ
నే లొంగను జానీ

సరిగమ పద ని సరి
తస్సాదియ్య సందిట్లోన సరసాలే మరి
రారాజల్లే వస్తదిగా మరి
నా సామిరంగా చూపులు గుచ్చి చూసెయ్రో గురి

కన్నుకొట్టాడే పిల్లడు వెన్ను తట్టాడే
దాచుకున్న అందాలన్నీ దొచిమ్మన్నాడే
చటుముద్దుల్లో ఎంత ఘాటు ప్రేముందో
చెంటకొస్తే చిన్నదాన చెవిలో చెబుతాలే
ముద్దంటే మోజుంది కానీ ఈవేళ నన్నింక పోనీ
అమ్మి ఓలమ్మి నీ టిక్కిరి బిక్కిరి యవ్వారాలు
నాకాడేస్తే చిత్తై పోతవు

తుంటరి పాప నీ కంతటి ఊపా
సరిగమ పదని సరి
తస్సాదియ్య సందిట్లోన సరసాలే మరి
రారాజల్లే వస్తదిగా మరి
నా సామిరంగా చూపులు గుచ్చి చూసెయ్రో గురి

బుగ్గను చూస్తే బంగినపల్లి
నవ్వుని చూస్తే జూకామల్లి
ఇద్దరమొకటై మళ్ళీమళ్ళీ
హత్తుకుపోదాం రావే బుల్లి

సరిగమ సరిగమ
సరిగమ పద ని సరి
తస్సాదియ్య సందిట్లోన సరసాలే మరి
రారాజల్లే వస్తదిగా మరి
నా సామిరంగా చూపులు గుచ్చి చూసెయ్రో గురి

Most Recent

Default