చిత్రం: ఏమాయ చేసావే (2010) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ నటీనటులు: నాగచైతన్య, సమంత దర్శకత్వం: గౌతమ్ మీనన్ నిర్మాత: మంజుల ఘట్టమనేని విడుదల తేది: 26.02.2010
Songs List:
ఆకాశం పాట సాహిత్యం
చిత్రం: ఏమాయ చేసావే (2010) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: నరేష్ అయ్యర్ ఆకాశం
ఆరోమాలే పాట సాహిత్యం
చిత్రం: ఏమాయ చేసావే (2010) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: అల్ఫన్స్ జోసెఫ్ ఆరోమాలే
ఈ హృదయం పాట సాహిత్యం
చిత్రం: ఏమాయ చేసావే (2010) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: అనంత శ్రీరామ్ (English Rap: Blaaz) గానం : విజయ్ ప్రకాష్ , సుజానే , బ్లేజ్ ఈ హృదయం కరిగించి వెళ్ళకే.. నా మరో హృదయం అది నిన్ను వదలదే.. ఎంత మంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా హొ.. నిన్న గాక మొన్న వచ్చి ఏ మాయ చేసావె పిల్లిమొగ్గలేసిందిలా హొసన్నా.. గాలుల్లో నీ వాసన హొసన్నా.. పువ్వుల్లో నిను చూసినా ఏ సందు మారినా ఈ తంతు మారునా నా వల్ల కాదు ఇంక నన్ను నేను ఎంత ఆపినా హొసన్నా.. ఊపిరినే వదిలేస్తున్నా హొసన్నా.. ఊహల్లో జీవిస్తున్నా హొసన్నా.. ఊపిరినే వదిలేస్తున్నా…. హొసన్నా.. everybody wanna know what’ feel like, a feel like, I really wanna be here with you… It’s not enough to say that we are made for each other, It’s love that is Hosanna true… Hosanna…be there when you’re calling out my name Hosanna…feeling like me whole life has changed I never wanna be the same…It’s time we rearrange… I take a step You take a step, I’m here calling out to you… Hello…Hello……Hello…Yo…Hosanna.. రంగు రంగు చినుకులున్న మేఘానివై నువ్వు నింగిలోనే ఉన్నావుగా ఆ తేనే గింజ పళ్ళున్న కొమ్మల్లే పైపైన అందకుండ ఉంటావుగా హొసన్నా.. ఆ మబ్బు వానవ్వదా హొసన్నా.. ఆ కొమ్మ తేనివ్వదా నా చెంత చేరవా ఈ చింత తీర్చవా ఏమంట నేను నీకు అంత కానివాడ్ని కాదుగా హలో హలో హలో హొసన్నా హొసన్నా.. ఆయువునే వదిలేస్తున్నా హొసన్నా.. ఆశల్లో జీవిస్తున్నా హొసన్నా.. ఆయువునే వదిలేస్తున్నా…. హొసన్నా.. ఈ హృదయం కరిగించి వెళ్ళకే.. నా మరో హృదయం అది నిన్ను వదలదే.. ఈ హృదయం కరిగించి వెళ్ళకే.. నా మరో హృదయం అది నిన్ను వదలదే..
కుందనపు బొమ్మ పాట సాహిత్యం
చిత్రం: ఏమాయ చేసావే (2010) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: బెన్నీ దయాల్, కల్యాణి మీనన్ ఆహా.. ఆహాహా.. బొమ్మా నిను చూస్తూ నే రెప్ప వేయటం మరిచా హే.. అయినా హే ఏవో హే కలలు ఆగవే తెలుసా హే తెలుసా నా చూపు నీ బానిస నీలో నాలో లోలో నులివెచ్చనైంది మొదలైందమ్మా ఓ.. కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మా కుందనపు బొమ్మా హొ.. కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన కుందనపు బొమ్మా నువ్వే మనసుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ నినే మరువదు ఈ జన్మ నీ పాదం నడిచే ఈ చోట కాలము కనువైనా ముందే అలలై పొంగిందే హే.. నీకన్నా నాకున్నా బలమింకేంటే ఏంటే వెన్నెల్లో వర్షంలా కన్నుల్లో చేరావు నువ్వే నన్నింక నన్నింకా నువ్వే నా అణువణువు గెలిచావే కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మా కుందనపు బొమ్మా హొ.. కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన కుందనపు బొమ్మా నువ్వే మనసుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ నినే మరువదు ఈ జన్మ చల్లనైనా మంటలో స్నానాలే చేయించావే ఆనందం అందించావే నీ మాట తేటిలో ముంచావే తేల్చావే తీరం మాత్రం దాచావేంటే బొమ్మా కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మా కుందనపు బొమ్మా హొ.. కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన కుందనపు బొమ్మా నువ్వే మనసుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ నినే మరువదు ఈ జన్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మా కుందనపు బొమ్మా హొ.. కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన కుందనపు బొమ్మా నువ్వే మనసుకి వెలుగమ్మా నువ్వే మనసుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ నినే మరువదు ఈ జన్మ నువ్వే మనసుకి వెలుగమ్మా
మనసా మళ్ళీ మళ్ళీ చూశా పాట సాహిత్యం
చిత్రం: ఏమాయ చేసావే (2010) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం : ఏ.ఆర్.రెహమాన్, చిన్మయి, దేవన్ ఏకాంబరం ఎవ్వరికి ఎవ్వరినీ జంటగా అనుకుంటాడో ఆఖరికి వాళ్లనే ఓ చోట కలిపేస్తాడు.. మనసా మళ్ళీ మళ్ళీ చూశా గిల్లీ గిల్లీ చూశా జరిగింది నమ్మేశా జతగా నాతో నిన్నే చూశా నీతో నన్నే చూశా నను నీకు వదిలేశా పై లోకంలో వాడు ఎపుడో ముడి వేశాడు విడిపోదే... విడిపోదే... తను పాల వెల్లంటా నువు వాన జల్లంటా నీలోని ఈ ప్రేమ తీరడం... తీరడం తను కంటి పాపంటా నువు కంటి రెప్పంటా విడదీయలేమంటా ఎవరం... ఎవరం... మనసా మళ్ళీ మళ్ళీ చూశా నీ కళ్లల్లో చూశా నూరేళ్ల మన ఆశ జతగా నాతో నిన్నే చూశా నాతోడల్లే చూశా నీ వెంట అడుగేశా... తీయనైన చీకటిని తలుచుకునే వేకువలో హాయి మల్లె తీగలతో వేచి ఉన్నా వాకిలిలు నింగి నేల గాలి నీరు నిప్పు అన్నీ అవిగో స్వాగతం అన్నాయి... తను పాల వెల్లంటా నువు వాన జల్లంటా నీలోని ఈ ప్రేమ తీరడం... తీరడం తను కంటి పాపంటా నువు కంటి రెప్పంటా విడదీయలేమంటా ఎవరం... ఎవరం... మనసా మళ్ళీ మళ్ళీ చూశా నీ కళ్లల్లో చూశా నూరేళ్ల మన ఆశ జతగా నాతో నిన్నే చూశా నాతోడల్లే చూశా నీ వెంట అడుగేశా... పై లోకంలో వాడు ఎపుడో ముడి వేశాడు విడిపోదే... విడిపోదే... తను పాల వెల్లంటా నువు వాన జల్లంటా నీలోని ఈ ప్రేమ తీరడం... తీరడం తను కంటి పాపంటా నువు కంటి రెప్పంటా విడదీయలేమంటా ఎవరం... ఎవరం... ప్రేమ జగం... ఓ... ఓ... విడుచు క్షణం... ఓ... ఓ... పెళ్లి అనుకుంటే... ఓ... ఓ... కలియుగమే ముగిసేది... ఓ... ఓ... మరణమ్ముతరువాత
శ్వాసే స్వరమై పాట సాహిత్యం
చిత్రం: ఏమాయ చేసావే (2010) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం : కార్తిక్ శ్వాసే స్వరమై సరదాలే పంచే సరిగమవై వెంటనే రా వెలుగై రా నిజమయ్యే కలవై రా నడిపించే అడుగై రా ననుచేరే నాతో రా ఓ శ్వాసే స్వరమై సరదాలే పంచే సరిగమవై వెంటనే రా వెలుగై రా నిజమయ్యే కలవై రా నడిపించే అడుగై రా ననుచేరే నాతో రా ఓ శ్వాసే స్వరమై సరదాలే పంచే సరిగమవై వెంటనే రా వెలుగై రా వయసే నిన్నే వలచి వసంతమున కోకిలై తియ్యంగ కూసీ ఈ శిశిరంలోన మూగబోయి నన్నే చూస్తుందే జాలేసి ఏమో ఏమూలుందో చిగురించే క్షణమే వెంటనే రా వెలుగై రా నిజమయ్యే కలవై రా నడిపించే అడుగై రా ననుచేరి నాతో రా
వింటున్నావా పాట సాహిత్యం
చిత్రం: ఏమాయ చేసావే (2010) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: కార్తిక్ , శ్రేయగోషల్ పలుకులు నీ పేరే తలుచుకున్నా పెదవుల అంచుల్లో అణుచుకున్నా మౌనముతో నీ మదిని బంధించా మన్నించు ప్రియా తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా తొలి సారి నీ మాటల్లో పులకింతల పదనిసలు విన్నా చాలు చాలే చెలియా చెలియా బతికుండగానే పిలుపులు నేను విన్నా ఓ..బతికుండగానే పిలుపులు నేను విన్నా ఏమో ఏమో ఏమవుతుందో ఏదేమైనా నువ్వే చూసుకో విడువను నిన్నే ఇకపైన వింటున్నావా ప్రియా గాలిలో తెల్ల కాగితంలా నేనలా తేలి ఆడుతుంటే నన్నే ఆపి నువ్వే రాసిన ఆ పాటలనే వింటున్నా తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా వింటున్నావా..వింటున్నావా వింటున్నావా వింటున్నావా ఆద్యంతం ఏదో ఏదో అనుభూతి ఆద్యంతం ఏదో అనుభూతి అనవరతం ఇలా అందించేది గగనం కన్నా మునుపటిది భూతలమ్ కన్నా ఇది వెనుకటిది కాలంతోన పుట్టింది కాలం లా మారే మనసే లేనిది ప్రేమ రా ఇలా కౌగిళ్ళల్లో నిన్ను దాచుకుంటా నీ దానినై నిన్నే దారిచేసుకుంటా ఎవరిని కలువని చోటులలోన ఎవరిని తలువని వేళలలోన తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా తొలి సారి నీ మాటల్లో పులకింతల పదనిసలు విన్నా చాలు చాలే చెలియా చెలియా బతికుండగా నీ పిలుపులు నేను విన్నా చాలు చాలే చెలియా చెలియా బతికుండగా నీ పిలుపులు నేను విన్నా ఓ..బతికుండగా నీ పిలుపులు నేను విన్నా