Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Idi Katha Kaadu (1979)




చిత్రం: ఇది కథ కాదు (1979)
సంగీతం: యమ్.యస్.విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు, సుశీల
నటీనటులు: కమల్ హాసన్, చిరంజీవి, జయసుధ, శరత్ బాబు, సరిత, లీలావతి
దర్శకత్వం: కె.బాలచందర్
నిర్మాత: టి. విశ్వేశ్వర రావు
విడుదల తేది: 29.06.1979



Songs List:



సరిగమలూ గలగలలు.. పాట సాహిత్యం

 
చిత్రం: ఇది కథ కాదు (1979)
సంగీతం: యమ్.యస్.విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు, సుశీల

సరిగమలూ గలగలలు.. 
సరిగమలూ గలగలలు
ప్రియుడే సంగీతము.. 
ప్రియురాలె నాట్యము
చెలికాలి మువ్వల గల గలలూ 
చెలి కాలి మువ్వల గల గలలూ
చెలికాని మురళిలో...
సరిగమలూ గలగలలు.. 
సరిగమలూ గలగలలు 
  
ఆవేశమున్నది ప్రతి కళలో
అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో
ఆవేశమున్నది ప్రతి కళలో
అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో 
కదిలీ కదలక కదిలించు కదలికలు
కదిలీ కదలక కదిలించు కదలికలు
గంగా తరంగాల శృంగార డోలికలు

సరిగమలూ గలగలలు.. 
సరిగమలు గలగలలు
ప్రియుడే సంగీతము.. 
ప్రియురాలె నాట్యము

హృదయాలు కలవాలి ఒక శృతిలో
బ్రతుకులు నడవాలి ఒక లయలో  
శృతిలయలొకటైన అనురాగ రాగాలు
జతులై జతలైన నవరస భావాలు

సరిగమలూ గలగలలు...  
సరిగమలూ గలగలలు

నయనాలు కలిశాయి ఒక చూపులో  
నాట్యాలు చేశాయి నీ రూపులో
నయనాలు కలిశాయి ఒక చూపులో  
నాట్యాలు చేశాయి నీ రూపులో
రాధనై పలకనీ నీ మురళి రవళిలో  
పాదమై కదలనీ నీ నాట్య సరళిలో

సరిగమలు గలగలలు...
ప్రియుడే సంగీతము.. 
ప్రియురాలె నాట్యము

ఆహా.. అహహా.. ఆహా.. అహహా 
ఆహా.. అహహా.. ఆహా.. అహహా 
ఆహా.. అహహా.. ఆహా.. అహహా 
ఆహా.. అహహా.. ఆహా.. అహహా




జోలపాట పాడి ఊయలూపనా పాట సాహిత్యం

 
చిత్రం: ఇది కథ కాదు (1979)
సంగీతం: యమ్.యస్.విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల 

జోలపాట పాడి ఊయలూపనా
నా జాలికధను చెప్పి మేలుకొలపనా ॥నా జాలి॥

పెళ్ళాడిన ఆ మగడు ప్రేమించిన ఈ ప్రియుడు
వెళ్ళారు నన్ను విడిచి వచ్చావు నువ్వు వడికి ॥జోల॥

చేసుకున్న బాసలన్ని చెరిగిపోయెను - నే
రాసుకున్న విన్నపాలు చేరవాయెను
ఆకసాన చీకటులే ఆవరించెను - ఆశ
లన్ని విడిచిఉన్న నేడు వెన్నెలొచ్చెను 

మీరా మనసార నాడు వలచెను గోపాలుని
కోరిక నెరవేరక చేపట్టెను భూపాలుని
ఆ కథకు నాకథకు అదే పోలిక
ఆ మీదట ఏమైనది చెప్పలేనిక

నల్లనయ్య నాడూదెను పిల్లనగ్రోవి ఆమె
పరవశించి పోయినదా గానము గ్రోలి
మరువరాని ఆ మురళీ మరల మ్రోగెను
మధుర గానమునకు బాబు నిదురపోయెను ॥జోల॥




గాలి కదుపులేదు పాట సాహిత్యం

 
చిత్రం: ఇది కథ కాదు (1979)
సంగీతం: యమ్.యస్.విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్. జానకి 

గాలి కదుపులేదు - కడలి కంతులేదు.
గంగ వెల్లువ కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరిగీస్తే అది ఆగేదేనా ॥ గాలి॥

ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు యెన్నో
ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు యెన్నో


తుళ్ళితుళ్ళి గంతులువేసే లేగకేది కట్టుబాటు ?
మళ్ళిమళ్ళి వసంతమొస్తే మల్లెకేల ఆకుచాటు ? ॥గాలి॥

ఓ తెమ్మెరా ఊపవే ఊహాల ఊయలనన్నూ
ఓ మల్లికా యివ్వవే నవ్వుల మాలిక నాకు
తల్లి మళ్ళి తరుణయ్యింది పువ్వు పూచి మొగ్గయ్యింది
గుడిని విడిచి వేరొక గుడిలో ప్రమిదనైతే
తప్పేముంది ॥గాలి॥




ఇటు అటుకాని హృదయంతోటి పాట సాహిత్యం

 
చిత్రం: ఇది కథ కాదు (1979)
సంగీతం: యమ్.యస్.విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు 

పల్లవి:
జూనియర్ జూనియర్ జూనియర్
Yes Boss
ఇటు అటుకాని హృదయంతోటి
ఎందుకురా ఈ తొందర నీకు ?
అటు ఇటు తానొక ఆటబొమ్మని
తెలిసే ఎందుకు వలచేవు 
ఒడ్డున పెరిగే గడ్డిపోచవు
గడ్డిపోచా? నేనా ? హిహిహి....
ఒడ్డున పెరిగే గడ్డిపోచవు
ఒద్దిక నదితో కోరేవు
ఒడ్డున పెరిగే గడ్డిపోచకు
హృదయం ఎందుకు ఉండకూడదు ?
ఉందని ఎందుకు ఒప్పుకోరాదు ?
రబ్బరు బొమ్మకు రాగం తెలుసు
ఆటబొమ్మకు ఆశలు తెలుసు
ఇద్దరు ఎందుకు ఒక్కటి కారాదు

చరణం: 1
సాగరమున్నా తీరనిది నీ ధాహమురా
కోకిల గాసం కాకి పాడితే ద్రోహమురా
నీ మొహమురా
తీగకు పందిరి కావలెగానీ
తెలుసా నువ్వే పందిరనీ 

నీటిని చూసి దాహం వేస్తే
తేనెకోసం తేటి వస్తే
పాపం గీపం అనటం చాదస్తం 

నో, ఇటీజ్ బ్యాడ్
బట్ అయామ్ మ్యాడ్
మోడుకూడా చిగురించాలని
మూగమనసు కోరే కోర్కెను
మోసం ద్రోహం అనటం అన్యాయం

చరణం: 2
చైత్రములోన చినుకు పడాలని కోరేవు
మార్గశిరాన మండుటెండకై చూసేవు

బాస్ లవ్ హేస్ నో సీజన్ నార్ ఈవన్ రీజన్
షటప్

ఉదయం కోసం పడమర తిరిగి
ఎదురుతెన్నులు కాచేవు

ఎండా వానా కలిసొస్తాయి
వెలుగూ చీకటి కలిసుంటాయి.
జరగని వింతలు ఎన్నో జరిగాయి

ఇటీజ్ హైలీ ఐడియాటిక్

బొమ్మ : 
నో  బాస్, ఇటీజ్ ఓన్లీ రొమాంటిక్
పాటపాడెను ముద్దుల బొమ్మ
పకపక నవ్వే వెందులకమ్మా
మనసున ఉన్నది చెప్పే నవ్వమ్మా



తకధిమితక పాట సాహిత్యం

 
చిత్రం: ఇది కథ కాదు (1979)
సంగీతం: యమ్.యస్.విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు 

తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధింధిం
జత జతకొక కధ ఉన్నది చరితైతే ఝంఝుం
ఒక యింటికి ముఖద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకు ఒక మనసని అనుకుంటే స్వర్గం

ఈలోక మొక ఆటస్థలము ఈ ఆట ఆడేది క్షణము
ఆడించు వాడెవ్వడైనా - ఆడాలి ఈ కీలుబొమ్మ
ఇది తెలిసి తుది తెలిసి ఇంకేందుకు గర్వం
తన అటే గెలవాలని ప్రతిబొమ్మకు స్వార్ధం
వెళ్తారు వెళ్ళేటి వాళ్ళు చెప్పేసై తుది వీడుకోలు
ఉంటారు కుణమున్నవాళ్లు - వింటారు నీ గుండెరొదలు

కన్నీళ్ళ సెలయెళ్ళు కాకూడదు కళ్ళు
కలలన్నీ వెలుగొచ్చిన మెలకువలో చెల్లు 
ఏ నాడు గెలిచింది వలపుతానోడుటే దాని గెలుపు
గాయాన్ని మాన్పేది మరుపు - ప్రాణాల్ని నిలిపేది రేపు

ప్రతి మాపూ ఒక రేపై తెరవాలి తలుపు
ఏ రెపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు

Most Recent

Default