చిత్రం: పెళ్ళాం ఊరెళితే (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహరన్ , కల్పన
నటీనటులు: శ్రీకాంత్ , వేణు తొట్టెంపూడి, సంగీత, రక్షిత
దర్శకత్వం: యస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 15.01.2003
దొండ పండు లాంటి పెదవే నీది
అబద్దం..అంతా అబద్దం..
దూదిపింజ లాంటి వదమే నీది
అబద్దం.. అంతా అబద్దం.
పాల మీగడంటి నుదురే నీది
అబద్దం.. అంతా అబద్దం
పూల తీగ లాంటి నడుమే నీది - అబద్దం
నీ పైన నా ప్రేమ అబద్దమనకూ అనకూ
మత్తును చల్లేటి నవ్వేమొ నీది - అబద్దం
నిన్ను నవ్వుల్లో ముంచెత్తు బాధ్యత నాది - ఇది నిజం
ముత్యాలు రాలేటి మాటేమొ నీది - అబద్దం
నీ మాటకు ఊ కొట్టు ఉద్యోగం నాది - ఇది నిజం
నేలమీద ఉన్న దేవత నీవు - అబద్దం
నిన్ను నమ్ముకున్న దాసుణ్ణి నేను - ఇది నిజం
నువు పొగిడే ప్రతి పాట తీపి - అబద్దం
నను మెప్పించాలనే తాపత్రయం - గొప్ప వాస్తవం
పాల నురగ లాంటి పైటేమో నీది - ఆ హ హ అబద్దం
నీ పైట మాటునున్న మనసేమొ నాది ఆ - ఇది నిజం
గోరింట పువ్వంటి చెయ్యేమొ నీది - అహ మళ్ళీ అబద్దం
నీ చేతిలోన ఉన్న బ్రతుకేమొ నాది - అహా ఇది నిజం
నీలాలు కొలువున్న కళ్ళేమొ నీవి - అబద్దం
నువ్వు కన్నెర్ర చేస్తేనే కన్నీరు నేను - ఇది నిజం
నీ పైన అనుమానం క్షణకాలం
మన ఇద్దరి మధ్యన అనుభంధం కలకాలం
******** ******** ********
చిత్రం: పెళ్ళాం ఊరెళితే (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: విజయ్ కుమార్
గానం: యస్.పి.బాలు, గోపికా పూర్ణిమ
పల్లవి:
మిల మిల మెరిసే మగువా నువు మేనక చెల్లెలివా
నిగ నిగలాడే భామా నును లేత పసిడి కొమ్మా
గడసరి పలుకుల గువ్వా నువు మదనుడి మరదలివా
గుబ గుబలాడెను ఊటి నిను చూసి అయ్యోరామా
కళ్ళే చూసెనంటె కోడాక్
పళ్ళే చూసెనంటె క్లోజప్
థ్రిల్లై గంతులేస్తురావా నీకోసం
కురులే చూసెనంటె సన్ సిల్క్
నవ్వే చూసెనంటె నెస్కెప్
తుళ్ళి చెంతవాలిపోవా నీకోసం
చరణం: 1
మెరుపులన్ని మెలివేసి తారలన్ని కలబోసి
పున్నమంత మరిగించి పుణ్యమంత కరిగించి
నవ నవలాడేలా నవ బ్రమ్హలు చేరి
తన్మయమై నిన్ను చేశారే కోరి
పలుకే వినినా తేనే తెలబోవు
రూపే కనినా తూర్పుకు మతిపోవు
కలరే చూసెనంటె ఏషియన్
రిస్టే చూసెనంటె టైటాన్
నీకై లక్షలుంచిపోవా వాకిట్లో
చరణం: 2
కాలి అందె కదిపిందా కాకి కోకిలై పోదా
పైట గాలి వీచిందా పాలవాన పడిపోదా
రుస రుస చూసిందా ఋతువులు మారేను
గుస గుసలాడిందా ఋషులే మారేను
నడుమే చూస్తే విరిసే హరివిల్లు
బిడియం పడుతు నీకే ప్రణమిల్లు
నడకే చూసెనంటె బాటా
పరుగే చూసెనంటె స్కూటీ
సంతోషించి ఇచ్చుకోవా ఎంతైనా