చిత్రం: రాధామై డార్లింగ్ (1982)
సంగీతం: బి.శంకర్
సాహిత్యం: సి.నారాయణరెడ్డి , జాలాది
గానం: యస్.పి.బాలు, వాణీ జయరాం, జి.ఆనంద్, లతారాణి, రమోలా, కమలాకర్ (నుతనగాయకుడు)
నటినటులు: విజయ కళ (తొలిపరిచయం) , పులిపాటి ద్వరస్వామి నాయుడు (తొలిపరిచయం) , చిరంజీవి (అతిధి నటుడు)
దర్శకత్వం: బి.భాస్కర్
నిర్మాత: పి.త్రినాధరావు
విడుదల తేది: 30..06.1982
పల్లవి:
అందరిలో ఇద్దరముంటే అదోలావుంది
అందరిలో ఇద్దరముంటే అదోలావుంది
ఇద్దరమే ఎదురుగ ఉంటే ఎదోలావుంది
ఏ దో లా... ఉంది
అందరిలో ఇద్దరముంటే అదోలావుంది
ఇద్దరమే ఎదురుగ ఉంటే ఎదోలావుంది
ఏ దో లా... ఉంది
చరణం: 1
కొండపైన సాగే సెలయేరునై
నీ గుండెపైన ఊగే ముత్యాలపేరునై
కొండపైన సాగే సెలయేరునై
నీ గుండెపైన ఊగే ముత్యాలపేరునై
ఆడుతుంటాను తారాడుతుంటాను
ఆడుతుంటాను తారాడుతుంటాను
కోడిమామిడినల్లుకొని తీగె పడుచునై
నీ వాడి కళ్ళని పలికించే వలపు పిలుపునై
కోడిమామిడినల్లుకొని తీగె పడుచునై
నీ వాడి కళ్ళని పలికించే వలపు పిలుపునై
ఆగిపోతాను నీలో దాగిపోతాను
ఆగిపోతాను నీలో దాగిపోతాను
నిన్నకాదు - నేడుకాదు
రేపుకాదు - మాపుకాదు
ఎన్నెన్నో జన్మలు ఉందాము
ఉందాము కలిసి ఉందాము
అందరిలో ఇద్దరముంటే అదోలావుంది
ఇద్దరమే ఎదురుగ ఉంటే ఎదోలావుంది
ఏ దో లా... ఉంది
చరణం: 2
వయసులాగ కమ్ముకొనే వానమబ్బునై
వాన మబ్బుని కలవర పరిచే కన్నె మెరుపునై
గడుసుగా పైటను మీటే దుడుసు గాలినై
ఆ గాలికే లీలలు నేర్పే పూల తావినై
కూడి ఉందాము జత వీడకుందాము
కూడి ఉందాము జత వీడకుందాము
నిన్నకాదు - నేడుకాదు
రేపుకాదు - మాపుకాదు
ఎన్నెన్నో జన్మలు ఉందాము
ఉందాము కలిసి ఉందాము
అందరిలో ఇద్దరముంటే అదోలావుంది
ఇద్దరమే ఎదురుగ ఉంటే ఎదోలావుంది
ఏ దో లా... ఉంది
ఏ దో లా... ఉంది