చిత్రం: మహానంది (2005) సంగీతం: కమలాకర్ నటీనటులు: సుమంత్ , అనుష్క , శ్రీహరి దర్శకత్వం: వి.సముద్ర నిర్మాత: అనసూయ దేవి విడుదల తేది: 03.12.2005
Songs List:
ఏమైనా ఏదేమైనా పాట సాహిత్యం
చిత్రం: మహానంది (2005) సంగీతం: కమలాకర్ సాహిత్యం: బండారు దానయ్య కవి గానం: హరిహరన్ , చిత్ర పల్లవి: ఏమైనా ఏదేమైనా ఏమైనా ఏదేమైనా ప్రేమ తెలుపుతున్నా ఏమైనా ఏదేమైనా మనసు తెలుసుకున్న అణువు అణువున ఆరాధన పెదవి దాటింది ఈ రోజున మనసులో కొత్త ప్రియభావన మరచి పోలేను కలిసి బ్రతుకు చివరివరకు ఏమైనా ఏదేమైనా ప్రేమ తెలుపుతున్నా చరణం: 1 నువ్వంటే ప్రాణం నీలో నా స్థానం పదిలమవ్వాలి పద పద మని పదికాలాలు ప్రేమంటే దైవం వెంటుంటే ధైర్యం సాగిపోవాలి కనుమరుగై మన దూరాలు ప్రేమెంతో పోసి చీటీలను రాసి కొరాను దైవాలని ఆ ఆశను చూసి ఆశ్చర్యం వేసి నువు నాకు కావాలనే ఇన్నాళ్ల నా ప్రేమ నువ్వే నా చిరునామా అని అనగా అనగా కలలు కనగ ఏమైనా ఏదేమైనా ప్రేమ తెలుపుతున్నా చరణం: 2 అందాల రాశి నన్నేదో చేసి తిష్ట వేసావు తొలి వలపుల తలుపులు తీసి పక్కింటి పెళ్లి అంటుంది తుళ్ళి ఒప్పుకోవాలి వధు వరులం మనమైపోయి చూపుల్లో భావం చేతల్లో జీవం మార్చింది నీవాడిగా మాటల్లో మాఘం ఆశల్లో భాగం అడిగింది నిను తోడుగా మరణాలే ధరిరాని గగనాలే విడిపోని ప్రతి జన్మలోను ఒకటి మనము ఏమైనా ఏదేమైనా ప్రేమ తెలుపుతున్నా అణువు అణువున ఆరాధన పెదవి దాటింది ఈ రోజున మనసులో కొత్త ప్రియభావన మరచి పోలేను కలిసి బ్రతుకు చివరివరకు
టైట్ జీన్ ప్యాంట్ పాట సాహిత్యం
చిత్రం: మహానంది (2005) సంగీతం: కమలాకర్ సాహిత్యం: తైదల బాపు గానం: టిప్పు టైట్ జీన్ ప్యాంట్
ఇంద్ర ధనస్సులో ఏడు రంగులు పాట సాహిత్యం
చిత్రం: మహానంది (2005) సంగీతం: కమలాకర్ సాహిత్యం: ఈశ్వర్ తేజ గానం: శ్రేయా ఘోషల్ ఇంద్ర ధనస్సులో ఏడు రంగులు బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు నింగి నేల ఓ అద్భుతం నీరు గాలి ఓ అద్భుతం స్వరాలూ ఏడూ సముద్రాలేడు వెంకన్న వుండే కొండలు ఏడు పెళ్లితో వేసే అడుగులు ఏడు నువ్వు నాతోడు ఓ నేస్తం నేను ని తోడు నేను ని తోడు ఓ ప్రేమ నువ్వు నా తోడు ఇంద్ర ధనస్సులో ఏడు రంగులు బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు నింగి నెల ఓ అద్భుతం నీరు గాలి ఓ అద్భుతం వచ్చింది ఈడు కోరింది తోడు కన్నేసి చూడు తప్పించు కోడు చూపులతో వాడు గాయం చేసాడు ప్రేమించమంటే మాయమౌతాడు ప్రతి రేయిలో ఇదే స్వప్నము తెల్లవారితే అదే మౌనము ఆలోచిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తా గోల చేస్తుంది నా ఈడు గోల చేస్తుంది ఆగనంటుంది అందాకా ఆగనంటుంది ఇంద్ర ధనస్సులో ఏడు రంగులు బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు నింగి నేల ఓ అద్భుతం నీరు గాలి ఓ అద్భుతం చూసింది మొదలు గుండెల్లో గుబులు ఏమైందో అస్సలు ని పైనే కళలు కౌగిళ్ళ కధలు చెప్పాలా బదులు ఎందయ్యో అస్సలు ఈ పిచ్చి పనులు ప్రేమన్నది ఓ అద్భుతం ప్రేమించడం మరో అద్భుతం ఇదే అర్ధం ఇదే నిత్యం ఇదే సత్యం నన్ను ప్రేమిచే మగడు ఎక్కడున్నాడో కల్లముందొచ్చి షొక్కిస్తే ఎంత బాగుందో ఇంద్ర ధనస్సులో ఏడు రంగులు బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు నింగి నేల ఓ అద్భుతం నీరు గాలి ఓ అద్భుతం నువ్వు నాతోడు ఓ నేస్తం నేను ని తోడు నేను ని తోడు ఓ ప్రేమ నువ్వు నా తోడు
ఎటు చుస్తే అటు నువ్వే పాట సాహిత్యం
చిత్రం: మహానంది (2005) సంగీతం: కమలాకర్ సాహిత్యం: వేల్పుల వెంకటేష్ గానం: చిత్ర ఎటు చుస్తే అటు నువ్వే
చంపకమాల పాట సాహిత్యం
చిత్రం: మహానంది (2005) సంగీతం: కమలాకర్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: మాలతి, శంకర్ మహదేవన్ చంపకమాల
నా పంచప్రాణాలు పాట సాహిత్యం
చిత్రం: మహానంది (2005) సంగీతం: కమలాకర్ సాహిత్యం: గురుచరణ్ గానం: యస్.పి.బాలు , చిత్ర నా పంచప్రాణాలు నీ ప్రేమా గీతాలని తెలుపనా ఈ పంచభూతాలే మన పెళ్ళి సాక్షాలని తెలుసునా (2) ఇలా మనం చెరోసగం ఇదేకదా స్వయంవరం ఏడేడు జన్మాలదే ఈ వరం నా పంచప్రాణాలు నీ ప్రేమా గీతాలని తెలుపనా ఈ పంచభూతాలే మన పెళ్ళి సాక్షాలని తెలుసునా ఈ నేల అన్నదీ నా గంగ నువ్వని నీ ప్రేమ స్వాతివాననీ ఈ గాలి అన్నదీ నువ్వంటే నిప్పని ఆ అగ్నిసాక్షి చాలనీ తారలతోటి ప్రేమకు నింగి పందిరి వేసే నేలకి వంగి అడగలేక అడుగుతుంటే అడుగడుగుకి తడబడే హృదయం నా పంచప్రాణాలు నీ ప్రేమా గీతాలని తెలుపనా ఈ పంచభూతాలే మన పెళ్ళి సాక్షాలని తెలుసునా కార్తీక మాసమే కళ్ళల్లో ఉన్నది కల్యాణమెప్పుడన్నది పెదాల మాటున ఏ మౌనమంత్రమో అక్షింతలేయమన్నది అందరి మాటే మంగళవాద్యం అందెను నీకే మంగళసూత్రం అదును చూసి పదును చూసి ముడిపడినది మనసుల ప్రణయం నా పంచప్రాణాలు నీ ప్రేమా గీతాలని తెలుపనా ఈ పంచభూతాలే మన పెళ్ళి సాక్షాలని తెలుసునా ఇలా మనం చెరోసగం ఇదేకదా స్వయంవరం ఏడేడు జన్మాలదే ఈ వరం
కత్తిలాంటి అమ్మాయి పాట సాహిత్యం
చిత్రం: మహానంది (2005) సంగీతం: కమలాకర్ సాహిత్యం: వేటూరి గానం: అద్నాన్ సామి, సుజాత కత్తిలాంటి అమ్మాయి