చిత్రం: సూర్యం (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: శంకర్ మహదేవన్, సుజాత
నటీనటులు: మంచు విష్ణు, సెలీనా జైట్లీ , వేద అర్చన శాస్త్రి
దర్శకత్వం: వి. సముద్ర
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 02.12.2004
ఎండాకాలంలో ఒక చెట్టు కావాలి వానాకాలంలో ఒక గొడుగు కావాలి
ఎండాకాలంలో ఒక చెట్టు కావాలి వానాకాలంలో ఒక గొడుగు కావాలి
హే శీతాకాలంలో ఒక రగ్గు కావాలి
చిలిపి కాలంలో తొలి సిగ్గుకావాలి
ఈ కుర్రవయసులోన మనకు... హోయ్
నాకునువ్వు కావాలి నీకునేను కావాలి
హేయ్ ముద్దులుకావాలి మురిపాలు కావాలి
నాకునువ్వు కావాలి నీకునేను కావాలి
హేయ్ ముద్దులుకావాలి మురిపాలు కావాలి
ఎండాకాలంలో ఒక చెట్టు కావాలి
వానాకాలంలో ఒక గొడుగు కావాలి
చెలి గంగలో చిరుసవ్వడి సైగలు చేస్తే చిలిపి విందులేవో నాకవసర మైనట్టు
పొగరెక్కిన కొస మీసం గుసగుస మంటే మగసరి ముదిలోన నా చెరిసగమైనట్టు
నాచూపుల చివరంచున నీ మోమే తొలిపొద్దై ఎదలోపల సరదాలకు తెరతీస్తుంటే
చనువై నువు బిడియాలను తొలగిస్తుంటే
మిగిలిందిక ఏముందంటే... హోయ్
నాకునువ్వు కావాలి నీకునేను కావాలి
హేయ్ ముద్దులుకావాలి మురిపాలు కావాలి
హేయ్ నువ్వు కావాలి నేను కావాలి
ముద్దులుకావాలి మురిపాలు కావాలి
కనురెప్పలు నునుబరువుగ రెపరెప మంటే కొత్త చెలిమికోసం అబ్బాయినడిగినట్టు
చిరునవ్వుతో ఉదయం నువు లేచావంటే రాత్రి తీపికలలో అమ్మాయి వచ్చినట్టు
ఇటునేను అటునీవు ఎదురెదురు వచ్చాక ఇదికాదు అదికాదని అనుకుంటుంటే
హా ఈ కాస్త సమయం ఇక వేస్టవుతుంటే
సూటిగా ఇక చెప్పాలంటే... హోయ్
నాకునువ్వు కావాలి నీకునేను కావాలి
హేయ్ ముద్దులుకావాలి మురిపాలు కావాలి
హేయ్ నువ్వు కావాలి నేను కావాలి
హేయ్ ముద్దులుకావాలి మురిపాలు కావాలి
ఎండాకాలంలో ఒక చెట్టు కావాలి
హే వానాకాలంలో ఒక గొడుగు కావాలి
శీతాకాలంలో ఒక రగ్గు కావాలి
చిలిపి కాలంలో తొలి సిగ్గుకావాలి
ఈ కుర్రవయసులోన మనకు... హోయ్
నాకునువ్వు కావాలి నీకునేను కావాలి హేయ్
ముద్దులుకావాలి మురిపాలు కావాలి హేయ్
నాకునువ్వు కావాలి నీకునేను కావాలి
హే ముద్దులుకావాలి మురిపాలు కావాలి లిలిలీ
******** ******* **********
చిత్రం: సూర్యం (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్
నీలి కన్నులా పండు వెన్నెలా నిన్ను నాలో దాచేసుకోవాలా
నీలి కన్నులా పండు వెన్నెలా నిన్ను నాలో దాచేసుకోవాలా
నన్ను నీలో నేచూసు కోవాలా
చిన్ని గుండెపై పుట్టుమచ్చలా నీకు నేను తోడుండి పోవాలా
ఎప్పుడూ నిన్నంటి ఉండాలా
ప్రేమ నేడు మొగ్గేసింది వెల్లువలె ముంచేసింది
అందుకే సిగ్గేస్తుంది నిన్ను చుస్తే ముద్దేస్తుంది
ఇద్దరం తూనీగల్లా కూడలు కోవాలా
నీలి కన్నులా పండు వెన్నెలా నిన్ను నాలో దాచేసుకోవాలా
నన్ను నీలో నేచూసు కోవాలా
కురిసే వెన్నెలలో రూపం నీలా
నామది వాకిటిలో నువు నిలవాలా
నువ్వే చేరి నాణెంలా ఓ ప్రేమ ముద్దిచ్చి పోవాలా
నేనే నువ్వై పోయేలా ఈ జన్మ నీకిచ్చు కోవాలా
ప్రతీ దినం నువు రాణిలా ఉండవే యెదుటా...
ప్రేమ నేడు మొగ్గేసింది వెల్లువలె ముంచేసింది
ఇద్దరం తూనీగల్లా కూడలు కోవాలా
చిన్ని గుండెపై పుట్టుమచ్చలా నీకు నేను తోడుండి పోవాలా
ఎప్పుడూ నిన్నంటి ఉండాలా
ఎదలో ఆశలకు ఎదురై రావే
కదిలే ఊహలకు ఊపిరి నువ్వే
నీ నవ్వు మువ్వల్లే మొగాలి నూరేళ్ళు నన్నళ్లు కోవాలి
ఓ నీ చేతి గీతల్లే మారాలి ఆ చేయి నన్నందు కోవాలి
ఎడారిలో గోదారిలా చేరవే చెలియా...
ప్రేమ నేడు మొగ్గేసింది వెల్లువలె ముంచేసింది
ఇద్దరం తూనీగల్లా కూడలు కోవాలా
నీలి కన్నులా పండు వెన్నెలా నిన్ను నాలో దాచేసుకోవాలా
నన్ను నీలో నేచూసు కోవాలా
ప్రేమ నేడు మొగ్గేసింది వెల్లువలె ముంచేసింది
అందుకే సిగ్గేస్తుంది నిన్ను చుస్తే ముద్దేస్తుంది
ఇద్దరం తూనీగల్లా కూడలు కోవాలా
చిన్ని గుండెపై పుట్టుమచ్చలా నీకు నేను తోడుండి పోవాలా
నన్ను నీలో నేచూసు కోవాలా
******** ******* **********
చిత్రం: సూర్యం (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: మాస్టర్ జీ
గానం: చక్రి, కౌశల్య
ఓసోసి నంగా నాచి
******** ******* **********
చిత్రం: సూర్యం (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: జలదంకి
గానం: కే. కే, శ్రేయా ఘోషల్
నాకై పుట్టినదాన
******** ******* **********
చిత్రం: సూర్యం (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: గురుచరణ్
గానం: కే. జే. ఏసుదాసు
ఆనందం ఆనందం
******** ******* **********
చిత్రం: సూర్యం (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: భువనచంద్ర
గానం: టిప్పు, కౌశల్య
ఆకుముట్టడి సోకుముట్టడి