చిత్రం: యుగంధర్ (1979) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, జానకి నటీనటులు: యన్.టి.రామారావు, జయసుధ దర్శకత్వం: కె. యస్.ఆర్.దాస్ నిర్మాత: పి.విద్యాసాగర్ విడుదల తేది: 30.11.1979
Songs List:
నాపరువం నీకోసం పాట సాహిత్యం
చిత్రం: యుగంధర్ (1979) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.జానకి పల్లవి: నాపరువం నీకోసం పానుపు వేసి వున్నదీ-వాకిలి తీసి వున్నదీ కోరిక పండగా నిండుగా నా పరువం చరణం: 1 రాకరాక వచ్చానోయీ మీ యింటికి ఈ పాదరింటికి లేక లేక నచ్చావోయి నా కంటికి నా చిగురొంటికి ఈ సమయం నా హృదయం నిన్ను చూసి నాగులాగా ఊగుతున్నది చెలరేగు తున్నది చరణం: 2 ఒక్కమాటు యిక్కడే నువ్వుండిపోరా రుచులందు కోరా ! తీయగా నేనిప్పించేది తీసుకోరా ఆపై చూసుకోరా ! ఈ రోజు ఇక రాదు ఈ కన్నెవయసు అందుకేలే కాగుతున్నది సెగకాచు కున్నది
పేదా గొప్పల కుస్తీ రా పాట సాహిత్యం
చిత్రం: యుగంధర్ (1979) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు సాకి: పేదా గొప్పల కుస్తీ రా పల్లవి: ఇది పేరుకు మాత్రం బస్తీ రా డబ్బులు నాస్తీ -డాబులు జాస్తీ జబర్దస్తీకి చెయ్యడ శాస్తి జంతర్ మంతర్ నగరం ! బల్ వింతర దీని వివరం !! చరణం: 1 ఆరేసు కెళ్ళినోడు సారేపు కొస్తాడు తాళి తాకట్టు పెట్టి తాగి మరీ వస్తాడు ఈ క్లబ్బు కెళ్ళినోడు పేకాడు కుంటాడు పరువమ్ము కుంటాడు. పట్నంలో బ్రతుకంతా లాటరీ ఇది పాపిష్టి, ప్యాషన్ల ప్యాక్టరీ ఏం కాలమో ! ఏం ఖర్మమో ! ఎటు పోతుందిర భాయీ ! లోకం ఎటుపోతుందిరఛాయీ! చరణం: 2 ఓనమః రానివాడు ఓట్లు కొనుక్కుంటాడు ఎకరాలన్నీ అమ్మి ఎం.ఎల్ఏ. అవుతాడు సినిమా ఛాన్సుల కోసం పట్నంలో దిగుతారు పల్లెకు మరి పోలేరు బస్తీలో బ్రతుకంటె చావురా ఛస్తే పట్టేందుకు నలుగురైన కరువురా ఏంన్యాయమో ! ఏం ధర్మమో ఎవరికి తెలుసుర భాయీ మర్మం ఎవరికి తెలుసుర భాయీ
దాదాదాదా దాస్తే దాగే దా.. పాట సాహిత్యం
చిత్రం: యుగంధర్ (1979) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, యస్.జానకి పల్లవి: దాదాదాదా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ దాస్తే దాగే దా...ఆ..ఆ..నీపై నాకున్న మోహం.. నాలో రేపింది తాపం..పాపం..నీదా..నాదా..ఆ..ఆ..ఆ దాదాదాదా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ దాస్తే దాగే దా... చరణం: 1 ఉరితాడంటి బిగికౌగిలిలో.. ఉక్కిరిబిక్కిరీ ఈ..ఈ చేసేస్తా మిన్నాగునురా విషకన్యనురా.. సొగసులతోనే కాటేస్తా..ఆ..ఆ ఇది నీ అంతం.. మరి నా వంతో.. ఏదో ఒకటి.. ఇక తేలాలీ.. దాదాదాదా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ దాస్తే దాగే దా...ఆ..ఆ.. చరణం: 2 పుట్టాము గనక..తప్పదు చావక.. ముందూ..వెనకా..ఆ తేడాగా...ఆ ఏ..తాడయినా మూడే ముళ్ళూ..సంబరమంతా.. మూణ్ణాళ్ళూ.. కథ జరగాలీ...తుది తేలాలి నీకూ..నాకూ..ముడివేయాలీ.... దాదాదాదా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ దాస్తే దాగే దా...ఆ..ఆ..నీపై నాకున్న మోహం.. నాలో రేపింది తాపం..పాపం..నీదా..నాదా..ఆ..ఆ..ఆ
నాకోసమే మీరొచ్చారు పాట సాహిత్యం
చిత్రం: యుగంధర్ (1979) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు పల్లవి: నాకోసమే మీరొచ్చారు మీ కోసమే నేనొచ్చాను ఇంతకు నేను ఎవరో తెలుసా ! నా పేరే యుగంధర్ యుగంధర్ చరణం: 1 మీరంతా చూసేది నన్నుకాదు- ఈ ఊరంతా అనుకునేది నేనుకొదు మంచికే మంచిని మనిషిలో మనిషిని ఏ యెదలో ఏముందో ఏ పొదలో ఏ ముందో పసికట్టి పట్టేస్తా బుసకొట్టి కాటేస్తా నా పేరే యుగంధర్ ... యుగంధర్ ... చరణం: 2 నా మాటే వేదవాక్కు నావాళ్ళకు నా పేరంటే హడల్ దొంగ నాయాళ్ళకు మంచికే మంచిని మనిషిలో మనిషిని ఏ వేషం వేసానో ఏ వేళ నస్తానో ఎదురొస్తే ఏరేస్తా ఏదైనా సాధిస్తా నా పేరే యుగంధర్ ... యుగంధర్...
ఓరబ్బా యేసుకున్నా కిళ్ళీ పాట సాహిత్యం
చిత్రం: యుగంధర్ (1979) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు సాకి: గంజాయి దమ్ము బిగించి కొడితే ఆపై కారాకిళ్ళీ నమిలితే ములో కాలు ఆరె అరె భాయీ మన కాళ్ళకు సలాం చేస్తాయి ! పల్లవి: ఓరబ్బా యేసుకున్నా కిళ్ళీ వొరె వొరె ఒళ్లంత తిరిగెను మళ్ళీ ! మత్తుగ ఉందిర ఓ బేటా నిజమే చెబుతా ఈ పూట నేనసలే యేమెరుగని యెర్రోణ్ని మరేమో ఏలూరు సిన్నోణ్ని చరణం: 1 నాకథ మారింది ముళ్ల కంపలో పడ్డాను రోయ్ - హాయ్ నా ఖర్మకాలింది. కత్తిమీది సామయ్యిందిరోయ్ – హాయ్ సరదాగా తిరిగేవాణ్ని దొరలాగా బతికేవాణ్ని ఎవరో పెద్దల రంగులవల్లో ఇరుక్కుపోతిని రోయ్ ఇంక నేనెట్టా! తట్టుకోను రోయ్ చరణం: 2 ఒక అందాల బొమ్మ- నేనంటేనే పడిచచ్చెరోయ్-హాయ్ ఒక గులాబి గుమ్మ-నా గుండెల్లో పడకేసేరోయ్-హాయ్ ఎర్రా ఎర్రాగుంది! అది బుర్రా బుర్రాగుంది వహ్వా యెర్రెత్తించి కిర్రెక్కించి యేమేమో చేసింది ! ఇంకనే నెట్టా! తట్టు కోనురోయ్!