చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002) సంగీతం: మణిశర్మ నటీనటులు: బాలకృష్ణ , టబు , శ్రేయ శరన్ దర్శకత్వం: వి.వి.వినాయక్ నిర్మాత: బెల్లంకొండ సురేష్ విడుదల తేది: 25.09.2002
Songs List:
Don't Care... పాట సాహిత్యం
చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: శంకర్ మహదేవన్ Don't Care... నవ్వేవాళ్ళు నవ్వనీ ఏడ్చేవాళ్ళు ఏడ్వనీ పొగిడేవాళ్ళు పొగడనీ తిట్టేవాళ్ళు తిట్టని Don't Care Don't Care పూలే నీపై జల్లని రాళ్ళే నీపైరువ్వనీ ఎత్తుకు నిన్నెగరెయ్యనీ గోతులునీకే తియ్యని Don't Care...Don't Care అనుకున్నది నువ్వే చెయ్ అనుమానం మానిచెయ్ నీమనసే పెట్టిచెయ్ నీదేరా పైచెయ్ చరణం: 1 ఎదిగేకొద్దీ ఒదగాలన్నది చెట్టును చూసినేర్చుకో క్రమశిక్షణతో మెలగాలన్నది చీమను చూసినేర్చుకో చిరునవ్వులతో బతకాలన్నది పువ్వును చూసినేర్చుకో ఓర్పు సహనం ఉండాలన్నది పుడమిని చూసినేర్చుకో ఎంత తొక్కినా నిన్నెంత తొక్కినా అంత పైకి రావాలన్నది బంతిని చూసినేర్చుకో నేర్చుకున్నది పాటించెయ్ ఓర్చుకుంటు పనులేచెయ్ నీదేరా పైచెయ్ చరణం: 2 ఉన్నదున్నట్టు చెప్పాలన్నది అద్దాన్ని చూసినేర్చుకో పరులకు సాయం చెయ్యాలన్నది సూర్యుణ్ణి చూసినేర్చుకో సోమరితనాన్ని వదలాలని గడియారాన్ని చూసినేర్చుకో ప్రేమనందరికి పంచాలన్నది భగవంతుణ్ణి చూసినేర్చుకో ఎంత చెప్పినా నేనెంత చెప్పినా ఇంకెంతో మిగిలున్నది అది నీకునువ్వు నేర్చుకో నేర్చుకున్నది పాఠం చెయ్ నలుగురికి అది నేర్పించెయ్ నీదేరా పైచెయ్
హాయ్ హాయ్ పాట సాహిత్యం
చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, సునీత పల్లవి: హాయి హాయి హాయి హాయి నువ్వు నాకు నచ్చావోయి వలదు లడాయి ఇది వలపు జుదాయి గిల్లి గిల్లి గజ్జాలీయి గీర ఎక్కి ఉన్నావోయి పలుకు బడాయి నా జతకు పరాయి తోడు నువ్వు లేక పోతె తోచదోయి తోటి రాగం పాడుతుంటె నచ్చదోయి దాని పెరు హల్లోవొయి తకదిన్న తకదిన్న తందాన దాని రూపు నువ్వేనొయి తకదిన్న తకదిన్న తందాన చరణం: 1 కొట్టే కన్ను పెట్టె నిన్ను నాలో దాచుకున్నానె అద్దమంటి అందాలోయి తకదిన్న తకదిన్న తందాన అంటుకుంటె ఆరట్లోయి తకదిన్న తకదిన్న తందాన పట్టె పిచ్చి పుట్టె వెర్రి ఇట్టె తోసిపుచ్చావె ఒంటిచేతి చప్పట్ట్లోయి తకదిన తకదిన తందాన అల్లుకున్న బంధాలోయి తకదిన్న తకదిన్న తందాన మసకేస్తే మజాల జాతర...పగటేలా ఇదేమి తొందర కూచిపుడి ఆడించేస్తా తకదిన్న తకదిన్న తందాన కుర్రదాన్ని ఓడించేస్తా తకదిన్న తకదిన్న తందాన దాని పెరు అల్లోఒవియి తకదిన్న తకదిన్న తందాన చరణం: 2 సిగ్గా ఎర్ర బుగ్గా నిన్ను తాకీ కందిపోయింది ముద్దులింక మద్దెళ్ళేలె తకదిన్న తకదిన్న తందాన ముళ్ళు పట్ట ముచ్చట్లోయి తకదిన్న తకదిన్న తందాన ప్రేమొ చందమామొ నిన్ను చూసీ వెళ్ళిపోయింది ములక్కాడ ఫ్లూటౌతుందా తకదిన్న తకదిన్న తందాన ముట్టుకుంటె ముద్దౌతుందా తకదిన్న తకదిన్న తందాన ఒడిచేరీ వయస్సు దాచకు ...వయసంటూ వసంతమాడకు కన్నె మొక్కు చెల్లించేస్తా తకదిన్న తకదిన్న తందాన చెమ్మ చెక్కలాడించేస్తా తకదిన్న తకదిన్న తందాన దాని పేరు అల్లోవియి తకదిన్న తకదిన్న తందాన
బకరా బకరా పాట సాహిత్యం
చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: ఉదిత్ నారాయణ్, చిత్ర బకరా బకరా
నీ కొప్పులో నా మల్లె తోట పాట సాహిత్యం
చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: శ్రీనివాస్ గానం: యస్. పి. బాలు, కౌసల్య నీ కొప్పులో నా మల్లె తోట
ఏం పిల్లా కుశలమా పాట సాహిత్యం
చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్. పి. బాలు, సుజాత ఏం పిల్లా కుశలమా
తెలుపు తెలుపు పాట సాహిత్యం
చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: యస్. పి. బాలు, చిత్ర తెలుపు తెలుపు