చిత్రం: యువ (2004) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ నటీనటులు: సూర్యా , మాధవన్ , సిద్దార్ధ్ , ఇషా డియోల్ , మీరా జాస్మిన్, త్రిష దర్శకత్వం: మణిరత్నం నిర్మాత: సుంకర మధుమురళి విడుదల తేది: 21.05.2004
Songs List:
Hey Goodbye Priya.! పాట సాహిత్యం
చిత్రం: యువ (2004) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: వేటూరి గానం: శంకర్ మహదేవన్, సునీతా సారధి, లక్కీ అలి, కార్తీక్ Hey Goodbye Priya.! (2) కళ్ళలో కల్మషం ప్రాయమేలే పరవశం స్పర్శలో మధు విషం స్పర్శలో మధు విషం నేన కానోయి నా వశం నీవేవరో నేనెవరో కన్నీటి పరదాల తెరచాటో కనుపాప తొలి చూపే పొరపాటో నీవేవరో నేనెవరో దొంగ చూపుతో యద దోచుకున్నావు సొట్ట బుగ్గలో నను దాచుకున్నావు మెత్తగా వచ్చి మనసు దోచి నను చంపేయమంటా నీవేవరో నేనెవరో ఆకుపై చినుకులా అంటనీ తేమల కలవకు ఊహలా బ్రతకని నన్నిలా నీవేవరో నేనెవరో కన్నీటి పరదాల తెరచాటో కనుపాప తొలి చూపే పొరపాటో నీవేవరో నేనెవరో Hey Goodbye Priya అడ్డ దారిలొ నీ దారి కాశాను దారి తప్పినా నే తేలి చూసాను తొలగి పొతివంటె తంటయే లేదు ఇది పనిలేని పాట నీవేవరో నేనెవరో
సంకురాత్రి కోడి పాట సాహిత్యం
చిత్రం: యువ (2004) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: వేటూరి గానం: మధుశ్రీ , ఏ.ఆర్.రెహమాన్ సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా చెయ్యి వేస్తే చెంగు జారే కుయ్యో మొర్రో నువ్వు రెండు మూరలా పానుపెయ్యరా జగడం వచ్చెనా తాకవొద్దయ్యా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యాయా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా ఆకు వక్క వేసినా నోరుపండదేమి ఒక పంటి కాటుకే ఎర్రనౌను సామీ స్వర్గ సుఖం పొందేటి దారి చూపవేమి వీధి అరుగుమీదే దోచుకున్న వలపూ వడ్డీలాగ పెరిగే నెలలు నిండనివ్వు మేడ మిద్దెలేలా చెట్టు నీడ మేలూ మెత్త దిండు కన్నా ఉత్త చాప మేలూ ముక్కెర్ల వెలుగులో రేయి తెలవారూ చప్ప ముద్దుపెడితే వొళ్ళు మండిపోదా సాహసాలు చేస్తే చల్లపడిపోనా
Dol Dol పాట సాహిత్యం
చిత్రం: యువ (2004) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: Blaaze గానం: Blaaze, Shahin Badar (Ethnic Vocals) Dol Dol
వచ్చిందా మేఘం పాట సాహిత్యం
చిత్రం: యువ (2004) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: వేటూరి గానం: అద్నాన్ సామి, సుజాత ఏయ్ ఏయ్ ఏయ్ అలోచించు ఏయ్ ఏయ్ ఏయ్ ఓ నా ప్రియా వచ్చిందా మేఘం రానీ పుట్టిందా వేడి పోనీ తెచ్చిందా జల్లు తేనీ మనమేం చేస్తాం వచ్చిందా దారి రానీ అదిపోయే చోటికి పోనీ మలుపొస్తే మారను దారి మనమేం చేస్తాం విను వినూ ఈ తమాష అలోచించూ ఓ ప్రియా విను వినూ ఈ తమాష అలోచించూ ఓ ప్రియా మనమేం చేస్తాం మనమేం చేస్తాం మనమేం చేస్తాం మనమేం చేస్తాం రాళ్ళను కూడా పూజిస్తారు అవి దార్లో ఉంటే ఏరేస్తారు దారప్పోగు నాజూకైనా పడక తప్పదు పీటముడి ఆలోచిస్తే అంతుచిక్కే అర్దం చేసుకో విషయమేదో నీ మనసేది చెబితే అది చెయ్ సరేలే నీకు నాకు ఎవరున్నారు విను వినూ ఈ తమాష అలోచించూ ఓ ప్రియా విను వినూ ఈ తమాష అలోచించూ ఓ ప్రియా వచ్చిందా మేఘం రాని పుట్టిందా వేడి పోని తెచ్చిందా జల్లు తేని మనమేం చేస్తాం వచ్చిందా దారి రాని అదిపోయే చోటికి పోని మలుపొస్తే మారదు దారి మనమేం చేస్తాం కడలింటా కలిసే నదులు ఒకటైనా పేర్లే మారు పువ్వుల్లో దాచిందెవరో పులకించేటి గంధాలన్ని ఏ కొందరి అడుగుజాడలో నేల మీదా అచ్చవుతాయి ఈ నీడలా చీకటి పడిన ఆ జాడలో చెరిగిపోవోయి ఏయ్ ఏయ్ ఏయ్ అలోచించు ఏయ్ ఏయ్ ఏయ్ ఓ నా ప్రియా వచ్చిందా మేఘం రాని పుట్టిందా వేడి పోని తెచ్చిందా జల్లు తేని మనమేం చేస్తాం వచ్చిందా దారి రాని అదిపోయే చోటికి పోని మలుపొస్తే మారదు దారి మనమేం చేస్తాం విను వినూ ఈ తమాష అలోచించూ ఓ ప్రియా విను వినూ ఈ తమాష అలోచించూ ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
దేహం తిరి పాట సాహిత్యం
చిత్రం: యువ (2004) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: వేటూరి గానం: ఏ.ఆర్.రెహమాన్, సునితా సారథి, తన్వి ఫనా.... ఫనా.... ఫనా.....ఫనా..... దేహం తిరి వెలుగన్నది చెలిమే జీవంనదీ ఎద నీరథీ నెనరే పుటకే పాపం కడుగు అమృతం చెలిమే హృదయం శిల శిలలో శిల్పం చెలిమే దేహం తిరి వెలుగన్నది ఫనా.... ఫనా.... తాకుతాం తగులుతాం పరుస్తాం స్మరిస్తాం వొదులుకోం తాకుతాం తగులుతాం పరుస్తాం స్మరిస్తాం చెదిరిపోం జన్మాంకురం కాసే ఫలం లోకం ద్వైతం కాంక్షే అద్వైతం సర్వం శూన్యం శేషం ప్రేమ మనిషి మాయం చెలిమి అమరం లోకానికి కాంతిధార ఒకటే ఒకటే ప్రతి ఉదయానికి వేకువైన వెలుగూ ఒకటే
జనగణ మన పాట సాహిత్యం
చిత్రం: యువ (2004) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: వేటూరి గానం: ఏ.ఆర్.రెహమాన్, కార్తీక్ జనగణ మన జన మొర విన కల నిజమయ్యె కాలం ఇదే వెలుగే బాటగా మలలే మెట్లుగా పగలే పొడిగాగ చక్ చక్ చక్ చక్ చక్ పుట్ సల్ ఇకపై ఇకపై విరచిద్దాం విధినే మార్చే ఒక చట్టం ఆయుధమిదే అహమిక వధే దివిటీ ఇదే చెడుగుకు చితే ఇరులే తొలగించు ఈ నిరుపేదల ఆకలికేకలు ముగించు బరితెగించు అరె స్వాహాల దాహాల ద్రోహాల వ్యూహాలు ఛేదించు కారడవుల సుడిగాలి మనం కాలికి తొడుగులు ఎందుకులే తిరగబడే యువశక్తి మనం ఆయుధమెందుకు విసిరేసేయ్ అదురే విడు గురితో నడు భేదం విడు గెలు ఇప్పుడు లేరా పోరాడు మలుపుల జారబడి నదివలె పరువిడి శ్రమించూ శ్రమ ఫలించు అరె విజయాల వీధుల్లో నీ వీరసైన్యాలు నిలిస్తే సజ్జనులంతా వొదిగుంటే నక్కలు రాజ్యాలేల్తుంటే ఎదురే తిరుగును యువ జనత ఎదురే తిరుగును భూమాత