చిత్రం: నవ్వుతూ బ్రతకాలిరా (2001) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు: జే. డి. చక్రవర్తి, సంగీత, అశాషైని, మాళవిక దర్శకత్వం: కోడి రామకృష్ణ నిర్మాత: శ్రీనివాస రెడ్డి విడుదల తేది: 2001
Songs List:
నోరారా నవ్వేద్దాం పాట సాహిత్యం
చిత్రం: నవ్వుతూ బ్రతకాలిరా (2001) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహితం: సిరివెన్నెల గానం: యస్. పి. బాలు నోరారా నవ్వేద్దాం
కోనసీమ కుర్రదాన్నిరో పాట సాహిత్యం
చిత్రం: నవ్వుతూ బ్రతకాలిరా (2001) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహితం: సిరివెన్నెల గానం: యస్. పి. బాలు, చిత్ర కోనసీమ కుర్రదాన్నిరో
ధిరనతోం తకిట..ధిరనతోం పాట సాహిత్యం
సినిమా: నవ్వుతూ బ్రతకాలిరా సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహితం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, సుమంగళి ధిరణతోం తకిట ధిరణతోం తకిట ధిరణతోం తకిట తానాన నిదుర ఉండదట కుదురు ఉండదట మధురమైన ఈ మైకాన నిమిషమైన ఇక నిలవనీయదట మొదట అందరికి ఇంతేనా తగని తొందరట చిలిపి చిందులట అదుపులేని అనందనా వలపు తేనె రుచి తెలుసుకున్న మది ఆగనన్నది ఏమైన మనసుతో...మనసు ముడిపడినదీ కనులతో... కనులు కలిసినవీ వయసుతో... వయసు జతపడినదీ వలపుతో ...వరుస కుదిరినదీ చెలియలో ...హొయలు తికమక పడినవీ కులుకులో... కునుకు చెదిరినదీ నడకలో... నడుమునడిగిన బరువిదీ బిగుతుతో ..సొగసు రగిలినదీ చలువ నీడవని తగిన తోడువని ఒడికి చేరిన అల్లరిని బిడియమా... అవును సహజము కదా కుదురుకో... ఉడుకు తెలియదు కదా తమకమా.. తమకు తెలుసును కదా అణుచుకొ ..తెగని తగువు కదా చినుకులా.. ఎదను తడిమిన గొడవిది వరదలా ..ఎదిగి తడిమినదీ పిలుపుల.. మెలిక తిరిగిన కథకళి తనువులో తళుకు తెలిసినదీ అదురుతున్న తడి పెదవి అలజడికి నిదుర లేవని కలలన్ని
అయ్యప్ప శరణమయ్యా పాట సాహిత్యం
చిత్రం: నవ్వుతూ బ్రతకాలిరా సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహితం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు అయ్యప్ప శరణమయ్యా ఈల కొట్టి తోలవయ్య కొత్త రధం కదెలనయ్యా వెనకడుగే వెయ్యదయ్యా చీకటని చిక్కులని ఆగకురా భాయి సుడిగాలులతో వానలతో చెయ్యి లడాయి కొండలని కోనలని చూడకురా భాయి అడుగేయనిదే తీరమే నీకు ఎదురు రాదోయి దీవేనలిచ్చే ఆ దేవుడికైనా కోవ్వెల కట్టి దీపమెట్టాలి అన్నము పెట్టే యజమానికి మనం కండలతొటి కంచె కట్టాలి పనినిచ్చి మన బ్రతుకులు నడిపించే వాడు తన చక్రముని చేతికిచ్చి తిప్పమన్నాడు చీడలని చేరకుండ చేట్టున్నవాడు ఆ నీడని నీకున్నదిరా చల్లని గూడు చినుకు పడందే నువ్వు దున్నే చేలొ తనకు తనే పైరు వస్తుందా కునుకు వీడందే కలలన్ని నిజం చేసేటందుకు వీలు వింటుందా చెమట చిందే శ్రమను నమ్మి బ్రతుకు బండిని తొయ్యి అలుపు అనే మాట అనక అడుగులు వెయ్యి ముందుకెళ్ళే దారులన్ని తెలుసుకోరా భాయి నీవెనకే నలుగురిని తీసుకెళ్ళాలి
ధిన్ ధిన్ తార.. పాట సాహిత్యం
చిత్రం: నవ్వుతూ బ్రతకాలిరా (2001) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహితం: సిరివెన్నెల గానం: దేవి శ్రీ ప్రసాద్, మురళి, సుమంగళి ధిన్ ధిన్ తార..ధిన్ తార..ధిన్ ధిన్ తార..ధిన్ ధిన్ ధిన్నా అంగరంగ వైభోగంగా పెళ్ళి చేద్దాం రారండి నిండు పందిరి వేసుందండి నేల పీట ఆయిందండి బుగ్గ చుక్కతో పెళ్ళికూతురు సిగ్గు మొగ్గ ఆయింది పక్కవాడితో లగ్గమైతే ఆ మొగ్గ విరియునండి కొంగుముళ్ళతో పగ్గమెయ్యగా పిల్ల ఎదురయింది అరె కుదురులేని ఈ కుర్రవాడికి తిక్క కుదురుతుంది ధిన్ ధిన్ తార..ధిన్ తార..ధిన్ ధిన్ తార..ధిన్ ధిన్ ధిన్నా పాలరాతి మేడ కరిగి..నేల మీద కాళ్ళే కడిగి పేదపెద్దలు అను తేడాలను చెరపాలి కోటలోని ఆ యువరాణి..తోటరాముడితో జతగూడి ప్రేమరాజ్యమును కలకాలం పాలించాలి కలిమికి చెలిమికి నడుమున నిలిచిన ఇనుప తెరలు కరుగుతూ ఉంటే కని విని యెరుగని జత ఇదని మన మనసు పాడుతుందే మనువుతో ముడిపడి విరిసిన మనసులు ఒకరికొకరు అనిపిస్తుంటే తళతళ వెలుగుల తడిసిన కనులకు సిరులు దొరికినట్లే ముందుజన్మలో ఋణమంతా తీర్చుకోను కలిసిందంట బ్రహ్మరాతలకు అర్ధం చెప్పే ఈ జంట అ: ముందు ఇద్దరుంటారంట..కలిసి ఒక్కటవుతారంట లెక్క చూస్తే పైఏటికి మూడవుతారంట ఆ: మసకలు, ముసుగులు గుసగుస గోదవులు ఉరికి ఉరికి తలబడుతుంటే పరులకు తెలియని పడుచుతనపు కధ వదను తేలుతుందే అ: జరిగిన తగువుకు బిడియము భయపడి పరువు విడిచి పరుగేడుతుంటే తికమక పడి కరిగే సమయము తెల్లవారుతుందే