చిత్రం: జ్వాల (1985) సంగీతం: ఇళయరాజా నటీనటులు: చిరంజీవి, రాధిక, భానుప్రియ, సిల్క్ స్మిత దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి నిర్మాత: పింజల నాగేశ్వరరావు విడుదల తేది: 14.07.1985
Songs List:
వెన్నెల వెన్నెల పాట సాహిత్యం
చిత్రం: జ్వాల (1985) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: గానం: జానకి వెన్నెల వెన్నెల ఏగలేనె వెన్నెల అల్లరి వయసుతో వల్లకాదు వెన్నెల పేట నిండ మేన మామలే వెన్నెల పూట పూటకెన్ని తిప్పలే పేట నిండ మేన మామలే వెన్నెల పూట పూటకెన్ని తిప్పలే వెన్నెల వెన్నెల ఏగలేనె వెన్నెల అల్లరి వయసుతో వల్లకాదు వెన్నెల ఇంతింత కళ్ళంట నావి సింతాకు ఒళ్ళంట నాది ఇంతింత కళ్ళంట నావి సింతాకు ఒళ్ళంట నాది తాకితే దూదిలా తగులుతా తట్టితే బంతిలా ఎగురుత తాకితే దూదిలా తగులుతా తట్టితే బంతిలా ఎగురుతా కలుసుకో దమ్ములుంటే రాయుడా కప్పుకో సొమ్ములుంటే నాతో ఒకరోజు ఆపై అది మోజు రామ్మ దామ్మ ముద్దుల మామ వెన్నెల వెన్నెల ఏగలేనె వెన్నెల అల్లరి వయసుతో వల్లకాదు మరదల మందేసి నువ్వూగుతుంటే సిందేసి నేనాడుతుంటే మందేసి నువ్వూగుతుంటే సిందేసి నేనాడుతుంటే గుమ్ముగ ఉంటది రాతిరీ గుండెలొ పుడతది ఆవిరీ గుమ్ముగ ఉంటది రాతిరీ గుండెలొ పుడతది ఆవిరీ ఘడియకో కొత్త మురిపం కాముడా వంటకో కొంటె సరసం వస్తె మునుమాపు చూస్తె ఆ బులుపు మనిమే టిం టిం చనిమే చిం చిం వెన్నెల వెన్నెల ఏగలేనె వెన్నెల అల్లరి వయసుతో మర్గయ మరదల పేట నిండ మేన మామలే వెన్నెల పూట పూటకెన్ని తిప్పలే పేట నిండ మేన మామలే వెన్నెల పూట పూటకెన్ని తిప్పలే వెన్నెల వెన్నెల ఏగలేనె వెన్నెల అల్లరి వయసుతో వల్లకాదు వెన్నెల
కలికి చిలక పాట సాహిత్యం
చిత్రం: జ్వాల (1985) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, జానకి పల్లవి: కలికి చిలక చలికి దరికి చేరగనే... చినుకులిగిరి వలపురగిలి కోరగనే జాణ మేన వాన వీణ ఝల్లుమన్నది ప్రేమ గాలి సోకి నన్ను అల్లుకున్నది... జాణ మేన వాన వీణ ఝల్లుమన్నది ప్రేమ గాలి సోకి నన్ను అల్లుకున్నది... కౌగిలింతలోనే....హెయ్...హేయ్.. కలికి చిలక చలికి దరికి చేరగనే... చినుకులిగిరి వలపురగిలి కోరగనే... చరణం: 1 వానొచ్చి తడిసాక వయసెంతొ తెలిసింది...తొలిసారిగా..ఆ.. నీవొచ్చి కలిసాక...మనసంటె తెలిసింది ఒక లీలగా..ఆ.. ఆ గాలి వానల్లె కలిశాము...ఎద మంటల్లొ చలి గుళ్ళో చేరాము.. మెరుపల్లె ఉరుమల్లె కలిశాము...తొలివయసుల్లో వడగల్లె ఏరాము.. మనం మనం...ఊ..ఊ.. మనం మనం...వరించడం..తరించడం..ఇహం పరం.. క్షణం క్షణం ...నిరీక్షణం...సుఖం సుఖం... లలల...కలికి చిలక చలికి దరికి చేరగనే... వయసు తడిసి వలపురగిలి కోరగనే మెరుపు తీగలాంటి మేను మెలికపడ్డది.. ఉరుముతున్న నిన్ను చూసి ఉలికిపడ్డది... మెరుపు తీగలాంటి మేను మెలికపడ్డది.. ఉరుముతున్న నిన్ను చూసి ఉలికిపడ్డది... కౌగిలింతలోనే....హెయ్...హేయ్.. కలికి చిలక చలికి దరికి చేరగనే... వయసు తడిసి వలపురగిలి కోరగనే.... చరణం: 2 వాటేసుకుంటేనే వయసొచ్చే.. ఈ సందే సందిల్లల్లో...హోయ్ వయ్యారి అందాలు.. వరదల్లె పొంగేటి కౌగిల్లలో...హా.. సూరీడు వెళ్ళాక ...సాయంత్రం... తొలి నా ఈడు కోరింది..నీ మంత్రం చుక్కల్తో వచ్చింది...ఆకాశం... చలి చూపుల్లో తెచ్చింది...ఆవేశం... ప్రియం ..ప్రియం..ఉ..ఉ.. ప్రియం ..ప్రియం....జతిస్వరం... పరస్పరం..స్వయంవరం... నరం నరం..ఒకే స్వరం..నిరంతరం...తరార... కలికి చిలక చలికి దరికి చేరగనే... చినుకులిగిరి వలపురగిలి కోరగనే... జాణ మేన వాన వీణ ఝల్లుమన్నది ప్రేమ గాలి సోకి నన్ను అల్లుకున్నది... మెరుపు తీగలాంటి మేను మెలికపడ్డది.. ఉరుముతున్న నిన్ను చూసి ఉలికిపడ్డది... కౌగిలింతలోనే....హెయ్...హేయ్.. కలికి చిలక చలికి దరికి చేరగనే... వయసు తడిసి వలపురగిలి కోరగనే....
ఏవేవో కలలు కన్నాను.. పాట సాహిత్యం
చిత్రం: జ్వాల (1985) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: మైలవరపు గోపి గానం: జానకి పల్లవి: అహ...అహ...హ... అహ...అహహ...ఆ... ఏవేవో కలలు కన్నాను.. మదిలో ఏవేవో కలలు కన్నాను.. మదిలో.. మౌన మురళినై..విరహ వీణనై... స్వామి గుడికి చేరువైన వేళలో...ఓ... ఏవేవో కలలు కన్నాను.. మదిలో.. చరణం: 1 సుడిగాలులలో మిణికే దీపం ఈ కోవెలలో ఎటు చేరినదో ఏ జన్మలోని బంధమో ...ఇదే ఋణానుబంధమో ఏ జన్మలోని బంధమో ...ఇదే ఋణానుబంధమో నీకు నేను బానిసై ..నాకు నువ్వు బాసటై...సాగిపోవు వరమె చాలు.. ఏవేవో కలలు కన్నాను.. మదిలో... చరణం: 2 నా కన్నులలో వెలుగై నిలిచీ... చిరు వెన్నెలగా... బ్రతుకే మలిచీ నిట్టూర్పుగున్న గుండెకీ ..ఓదార్పు చూపినావురా నిట్టూర్పుగున్న గుండెకీ ..ఓదార్పు చూపినావురా నాది పేద మనసురా .. కాంచలీయలేనురా..కనుల నీరె కాంచరా
తలాంగు దింత పాట సాహిత్యం
చిత్రం: జ్వాల (1985) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: గానం: ఎస్.పి.బాలు, కె. చిత్ర తలాంగు దింత