చిత్రం: అమాయకుడు (1968) సంగీతం: బి. శంకర్ నటీనటులు: కృష్ణ , జమున, జి. వరలక్ష్మీ దర్శకత్వం: అడ్డాల నారాయణ రావు నిర్మాతలు: ఎం. శంకరయ్య, వెంకట నర్సయ్య విడుదల తేది: 10.05.1968
Songs List:
అనుకోనా పాట సాహిత్యం
చిత్రం: అమాయకుడు (1968) సంగీతం: బి. శంకర్ సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం: పి.బి.శ్రీనివాస్ అనుకోనా ఇది నిజమనుకోన
బొమ్మను గీశావు పాట సాహిత్యం
చిత్రం: అమాయకుడు (1968) సంగీతం: బి. శంకర్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.బి.శ్రీనివాస్, పి.సుశీల బొమ్మను గీశావు
చందమామ రమ్మంది చూడు..పాట సాహిత్యం
చిత్రం: అమాయకుడు (1968) సంగీతం: బి. శంకర్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.సుశీల పల్లవి: చందమామ రమ్మంది చూడు.. చల్లగాలి రమ్మంది చూడూ.. ఆ పైన.. ఇంక ఆ పైన.. నువ్వు నా కళ్ళలో తొంగి చూడూ చందమామ బాగుంది నేడు.. చల్లగాలి బాగుంది నేడు ఏముంది.. ఇంక ఏముంది.. అది అంతే కదా ఏనాడు చందమామ బాగుంది నేడు చరణం: 1 పూవులే ఎందుకో నవ్వుతున్నాయి చూడు పూవులే ఎందుకో నవ్వుతున్నాయి చూడు వెన్నెలే ఎందుకో నన్ను కవ్వించే నేడు తెలుసుకోలేవు నీవూ.. పలకగాలేను నేను చందమామ రమ్మంది చూడూ చరణం: 2 పూవులే నవ్వితే నవ్వుకోనిమ్ము నేడు పూవులే నవ్వితే నవ్వుకోనిమ్ము నేడు ఉందిగా వెన్నెలా ఎందుకమ్మాయి తోడు నీది నా దారి కాదు.. నాది నీ దారి కాదు చందమామ బాగుంది నేడు చరణం: 3 చెంతగా నిలిచినా ఇంత గిలిగింత లేదు చెంతగా నిలిచినా ఇంత గిలిగింత లేదు చెంతగా నిలిచినా వింత నాకేమి లేదు అడవి మనిషివి నీవు.. ఆ మాటే తగదన్నాను చందమామ రమ్మంది చూడు.. చల్లగాలి రమ్మంది చూడు ఆ పైన.. ఇంక ఆ పైన.. నువ్వు నా కళ్ళలో తొంగి చూడు చందమామ రమ్మంది చూడు
మనిషైతే.. మనసుంటే పాట సాహిత్యం
చిత్రం: అమాయకుడు (1968) సంగీతం: బి. శంకర్ సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం: ఘంటసాల పల్లవి: మనిషైతే.. మనసుంటే మనిషైతే మనసుంటే.. కనులు కరగాలిరా కరిగి కరుణ కురియాలిరా.. కురిసి జగతి నిండాలిరా చరణం: 1 ఆగి ఆగి సాగి పోరా.. సాగి పోతూ చూడరా..ఆ.. ఆగి ఆగి సాగి పోరా.. సాగి పోతూ చూడరా..ఆ.. వేగి పోయే ఎన్నెన్నెని బ్రతుకులో.. వేడుకుంటూ ఎన్నెన్ని చేతులో వేచి ఉన్నాయిరా.. మనిషైతే.. మనసుంటే మనిషైతే మనసుంటే.. కనులు కరగాలిరా కరిగి కరుణ కురియాలిరా.. కురిసి జగతి నిండాలిరా చరణం: 2 తేలిపోతూ నీలి మేఘం.. జాలి జాలిగ కరిగేరా తేలిపోతూ నీలి మేఘం.. జాలి జాలిగ కరిగేరా కేలు చాపి ఆ దైవమే తన.. కేలు చాపి ఆకాశమే ఈ.. నేల పై ఒరిగెరా.. మనిషైతే.. మనసుంటే.. మనసుంటే మన్షైతే.. వైకుంఠమే ఒరుగురా నీ కోసమే కరుగురా.. నీ కోసమే కరుగురా.. నీ కోసమే కరుగురా..
పట్నంలో శాలిబండ పాట సాహిత్యం
చిత్రం: అమాయకుడు (1968) సంగీతం: బి. శంకర్ సాహిత్యం: వేణుగోపాల్ రెడ్డి గానం: యల్.ఆర్.ఈశ్వరి పల్లవి: పట్నంలో శాలిబండ పేరైనా గోలకొండ (2) సూపించు సూపునిండా ఫిసల్ ఫిసల్ బండ చరణం: 1 వయసు పిల్ల వంటి సొంపు అది వంగి ఉంటె భలే ఇంపు హహహ అది వంగి ఉంటె భలే ఇంపు అబ్బ అబ్బ అది వంగి ఉంటె భలే ఇంపు ఓరసూపు వలవేసి దోరవయసు దోచేసి (2) గులకరాళ్ల నీటిలోన సెలయేటి బాటలోన (2) ఒక్కసారి సూడాలి సంబరాల చాటుబండ ఫిసల్ ఫిసల్ బండ చరణం: 2 చేప కనుల చిన్నదోయి నీ చేతికైతే చిక్కదోయి (2) అల్లిబిల్లి అయి వుందా బల్లపరుపు అల్ల బండా అయ్యో అయ్యో అయ్యో బల్లపరుపు అల్ల బండా ఆ... బల్లపరుపు అల్ల బండా
పోలేవు నీవు పాట సాహిత్యం
చిత్రం: అమాయకుడు (1968) సంగీతం: బి. శంకర్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల పోలేవు నీవు
పూవులలో పాట సాహిత్యం
చిత్రం: అమాయకుడు (1968) సంగీతం: బి. శంకర్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల పూవులలో