చిత్రం: దొంగ (1985) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: చిరంజీవి, రాధ దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి నిర్మాత: టి. త్రివిక్రమ రావు విడుదల తేది: 14.03.1985
Songs List:
గోలీమార్... గోలీమార్... పాట సాహిత్యం
చిత్రం: దొంగ (1985) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు పల్లవి: గోలీమార్... గోలీమార్... గోలీమార్ మార్ మార్ మార్ మార్ ..మార్ మార్ .. కాష్మోర కౌగిలిస్తే ఏం చేస్తావో నేపాళీ మంత్రమేస్తే ఏమౌతావో కంగారు పడ్డ కన్నె శృంగారమా వణుకుల్లో కూడ ఇంత వయ్యారమా గోలీమార్ గోలీమార్ .. మార్ మార్ మార్ మార్ చరణం: 1 పుట్టంగానే మట్టైపోయే కొత్త్తచట్టం వస్తే ముద్దుపెట్టాలంటే అల్లాడి పోతావే అమ్మడూ బాణామతి చేస్తారు ప్రాణాలింక తీస్తారు ఉన్న మతి పోయాక ..ఉప్పుపాతరేస్తారు ఓ... ఇంతి బంతి పూబంతి ఓ... శాంతి శాంతి ఓం శాంతి రుద్రం రౌద్రం రిరిమ్‌షా .. మూర్ఖం మూఢం ముముర్‌షా కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్ గోలీమార్ గోలీమార్ .. మార్ మార్ మార్ మార్ చరణం: 2 ముట్టంగానే నిప్పైపోయే కొరివి దెయ్యాలొస్తే కొంగులంటుకుంటే చల్లారేదెట్టాగో ఇప్పుడూ.... చేతబడి చేస్తారో కోడి మెడ కోస్తారో శ్మశానాల వీధుల్లో .. పిశాచాలు పడతారో ఓ... నారీ ప్యారీ వయ్యారి ఓ... భద్రా కాళి కంకాళి తీవ్రం తీండ్రం భిద్రుక్ష .. ముందు వెనుక పరీక్ష కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్ ... కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్ ... గోలీమార్ గోలీమార్ .. మార్ మార్ మార్ మార్ కాష్మోర కౌగిలిస్తే ఏం చేస్తావో నేపాళీ మంత్రమేస్తే ఏమౌతావో కంగారు పడ్డ కన్నె శృంగారమా వణుకుల్లో కూడ ఇంత వయ్యారమా గోలీమార్ గోలీమార్ .. మార్ మార్ మార్ మార్ గోలీమార్ గోలీమార్ .. మార్ మార్ మార్ మార్
సరి..సరీ..నువ్వు చెప్పెదంత పాట సాహిత్యం
చిత్రం: దొంగ (1985) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: సరి..సరీ..నువ్వు చెప్పెదంత సరి..సరీ హరి..హరీ..నేను విన్నదంత..హరి..హరీ కమ్ముకుపోతే సరేసరీ..కౌగిలిలోనే ఉరీఉరి ఆఆఆ..ఉరీఉరి..య్యా సరి..సరీ..నువ్వు చెప్పెదంత సరి..సరీ హరి..హరీ..నేను విన్నదంత..హరి..హరీ సరి..సరీ..నువ్వు చెప్పెదంత సరి..సరీ హరి..హరీ..నేను విన్నదంత..హరి..హరీ చరణం: 1 హే..హే..ఏ..హ్హే..లలా..లలా.. వచ్చిందంటే చలికాలం..వాటేయ్యాలి కలకాలం హోయ్..వాటాలు అన్ని చూసి ఆడేయాలి కోలాటం అయ్యిందంటే సాయంత్రం..అంతో ఇంతో శృంగారం బుగ్గల్లో ముద్దే పెట్టి.. పూయించాలి మందారం చీకట్లు పుట్టే వేళ.. సిగ్గొచ్చి కుట్టే వేళ నీ చీరకొంగు జాగ్రత్తో..ఓహో.. దీపాలు ఊదేసి..తాపాలు తగ్గించుకో పులకింత రేపేసి..బంధాల్లో కట్టేసుకో సరి..సరీ..నువ్వు చెప్పెదంత సరి..సరీ హరి..హరీ..నేను విన్నదంత..హరి..హరీ చరణం: 2 హే..హే..హ్హా..ఆ..ఏహే..ఆహా.. ఎండలోన ఓ తాపం.. ఎన్నెల్లోన ఓ కోపం ఏ మందు వాడాలంట తగ్గాలంటే ఈ రోగం మల్లెల్లోన మనసిచ్చి.. మసకల్లోన వయసిచ్చి హోయ్..ఓ ముద్దు ఇచ్చావంటే..తగ్గేనంట ఈ తాపం ఒళ్ళంత వేడెక్కించు..కళ్ళల్లో కైపెక్కించు నా వన్నె చిన్నె పెంచుకో..హో చెప్పేది ఏముంది చేసేదెంతో ఉంది..ఆహా శృతిమించి పోయాక రాగానికంతేముందీ సరి..సరీ..నువ్వు చెప్పెదంత సరి..సరీ హరి..హరీ..నేను విన్నదంత..హరి..హరీ కమ్ముకుపోతే సరేసరీ..కౌగిలిలోనే ఉరీఉరి ఆఆఆ..ఉరీఉరి..య్యా సరి..సరీ..నువ్వు చెప్పెదంత సరి..సరీ హరి..హరీ..నేను విన్నదంత..హరి..హరీ
దొంగ..దొంగ..ముద్దులదొంగ పాట సాహిత్యం
చిత్రం: దొంగ (1985) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: దొంగ..దొంగ..ముద్దులదొంగ దోచాడే....బుగ్గ... కోసాడే....మొగ్గ కౌగిలన్ని...దోపిడాయే...ఈ సయ్యాటలో..ఓ ఈ సందిళ్ళలో..ఓ.. దొంగ..దొంగ..వెన్నెలదొంగ వచ్చిందే....చుక్క..వాలిందే....పక్క వత్తిళ్ళన్ని..రాత్రులాయే..ఈ ఉర్రుతలో..ఓ ఈ ఉయ్యాలలో..ఓ.. చరణం: 1 కొరికే నీ కళ్ళతో..కొరికి నమిలే ఆ కళ్ళతో ఇరుకు కౌగిళ్ళు ఇస్తావనీ..ఈ చలిగా నీ చూపుతో..చలినే నలిపే నీ ఊపుతో ఒడికే నీ ఒళ్ళు ఇస్తావనీ..ఈ వాయిదాలతో పెంచుకొన్నది..వయ్యారాల పరువం..మ్మ్ కొట్టే కన్ను కోరే చూపు..బాణాలేసి.. సన్నంగ చీకట్లోన సిగ్గుతల్లి..ప్రాణం తీసీ.. ఈ తారాటలో..ఈ... తైతక్కలో..ఓ దొంగ దొంగ..వెన్నెలదొంగ..వచ్చిందే చుక్క వాలిందే..ఏ..పక్కా చరణం: 2 కొసరే నీ చూపులో..కసిగా ముసిరే కవ్వింపులో పిలుపో వలపో..విన్నానులే..ఏ...ఏ... ఎదిగే నీ సోకులో..ఎదిగి ఒదిగే నాజుకులో ఉలుకో తళుకో..చూశానులే..ఏ.. ఏ.. పక్కవత్తిడి పక్కపాపిడి... ఇలా చెదరిపోనీ..ఈ నచ్చేదిస్తే ఇచ్చేదిస్తా..సాయంకాలం..ఓలమ్మో వెచ్చందిస్తే మెచ్చిందిస్త..శీతాకాలం..మ్మ్ హా..నా దోసిళ్ళతో..హా..నీ దోపిళ్ళలో..ఓ దొంగ..దొంగ..ముద్దులదొంగ దోచాడే...బుగ్గ..కోసాడే....మొగ్గ వత్తిళ్ళన్ని..రాత్రులాయే..ఈ ఉర్రుతలో..ఓ ఈ ఉయ్యాలలో..ఓ..హా..హా హా హా హా హా హే హే హే హే హే హే
అందమా అలా అలా.. పాట సాహిత్యం
చిత్రం: దొంగ (1985) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, జానకి పల్లవి: అందమా అలా అలా.. అల్లుకో ఇలా ఇలా అందమా అలా అలా.. అల్లుకో ఇలా ఇలా కవ్వించే నీ కళ్ళు.. నువ్విచ్చే కౌగిళ్ళు నూరేళ్ళు నావేనులే.. ఏ ఏ ఏ.. అందమా అలా అలా.. అల్లుకో ఇలా ఇలా చరణం: 1 తెల్ల చీర ఇచ్చుకో మల్లెపూల వేళలో సన్నకాటుకిచ్చుకో సందె చీకటేళలో కదలి వచ్చే నీలో.. కడలి పొంగులు చూశా కనుల నీడలలోనే.. కవితలెన్నో రాశా.. ఆహాహా కొత్త మోజుల.. మత్తు గాలికి.. సొగసు ఊపిరి.. పోసుకున్నది రాగాలెన్నో నీలో రేగే వేళా... అందమా అలా అలా.. అల్లుకో ఇలా ఇలా చరణం: 2 కొమ్మ రెమ్మ సందుల్లో మావిళ్ళ విందులో కోకిలమ్మ వీధుల్లో రాగాల చిందులు రామచిలకలు తెచ్చే చిగురు లేఖలు చూశా చిగురు వేసిన ప్రేమా.. నీకు కానుక చేశా మండు వేసవి.. మల్లెలావిడి.. పండు వెన్నెల.. పడుచు ఊపిరి.. నీలో నాలో ఊయ్యాలూగే వేళా.. అందమా అలా అలా.. అల్లుకో ఇలా ఇలా కవ్వించే నీ కళ్ళు.. నువ్విచ్చే కౌగిళ్ళు నూరేళ్ళు నావేనులే.. ఏ ఏ ఏ.. అందమా అలా అలా.. అల్లుకో ఇలా ఇలా
తప్పనకా ఒప్పనకా.. పాట సాహిత్యం
చిత్రం: దొంగ (1985) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: తప్పనకా ఒప్పనకా.. తాకాలని ఉంది బుగ్గ..తాకాలని ఉంది రేపనకా మాపనకా.. పెట్టాలని ఉంది ముద్దు..పెట్టాలని ఉంది వాయిదాలు వేస్తుంటే.. వయసాగదే వాయిదాలు వేస్తుంటే.. వయసాగదే వాటేసు కున్నదాక మనసాగదే వాటేసు కున్నదాక మనసాగదే కాదనకా లేదనకా.. ఇవ్వాలని ఉంది మనసు.. ఇవ్వాలని ఉంది రేయనకా పగలనకా.. కలవాలని ఉంది నిన్నే కలవాలని ఉందీ వాయిదాలు వేస్తెనే.. వయసందము వాయిదాలు వేస్తెనే.. వయసందము వాటేసు కున్ననాడే.. వలపందము వాటేసు కున్ననాడే.. వలపందము చరణం: 1 సంపంగి పూసే వేళ.. నీ చెంప తాకే వేళ నీ వొంపు సొంపు నాకే ఇస్తావా నీ మంచు తగిలే వేళ.. నా మల్లె తడిసే వేళ నా సిగ్గు సింగారాలు దోస్తావా.. వయ్యారం కౌగిట్లోనే ఓడిస్తా.. సందిట్లో పందాలెన్నో.. గెలిపిస్తా గెలిపించవా.. చలిపెంచవా.. వలపించవా..ఒడిపంచవా నా లేడి లేచాక పరుగాగదూ నా లేడి లేచాక పరుగాగదూ నీ కోడి కూస్తుంటే పరువాగదూ నీ కోడి కూస్తుంటే పరువాగదూ తప్పనకా ఒప్పనకా..తాకాలని ఉంది బుగ్గ..తాకాలని ఉంది హోయ్.. రేయనకా పగలనకా.. కలవాలని ఉంది నిన్ను కలవాలని ఉందీ చరణం: 2 నీ చేయి తాకే వేళ..నా చీర అలిగే వేళ నా కట్టు బొట్టు అన్ని చూస్తావా..ఆ సోకంత బలిసే వేళ..రైకంత బిగిసే వేళ నా వేడి వాడి అన్ని చూస్తావా..ఆ సరికొత్తా ఇరకాటంలో పెట్టేస్తా..ఆ హోయ్..సరిహద్దే కౌగిట్లో కొట్టేస్తా..ఆ కౌవ్వించవా..కసిపెంచవా..పొగమంచులో..పగపెంచవా నీ గాలి వీచాక..మెరుపాగదు.. నీ గాలి వీచాక..మెరుపాగదు నా జోలి కొచ్చాక చినుకాగదూ.. నా జోలి కొచ్చాక చినుకాగదూ హోయ్..కాదనకా లేదనకా..ఇవ్వాలని ఉంది మనసు..ఇవ్వాలని ఉంది రేపనకా మాపనకా..పెట్టాలని ఉంది ముద్దు..పెట్టాలని ఉంది వాయిదాలు వేస్తెనే.. వయసందము వాయిదాలు వేస్తెనే.. వయసందము వాటేసు కున్నదాక మనసాగదే వాటేసు కున్నదాక మనసాగదే
ఇది పందెం పాట సాహిత్యం
చిత్రం: దొంగ (1985) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్. జానకి ఇది పందెం