Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Lakshmi Narasimha (2004)




చిత్రం: లక్ష్మీనరసింహా  (2004)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: బాలక్రిష్ణ , ఆసీన్
దర్శకత్వం: జయంత్ సి.పరాన్జీ
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 14.01.2004



Songs List:



దేవున్నే పిలిచావంటే పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీనరసింహా  (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్

దేవున్నే పిలిచావంటే 



అందంలో ఆంధ్రా కోస్తా పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీనరసింహా  (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, శ్రేయా ఘోషల్

అందంలో ఆంధ్రా కోస్తా
నీకే నా బందో బస్తా
అంతేదో చూస్త జోరుగా
అందాలే చందాలిస్తా
మందార ఘంధాలిస్తా
రాసిస్తా నన్నే తేరగా

కస్సుల బస్సుల కారప్పొడి
కసి కసామిస నా దోపిడీ
కిస్సు కి మిస్ కి వెంటే పడీ
కధే నడిపితే నీకే పిడి
నచ్చావులే మెచ్చానులే
జివ్వు జీవ్వంటూ కవ్వించు
కుంటాను రావే మరి
కుడికాలే కదిలింది
కుడి కన్నె అదిరింది హొయ్

అందం లో ఆంధ్ర కోస్తా
నీకేనా బందో బస్తా
అంతేదో చూస్తా జోరుగా

మత్తెక్కే అందాల మహిళామని
చెయ్యవే తియ్యగా పూబోణి
కమ్ముకుంటే పాడుతుంది కళ్యాణి
సయ్యంటూ కలిపాను చెయ్యి చెయ్యి
ఎత్తులే వెయ్యకు అబ్బాయి
అందుకైతే మోగనివ్వు సన్నాయి

గుచ్చుకుంటే నీకు ఏడు ముళ్ళు
చిట్టి చెంపబుగ్గే నాకు చెమ్మగిల్లు
హత్తుకున్నాక పుట్టేది ఆ హాయి హైలెస్సలే
కుడికాలే కదిలింది
కుడి కన్నె అదిరింది హొయ్

అందం లో ఆంధ్ర కోస్తా
నీకేనా బందో బస్తా
అంతేదో చూస్తా జోరుగా

భామ నీ బాడీ కి భంధో బస్తు
సిగ్గులే దోచితే శ్రీరస్తు
కంటితోనే ఒంటి తేనే లాగేస్తూ
పొమ్మంటే రమ్మంటు నీతో చిక్కు
గాలిలో ముద్దుల మ్యూజిక్కు
లాహిరాల కళ్ళతోటి మ్యాజిక్కు
అః జబ్బ చూస్తే పచ్చ డబ్బ పండు
నువ్వు నవ్వుతుంటే నాకు మల్లె చెండు
ప్రేమ కోరింది నాతోటి నీ పెళ్లి పేరంటమే
కుడికాలే కదిలింది
కుడి కన్నె అదిరింది

అందం లో ఆంధ్ర కోస్తా
నీకేనా బందో బస్తా
అంతేదో చూస్తా జోరుగా
ఓ అందాలే చందాలిస్తా
మందార ఘంధాలిస్తా
రాసిస్తా నన్నే తేరగా

కసుల భూస్సుల కారప్పొడి
కసి కాసమిస నా దోపిడీ
కిస్సు కి మిస్ కి వెంటే పడీ
కథే నడిపితే నీకే పిడి
నచ్చావులే మెచ్చానులే
జివ్వు జివ్వంటూ కవ్వించు
కుంటాను రావే మరి
కుడికాలే కదిలింది
అరెరే కుడి కన్నె అదిరింది హొయ్



జడతోటి కొడితే పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీనరసింహా  (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి. బాలు, సుజాత

జడతోటి కొడితే జగ్గల్ పేట్లో పడతావ్ ఓరబ్బి కొట్టేయనా
కుడి కన్ను కొడితే కాకినాడ్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా

నువ్వు నన్ను కొట్టినా, నే నిన్ను కొట్టినా
ఆ ఉట్టి కొట్టేది మనమే కదా
నువ్వు చిలకల్లే కొడుతుంటే నారాయణ
కన్నె చీరమ్మ బెణికింది నారాయణ
నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ
ఉన్న నిదరమ్మ బెదిరింది నారాయణ

జడతోటి కొడితే జగ్గల్ పేట్లో పడతావ్ ఓరబ్బి కొట్టేయనా
కుడి కన్ను కొడితే కాకినాడ్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా

ప్రేమించి పెళ్ళాడినా... ఓ ఓ పెళ్ళాడి ప్రేమించినా... ఓ ఓ
ముందుకొచ్చినా, పక్కకొచ్చినా, మీదికొచ్చినా నేనేగా
కొపమోచ్చినా, కోరికొచ్చినా, దారికొచ్చినా నేనేగా
చలి తలుపులకొక నిచ్చెన వేస్తావా ఇవ్వాళ
ఒడి దుడుకులకొక వంతెన కట్టాలా పూబాలా
చలి తలుపులకొక నిచ్చెన వేస్తావా ఇవ్వాళ
ఒడి దుడుకులకొక వంతెన కట్టాలా పూబాలా
నీ ఆటే కట్టినా, నిన్నే ఆకట్టినా
ఆ తాళి కట్టేది నాకే కదా
కొత్త కౌగిళ్ళు కడుతుంటే నారాయణ
కొంగు గొంగళ్ళు పరిచింది నారాయణ
సోకు పెద్దిల్లు కడుతుంటే నారాయణ
సిగ్గు చిన్నిల్లు కూలింది నారాయణ

చాపేసి దిండేసినా... ఓ ఓ దిండేసి చాపేసినా... ఓ ఓ
సేవ చేసినా, దాడి చేసినా, గొడవ చేసినా నేనేగా
తప్పు చేసినా, ఒప్పు చేసినా, చెప్పి చేసినా నేనేగా
గిలిగిలి గిలిగిలి గిలిగింతలు కావాలా గోపాల
మరుమరు మరుమరు మరుమల్లెలు పెట్టాలా ప్రియురాలా
హోయ్ గిలిగిలి గిలిగిలి గిలిగింతలు కావాలా గోపాల
మరుమరు మరుమరు మరుమల్లెలు పెట్టాలా ప్రియురాలా
మోమాటం పెట్టినా, ఇరకాటం పెట్టినా
అడిగింది పెట్టేది నేనే కదా
సుముహుర్తాలు పెడుతుంటే నారాయణ
సన్న నడువమ్మ నవ్వింది నారాయణ
పాలు పళ్ళన్నీ పెడుతుంటే నారాయణ
పట్టు పరుపమ్మ ఏడ్చింది నారాయణ

జడ తోటి కొడితే జగ్గల్ పేట్లో పడతావ్ ఓరబ్బి కొట్టేయనా
కుడి కన్ను కొడితే కాకినాడ్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా

నువ్వు నన్ను కొట్టినా, నే నిన్ను కొట్టినా
ఆ ఉట్టి కొట్టేది మనమే కదా
నువ్వు చిలకల్లే కొడుతుంటే నారాయణ
కన్నె చీరమ్మ బెణికింది నారాయణ
నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ
ఉన్న నిదరమ్మ బెదిరింది నారాయణ




మరుమల్లి జాబిల్లి పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీనరసింహా  (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్, మురళీధర్ , శ్రీవర్ధిని

మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి
మన్మధుని రాఘవుని కలబోతే బావ అని
మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి
మన్మధుని రాఘవుని కలబోతే బావ అని
ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఈడు జోడు పెళ్ళి
ఇంటిపేరు మర్చే పెళ్ళి జంటనడక పెళ్ళి
బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవమయి జరుగుతున్న పెళ్ళి
బహుమానంగా ఆశీస్సులనే అడుగుతున్న పెళ్ళి 

దేవుళ్ళు దేవతలు కొలువయిలేరు కొవెలలో
బంధువులై చుట్టాలై విచ్చేసినారు వాకిలిలో
ఊరు వాడా వేడుకా ప్రతి ఒక్కరి హౄదయం వేదిక
లేనే లేదు తీరికా ప్రతి నిమిషం తెలియని తికమకా
మైనాలు కోయిలలు కూర్చోలేదు కొమ్మలలో
మా వాళ్ళై అయినోళ్ళై ఒక చెయ్యేసినాయి మేళంలో
పందిరిలోన పండుగలన్ని నిలుపుతున్న పెళ్ళి
నవ్వులలోన కన్నుల తడిని కలుపుతున్న పెళ్ళి

మా నాన్నా మా అన్న ఇద్దరు నాకు పుట్టిళ్ళు
అందరికి సెలవంటు నేవెళ్ళి వొస్తా అత్తిళ్ళు
చల్లని చూపే కాటుకా ఇక తరగని ప్రేమే బొట్టుగా
మమకారాలే సిరులుగా మెట్టింట్లో ఉంటా సీతగా
ఆత్రాన్నయి సూత్రన్నయి ముద్దుగా వెస్తా బంధాలు
నేస్తాన్నయి నీ వాడ్నై నీ వద్ద వుంటా వందేళ్ళు
మాటలు కలిసే మనసులు కలిసే ముచ్చటయిన పెళ్ళి
కలిసిన మనసె శక్షిగా నిలిచే స్వచ్చమయిన పెళ్ళి





పప్పేసుకో చారేసుకో పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీనరసింహా  (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: మల్లికార్జున్, మహాలక్ష్మి అయ్యర్

పప్పేసుకో చారేసుకో అన్నీ వేసీ‌ ఒప్పెసుకో 
కన్నెసుకో కాలిసుకో ముల్లే వేసీ అల్లేసుకో
దమ్మున్నొడు భలే రిమ్మున్నొడూ
అయ్యాడు నీ వాడూ...
రమ్మన్నాడు అదె ఇమ్మన్నాడూ అమ్మమ్మో చీ పాడూ...

పువ్వుల్నే తెస్తాడు కొప్పుల్లో  పెట్టేయడు
నా చీర కుచ్చిళ్ళు తురిమేస్తాడు
చీకట్లో వస్తాడు చంపల్నే గిల్లేయడు
అరికాలే గీరేస్తుంటాడు
హే పట్టిమంచం ఊయలల్లే మార్చి మంత్రాలయ్యాడు
పట్టపగలు మంచివాడే రాత్రి మహా పిచ్చోడు హేయ్ 
వేషం మార్చి సరసం నేర్చి
రామయ్యే మళ్ళీ నీకోసం పుట్టాడు

అరె పప్పేసుకో చారేసుకో అన్నీ వేసీ‌ ఒప్పెసుకో 
అరె కన్నెసుకో కాలిసుకో ముల్లె వేసీ అల్లేసుకో

బైటేమో గొప్పొడూ మొనగాడు రౌడి గాడు
ఈ రాణి సేవల్లో బంటౌతాడూ
దొంగల్నె పడతాడూ తిడతాడు కొట్టెస్తాడూ
పొంగుల్లొ డంగై పోతాడూ..

హే ఆకలేస్తే అన్నం కాదూ సోకె తింటానంటాడూ
దాహం వేస్తే నీరె కాదు నిప్పె తాగలంటాడూ..
ఏదో చేసీ నన్నే దోచీ ఏడాదిలోగానె నాన్నై పోతాడూ

పప్పెసుకో చారేసుకో అన్నీ వేసీ‌ ఒప్పెసుకో
హ కన్నెసుకో కాలిసుకో ముల్లె వేసీ అల్లేసుకో
దమ్మున్నొడు భలే రిమ్మున్నొడూ
అయ్యాడు నీ వాడూ...
రమ్మన్నాడు అదె ఇమ్మన్నాడూ అమ్మమ్మో చీ పాడూ...




నాతోటి నీకు పనుంది పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీనరసింహా  (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: కార్తిక్, మహాలక్ష్మి అయ్యర్

నాతోటి నీకు పనుంది

Most Recent

Default