చిత్రం: యుద్దభూమి (1988) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి, జొన్నవిత్తుల గానం: యస్.పి.బాలు, జానకి, చిత్ర నటీనటులు: చిరంజీవి, విజయశాంతి దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు నిర్మాత: కె.కృష్ణమోహన్ రావు విడుదల తేది: 11.11.1988
Songs List:
వయసో నమహా పాట సాహిత్యం
చిత్రం: యుద్ధభూమి (1988) సంగీతం: చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, జానకి వయసో నమహా - వరసే యమహా ఇప్పుడిప్పుడిప్పుడే వయసు వచ్చనే ఒక్కటొక్కటొక్కటి గుర్తు వచ్చనే పచ్చి పచ్చి పచ్చిగా పాట వచ్చనే గిచ్చి గిచ్చి గోలగా జోల పాడెనే సోయలేని ఆరాటం మొంకు చాటు మోమాటం వయసో నమహా - వరసే యమహా ఒక్కటొక్కటొక్కటి తెలిసి వచ్చనే పిట్ట ఈడు కొత్తగా లొట్టలేశనే కచ్చి కచ్చి కచ్చిగా కన్ను కొట్టకే పిచ్చి పిచ్చి పిచ్చిగా రెచ్చగొట్టకే కొంగు చాటు కోలాటం పొందు కోరి పోరాటం తుళ్ళీ పడ్డ ఈడు మీద కళ్ళు సోకితే ఓయబ్బో ఓలమ్మో ఒళ్ళంత జాతరే కెవ్వు మన్న కంటి పాప ఆగకున్నదీ ఆ ఒంపో ఈ సొంపో పారేసి చూడవే చిక్కనైన నడుమ్మీద చీరకట్టు నిలవదాయె ఉన్న గుట్టు వెల్లడాయనే చిక్కి చిక్కి సన్నబడ్డ చక్కనమ్మ బక్క నడుము పక్కకొచ్చి దక్కనివ్వవే చెప్పలేని తప్పలాయె చెప్పబోతె తప్పులాయె నేనెమి కావాలమ్మా వయసో నమహా - వరసే యమహా ఇప్పుడిప్పుడిప్పుడే వయసు వచ్చనే ఒక్కటొక్కటొక్కటి తెలిసి వచ్చనే పచ్చి పచ్చి పచ్చిగా పాట వచ్చనే పిచ్చి పిచ్చి పిచ్చిగా రెచ్చగొట్టకే మోయలేని ఆరాటం - పొందుకోరి పోరాటం విచ్చుకున్న మొగ్గ మీద తుమ్మెదాడదా ఓ లమ్మి నా జిమ్మి గగ్గోలు దేనికే పండు ఉన్న కొమ్మ మీద పిట్టలాడితే నా రంగు నా పొంగు నేనెట్ట దాచనూ టిప్పు టాపు సోకు చూసి ఎప్పుడెప్పుడన్న ఆశ నిప్పులాగ గుప్పుమన్నదే చుక్కలొచ్చి చూడగానె పక్కవేడి చుర్రుమన్న సిగ్గులెట్ట విప్పుకొందునే లప్పలాంటి సోకులన్ని చప్పునొచ్చి అప్పగించు తప్పేమి లేదోయమ్మో వయసో నమహా - వరసే యమహా ఇప్పుడిప్పుడిప్పుడే వయసు వచ్చనే ఒక్కటొక్కటొక్కటి తెలిసి వచ్చనే పచ్చి పచ్చి పచ్చిగా పాట వచ్చనే పిచ్చి పిచ్చి పిచ్చిగా రెచ్చగొట్టకే మోయలేని ఆరాటం - పొందుకోరి పోరాటం
గాలొచ్చి తాకిందమ్మ పాట సాహిత్యం
చిత్రం: యుద్ధభూమి (1988) సంగీతం: చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, జానకి గాలొచ్చి తాకిందమ్మ ఈ పక్కా - ఏ పక్కా పువ్వొచ్చి గుచ్చిందమ్మ ఈ పక్కా - ఏ పక్కా ఈట్తాగైతె ఎట్టాగంట ఎన్నెల్లోనా ఎట్టాగైన సుట్టేయాలి కౌగిల్లోనా మల్లెపూల పక్కమీద రాతిరంతా తియ్య తియ్యని తాపాలన్ని తీర్చాలంటా కొంగొచ్చి తాకిందమ్మ ఈ పక్కా - ఏ పక్కా రేగింది ఏదో తిక్క ఈ పక్కా - ఏ పక్కా ఇట్టాగైతె ఎట్టాగంట ఎన్నెల్లోనా ఎట్టాగైన అడిగిందల్ల ఇవ్వాలంటా మంచు వాన పడతా ఉంటే మంచెకాడా మంచి లాభం మనదేనంట కౌగిల్లోనా వలపు పట్టులో మొదటి మెట్టులో ఒంపు సొంపు మల్లెల పరుపైపోతే ఒక నిద్దుర తీయాలి చిరు ముద్దర వేయాలీ తీపి గుర్తుల రూపు రేకలే తీరే వారు మారీ ఊరిస్తుంటే గిలిగింతలు పెట్టాలి పది అంతలు కట్టాలీ ఇక ముందూ వెనక తీరాలంటె మోమాటమే మన చేతి వాటం చూశావంటే మాట్లాడవే గాలొచ్చి తాకిందమ్మ ఈ పక్కా - ఏ పక్కా రేగిది ఏదో తిక్క ఈ పక్కా - ఏ పక్కా కంది చేనులో కౌగిలింతలో అందాలన్ని అంది కందిపోతే ఆ పట్టే వదలాలి నా గుట్టే దాచాలీ చెరుకు తోటలో ఇరుకు చోటులో శింగారాలే చిక్కి చిక్కి పోతే తెరచాటె అవ్వాలి ఆ మాటే మానాలీ ఇక చూడా బోతే సూటి పోటి యవ్వారమే ఇది చుట్టుకుంటె సుర్రు మనే వయ్యారమే గాలొచ్చి తాకిందమ్మ ఈ పక్కా - ఏ పక్కా రేగింది ఏదో తిక్క ఈ పక్కా - ఏ పక్కా ఈట్టాగైతె ఎట్టాగంట ఎన్నెల్లోనా ఎట్టాగైన అడిగిందల్ల ఇవ్వాలంటా మల్లెపూల పక్కమీద రాతిరంతా తియ్య తియ్యని తాపాలన్ని తీర్చాలంటా
ఏమిటి ఎప్పుడు ఎక్కడ ఎలా పాట సాహిత్యం
చిత్రం: యుద్ధభూమి (1988) సంగీతం: చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, జానకి ఏమిటి ఎప్పుడు ఎక్కడ ఎలా కథ మొదలెట్టేది అమ్మాయి గారూ ఏమిటి ఇప్పుడా ఇక్కడా ఇలా కథ మొదలెడతారా అబాయి గారూ ఈడొచ్చి కూకుంటే వేడేక్కి పోతుంటే సందు చూసి సైగ చేసి సందె ముద్దు విందు చేసి నా బుగ్గ గిల్లుకోరా ముద్దెక్కడెట్టావ్ - వద్దన్న చోటా కన్నెక్కడేశా - కాదన్న చోటా ఐతే అమ్మడు ఇంతలా వాదులాటెందుకో పువ్వెందుకుంటా - పులకింతకంటా నవ్వెందుకంటా - కవ్వింతకంటా ఐతే వలపులో ఇంతలా ఈదులాటెందుకో ఒంపులన్ని సొంపులైన ఒళ్ళిచ్చుకో ముద్దుకంటె ముందు మూడు ముళ్ళిచ్చుకో చందమామ రుద్దుకున్న అందగత్తె ఒంటిమీద సర్దుకున్న సోకులమ్మ జారుడెందుకో నింగిలోన వంపులాట తొంగి తొంగి చూసుకున్న అందగాడ గాలమేసి నన్నందుకో ఏమిటి ఎప్పుడు ఎక్కడ ఎలా కథ మొదలెట్టేది అమ్మాయి గారూ ఏమిటి ఇప్పుడా ఇక్కడా ఇలా కథ మొదలెడతారా అబాయి గారూ ఈడెందుకంటా - నీ జోడుకంటా పోజెందుకంటా - నీ మోజుకంటా ఐనా పిల్లడు కొత్తగా దేవులాటెందుకూ మల్లెందుకంటా - మంచానికంటా నువ్వెందుకంటా - నీ తోడూకంటా అయితే అమ్మడూ అంతగా కొంగు చాటెందుకో అమ్మతోడు అబ్బతోడు మాటిచ్చుకో పక్కతోడు పాలతోడు వేసేసుకో చీకటింట దువ్వుకున్న పాపిడమ్మ కుంకుమంత చిత్తడైన ఒత్తిడింక అంటించుకో ముక్కు మీద పచ్చలన్ని ఎర్రబడ్డ కోపమంత దూపమేసి జున్నుముక్క అందించుకో ఏమిటి ఎప్పుడు ఎక్కడ ఎలా కథ మొదలెట్టేది అమ్మాయి గారూ ఏమిటి ఇప్పుడా ఇక్కడా ఇలా కథ మొదలెడతారా అబాయి గారూ ఈడొచ్చి కూకుంటే వేడెక్కి పోతుంటే సందు చూసి సైగ చేసి సందె ముద్దు విందు చేసి నా బుగ్గ గిల్లుకోరా
అబ్బబ్బా చందమామలాంటి పాట సాహిత్యం
చిత్రం: యుద్ధభూమి (1988) సంగీతం: చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, జానకి అబ్బబ్బా చందమామలాంటి పిల్ల సందెకాడ తారసిల్లి సన్నజాజులిచ్చి పొమ్మంటే ఆహాహా...తకఝం..తకఝం.. అమ్మమ్మో చందమామలాంటి వాడు బుగ్గమీద సిగ్గు గిల్లి సందుజూసి రెచ్చిపోతూంటే ఆహాహా... తకఝం..తకఝం.. తాకుతుంటే ఒళ్ళూ ఒళ్ళూ తకఝం..తకఝం.. తాకిడాయే ఒంపు సొంపు తకఝం..తకఝం.. బుంగమూతి కజ్జికాయ బుజ్జిపండు గిచ్చుడాయె అమ్మమ్మో.. అబ్బబ్బా.. కోక చాటు అందాలు కొంగుదాటగా తకఝం..తకఝం.. వాడి కొంటెచూపు బాణాలు కొంపముంచగా తకఝం..తకఝం.. అరె ఎప్పుడెప్పుడంటాది నిప్పులంటుకుంటాది నా ఈడు.. అబ్బ నీతోడూ.. చప్పు చప్పునొస్తాది చప్పరించమంటాది ఓ ముద్దు అబ్బ ఈ పొద్దు ఆడబెట్టనా ఈడబెట్టనా యాడబెట్టుకోను చెప్పు గుండెచప్పుడూ అమ్మమ్మో చందమామలాంటి వాడు బుగ్గమీద సిగ్గు గిల్లి సందుజూసి రెచ్చిపోతూంటే ఏహేహే... తకఝం..తకఝం.. మంచమెక్కమంటాడు మంచి చెప్పినా తకఝం..తకఝం సందె చుక్కలేళకంటాది నొక్కి చెప్పినా తకఝం..తకఝం అరె గుట్టు గుప్పుమంటాది గూడుదాటి పోతాది నా గువ్వ అబ్బ అవ్వవ్వ అరె పక్కపక్కకొస్తాది పండు దాగిపోతాది నా రెక్క కొత్త నీ రెక్క ఏమిచెప్పినా ఎంత చెప్పినా తప్పుచేసి కాని తాను తప్పుకోడమ్మా అబ్బబ్బా చందమామలాంటి పిల్ల సందెకాడ తారసిల్లి సన్నజాజులిచ్చి పొమ్మంటే ఆహాహా...తకఝం..తకఝం.. అమ్మమ్మో చందమామలాంటి వాడు బుగ్గమీద సిగ్గు గిల్లి సందుజూసి రెచ్చిపోతూంటే ఓహోహో... తకఝం..తకఝం.. తాకుతుంటే ఒళ్ళూ ఒళ్ళూ తకఝం..తకఝం.. తాకిడాయే ఒంపు సొంపు తకఝం..తకఝం.. బుంగమూతి కజ్జికాయ బుజ్జిపండు గిచ్చుడాయె అమ్మమ్మో.. అబ్బబ్బా..
జాలి జాలి సందెగాలి పాట సాహిత్యం
చిత్రం: యుద్దభూమి (1988) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, జానకి పల్లవి: జాలి జాలి సందెగాలి లాలిపాడినా తేలి తేలి మల్లెపూల తెమ్మెరాడినా ఎందుకో నిదరపోదు నా వయసు బహుశా.. బహుశా.. ప్రేమించిందో ఏమో నా మనసు సోలి సోలి లేత ఈడు సొమ్మసిల్లినా చూసి చూసి రెండు కళ్ళు చెమ్మగిల్లినా ఎందుకో నిలువనీదు నా మనసు బహుశా.. బహుశా.. విరహంలో వుందేమో ఆ సొగసు చరణం: 1 పడమటింట పొద్దు వాలి గడియ పెట్టినా తారకళ్ళు ఆకసాన దీపమెట్టినా వాగులమ్మ అలల నీటి వీణ మీటినా వెన్నెలమ్మ కనుల మీద వేణువూదినా ఆగదు అందదు మనసు ఎందుకో ఒడినే అడిగే ఒంటి మీద వలపు సోకి కంటి మీద కునుకురాని కొంటె కోరిక తెలుసుకో ఇక జాలి జాలి సందెగాలి లాలిపాడినా చూసి చూసి రెండు కళ్ళు చెమ్మగిల్లినా చరణం: 2 కోకిలమ్మ కొత్త పాట కోసుకొచ్చినా పూవులమ్మ కొత్త హాయి పూసి వెళ్ళినా వానమబ్బు మెరుపులెన్ని మోసుకొచ్చినా మాఘవేళ మత్తు జల్లి మంత్రమేసినా తీరని తీయని మనసు ఏమిటో అడుగు చెబుతా ఒంటిగుంటె ఓపలేక జంట కట్టుకున్న వేళ చిలిపి కోరిక తెలుపుకో ఇక... సోలి సోలి లేత ఈడు సొమ్మసిల్లినా చూసి చూసి రెండు కళ్ళు చెమ్మగిల్లినా ఎందుకో నిలువనీదు నా మనసు బహుశా.. బహుశా.. విరహంలో వుందేమో ఆ సొగసు జాలి జాలి సందెగాలి లాలిపాడినా తేలి తేలి మల్లెపూల తెమ్మెరాడినా ఎందుకో నిదరపోదు నా వయసు బహుశా.. బహుశా.. ప్రేమించిందో ఏమో నా మనసు
వీరా మగధిర పాట సాహిత్యం
చిత్రం: యుద్ధభూమి (1988) సంగీతం: చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, జానకి వీరా మగధిర రారా రస వీరా తారాపశాన వీరాధివీర నారి జగాన రారాజు నీవు జగదేక వీరా జగదేక వీరా జగదేక వీరా చిలిపి వలపు చిటికేసిన వేళా చిలక ముద్దు ఒకటందుకు పోరా రావే రస రాణీ ఆడే అలివేణీ నాజుకులోన నవమల్లి నీవు పరువాలు పూల పొదరిల్లు నీవు అభిమాన తారా... వలలు వలలు ఉప్పొంగిన వేళా వలపు వలలు పెనవేసుకుపోగా వీరా మగధిరా రావే రస రాణీ నూగారు నునుపుల బంగారు బలుపుల నీ కండ మెరుపుల గురి గురి గది చూడనా లేలేత నడుమున వాలేటి బిడియపు క్రీ నీడ గిలకల చలి గిలి తడి లాగనా నీ వీర శృంగారం వేచింది పూబాణం నీ కొత్త వయ్యారం కోరింది సంసారం అందాల భాలా... విరులు మరులు విచ్చలవిడి కాగా మరుడి పురుడు మనదిద్దరిదేగా రావే రస రాణీ...వీరా మగధిరా నీ ముద్దు తొనికిన పూదేనె చినుకుల రాగాల మడుగున ఎగా దిగా చెలి ఈదనా నీ కంటి చురకల నీ చంటి పిడుగుల నీ ఒంటి ఒడుగుల హల హల హల పొంగనా చెయ్యందుకో లేడీ చేస్తానులే దాడీ హెర్క్యులస్ బాడి హీ మాన్ తో జోడీ అడిగానులేరా అదర మధురిమలు అందిన వేలా ఎదను కలిపి నన్నెతుకుపోరా వీరా మగధిరా - రావే రస రాణీ తారాపశాన వీరాధివీర నారి జగాన రారాజు నీవు జగదేక వీరా... జగదేక వీరా జగదేక వీరా
గమనిక: ఈ చిత్రంలోని పాటలు వేటూరి సుందర రామమూర్తి మరియు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాశారు అలాగే యస్.పి.బాలు, జానకి, చిత్ర గారు పాడారు కాని ఏవి ఎవరు పాడారు, ఏవి ఎవరు రాశారో చెప్పగలరు