చిత్రం: పిల్ల జమిందార్ (1980) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు నిర్మాత: అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జున విడుదల తేది: 26.09.1980
Songs List:
మొన్ననే మోతగా పాట సాహిత్యం
చిత్రం: పిల్ల జమిందార్ (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు, పి.సుశీల మొన్ననే మోతగా - ఓ పొగరుబోతు పిల్ల కొమ్ములొంచాను నిన్ననే నీటుగా – ఓ గడుసుపిల్ల వయసు దోచుకున్నాను. రోజుకొక్క మోజు మార్చు మొనగాణ్ణి రే రే రే రే రేపులరాముణ్ణి - జిల్లయిపోవాలి కన్ను కొట్టానంటే - పిల్లయిపోవాలి చెయ్యిపట్టానంటే గురిచూసి కన్నెవయసు తడితేచాలు - నేను గురుతుండీపోవాలి తొంబై ఏళ్ళు ఒంటరిగా దొరికానని ఏడిపిస్తావా. తుంటరిగా వెంటపడిపగబడతావా చేతులెత్తి మొక్కుతాను పోనీచాలు- నలుగురిలో చెయ్యొద్దు నవ్వులపాలు- మొన్ననే గుట్టుగా - ఓ మంచివాడు పెళ్ళిచూపుకొచ్చాడు, నిన్ననే నీటుగా – ఓ పూలరంగడొచ్చి నన్ను మెచ్చాడు. ఏడ్చాడు - రేపు జరుగు పెళ్ళికడ్డురావద్దు - రేరేరేరే రేపులరాముడు. అందాల రాముడివని అనుకున్నాను. దొంగరాముడని యిప్పుడు తెలుసుకున్నాను. రేపులరాముడంటే రాకపొదును. నేను యీరోజు నీపాలిట పడకపోదును. వచ్చాక నాకు లొంగిపోవలసిందే - చచ్చినట్లు నాదారికి రావలసిందే కన్నెపిల్ల కంటబడితే వుండబట్టదు - నాకైపు తీరకుంటే నాకు నిద్దరపట్టదు
గేరు మార్చు, స్పీడు పెంచు పాట సాహిత్యం
చిత్రం: పిల్ల జమిందార్ (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు, పి.సుశీల గేరు మార్చు, స్పీడు పెంచు - చక చకచకచక చక చక చక చక పోనీ పోనీ కారు గేరుమార్చా స్పీడు పెంచా - చకచకచకచక చక చక చక చక పరుగెడుతోంది కారు చుక్కలాటి చక్కనమ్మ కారెక్కింది - తిక్క రేగి ఆకారు చెట్టెక్కింది - డొక్కుకారు ఎక్కడం నాదే తప్పు - నీ మాట నమ్మిరావడం అసలే తప్పు - చూడకుండా తోలావు ముందూ వెనక నా చూపు చెదిరిపోయింది నిన్ను చూశాక- ఎక్కుకారు.... వెయ్యిడోరు.... చక చక .... చుప్పనాతి కారుకీ ఏ మొచ్చిందో చెప్పకుండ ఆగింది ఏమయ్యిందో ఆకతాయి కుర్రదాని అల్లరిచూసి.. ఉలుకొచ్చిందో లేక వుడుకెత్తిందో ఊకదంపు మాటలకు బండి కదలదు - దిగిచూస్తేగాని దాని కిటుకు తెలియదు. తొయ్యికారు - ముయ్యినోరు
శంభోశంకర మహదేవా పాట సాహిత్యం
చిత్రం: పిల్ల జమిందార్ (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.జానకి, యస్.పి.బాలు శంభోశంకర మహదేవా రంభను నాలో చూసావా..? రంగులలోన నాపొంగులలోన ఉయ్యాలూగి తేలిసోలిపోవా శివశివ శంభోశంకర మహదేవా రంభవు నువ్వనుకున్నావా.. ఇంద్రుడనేనే మహేంద్రుడనేనే నాచేంత మోజుతీర్చుకోవా శివశివ శంభోశంకర మహదేవా- రంభకులేదు నీచొరవ. రెపరెపలాడే పరువంలోనే... ఉన్నది ఓచిన్నదీ... ఆశలు రేగే రాతిరివేళ.- చాటుగ రమ్మన్నదీ కురిసే జడివానలో గుసగుసలాడాలనీ... కులికే పొదరిళ్ళలో కోరిక తీరాలనీ... ఈ సందడి ఇక రాదన్నదీ. వయసు సొగసు నీదన్నదీ శంభోశంకర మహదేవా రంభకులేదు నీ చొరవ రంగులలోన నీ పొంగులలోన.. ఉయ్యాలలూగి తేలిసోలనీవా ||శివ॥ చీకటిలోన చిందులు వేసి విందుగ నేనాడనా- వేకువదాకా వేడుక చేసి తోడుగనే పాడనా... అల్లరి కేరింతలో అల్లుకు పోతానులే-- కమ్మని కవ్వింతలో కరిగి పోతానులే- నీ స్నేహము ఇక నాలోకము. కనీ విని ఎరుగని ఒక మైకము
అందాలొలికే నందకిశోరుడు పాట సాహిత్యం
చిత్రం: పిల్ల జమిందార్ (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.శైలజ, యస్.పి.బాలు అందాలొలికే నందకిశోరుడు-బృందావనిలో వెలిశాడు. రాధకోసమా.... రాసలీల కోసమా... ? వేయిరూపాల రేపల్లె గోపాలుడు వేణునాదాల సంగీత భూపాలుడు మంచికి గొడుగును పట్టీ వంచనపై పగబట్టి - మాయపూతకీ మదము అణిచివేశాడు మధుర బురుజుపై ధ్వజమెత్తసాగేడు. కోటకోసమా.... కంసుడి వేటకోసమా... ? చవితి చంద్రుణ్ణి చూశాడు పొరపాటున లేని అపవాదు మోశాడు గ్రహపాటున కొండాకోనా మించీ - అడవులో గాలించీ.... ఎలుగు రాజుని ఎదిరించి పోరేడు వెలుగు వెదజల్లు మణి తిరిగి తెచ్చాడు. ప్రేమకోసమా సత్యభామకోసమా ....
వయసేమో 60 పాట సాహిత్యం
చిత్రం: పిల్ల జమిందార్ (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: రాజశ్రీ గానం: పి.సుశీల , యస్.పి.బాలు ఆఁ...ఆఁ...ఆఁ...వయసేమో 60, మనసేమో 20 వగరుంది పొగరుందినాలో నర్సమ్మాకాసుకో-సరసమే చూసుకో. అఁ...ఆఁ...ఆఁ... అరవైలో అడుగుబెట్టి ఇరవైలా పట్టుబడ్డ ఆడేవు పాడేవు తాతా ఏమిటీ కోరిక, అల్లరి చాలిక మనవరాలికి తాతకు వరసుందీ_ మనసుంటే మజాలకు దారుందీ ఊరించే నీ అందం చూస్తే చాలు_ఆబ్రహ్మకైన పుడుతుంది రిమ్మ తెగులు. ముసలాడికి రేగింది ముద్దుముచ్చట-ఇది కనలేదు వినలేదు నేను ఎచ్చట. నీ మనవడిపై నా కెప్పుడో మనసయ్యింది - మా ఇద్దరికీ ఏనాడో జతకుదిరింది. కళ్ళల్లో తీరని పదునుంది గుండెల్లో తాని వలపుంది - నీకోసం పడుచువాణ్ణి అయిపోతాను -- నీ పరువానికి పగ్గమేసి నిలబెడతాను మనసులేని పిల్లతో మనువుదండగ - మనసుపడి వస్తేనే కనులపండుగ - నా దోరవలపు దాచాను అందగాడికి - అది యివ్వలేను ఎవ్వరికీ యీ జన్మకి
నీ చూపులోనా.. పాట సాహిత్యం
చిత్రం: పిల్ల జమిందార్ (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వడ్డేపల్లి కృష్ణ గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.పి.శైలజ పల్లవి: నీ చూపులోనా.. విరజాజివానా ఆ వానలోనా నేను తడిసేనా.. హాయిగా నీ నవ్వులోనా.. రతనాల వానా ఆ వానలోనా నేను మరిచేనా... తీయగా చరణం: 1 ఆ వెన్నెలేమో.. పరదాలు వేసే నీ వన్నెలేమో.. సరదాలు చేసే ఆ వెన్నెలేమో.. పరదాలు వేసే నీ వన్నెలేమో.. సరదాలు చేసే వయసేమో పొంగిందీ... వలపేమొ రేగిందీ వయసేమో పొంగిందీ... వలపేమొ రేగిందీ కనివిని ఎరుగని తలపులు చిగురించే... నీ చూపులోనా.. విరజాజివానా ఆ వానలోనా నేను తడిసేనా.. హాయిగా నీ నవ్వులోనా.. వడగళ్ల వానా ఆ వానలోనా నేను మునిగేనా... తేలనా చరణం: 2 చిరుగాలిలోనా... చిగురాకు ఊగే చెలి కులుకులోనా... పరువాలు ఊగే ఈ పాల రేయీ... మురిపించె నన్ను... మురిపాలలోనా... ఇరికించె నన్ను... గిలిగింత కలిగించే... మనసంత పులకించే... జాబిల్లి కవ్వించే... నిలువెల్ల దహియించే... చెరగని.. తరగని.. వలపులు కురిపించే... నీ చూపులోనా... విరజాజివానా ఆ వానలోనా నేను తడిసేనా... హాయిగా నీ నవ్వులోనా... రతనాల వానా ఆ వానలోనా నేను మరిచేనా... తీయగా
నా పేరు బాలరాజు పాట సాహిత్యం
చిత్రం: పిల్ల జమిందార్ (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు, మాధవపెద్ది రమేష్ నా పేరు బాలరాజు మూడింది మీకు రోజు - మీ ఎత్తులకు మీ జిత్తులకు ఇదే చివరిరోజు_ వదిలిస్తా మీ బూజు తేరగ బాగా కలిసొచ్చిందని తెగతిని బలిశారు. అన్నం పెట్టినయింటిలోనే కన్నం వేశారు. కలిమికిచేరిన కప్పలూ.. గోతులు తీసే నక్కలూ మీ నాటకాలు చాలు మీ బూటకాలు చాలు మారుస్తా మీ జాతకం... ఆడిస్తా శివతాండవం- శివతాండవం నమ్మిన నాకే చివరకు నువ్వు నామం పెడతావా దగ్గర వాళ్లని చేరదీసే దగాలు చేస్తావా ..? తేనెలు పూసిన కత్తులు - చేనేమేసే కంచెలూ- మీ పొగరు అణచివేస్తా - నే తగిన శాస్తి చేస్తా- వేయిస్తా కోలాటం – నేర్పిస్తా గుణపాఠం.. గుణపాఠం