చిత్రం: కథ (2009)
సంగీతం: యస్.కె.బాలచంద్రన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: నరేష్ అయ్యర్
నటీనటులు: జెనీలియా, అరుణ్
దర్శకత్వం: శ్రీనివాస్ రాగ
నిర్మాత: ఊర్మిళ గుణ్ణం
విడుదల తేది: 12.12.2009
టక టక టక టక ఎవరో నా మది గది తలుపులు తడితే
తెరిచా తెరిచా ఒక నిమిషము ప్రాణము విడిచా
ఆ హంతకి నాలో ఊహకీ ఊపిరే పోసినదీ
నే ఒంటరీ అనే మాటని అంతమే చేసినదీ
ఉలుకూ పలుకూ అసలెరుగని మనసుని ఉసిగొలిపినదా అందం
ఉరుకూ పరుగూ అవి తెలియని తలపుని తెగతరిమినదే పాపం
నీలాల నింగి తెరపైన గీసుకున్నానా ఆమె రూపం
జగమంతా కాగితం చేసి రాసుకున్నానా ప్రేమ గీతం..
ఏవేళలో ఎటేపెళ్ళినా ఎదురుగా కనబడుచూ
ఆ పాటనే ప్రతీ అక్షరం వదలకా పలికినదీ ..
అదిగో అదిగో ఆ అడుగుల సడి విని కదలని కదలిక రాదా
అపుడే అకడే ఆపెదవుల నగవుకి ఎదలను బడలిక పోదా
సంతోషం నీడలా మారి నడిచి వస్తోంది ఆమె వెంటా
ఆనందం పాపలా చేరి ఆడుకుంటోంది ఆమె కంటా..
నా రేయికీ తనే వేకువై వెలుగునే ఇచ్చినదీ
ఈ జన్మలో మరో జన్మనే మరుక్షణం చూపినదీ