Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Pandurangadu (2008)





చిత్రం: పాండురంగడు (2008)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: బాలక్రిష్ణ , టబు, స్నేహ, మేఘన నాయుడు
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: కె.కృష్ణమోహన్ రావు
విడుదల తేది: 30.05.2008



Songs List:



అడవు దేవకీ దేవి పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగడు (2008)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: శ్రీ వ్యాధవ్యాస్
గానం: యస్.పి.బాలు, మాళవిక, సౌమ్య




గోవిందుడే కోక చుట్టి పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగడు (2008)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: శ్రీ వ్యాధవ్యాస్
గానం: యస్.పి.బాలు, మాళవిక, సౌమ్య



హే కృష్ణా ముకుందా పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగడు (2008)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: శ్రీ వ్యాధవ్యాస్
గానం: యస్.పి.బాలు, మాళవిక, సౌమ్య

హే క్రిష్ణా ముకుందా మురారి

శ్రీకృష్ణ  శ్రీకేశవ శ్రీమాధవ శ్రీధర
దామోధర నీ దర్శనమీజన్మకి దొరకదా

హే మాధవ పుండరీక హే వనమాలి
గోవిందా భక్త హృదయ బృంధావిహరి 
ఆగజేంద్ర ప్రాణదాత నీవేకదా శ్రీహరి
కొనవూపిరికి ఊపిరివై కనిపించగ రారా హరి

హే మాధవ పుండరీక హే వనామాలి

అను దిన జన ధూప దీప సంరంభంలో 
ధీనజనుల కన్నీళ్లు కనబడవా మాధవా
గణ గణ గణ గణ గుడి ఘంటారావం లో
నిను నమ్మిన గుండెఘోష వినబడదా కేశవా
వినబడదా కేశవా వినబడదా కేశవా

విన్నా వినబడనట్టు ఉంటావా రాయిలా
వింటే మనసుంటే కనులుంటే కనుగుంటే 
కరునుంటే రాయిలా

శ్రీకృష్ణ శ్రీకేశవ శ్రీమాధవ శ్రీధర
దామోధర నీ దర్శనమీజన్మకి దొరకదా

హే మాధవ పుండరీక హే వనామాలి
గోవిందా భక్త హృదయ బృంధావిహరి 

యెశోద వకులగా వేచి ఉన్నదని వెంకటేశునిగా వెళ్లావే 
గోవిందా గోవిందా వెంకటరమణ గోవిందా
నరకాసురచర వనితల కొరకై సమరార్భావటిగావించావే
గోపాలా గోపాలా గోకులనందన గోపాలా
నీకై జనించి నీకై జపించి నీకై తపించి నీకై జ్వలించే 
దాసురలికే దర్శనమివ్వగా
గర్భమోలే నిర్బంధిచే ఈ గర్భగుడా నీకడ్డంకి
నీలిమేఘమే నిప్పులార్పదా
నెమలిపించమే జడిపిస్తే
ప్రభంజనం ప్రజ్వలించదా నీకాలుగూటి ఆజ్ఞాపిస్తే 
తలపులు తెరిపించు దర్శనమిప్పించు 

హే క్రిష్ణా ముకుందా మురారి




సహస్ర శీర్ష పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగడు (2008)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: శ్రీ వ్యాధవ్యాస్
గానం: యస్.పి.బాలు, మాళవిక, సౌమ్య



ఏమని అడగను పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగడు (2008)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: శ్రీ వ్యాధవ్యాస్
గానం: యస్.పి.బాలు, మాళవిక, సౌమ్య

ఏమని అడగను ఏ వరము నిను కోరను
నీ దాసదాసానుదాసుడను, నీ ఎదుట నే మూగను కృష్ణా ఏమని అడగను
మొసలి బారి పడి మొరలిడిన గజేంద్రుని బాధలులేవు
రక్ష రక్షయని ప్రార్థించుటకు ద్రౌపది దుస్థితి లేదు
అటుకులిచ్చి సంపదలు తెమ్మనే అర్థాంగలక్ష్మీ లేనే లేదు ఆ
అడగకున్నా అన్నీ యిచ్చే వాడే నా వాడని తెలిసే
ఏమని అడగను ఏ వరము నిను కోరను
కృష్ణా కృష్ణా కృష్ణా ఏమని అడగను ఆ

బంధమే లేని భగవంతుడు నీ అనుబంధానికి బంధితుడు
అందరిచేత అడిగించుకునేవాడు నిన్నడుగుతున్నాడు ఆ
అంతా నువ్వే అంటాడయ్యా ఆ ఒక్కటేదో అడగవా
అమ్మా నీ కృష్ణయ్యా చిన్నప్పుడు మన్ను తిన్నాడని తెలిసి
నోరు చూపమంటే తన నోట పదునాలుగు భువనాలను
చూపించాడు కదమ్మా అప్పుడు ఆ యశోదమ్మ ఆశ్చర్యంతో
నోరు తెరిచి చూసిందే కానీ, నోరు తెరిచి ఏమైనా అడిగిందా తల్లీ ఆ
మన్ను తిన్న ఆనోట అన్ని లోకాలను చూసిన యశోదమ్మ ఏవరమడిగిందమ్మా
వేణుగానమును విని ఆగోవులు తరించినవిగాని గోవిందుని ఏం కోరాయమ్మా
ముక్తికాంతుడగు ముకుందుడే (2)
నా యందు నిలిచి ఉన్నాడు, నా పంచప్రాణాలు
తులసిదళాలతో అర్చన చేస్తున్నాను
ఇంతకన్నా కావలసింది ఇంకేంఉందీ




శ్రీ శ్రీ శ్రీ రాజాది రాజ పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగడు (2008)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు



గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగడు (2008)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై
గోపాల బాల బాల బాల రాధకృష్ణ జై (2)
కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై బాలకృష్ణ జై
రంగ రంగా రంగరంగా నువ్వూ ఒక దొంగ ఇంటి దొంగ
చిలిపిచంటి దొంగ చిన్నకృష్ణుడల్లే దోచుకున్న దొంగ
వెతికి వెన్నలెన్నో మింగినావు అవలీలగా
రంగ రంగా రంగరంగా నువ్వూ ఒక దొంగ రంగ రంగా

ఉట్టిపాలచట్టి పట్టి తూటు కొట్టి నోట పెట్టినట్టి చంటిదొంగ రంగ రంగా
చీరకొంగు పట్టి కొల్లగొట్టి గుట్టు బయట పెట్టి శుబ్బరంగా రంగ రంగా
గోకులాన ఆడినావు నాడే రాసలీల కృష్టుడి గోల ఇలా నీ లా
ఎలా గోపాల బాల రంగా రంగ రంగా
రంగ రంగా నువ్వూ ఒక దొంగ కృష్ణుడల్లే దోచుకున్న దొంగ

గోపికామాలహారిప్యారి మాయమీర వన విహారి
మదనమోహన మురళీధారి కృష్ణ జై (2)
కృష్ణ జై రామా కృష్ణ జై రాధా కృష్ణ జై వా కృష్ణ కృష్ణ కృష్ణ జై

పల్లె భామతెచ్చే చల్లకుండలన్నీ చిల్లుకొట్టి తాగుదారి దొంగ రంగరంగా
కాలనాగుపడగ కాలుకింద నలగ కధముతొక్కినావు తాండవంగ రంగరంగా
వేణువూది కాసినావు ఆవుమందలెన్నో అల్లరే ఇంటా వంటా
నీ తోటి జంటా తెచ్చేను తంటా రంగా రంగ రంగా 



మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగడు (2008)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: యస్.పి.బాలు

మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను
పితృదేవోభవ అన్న మాట విడిచాను
నా పైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా
నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా
అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది
నాన్న అని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది
అమ్మా నాన్నా అమ్మా 

అమ్మా నీ కలలే నా కంటిపాపలయినవని లాలి జోలాలి
నీ ప్రాణం పనంపెట్టి నాకు పురుడు పోశావని
నీ నెత్తుటి ముద్దయే నా అందమయిన దేహమని
బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురని
తెలియనైతి తల్లీ, ఎరుగనైతిని అమ్మా
కడుపు తీపినే హేళన చేసిన జులాయిని
కన్న పేగుముడిని తెంపివేసిన కసాయిని
మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా
కలనైనా నన్ను కరుణించొద్దు నాన్నా

నాన్నా నీ గుండెపైన నడక నేర్చుకున్నానని
నీ చూపుడు వేలుతో లోకాన్నే చూశానని
నాన్నను పూజిస్తే ఆదిదేవునకు అది అందునని
అమ్మకు బ్రహ్మకు మధ్య నాన్నే ఒక నిచ్చెనని
తెలియనైతి తండ్రీ ఎరుగనైతి నాన్నా
నాన్నంటే నడీచే దేవాలయమని మరిచితిని
ఆత్మజ్యోతిని చేజేతులా ఆర్పివేసుకొంటిని
మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా
కలనైనా నను కరుణించొద్దు నాన్నా

కన్నా నిన్ను ఇచ్చిన కన్నయ్యే ఇచ్చాడు క్షమించే హృదయం
మా ఆయువు పోసుకొని నీవు వర్ధిల్లు కలకాలం
శతమానం భవతి శతాష్‌మాన్‌ భవతి (2)




బృందావమున పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగడు (2008)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, సునీత






జ్వలత్ కార పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగడు (2008)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

ప్రేమావలంబనం పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగడు (2008)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: యస్.పి.బాలు

చు... చు... చు... చు... చు...
చుంబనం 
ప్రేమావలంబనం ప్రియ చుంబనం
ప్రియ చుంబనం
ప్రకృతి పురుష పరమ శృంగార విశృంఖలం
ప్రేమావలంబనం ప్రియ చుంబనం
కచల లాట - కపోలాక్ష
వక్షస్థల - కుచ 
సంభావనా తీత సరస చుంబనం
రమ్య చుంబనం 

దస నిప మగ మగ మగ

ప్రేమావలంబనం ప్రియ చుంబనం
ప్రేమావలంబనం ప్రియ చుంబనం

నవ సంగమ హృదయంగమ సారంగి
నిరుపమ నియమితకం  చుంబనం

లలిత లలిత లవలీలతాంగి
సులలిత స్ఫురితక చుంబనం
పప మగమ ని నిపమప సవ తిర్యక్ చుంబనం
ని నిపమప స సనిపని ఘండిత గం చుంబనం
హుద్రాంతం కుందరం వ్యూతగణం సంపుటకం
హస్తాంగుళి పాదాంగుళి చుంబనం

గస మగ నిప సని
గమ పస రిగ రిసనిపమగ

ప్రేమావలంబనం ప్రియ చుంబనం
ప్రేమావలంబనం ప్రియ చుంబనం

ప్రేమావలంబనం ప్రియ చుంబనం

తకిడత ధిం తకిడత తా
ధా న  ధా న ధా

పదని సరి  సరి సనిదప
గపదని సరి గపదని సని

ప్రేమావలంబనం ప్రియ చుంబనం

ధిం ధిందాది ధిం ధిందాది థా

సరిరి రిపమ మగగ గనిని గపమ పసస
సరి రిగ మరి సనిదప మగ రిమగరి గప రిస 
నిరప మగరి
ప్రేమావలంబనం ప్రియ చుంబనం

అనురాగ రాగ నిత్య నీరాజనం
అంతర్ముఖ జిహ్వా దాలు దశల చుంబనం
మధుర మధుర మధన కథన భూషణం
మధుమయే వరమృదు చుంబనం
చెలి జఘం చుంబనం ఛాయా చుంబనం
చెలి జఘం చుంబనం ఛాయా చుంబనం
ఊహాతీతమహా... ఊరు చుంబనం

పమదపనిద  గరి సని దప మగమ మగరి

ప్రేమావలంబనం ప్రియ చుంబనం
ప్రేమావలంబనం ప్రియ చుంబనం
ప్రేమావలంబనం ప్రియ చుంబనం
ప్రేమావలంబనం ప్రియ చుంబనం






కోసలదేశపు కోమలితో పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగడు (2008)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, సునీత

కోసలదేశపు కోమలితో తొ తొ తొ
కొంకిణి నగరపు కామినితో తొ తొ తొ
హస్తినాపురపు అశ్వినితో పాటలీపుత్ర పద్మినితో
తరికిటతో...... అందరితో
తధిగిణతో..... ఎందరితో
ఒక్కరా ఇద్దరా ముగ్గురా తెలియదు లెక్కెంతో ఎంతో
సింధుతీరపు సుందరితో తొ తొ తొ
కుంతల ప్రాంతపు కాంతలతో

కన్యను కవ్వించా చుంబనాలతో
ముగ్దను అలరించా మర్దనాలతో
ప్రొఢను అలరించా పీడనాలతో
తరుణులందరిని మెప్పించా తరుణోపాయముతో
సరస ప్రవీణ శృంగార రత్న 
పడుచు ప్రసన్న పడక ప్రపూర్ణ
అను పిలుపులతో పలుబిరుదులతో ప్రశంసించారు నన్నెంతో ఎంతో...
వుజ్జయిని సమ వుజ్జిణితో తొ తొ తొ
ద్రావిడలో ఒక ఆవిడతో

అనేకమందితో తో తో అందులో ఒక్కరితో ఏం చేశావో చెప్పు
రసికుల తిలకా పూర్తి వివరణలతో
తనువును తడిపాను పాలుతేనెతో
తదుపరి తుడిచాను పెదవి దూదితో
పరిమళమద్దాను పంటిపూలతో
కొంటెసేవలను చేశాను ఒంటిచేతితో
తొలిసారి తీర్చి మలిసారి మార్చి
సుఖశిఖరమేదో చూపాను మెచ్చి
నా విద్వత్తో రసవిద్యుత్తో
అది నభూతో న భవిష్యత్తూ
నానా జాతుల వనితలతో తొ తొ తొ
ఇతరత్రా పలు ఇంతులతో




మాతా పిత్సుసం పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగడు (2008)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: యస్.పి.బాలు



నీల మేఘ వర పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగడు (2008)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: శ్రీ వ్యాధవ్యాస్
గానం: యస్.పి.బాలు

నీల మేఘ వర వర్ణ నిగమ నిగమాంత నిజ నివాస
శరస్ చంద్రిక సౌమ్య సౌందర్య చారు చంద్రహాస
మధుర మధుర మణి కుండల మండిత గండ యుగవికాస
పద్మ పట్రాణయాన పరమాత్మ పాహిచిద్విలాస
పాహిచిద్విలాసా పాహిచిద్విలాసా
తన వైకుంటము వీడి నను గూడి
ఆట్లాడగ వచ్చితివా...
ప్రెమ మీరగ రంగా అని పేరు పెట్టి పిలిచితివ
తల్లితండ్రుల సెవల మైమరచిన తనయుడిపైనె అలిగితివా...
శ్రిత మ్రుదుల శ్రి మాధవ శిల వైతివా.. శ్రి కెశవా.
నాకొసం నా ఇంటికి వచ్చిన భువన మొహనా బూహరణ
కనుల ఎదుట సాక్షత్కరించిన కననైతినె హరి హరణా..
రాధ హౄదయ బౄంద రసమయ కరుణ సుగంధ
రావ నీ రంగని బ్రోవ రాజది రాజ శ్రిరంగా..
రంగా పాండురంగా (2)



జయ రామ రంగ విట్టల పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగడు (2008)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: యస్.పి.బాలు

Most Recent

Default