చిత్రం: తలంబ్రాలు (1987) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం నటీనటులు: రాజశేఖర్ , జీవిత దర్శకత్వం: కోడిరామకృష్ణ నిర్మాత: యమ్.శ్యాంప్రసాద్ రెడ్డి విడుదల తేది: 09.11.1987
Songs List:
నిన్న నీవు నాకెంతో దూరం ... పాట సాహిత్యం
చిత్రం: తలంబ్రాలు (1987) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: సుశీల, యస్.పి.బాలు పల్లవి: నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం కంటిలో పాపలా తేనెలో తీపిలా తోడుగా నాతో ఉండిపో... నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం కంటిలో పాపలా.. తేనెలో తీపిలా.. తోడుగా నాతో ఉండిపో... చరణం: 1 నీలాల నింగి వంగి నేల చేవిలో ఇలా అంది నీలాల నింగీ వంగీ నేల చేవిలో ఇలా అందీ నీవున్నదాకా నేనున్నదాకా ఉంటుంది ప్రేమన్నదీ.. ఆ ప్రేమ నాలో ఉంది నీ పొందునే కోరుకుంది ఆ ప్రేమ నాలో ఉందీ నీ పొందునే కోరుకుందీ ఈ జన్మకైనా ఏ జన్మకైనా సరిలేరు మనకన్నదీ.. పరువాల పందిట్లో సరదాల సందిట్లో పండాలి వలపన్నదీ హొయ్ సరిలేని సద్దుల్లో విడిపొని ముద్దుల్లో మునగాలి మనమన్నదీ.. నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం కంటిలో పాపలా.. తేనెలో తీపిలా.. తోడుగా నాతో ఉండిపో... హొ చరణం: 2 గోదారి కెరటంలోనా.. గోరంత సొగసే ఉంది హొయ్.. గోదారి కెరటంలోనా.. గోరంత సొగసే ఉందీ నీరెండలాంటి నీ చూపులోన కొండంత సొగసున్నదీ కార్తీక పున్నమిలోనా కాసింత హాయే ఉందీ కార్తీక పున్నమిలోనా కాసింత హాయే ఉందీ ఏ వేలనైనా నీ నీడలోనా ఎనలేని హాయున్నదీ కడసంధ్య వాకిట్లో కాపున్న చీకట్లో కరగాలి వయసన్నదీ హొయ్ చిరునవ్వు చిందుల్లో మురిపాల విందుల్లో సాగాలి మనమన్నదీ హొయ్ నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం కంటిలో పాపలా తేనెలో తీపిలా తోడుగా నాతో ఉండిపో... నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
ఇది పాట కానే కాదు పాట సాహిత్యం
చిత్రం: తలంబ్రాలు (1986) సంగీతం: సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: సుశీల పల్లవి: ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు వేదన శృతిగా.. రోదన లయగా.. సాగే గానమిది ఆ......ఆ....ఆ....ఆ....ఆ... ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు చరణం: 1 ఒంటరిగా తిరుగాడు లేడినొక మనిషి చూసినాడు.. చెంతకు చేరదీసినాడు అభము శుభము తెలియని లేడి అతనిని నమ్మిందీ.. తన హృదయం పరిచిందీ ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్ద పులనీ... తను బలియై పోతిననీ ఆ లేడి గుండె కోత.. నా గాధకు శ్రీకారం నే పలికే ప్రతి మాటా స్త్రీ జాతికి సందేశం ఆ...ఆ....ఆ....ఆ...ఆ... ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు చరణం: 2 ఇప్పుడు కూడా నయవంచకులు ఇంద్రులు ఉన్నారు... కామాంధులు ఉన్నారు వారి చేతిలో వందలు వేలు బలి ఔతున్నారు... అబలలు బలి ఔతున్నారు నిప్పులు చెరిగే ఈ అమానుషం ఆగేదెప్పటికీ... చల్లారేదెప్పటికీ ఆ మంటలారుదాకా నా గానామాగిపోదు ఆ రోజు వచ్చుదాకా నా గొంతు మూగపోదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిదీ ఆ....ఆ....ఆ....ఆ...ఆ... ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
ఓ ధనవంతుడైన మానవుడా పాట సాహిత్యం
చిత్రం: తలంబ్రాలు (1986) సంగీతం: సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: సుశీల ఓ ధనవంతుడైన మానవుడా
ఓ రాతిరి పాట సాహిత్యం
చిత్రం: తలంబ్రాలు (1986) సంగీతం: సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: సుశీల ఓ రాతిరి