చిత్రం: జోకర్ (1991)
సంగీతం: వంశీ
సాహిత్యం: గురుచరణ్
గానం: యస్.పి.బాలు
నటీనటులు: రాజేంద్రప్రసాద్ , వాణీ విశ్వనాథ్, బేబీ షామిలి
దర్శకత్వం: వంశీ
నిర్మాతలు: పి.పట్టాభి రామారావు, యమ్.లక్ష్మణ్ కుమార్ చౌదరి
విడుదల తేది: 1991
పల్లవి:
పాలనవ్వులలోన పగడాల వెలుగులు
బాల పలుకులోన పలకాలి చిలకలు
పైన పగటి వేషం ఒక వేడుకైనది
లోన తగని పాశం ఈ జోకరైనది
అమ్మ అమ్మ పూల రెమ్మ రెమ్మ నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మ
పాలనవ్వులలోన పగడాల వెలుగులు
బాల పలుకులోన పలకాలి చిలకలు
పైన పగటి వేషం ఒక వేడుకైనది
లోన తగని పాశం ఈ జోకరైనది
అమ్మ అమ్మ పూల రెమ్మ రెమ్మ నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మ
చరణం: 1
చిలిపి మాటలు చిలికే పాట పేరడి
చురుకు చేతిలో చిరిగే పేక గారడి
చిట్టిపాప బెట్టు అదిహాటు ట్రాజెడి
రట్టుచేయి బెట్టు ఇది స్వీటు కామిడి
గువ్వ నువ్వు నేను నవ్వే నవ్వులోన పువ్వు పువ్వు వాన జల్లాయెను
కయ్యాలు నేటికి కట్టాయెను
చిన్నారి ఆటల పుట్టయెను
పాలనవ్వులలోన పగడాల వెలుగులు
బాల పలుకులోన పలకాలి చిలకలు
పైన పగటి వేషం ఒక వేడుకైనది
లోన తగని పాశం ఈ జోకరైనది
అమ్మ అమ్మ పూల రెమ్మ రెమ్మ నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మ
చరణం: 2
తగువుపాపతో చెలిమి చేసి జోకరు
బిగువులాగితే పొంగి పోయే హ్యుమరు
ఎత్తువేసి వస్తే ఎదురైన నేస్తమా
చిత్తుచేసి చేసినావే ఎదలోని బంధమా
చిన్న చిన్న లేత పొన్నా పొన్నా
ప్రేమకన్న మిన్న లేదు లేదోయన్న
కుందేలు జాబిలి ఫ్రెండాయెను
అందాల స్నేహము విందాయెను
పాలనవ్వులలోన పగడాల వెలుగులు
బాల పలుకులోన పలకాలి చిలకలు
పైన పగటి వేషం ఒక వేడుకైనది
లోన తగని పాశం ఈ జోకరైనది
అమ్మ అమ్మ పూల రెమ్మ రెమ్మ నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మ
******** ********* *********
చిత్రం: జోకర్ (1991)
సంగీతం: వంశీ
సాహిత్యం: గురుచరణ్
గానం: యస్.పి.బాలు, చిత్ర
పల్లవి:
రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి
నీకంటి చూపులవెంట నా పరుగంటి
రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి
నా కంటి కలలుకళలు నీసొమ్మంటి
రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి
నీకంటి చూపులవెంట నా పరుగంటి
రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి
నా కంటి కలలుకళలు నీసొమ్మంటి
ఇటురా త్వరగా ఇకమా త్వరగా
వెతికే చెలిమి కలిసే జతగా
చరణం: 1
నాతోడు నీవైవుంటే నీ నీడ నేనేనంటి
ఈ జంట కంటే వేరు లేదులేదంటి
ఎలాగెలాగ?
నాతోడు నీవైవుంటే నీ నీడ నేనేనంటి
ఈ జంట కంటే వేరు లేదులేదంటి
నీమీద ఆశలు వుంచి ఆపైన కోటలు పెంచి
నీకోసం రేపుమాపు వుంటిని మిన్నంటి
రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి
నీకంటి చూపులవెంట నా పరుగంటి
రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి
నా కంటి కలలుకళలు నీసొమ్మంటి
చరణం: 2
కొలిచె చెలిమే కలసి ఇటురా
నాలోని మగసిరితోటి నీలోని సొగసులు పోటి
వేయించి నేనె ఒడి పోనిపొమ్మంటి
ఎలాగెలాగ?
నాలోని మగసిరితోటి నీలోని సొగసులు పోటి
వేయించి నేనె ఒడి పోనిపొమ్మంటి
నేనోడి నీవె గెలిచి నీ గెలుపు నాదని తలచి
రాగాలు రంజిలు రోజే రాజీ రమ్మంటి
రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి
నీకంటి చూపులవెంట నా పరుగంటి
రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి
నా కంటి కలలుకళలు నీసొమ్మంటి
రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి
నీకంటి చూపులవెంట నా పరుగంటి
రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి
నా కంటి కలలుకళలు నీసొమ్మంటి
******** ********* *********
చిత్రం: జోకర్ (1991)
సంగీతం: వంశీ
సాహిత్యం: గురుచరణ్
గానం: యస్.పి.బాలు, చిత్ర, మాల్గాడి శుభ
పల్లవి:
దిందిన్న దిందిన్న దిన్నా దిన్నా దిందిన్న దిందిన్న దిన్నా దిన్నా
రంగురంగుల రైలుబండి పరుగులెత్తి సాగితే
పచ్చరంగులో పోవాల సంధ్యరంగులో ఆగాల
పగలు రేయి ప్రయాణంలో రాగాలెన్నో తియ్యలా తన తీరం చేరి తీరాలా
బండిర పొగబండిరా దొరలెక్కే రైలుబండిరా దొరసానులెక్కే బండిరా
చరణం: 1
అనుకోకే నాలోన విలువిచ్చాను
నిను కోరి ఓ క్లాసు దిగి వచ్చాను
అందుకునే ఒక రోజు వుండీ వుంటది
అందుకనే మన మోజు పండి వుంటది
బహురూపధారికి బహుమానమియ్యనా
సాధించే రాజు వేళ సంధ్యారాగాల మాల
బండిర పొగబండిరా దొరలెక్కే రైలుబండిరా దొరసానులెక్కే బండిరా
రంగురంగుల రైలుబండి పరుగులెత్తి సాగితే
పచ్చరంగులో పోవాల సంధ్యరంగులో ఆగాల
పగలు రేయి ప్రయాణంలో రాగాలెన్నో తియ్యలా తన తీరం చేరి తీరాలా
బండిర పొగబండిరా దొరలెక్కే రైలుబండిరా దొరసానులెక్కే బండిరా
చరణం: 2
సుందరమా సుమదురమా మందగమనా
మంజులమై సంచరించు మలయ పవనమా
చీకటిలో నీలి రంగు అద్దుకుంటూనే
వేకువలో ప్రేమ రంగు దిద్దుకుందామా
ఊహాగానాలతో లాలించే రాజుకి
సేవిస్తు వెయ్యాలిక జాజి జాపత్రిమాల
బండిర పొగబండిరా దొరలెక్కే రైలుబండిరా దొరసానులెక్కే బండిరా
రంగురంగుల రైలుబండి పరుగులెత్తి సాగితే
పచ్చరంగులో పోవాల సంధ్యరంగులో ఆగాల
పగలు రేయి ప్రయాణంలో రాగాలెన్నో తియ్యలా తన తీరం చేరి తీరాలా
బండిర పొగబండిరా దొరలెక్కే బండిరా దొరసానులెక్కే బండిరా
రంగురంగుల రైలుబండి పరుగులెత్తి సాగితే
పచ్చరంగులో పోవాల సంధ్యరంగులో ఆగాల
పగలు రేయి ప్రయాణంలో రాగాలెన్నో తియ్యలా తన తీరం చేరి తీరాలా
బండిర పొగబండిరా దొరలెక్కే రైలుబండిరా దొరసానులెక్కే బండిరా
బండిర పొగబండిరా దొరలెక్కే రైలుబండిరా దొరసానులెక్కే బండిరా
******** ********* *********
చిత్రం: జోకర్ (1991)
సంగీతం: వంశీ
సాహిత్యం: గురుచరణ్
గానం: యస్.పి.బాలు, చిత్ర
పూచిన తారలు పూవులుగా
దోచిన చీకటి తుమ్మెదగా
జాము వేచింది నాలా జాబిలీ జాగు ఏలా?
వేగిపోవాలి నాలా వేచి దోచాలీ నీలా
తీరనీ తాపము,చేరనీ తీరమూ
పూచిన తారలు పూవులుగా
దోచిన చీకటి తుమ్మెదగా
జాజులా జాములోన జాబిలై నేను రానా
చేరుకోవాలి నీలా సేద తీరాలి నాలా
తీరనీ తాపము,చేరనీ తీరమూ
తార దారాలు తీసి చూపు రట్నాలనేసి
చీర గారాలు చూపి నీకు జోహారు చేసి చేసి
తేనె మారాలు తీసి పులవాలేటి వాని
రూపు నీలోన చూసి ప్రేమవారాసి రాశి పోసి
చూసి చూసి చూపే దోసి ఆశా ఆశ ఆరా తీసి
తీరా మోజు తీరే రోజు ఆగేవేళ ఆపేవేళ పాడేకోయిలా
రావే రాధికా ప్రేమే నీదికా ఏదీ కానుకా తేనే నీదిగా
చూపు గారాము చూసి మాట మారాము చేసి
మారు మాటడలేక కోరి నీ దారి చేరి చేరి
మాకు మారాకు వేసి పూత పూదోట పూసి
కాపు మారాక తోటి రేపు కాలేక వేచీ వేచీ
వేచేవాడు కాచేరేడు వీడే వాడు కానేకాడు
ఈడే నేడు దోచేవాడు తానే జోడు ఆడీ పాడీ తోడూ నీడగా
నీవే మాలిగా రావే మాలికా తీరే కోరిక లోటే లేదికా