Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kobbari Bondam (1991)



చిత్రం: కొబ్బరి బొండాం (1991)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర
నటీనటులు: రాజేంద్రప్రసాద్, నిరోషా
దర్శకత్వం: కాట్రగడ్డ రవితేజ
నిర్మాత: కె. అచ్చిరెడ్డి
విడుదల తేది: 1991

అందాల మేఘమాల
పరుగులు తీసే పరువంతో పోటీ పడతావా
వెచ్చని ఊహల ఊయలలూగి
నీలాల నింగి అంచులు చూసొద్దాం
కొండలు దాటి కోనలు దాటి
ఏవేవో భావాలే మదిలో మోహన రాగాలై
కోయిల పాడే గీతాలై ఎద మరిపిస్తేనే
సాగే కాలంతో చివురించే ఆశల్లో
ఉందేదో ఆహా ఓ హాయి

అందాల మేఘమాల
పరుగులు తీసే పరువంతో పోటీ పడతావా
వెచ్చని ఊహల ఊయలలూగి
నీలాల నింగి అంచులు చూసొద్దాం
కొండలు దాటి కోనలు దాటి
విన్నాలే ఓ పిలుపు వయసులు పిలిచే తొలిపిలుపు
మనసున పొంగే తొలివలపు రారమ్మంటేనే
తీశావో తలుపు నీదే ఈ గెలుపు
రావేల ఆహా ఆహాహా

అందాల మేఘమాల
పరుగులు తీసే పరువంతో పోటీ పడతావా
వెచ్చని ఊహల ఊయలలూగి
నీలాల నింగి అంచులు చూసొద్దాం
కొండలు దాటి కోనలు దాటి
ఏవేవో పులకింత తపనలు రేగే తరుణంలో
తనువుని తడిమే నీళ్ళల్లో ఓ గిలిగింత
సంధ్యాసమయంలో ఈ జలకాలాటల్లో
ఉందేదో ఆహా ఓ హాయి
అందాల మేఘమాల


******   *******   *******


చిత్రం: కొబ్బరి బోండాం (1991)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
చల్ల చల్లని గాలుల్లో...సాయం సమయంలో
సరసాలాడే మల్లెల జల్లుల్లో...ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే
ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే...
ఊ అనమంది ఉల్లాసం
చల్ల చల్లని గాలుల్లో...సాయం సమయంలో
సరసాలాడే మల్లెల జల్లుల్లో...ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే
ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే...
ఊ అనమంది ఉల్లాసం
ఉసిగోల్పింది సల్లాపం...

చరణం: 1
ఆహ ఆహ ఈ హాయి...నూరేళ్ళు నీదోయి
ఎద ఎద కలిసే ఏకాంతంలో...కౌగిలి రాగంలో
అందాల అమ్మాయ్యి..అందియ్యి నీ చేయి
పెదవులు కలిసి జతగా వేసే...ముద్దుల తాళంలో
కొబ్బరి బోండాం ...లబ్జు లకోరీ..
మోహవేశంలో ...ప్రేమానందంలో
ఏదేదో ...ఏమేమో...చక్కిలి గింతల
చలి చలి గిలి గిలి..లల.ల.లా...

చల్ల చల్లని గాలుల్లో...సాయం సమయంలో
సరసాలాడే మల్లెల జల్లుల్లో...ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే
ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే...
ఊ అనమంది ఉల్లాసం
ఉసిగోల్పింది సల్లాపం...

చరణం: 2
ఓహొ హో వయ్యారి...ముద్దొచ్చే సింగారి
సృష్టి రహస్యం భేదించాలి...శోభన రాత్రుల్లో
మౌనాలా తీరానా...గారాలా మారాలా
మన్మధబాణం సంధించాలి...యవ్వన వీధుల్లో
మధువుల మధనం...మదనుడి శరణం
సాగే శృంగారం...ఊగే సింగారం
ఉయ్యాల... జంపాల...గంధపుతూతల
సుందరి సొగసుకు...తపన వరసల
తకధిమి... ధిమితక

చల్ల చల్లని గాలుల్లో...సాయం సమయంలో
సరసాలాడే మల్లెల జల్లుల్లో...ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే
ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే...
ఊ అనమంది ఉల్లాసం
ఉసిగోల్పింది సల్లాపం...

Most Recent

Default